Google+ Followers

Followers

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం -50 (చివరి భాగం ) శ్రీ హనుమ గీతా భాష్య ఉదంతం


పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధ మైన కురుక్షేత్ర రణ రంగం లో విజయుడి రధం జెండా పై కపి రాజు హను మంతుడు కొలువై ఉన్నాడు .యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్యా ,అర్జునుని కోరిక పై రధాన్ని నిలి పాడు పార్ధ సారధి అయిన శ్రీ కృష్ణుడు .కిరీటి రధం దిగి ,రెండు వైపులా ఉన్న సైన్య సమూహాన్ని చూశాడు .అందరు బంధువులే .కావలసిన వారే .వీళ్ళందర్నీ చంపి ,తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు .కనుక యుద్ధం చేయటం కంటే భిక్షం ఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి .మనసు అంతా వ్యాకులం అయింది .కర్తవ్యo తోచటం లేడు .శ్రీ కృష్ణ పరమాత్మ నే శరణు కోరి కర్తవ్య౦ బోధించమని  వేడు కొన్నాడు .
బావ మరిది ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడు అర్జునుని మనో భావం గుర్తిoచాడు శ్రీ కృష్ణ భగవానుడు .వెంటనే పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతా సారాన్ని విని పించి యుద్దోన్ముఖుడిని చేశాడు .భగవానుని గీత ను అను సరించి ,విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు .
పార్దునికి ,పార్ధ సారధి విని పిస్తున్న భగవద్ గీత నంతటిని అర్జునుని రధపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు .మనసుకు దాన్ని అంతటిని పట్టించు కొన్నాడు .శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !అని భక్తీ తో నమస్కరించాడు .అప్పుడు గోపాల చక్ర వర్తి శ్రీ  కృష్ణ పరమాత్మ హను మంతా !నేను చెప్పిన విషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు .దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు .నువ్వు విన్న గీత కు భాష్యం రచించు  .దానితో నీ పిశాచ రూపం అంత రిస్తుంది అని శాపాన్ని ,శాప విమోచనాన్ని తెలియ జేశాడు పరమాత్మ .
కురు క్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత,హనుమ పిశాచి రూపం పొంది ,గంధ మాదన పర్వతం చేరాడు .అక్కడ అత్యంత భక్తీ ,శ్రద్ధ లతో భగవద్ గీతను మననం చేసు కొంటూ ”,గీతా భాష్యం రచించాడు .అదే హనుమద్ భాష్యం గా లోకం లో ప్రసిద్ధి చెందింది .అక్కడక్కడ ఈ భాష్య గ్రంధాలు కనీ పిస్తున్నాయట .
ఈ కదా విశేషా లన్నిటిని మైత్రేయాది మహర్షులకు పరాశర మహర్షి చెప్పిశ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్నిసంపూర్ణం గా తెలియ జేశాడు .ఆ మర్నాడు మైత్రేయాది మహర్షులు ,పరాశర మహర్షి ఇత్యాది  శిష్య బృందం అందరు కలిసి శ్రీ హనుమ పూజ ను నిర్వహించి ,నైవేద్యం పెట్టి అందరికి తీర్ధ ,ప్రసాదాలను అంద జేశారు .ఎక్కడ హనుమ పూజ జరుగు తుందో అక్కడ శ్రీ రాముడు సీతా ఆంజనేయ  సమేతం గా  లక్ష్మణ భరత శత్రుఘ్నపరి వారంతో ,ఉమా మహేశ్వరు లతో కొలువై ఉండి  అందరకు మనో భీష్టా లను నేర వేరుస్తాడు .
ఆంజనేయ పాహిమాం -ఆంజనేయ రక్షమాం-ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్ష మాం-ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్ష మాం
సువర్చ లాధిష్టిత వామ భాగం -నిరస్త కందర్ప సురూప దర్పణం భాను ప్రభం ,రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం ,శ్రీ హానూ మంత మీడే.
హనుమా, నంజనా సూను,వాయుపుత్రో ,మహా బలహ -రామేష్టహ ,ఫల్గున సఖః ,పింగాక్షో ,అమిత విక్రమః
ఉదధి క్రమణశ్చైవ ,సీతా శోక వినాశనః ,లక్ష్మణ ప్రాణ దాతాచ ,సుగ్రీవస్య దర్పహా ,ద్వాదశైతాని నామాని కపీంద్రస్య
మహాత్మనః -స్వాప కాలే పతేన్నిత్యం ,యాత్రా కాలే విశేషతః ,-తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ”.
అతులిత బలదామం ,స్వర్ణ శైలాభి దేహం- దనుజ  వర క్రుశానుం జ్ఞానినా మగ్ర గణ్యం- సకల గుణ నిధానం ,వానరా ణా మధీశంరఘు పతి ప్రియ భక్తం వాత జాతం నమామి
సుందరే సుందరే రామః సుందరే సుందరీ కధా సుందరే సుందరీ సీతా ,సుందరే సుందరం వనం
సుందరే ,సుందరం కావ్యం ,సుందరే సుమ్దరః కపిహ్ -సుందరే సుందరం మంత్రం సుందరే కిం నసుందరం
గోష్పదీకృత వారాశిం మశకీ కృత రాక్షసం -రామాయణ మహా మాలా రత్నం వందే అ నిలాత్మజం
ఒక భూతంబున కుద్భ వించి ,మరి ఇంకో దాని పై కేగి -,ఇంకొక దానిన్ దరి ఈడ్చి ,వేరొకట రక్షో దేశమున్ గాల్చి ,-వేరొక
భూతంబు తనూజ గుర్తెరిగి పెరుమ్గాంచి -,భూత ప్రపంచక రూపాత్మకుడైన మారుతి సమస్తా రాధ్య దైవంబగున్
శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే పూర్వా భాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూ మతే
కరుణారస పూర్ణాయ,ఫలా పూప ప్రియాయచ -మాణిక్య హార కం థాయ మంగళం శ్రీ హానూ మతే
సువర్చలా కళత్రాయ,చతుర్భుజ ధరాయచ -ఉష్ట్రా రూధాయ వీరాయ ,మంగళం శ్రీ హానూ మతే
దివ్య మంగళ దేహాయ ,పీతాంబర ధరాయచ -తప్త కాంచన వర్ణాయ  మంగళం శ్రీ హానూ మతే
భక్త రక్షణ శీలాయ ,జానకీ శోక హారిణే-జ్వలత్పావక నేత్రాయ ,మంగళం శ్రీ హానూ మతే
పంపా తీర విహారాయ ,సౌమిత్రి ప్రాణ దాయినే -సృష్టి కారణ భూతాయ ,మంగళం శ్రీ హనూమతే
రంభా వన విహారాయ ,గంధ మాదన వాసినే సర్వ లోకైక నాధాయ ,మంగళం శ్రీ హనూమతే
పంచానన భీమాయ ,కాలనేమి హరాయచ కౌండిన్య గోత్ర జాతాయ మంగళం శ్రీ హానూ మతే ”’.
శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం సర్వం సంపూర్ణం ఓం శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ


శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం — 49 శ్రీ హనుమంతుని వేదాంతం కధ


                                                                   
                  
ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .–”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః –ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్  ” –రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .
”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః –యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః –శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం –భోగశ్చ  ,మోక్షశ్చ ,కరస్త యేవ ”–అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు .
  చిటికెల భాగవతం
అయోధ్యలో ఉన్నంత కాలం శ్రీ రామునికి సర్వ సేవలు హనుమంతుడే చేశాడు .ఇది చూసి సీత ,లక్ష్మణుడు ,భరత శత్రుఘ్నులు చాలా బాధ పడు తున్నారు . వారికి రాముని సేవలు చేసే అవకాశమే రావటం లేదు .రాత్రి వేళల్లో సీతా దేవి చేయాల్సిన సేవలకు హనుమ అడ్డం వస్తున్నాడు .వీరంతా కలిసి ఆలోచించి ,ఒక ప్రణాళిక సిద్ధం చేసు కొన్నారు .అన్ని సపర్యలు తామే చేసే టట్లు హనుమ కు మాత్రం అతి చిన్నది అయిన ఒక పని అప్ప గించారు .అదే చిటికెల కార్య క్రమం .ఆ పని నైనా తనకు ఉంచి నందుకు పరమానంద పడ్డాడు మారుతి .అందరికి అంగీకార మైన పరిష్కారం లభించింది .
ఆ రోజు హనుమ శ్రీ రాముడిని తదేకం గా చూస్తూ కూర్చున్నాడు .పగలంతా గడిచి పోయింది .సీతా దేవి శ్రీ రాముని గది లోకి ప్రవేశించింది .హనుమ బయటకు వచ్చేశాడు .తలుపులు మూసేశారు దంపతులు .రాముడు ఎప్పుడు ఆవ లిస్తాడో తెలీదు అందుకని హనుమ విడువ కుండా ”చిటికెలు ”వేస్తూనే ఉన్నాడు .రాముడికి ఆవులింతలు వచ్చి, ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు .పధకం బెడిసి కొట్టింది .మళ్ళీ అంతా సమావేశ మై సేవలన్నీ ఆంజనేయుడే చేయాలి అని నిర్ణ యించారు .ఈ విషయాన్ని హనుమ కు తెలియ జేశారు .అప్పుడు చిటికెలు వేయటం మానేశాడు మారుతి .దానితో శ్రీ రాముడు నిద్రకు ఉపక్రమించాడు .ఇదీ చిటికెల భాగవతం .
సశేషం

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –48 హనుమ భోజన కధ


సీతా సాధ్వి కి హనుమ మీద అమిత పుత్ర వాత్సల్యం ఉంది .తనను మళ్ళీ శ్రీ రాముని సన్నిధికి చేర్చినది మారుతి యే ననే నమ్మకం ఆమెది .ఆ సంజీవ రాయుడే లేక పోతే తన దుర్గతికి నిష్కృతి ఉండేది కాదను కొనేది .ఇప్పుడు ఆమె అయోధ్యా నగరానికి మహా రాణి .పుత్ర వాత్సల్యం తో అతన్ని విందుకు ఆహ్వా నించ దలచి శ్రీ రామునికి తెలిపింది .దానికి రాముడు  ”సీతా ! ఆంజనేయునికి తృప్తిగా భోజనం పెట్ట గలవా .అతడు రుద్రుడు .బాగా ఆలోచించి ఏర్పాట్లు చేసుకో ”అని ముందే హెచ్చరించాడు .జానకీ దేవి హనుమ ను మహా వీరుని గా ,అధ్యాత్మ చింతనా పరుని గా భావించింది కాని ,రుద్రాంశ సంభూతుడు అన్న విషయాన్ని మరిచి పోయింది .
ఏర్పాట్లన్నీ చక్కగా చేసింది .నోరూరించే పిండి వంటలు తయారు చేసింది .హనుమ ను ఆహ్వానించింది .అతడు సమయానికి వచ్చాడు .విస్తరి ముందు హాయిగా కూర్చున్నాడు .అన్ని పదార్ధాను సీతా దేవి యే వడ్డించింది .వడ్డిం చినవి ,వడ్డించి నట్లు తినేస్తున్నాడు మారుతి .ఒకే పదార్ధాన్ని అనేక సారులు అడిగి వడ్డింప జేసుకొని లాగించేస్తున్నాడు .వండిన వన్నీ ”స్వాహా ”చేశేశాడు .దిక్కు తోచ లేదు సీతమ్మకు .తృప్తి గా తిన కుండా హనుమ విస్తరి   ముందు నుంచి లేచే సూచన ఆమెకు కనిపించ లేదు .అప్పుడు ఆమె కు తన భర్త, హనుమ రుద్రావతారం అని చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చింది .వెంటనే మనస్సు లో శ్రీ రాముని ధ్యానించి,నమస్కరించింది .హనుమ వెనుక నుంచొని శివ పంచాక్షరి ”ఓం నమశ్శివాయ ”ను జపిస్తూ శివున్ని కాసేపు ధ్యానించింది .మహా రుద్రావతారు డైన శివాత్మజుడైన హనుమ తన రుద్రా రూపాన్ని సీతా మాతకు చూపించి ,కడుపు నిండిన వాడి లాగా జుర్రున త్రేపుతూ ,విస్తరి ముందు నుంచి లేచాడు . .ఆంజనేయుని  శివావతారాన్ని  అప్పుడామెదర్శించి ఆనందించింది .,అప్పటి దాకా హనుమ పై ఉన్న సాధారణ దృష్టి మారి పోయి, విశేష గౌరవ దృష్టి తో చూడటం మొదలు పెట్టింది .
                      అవిసె చెట్టు ప్రసాదం 
సీతా రాములు శత కంథరాక్షస సంహారం చేసి,అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఏకాదశీ పర్వదినం .ఏకాదశీ వ్రతాన్నిశ్రద్ధతో  నిర్వహించి ,మర్నాడు ద్వాదశి పారాయణ చేశారు .ద్వాదశి ఘడియలు దాటి పోకుండా విందు భోజనానికి ఏర్పాట్లు జరిగాయి .రాముని సోదరులు ,అనేక మంది రాజులూ ,విభీషణుడు మున్నగు వారు ,సుగ్రీవాదులు అందరు ఉచిత స్తానాల్లో భోజనాలకు కూర్చున్నారు .అందరికి బంగారు ఆకులలో వడ్డన జరిగింది .భోజనం తిన టానికి ముందు అందరు పరిశేచనం (నీటిని విస్తరి చుట్టూ మంత్ర పూతం గా తిప్పటం )చేస్తున్నారు .అప్పుడు హనుమ ఒక్క ఉదుటున శ్రీ రాముని సమీ పించి నమస్కరించి ,”రాజా రామా ! భక్త పరాదీనా !ఈ దాసుడిది ఒక విన్నపం ఉంది .ఆలించు .మొదట గా మీరు భోజనం చేసిన తరువాత మా వానర జాతి అంతా మీ ప్రసాదం గా భుజించ టానికి అనుజ్న నివ్వండి .”అని ప్రార్ధించాడు .ఇందులో ఏదో అంత రార్ధం ఉండి  ఉంటుందని ,లేక పోతే ఇలాంటి కోరిక కోరడని గ్రహించాడు రాముడు .”సరే అలానే కానిద్దాం ”అన్నాడు రామాదులు ,మహర్షులు తృప్తిగా భోజనం చేశారు .
హనుమ, శ్రీ రాముని బంగారు విస్తరి లో తినగా మిగిలిన  పదార్ధాలతోఒక ముద్ద ను ఒక గిన్నె లో ఉంచుకొని ,  ,దాన్ని దగ్గర లో ఉన్న ఒక అవిసె చెట్టు దగ్గరకు చేరి కింద ఉంచాడు .అవిసె పూలను కోసి, ఒక చోట చేర్చాడు .హనుమ ఎంచేస్తాడో చూడటానికి రాముని తో సహా అందరు కుతూహల పడుతున్నారు .అప్పుడు మారుతి సుగ్రీవాది వానర వీరు లందరినీ తన దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు .వారంతా బిల బిల లాడుతూ చేరుకొన్నారు .శ్రీ రాముని ప్రసాదం అని చెప్పి ఆ గిన్నే లోని దానిని ఒక ముద్ద గా చేసి దానితో పాటు అవిసె పువ్వును ఒక్కక్క వానరుని చేతి లో ఉంచాడు .  దానిని ”రామార్పణం ”అని అనుకొంటూ కళ్ళకు అద్దుకొని ప్రసాదం గా భుజించమని కోరాడు .అందరు హనుమ చెప్పి నట్లే చేశారు .అందరు తిన్న తరువాత మారుతి, తాను కూడా దాన్ని అవిసె పువ్వు తో సహా ప్రసాదం గా కళ్ళకు అద్దు  కొని తిన్నాడు .ఇంత మంది వానరులకు ఆ కాస్త ప్రసాదమే,ఆ కాసిని అవిసె పూలే  అవ్యయం గా సరిపోయాయి .
అప్పుడు శ్రీ రాముడు హనుమ చెంత కు చేరి ” వాయు నందనా !ఇప్పుడు నువ్వు చేసిన ఈ కృత్యం వల్ల ద్వాదశి పారాయణ సమగ్రం గా ,సంతృప్తి గా సంపూర్ణం అయింది .ద్వాదశి వ్రతానికి గొప్ప సార్ధకత లభించింది .కనుక ఇప్పటి నుడి ప్రతి నెలలో వచ్చే రెండు ద్వాదశి తిధులలో ఈ అవిసె వృక్షానికి చెందిన పూలను ,కాయలను ,పత్రా లను భోజన పదార్ధాలుగా ఉపయోగించిన వారికి సకల సుఖ శాంతులు లభిస్తాయి వారందరూ నాకు అత్యంత ఆత్మీయులవుతారు .”అని వరం ఇచ్చాడు .అప్పటి నుండి అవిసె చెట్టు విష్ణు ప్రీతీ కరమైనది గా భావిస్తున్నారు .దాని ఆకులు కాయలు పూలను భక్తీ తో ద్వాదశి నాడు భుజిస్తారు .అవిసె కు ”అగస్త్య  ”అనే పేరు ఉంది .ఆకాశం లో అగస్త్య నక్షత్ర దర్శనం నాడు అవిసె బాగా పూస్తుంది .అవిసె ను ”అగిసే” అనీ కొన్ని చోట్ల పిలుస్తారు .అవిసె చెట్టు మహాత్మ్యాన్ని అందరికి తీలియ జేసిన ఘనత హనుమదే .
సశేషం 

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –47 గంధ సింధూర విశేషం


.శ్రీ రామ పాద సేవా దురంధరుడు , రామ భక్తీ సామ్రాజ్యాధి పతి అయినశ్రీ  హను మంతుడు అయోధ్య లో శ్రీ రామ పట్టాభి షెకాన్ని పరమ వైభవం గా జరి పించాడు .రామ పరభువు సీతా మాతను ప్రేమించి నంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరం గా ఉంచుతున్నాడని మనసు లో భావించాడు .రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు .తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధం కావటం లేదు .తన కంటే సీతా మాత లో అధికం గా ఏముంది ?ఆమెనే అంత ఆత్మీయం గా దగ్గరే ఉచుకోవటానికి కారణ మేమిటో ఆ ఆజనం బ్రహ్మ చారికి ఏమీ తెలియక తల్ల డిల్లు తున్నాడు .జానకీ దేవి పాపిడి లో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది .ఆ యెర్ర బొట్టు కు రాముడు ఆకర్షితు దయాదేమో నని అనుమానం వచ్చింది .ఆ సిన్దూరమే తన కొంప ముంచి శ్రీరాముడిని సీతా దేవికి అతి సమీపం గా ఉంచుతోందని భ్రమ పడ్డాడు .శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించ లేని దుర్భర వేదన కు గురి అయాడు .దీని సంగతేమిటో తేల్చు కోవాలని శ్రీ రాముడి దగ్గరకే ,వెళ్లి చేతులు జోడించి ”రామయ తండ్రీ !మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది .దానికి కారణం ఏమిటో వివరించండి ”అని ప్రార్ధించాడు .
శ్రీ రామ ప్రభువు చిరు నవ్వు నవ్వి ,భక్త హనుమాన్ ను సమీపానికి రమ్మని ”భక్తా ఆంజనేయా !సీతా దేవి నుదుట సింధూర బొట్టు పెట్టు కోవటానికి కారణం ఉంది .శివ ధనుర్భంగం చేసి ,జానకిని వివాహ మాడిన శుభ సమయం లో ఆమె పాపిట మీద  సిన్దూరాన్ని నేను ఉంచాను .అప్పటి నుండి ఆమె సిన్దూరాన్ని పాపిటలో ధరిస్తోంది .దాని వల్ల నేను సీత కు వశుడను అయ్యాను .మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సిన్దూరమే కారణం ”అని వివరించి చెప్పాడు .
ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు .ఇక ఆలస్యం చెయ్య లేదు .వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సిన్దూరాన్ని తీసుకొని ,నువ్వుల నూనె తో కలిపి ,తన ఒళ్లంతా పూసేసు కొన్నాడు .ఇలా చేస్తే  ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తనవాశం అవుతాడని భావించాడు .వెంటనే హుటాహుటిన శ్రీ రామ దర్శనం చేసి నమస్కరించి ”ప్రభూసీతా రామా !చిటికెడు సిన్దూరానికే సీతా మాతకు వశమై పోయావు .మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను .మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా ?”అని అమాయకం గా అయినా మనసు లోని మాటను ధైర్యం గానే చెప్పాడు .సీతా రాముడు నవ్వి ఆనందం తో ‘హనుమా !ఈ రోజు మంగళ వారం .నాకు ప్రీతీ కలిగించాలని శరీరం అంతా సిన్దూరాన్ని ధరించావు కనుక ,నీకు మంగళ వారం భక్తీ తో గంధ సింధూరం తో పూజ చేసి ,దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు .ఈ వరాన్ని నేను నీ కు అనుగ్రహించిన వరం గా గ్రహించు .”అని హనుమ కు మనశ్శాంతి ని చేకూర్చాడు  .అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళ వారం నాడు గంధ సింధూరం తో పూజ చేసి దానిని నువ్వుల నూనె తో కలిపి నుదుట బొట్టు పెట్టు కొనే ఆచారం లోకం లో ప్రారంభ మైంది .ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనె తో కలిపినా లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది .,అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు .సిందూర పూజ హనుమ కు అత్యంత ప్రీతీ కరం .అందులోను మంగళ వారం రోజున మరీ ఇష్టం .ఇదీ సింధూరం కధా విశేషం .
సింధూరం గురించి ఇంకో కధ కూడా ప్రచారం లో ఉంది .ఇది ఆంజనేయుని తొమ్మిది అవతారాలలోమొదటిది విజయుని చరిత్రకు సంబంధించినది .ఆ విజయుడే పాండవ మధ్యముడయినఅర్జునుడు . ధర్మ రాజు చేసిన రాజ సూయ యాగం లో దక్షిణ దేశాలను జయించటానికి అర్జునుడు సైన్యం తో బయల్దేరాడు .దక్షిణ సముద్రాన్ని చేరి ,అక్కడ శ్రీ రాముడు లంకకు కట్టిన వారధిని చూసి పరిహాసం గా నవ్వాడు .అక్కడే ఉన్న హనుమకు కోపం వచ్చింది ఇద్దరికీ వాగ్వాదం పెరిగింది .ప్రతిజ్ఞలు చేసుకొన్నారు పంతాలకు పోయి .అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడికి వచ్చాడు .కిరీటి బాణాలతో సేతువు ను నిర్మించాడు .దాని కింద ఎవ్వరికీ తెలీకుండా కృష్ణుడు తాబేలు ర రూపం లో ఉంది సేతువు విరిగి పోకుండా కాపాడు తున్నాడు .హనుమ ఒక్క సారి సేతువు పైకెక్కి కాళ్ళతో చిందర వందర చేస్తూ తొక్కు తున్నాడు .సేతువు యే మాత్రం వంగ కుండా  శిధిలం కాకుండా నిలబడి ఉంది హనుమ అంతటి బలాధ్యుని పాద ఘట్టనానికి తట్టు కొని నిల బడింది .ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు .అర్జునుడు విజయ గర్వం తో విర్ర వీగాడు .కృష్ణుడు నీటి నుండి బయటకు వచ్చాడు .ఒళ్లంతా రక్తం కారుతోంది .పార్ధుని తో సహా అందరు భయ పడ్డారు .అప్పుడు పరమాత్మ ”అర్జునా ! ఈ జయం నీది కాదు .ఆన్జనేయుడిది .నేను వారధి కింద వీపు పెట్టి మోయక పోతే  అది హనుమ ఒక్క లంఘనానికే విరిగి ముక్కలయ్యేది .నీ పరువు కాపాడ టానికి నేత్తురువోడే  టట్లు తట్లు శ్రమించాను .బాధ భరించాను .హనుమ కు నేను రాముడిగా ,కృష్ణుడిగా ఉంటున్నానని తెలియదు పాపం .”అన్నాడు అర్జునుడు సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాప పడి హనుమ ను ఆశ్రయించాడు .హనుమ శ్రీ కృష్ణుని శ్రీ రాముని గా గ్రహించి ,ఆయన వీపుకు అంటిన రక్తాన్ని అంతటిని తన శరీరానికి పట్టించు కొన్నాడు .క్షమాపణ కోరాడు .అప్పటి నుండి ఆంజనేయునికి సింధూర పూజ వ్యాప్తి లో ఉందని తెలుస్తోంది .అర్జునుని రధం మీద జెండా పై హనుమ ఉండి మహా భారతయుద్ధం లో   ఆతని విజయానికి కారకుడ వుతానని అనుగ్రహించాడు  .దాన్నే ”కపి ధ్వజం ”అంటారు .
సశేషం –

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –46 కుమ్భినీ పాలుని కధ


శ్రీ రామ చంద్రుని పరి పాలనా కాలం లో దక్షిణ భాగం లో ధర్మా రాన్యం అంటే ఈ నాటి కర్నాటక లో రాక్షసుల చేత ధ్వంసం చెయ్య బడ్డ గ్రామా లను రాముడు పునర్నిర్మించి వాస యోగ్యం చేయించాడు .ఆ గ్రామాలకు ”మండల నగరం ”అనే దాన్ని ప్రధాన కేంద్రం గా చేశాడు .అక్కడ వేద వేద్యులు సత్కర్మా చారణులు పండితులు జ్ఞాన నిష్టులు అనేక మంది ఉండే వారు దానికి ధర్మ కర్త గా ఆంజనేయుడిని నియమించాడు .శ్రీ రాముని తరఫున హనుమ వారిని చక్క గా కాపాడుతున్నాడు .ప్రజలకందరికి మంచి రక్షణ కల్పించాడు .కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు .గొప్ప ధర్మ వ్యవస్తనేర్పరచి ,దాని దిన దినాభి వృద్ధి కి కృషి చేశాడు .కలి కాలం ప్రవేశించ గానే ,దాని పరి పాలనాన్ని అక్కడి వారి కే వదిలి గంధ మాదన పర్వతం చేరి శ్రీ రాముని పై ధ్యానం చేస్తూ గడుపు తున్నాడు .
కలియుగం లో ”కన్యా కుబ్జం ”అనే పట్టణాన్ని రాజధాని గా చేసుకొని ,”ఆ  మందుడు ”అనే రాజు పాలిస్తున్నాడు .అతనికి ”మాయ”అనే భార్య ఉంది .వారికి ”రత్న గంగ ”అనే కూతురు జన్మించింది .ఆమెను అల్లారు ముద్దు గా పెంచుతూ ,సర్వ విద్యా విశారద ను చేశారు .ఆమె కు పెండ్లీడు వచ్చింది .వరాన్వేషణ చేస్తున్నారు .వీరి పురోహితుడు ”ధర్మ సఖుడు ”.ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా సంతోషం కల్గిస్తున్నాడు .ఒక రాజు ఆయనతో ”మహాత్మా !కలి ప్రవేశించింది .కల్మషం అంతటా వ్యాపించి పోయింది .”అన్నాడు .రాజు కలి కల్మషమంటే ఏమిటి ?అని అడిగాడు .ఆయన దానికి అర్ధం అసత్య ప్రచారం అని చెప్పి ”కలి కాలం లో అబద్ధం చెప్పే వారు ,వేదాన్ని దూషించే వారు ,హింసను పెంచే వారు ,ధర్మాన్ని వాడి లేసి అర్ధ ,కామాలను మాత్రమె ఆశ్ర యించే వారు ఎక్కువై పోతారు .విశ్వాస హీనులు ,కామ పరాయణులు ,దైవ చింతన లేని వారు ,డామ్బికులు ,వేష దారులు ,పాశందులు ,ప్రజా వంచకులు ,అసూయా పరులు ,మూర్ఖులు పెరిగి పోతారు .వీటి వల్ల ఆ అధర్మాలన్ని రాజుకు సంక్ర మిస్తాయి .మీరు ధర్మ పరులు కనుక భారాన్ని దేవుడి మీద వేయండి .మన చిరంజీవి కి మంచి వరుని తో త్వర లోనే వివాహం అవుతుంది ”అని చెప్పాడు .
కొంత కాలానికి బ్రహ్మా వర్తాన్ని పాలించే కుమ్భినీ పాలుడు అనే రాజుకు రత్న గంగ నిచ్చి వివాహం చేశాడు .కుమ్భినీ పాలుడు ,భార్య తో కలిసి ధర్మారణ్యానికి వెళ్లి అక్కడ తన రాజ్యాన్ని స్తాపించాడు .కుమ్భినీ పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని అవలంబించాడు .అప్పటి దాకా బ్రాహ్మణులు వేద విద్యా వ్యాప్తికి సత్కర్మా చరణకు యజ్న యాగాలకు ఇవ్వ బడిన అగ్రహారాలనాన్ని టినీ లాగేసు కొన్నాడు .జైనులను అక్కడ అ దికారులను గా నియ మించాడు .వాళ్ళు యజ్న యాగాలు చేసే వారిని హింసించి శిక్షించే వారు .జైనుల వేధింపు విపరీతమై వారికేమీ దిక్కు తోచలేదు .దుష్టులకు రాజ బలం తోడైంది .ఇక భరించ లేక అందరు కలిసి కన్యా కుబ్జ రాజు అయిన ”ఆమందుడు  రాజు ”కు తమ గోడు విన్న వించు కొన్నారు .తాము అతి ప్రాఛీ న కాలం నుండి అక్కడ ఉంటున్నామని ,త్రేతాయుగం లో శ్రీ రాముడు ”మహోదరం ”తో పాటు మరి కొన్ని అగ్రహారాలను తమకు ఇచ్చాడని ,తమ అల్లుడు కుమ్భినీ పాలుడు దుర్మార్గం గా వాటిని లాగేసుకొని ,హింసిస్తున్నాడని దేవతా రాదన యజ్న యాగాదులను నిషేధించాడని పూర్వ జీవితం కోన సాగించటం దుర్భరం గా ఉందని ,మళ్ళీ తమ దైవ కార్య నిర్వహణకు ,తమ వృత్తులను కోన సాగించు కోవటానికి వెంటనే చర్య తీసుకో మని విన్న వించారు .
రాజు వారంతా చెప్పింది సావధానం గా ఆలకించాడు .అల్లుడు కుంభీ పాలుడికి కబురు చేసి లాక్కున్న భూముల నన్నిటిని బ్రాహ్మణులకు ఇచ్చి వేయమని వేద విద్య కు ఆటంకం కలిగించవద్దని హితవు చెప్పి రాజ పత్రం ఇచ్చి వారిని పంపాడు . వారందరూ కుమ్భినీ పాలుడికి రాజ పత్రం ఇచ్చారు . .ఇది అల్లుడికి కోపం తెప్పించింది .మొండిగా ”మీకు యే రాముడు భూముల్ని ఇచ్చాడో ఆ రామున్నే రమ్మనండి ఆయన తో బాటు ”తోకాయన్ను ”కూడా తీసుకొని రండి ..అప్పుడు ఆయన చెప్పింది విని తగిన ట్లు చేస్తా ”అని భీష్మించాడు .పాపం కొంత మంది బ్రాహ్మణులు రాజుకు ఎదురు తిరగ లేక జైన మతాన్ని తీసుకొని ,రాజుకు లోబడి జీవిస్తున్నారు .మిగిలిన వారు తమను రక్షించ గలిగేది వాయు సుతుడైన హనుమ ఒక్కడే నని గ్రహించి ,శరణు కోరుతూ ధ్యానించ సాగారు .భక్త సులభుడైన మారుతి వెంటనే ప్రత్యక్ష మైవారికి ఆనందం కల్గించాడు .వారు ఆయన్ను ప్రస్తుతి చేశారు .తమ బాధ ను వెల్ల బోసుకొన్నారు .వారిని రక్షించాలనే ఉద్దేశ్యం తో మనసు కరిగి ,తన ఎడమ బాహువు నుండి ఒక వెంట్రుకను ,కుడి చేతి నుండి ఇంకో రోమాన్నితీసి  ,ఒక భూర్జర పత్రం లో భద్రం గా ఉంచి దాన్ని బ్రాహ్మణుల కిచ్చి ,రాజు దగ్గరకు వెళ్లి తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి పంపించాడు .ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే -ఒక రోమాన్ని సింహ ద్వారం మీద ఉంచండి .అప్పుడు భయంకర మైన అగ్ని జ్వాలలు ఏర్పడి రాజ సౌధాన్ని ,పట్టణాన్ని కాల్చేస్తాయి మీ గ్రామాలను మీ కిచ్చేసి, రక్షించమని రాజు ప్రార్ధిస్తే కుడి చేతి రోమాన్ని విసరండి . .అప్పుడు అంతా యదా స్తితి లోకి వస్తుంది అని చెప్పి పంపాడు .అక్కడ మూడు రోజులున్దమని ,ఆకలి దప్పుల తో బాధ పడుతున్నారు కనుక తానిచ్చే ఫలాలను ఆర గించమని చెప్పి ,అదృశ్య మైనాడు .
బ్రాహ్మణులు హనుమంతుని పూజ చేసి ,ప్రసాదం తీసుకొని స్వస్థత చెందారు మారుతి వారికోసం విశ్రాంతి గృహం నిర్మించాడు .మూడు రోజులు అందులో ఉండి ,నాలుగవ రోజు న వారి అగ్రహారాలకు శిలాగ్రుం చేర్చింది . మర్నాడు వారంతా రాజు దగ్గరకు వెళ్లి హనుమ చెప్పి నట్లు అడిగారు .దానిని మన్నిన్చాకుండా అవమానించాడు .హనుమ ఎడమ చేతి వెంట్రుకను ద్వారం మీద ఉంచారు .పట్టణం అంతా అంటుకొని భస్మీ భూతమైంది . ఆర్త నాదాలు పట్నం అన్తావ్యాపించాయి .జైనులందరూ పారి పోయారు .బ్రాహ్మణుల ప్రభావాన్ని గమనించి ,రాజు భయ పడి వారి అగ్రహారాలను వారికిచ్చి వేశాడు .వారు కుడి చేతి రోమాన్ని విసరేశారు .దానితో పట్నం మామూలు అయింది .రాజు కూడా బుద్ధి తెచ్చుకొని ,శ్రీ రాముని భక్తుడు గా మారి  వేదాను సారం గా ప్రవర్తించాడు ధర్మ సంస్తాపకుడై ,విష్ణు ధ్యాన రతుడై ప్రజలను కన్న బిడ్డల్లా పాలించాడు .ధర్మారణ్యాన్ని నిజమైన ధర్మా రణ్యం గా పాలిచాడు .త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన హనుమను అందరు భక్తీ శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది ,చివరకు కై వల్యం చేరారు .
సశేషం

ఆంజనేయ స్వామి మహాత్మ్యం — 45 శ్రీ హనుమత్కేశ్వరం


 రాముడు రాజ్య పాలన చేస్తున్న కాలం లో ఒక సారి అగస్త్యుడు మున్నగు మహర్షులు వచ్చి సందర్శించారు .వారందరికి తగిన విధం లో స్వాగతించి ,ఉచితాసనాలపై కూర్చో బెట్టి ,అగస్త్య మహర్షి తో ”శంకరుడు- హనుమంతుడు వీరిద్దరిలో ఎవరు అధికులు ?వాళ్ళిద్దరి సాహసాలను మనం తెలుసు కోవటం యెట్లా ?”అని శ్రీ రాముడు ప్రశ్నించాడు .అప్పుడు అగస్త్య ముని ”విజయ భాస్కరా రామా !విను .శంకరుడే హను మంతుడు .వాయు వర ప్రసాది .వాయువు లాగా అంతటా సంచ రించే నేర్పున్న వాడు .అందులో సందేహం లేదు .నీకు అనుమానం వస్తే పరీక్షించ వచ్చు ”అన్నాడు .
శ్రీ రాముడు మారుతి ని ఆప్యాయం గా పిలిచి ,”హనుమా ! ఇప్పుడే లంకకు వెళ్లి ,విభీషణుడి దగ్గరున్న ”మౌక్తిక లింగం ”ను తీసుకొని రావాలి .”అని ఆజ్ఞా పించాడు .హనుమ మారు మాట చెప్ప కుండా ,రామాదులకు నమస్కరించి ,తండ్రి వాయుదేవునికి వందనం చేసి ,రివ్వున వీచిన గాలిలాగా పల్లెలు ,పట్టణాలు ,కొండలు ,కోనలు అన్ని దాటుకుంటూ దక్షిణ సముద్రాన్ని అవలీలగా లంఘించి ,లంకలో ప్రవేశించాడు .అక్కడున్న రాక్షస వీరు లందరూ ఇంత హటాత్తు గా హనుమ రావటం చూసి ఆశ్చర్య పోయారు .సరాసరి మహా రాజు విభీషణుని కొలువు చేరాడు .విభీషణుడు మారుతి ని గౌరవించాడు .వచ్చిన కారణం తెలుప మన్నాడు .శ్రీ రాముని ఆజ్న ను వినిపించాడు హనుమ .రాజు ఎంతో సంతోషించి తాను ప్రతిష్టించిన చోటు కు వెళ్లి అక్కడున్న ఆరు శివ లింగాలను చూపించాడు .అందులో మౌక్తిక లింగాన్ని ఆంజనేయుడి చేతికిస్తూ ”హనుమా ! దీనిని నా అన్న రావణుడు కుబేరుడి నుండి తెచ్చాడు .కుబేరుడికి దాన్ని సాక్షాత్తు శివుడే ఇచ్చాడు .ఆ లింగాన్ని కుబేరుడు పూజించి ,నవ నిదు ల తో కూడిన రాజ్యానికి రాజు ఆవ గలిగాడు .రావణుడు దీన్ని పొంది లంకా సామ్రాజ్యాధి పతి అయ్యాడు .దీన్ని నేను శ్రీ రామ చంద్రునికి సభక్తికం గా సమర్పిం చానని చెప్పు ”అని లింగాన్ని ఇచ్చేశాడు .
హనుమ భక్తిగా ఆ మౌక్తిక లింగానికి నమస్కరించి ,గ్రహించాడు .విభీషణుడి దగ్గర వీడ్కోలు తీసుకొని అయోధ్య కు బయల్దేరాడు .ఆకాశం లో ఎగురుతూ ,ఏడవ రోజున అవంతీ నగర ప్రాంతం లో ఉన్న పర్వతం  మీదకు చేరాడు .లింగాన్ని అక్కడ ఉంచి ”,రుద్ర సరస్సు” లో స్నానం చ సి ,అర్ఘ్యాదులు సమర్పించి ,మళ్ళీ ఆ పర్వతం దగ్గరకు చేరాడు .అప్పుడు మౌక్తిక లింగం చిన్న పర్వతం అంత గా పెరిగి ఉండటం చూసి ఆశ్చర్య పోయాడు .దానికి కదిలించటానికి విశ్వ ప్రయత్నం చేసి ,విఫలుడైనాడు .అప్పుడు ఉమా పతి పరమేశ్వరుడు ప్రత్యక్ష మై ”హనుమా !విచార పడకు .నువ్వు దుఖిస్తే ,లోకం అంతా చింతా క్రాంత మవుతుంది .నువ్వు సంతోషం గా ఉంటె ప్రపంచం నవ్వుతుంది .ఈ లింగం ఇక్కడే ఉండాలని భాగ వంతుని భావన గా కన్పిస్తోంది .ఈ పర్వతం చాలా పవిత్ర మైనది .ఇక్కడ రుద్ర సరస్సు ఉండటం మరీ విశేషం .మౌక్తిక లింగం ఇక్కడ ఉండటం వల్ల దివ్యులైన దేవ గణం రుషి గణం దీనిని సేవించే పరమాద్భుత మైన అవకాశం కలుగు తుంది .దీన్ని వారందరూ ”శ్రీ హనుమత్కేశ్వరం ”అనే పేరు తో పిలుస్తారు .ఆ పేరు తో ఇది ప్రశస్తి పొందుతుంది . మానవు లందరూ ఈ హనుమత్కేశ్వర లింగాన్ని భక్తీ శ్రద్ధ లతో పూజించి ధన్య మవుతుంది .ఇక్కడ జరిగిన విషయాల నన్నిటిని శ్రీ రామ చంద్రునికి నా మాట గా చెప్పు .ఆయన దానిని అర్ధం చేసుకోగలదు ”అని దీవించి పంపాడు శివుడు .
అలాగే సూటిగా అయోధ్య చేరి శ్రీ రామునికి అన్నీ సవిరం గా వివ రించాడు .శ్రీ రాముడు ,అగస్త్య మహర్షి  మొదలైన వారంతా హనుమ ను ఆశీర్వ దించారు .ఈ కద లో మనకు తెలిసిన్దేమిటి ?ఎవరి కైనా కర్మ ఫలం అనుభ విన్చాల్సిందే .శ్రీ రాముడు ,నారాయణుడు ,శంకరుడు ,హనుమంతుడు ,ఎవరైనా దుష్ట రాక్షస సంహారం చేసి నందున తపస్సు చేయాల్సి వచ్చింది .అలాంటి మహాను భావులే పాపాలకు భయ పడి నప్పుడు ,సామాన్య మాన వుల సంగతి వేరే చెప్పాలా ?అందుకే అనుభవం ఉన్న వారు అందరు చెప్పే మాట లు వినాలి -మనసు చేత ,వాక్కు చేత ,క్రియల చేత ,ఇతరులకు బాధ కలుగ కుండా నడచు కోవాలి .అప్పుడు అదే తపస్సు అవుతుంది .శ్రీ రామ హనుమదాదుల చర్యలు సర్వ కాలలో ,సర్వ మానవులకు శిరో ధార్యం .ఆదర్శ ప్రాయం .మనందరి నడక శుభదాయకం గా ఉంటె దేశానికి శాంతి శుభాలు కలుగు తాయి .
సశేషం —

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం-44 శ్రీ రాముని తపస్సు

గంధ మాదన పర్వతం లో ఉన్న ఆంజనేయుడు ఒక సారి శ్రీ రామ సందర్శనార్ధం అయోధ్యకు వచ్చాడు .రామునికి నమస్కారం చేసి ,ఎదురుగా నిలబడ్డాడు .రాముడు కుశల ప్రశ్నలు వేసి క్షేమ సమాచారాలను తెలుసుకొన్నాడు .”హనుమా ! ఇంత కాలానికి మేము జ్ఞాపకం వచ్చామా ?ఏమి చేస్తున్నావు ?”అని అడిగాడు .అప్పుడు హనుమ వినయం తో ”సీతా రాముల స్వరూపాలు నా హృదయ పీథం మీద కొలువై ఉంటె నేను మిమ్మల్ని మరవటం ఉంటుందా స్వామీ ?నాప్రతి రోమం లో, ప్రతి రక్త కణం లో మీ నామమే ప్రతిధ్వనిస్తుంది .నేను ఒక సారి హిమాలయానికి వెళ్లాను .అక్కడి వారు నేను రావణాదులను సంహరించడం లో పాపం మూట కట్టుకోన్నానని ,అందుకని హిమాలయానికి వచ్చే అర్హత పోగొట్టు కొన్నానని శివుని దర్శించి పాప రహితుడనై రమ్మని వారందరూ నాతో చెప్పారు .అది విని నేను నర్మదా నది దక్షిణ తీరం లో తపస్సు చేయటం ప్రారంభించాను .నామొర ఆలించి సర్వ శుభంకరుడు శంకరుడు ప్రత్యక్ష మైనాడు .నన్ను అనుగ్రహించాడు .అక్కడ నుండే ఇక్కడికి సరాసరి వస్తున్నాను ”అని చెప్పాడు .
మారుతి మాటలు విన్న శ్రీ రాముడు ఆలోచనా మగ్నం అయ్యాడు .మనసు లో వితర్కించు కొన్నాడు .”నేను వేలాది రాక్షస గణాలను చంపాను కదా ఎంతో పాపం నేనూ మూట కట్టుకొనే ఉంటాను .కనుక నేను కూడా మహేశ్వరుని తపస్సు చేసి ,పాప ప్రక్షాళనం చేసు కొంటాను ”అని నిశ్చయించు కొన్నాడు .లక్ష్మనాదులను ,పరివారాన్ని వెంట తీసుకొని నర్మదా నది దక్షిణ ప్రాంతం చేరాడు .అక్కడ అనుకూల మైన ఒక చోట నిశ్చల మనస్సు తో శివుని కోసం తీవ్ర తపస్సు చేశాడు .సదా శివుని మంత్రాన్ని జపించాడు .లక్ష్మణుడు కూడా నర్మద కు దగ్గర లో ఉన్న జ్యోతిష్మతీ పురం లో ఉండిశ్రీ రామునికి కావలసిన సేవలు చేస్తున్నాడు .అన్నదమ్ములు ఇద్దరు శివ లింగాలను ప్రతిష్టించి ,త్రి సంధ్యలలో అభిషేకిస్తూ ధ్యానిస్తూ జపిస్తున్నారు .ఇలా ఇరవైనాలుగు సంవత్సరాలు వారు శివ ధ్యాన యోగం లో గడిపారు .చివరికి శివుడు ప్రత్యక్షమై వారి ని పాప విదూరులను చేసి మనోభీష్టాన్ని నేర వేర్చాడు .
రామ లక్ష్మణులు తపస్సు చేస్తున్నారన్న వార్త దేశమంతా పాకి పోయింది .మహర్షి గణం అంతా అక్కడికి చేరారు .వాళ్ళంతా ఒక చోట నర్మదా నది ఒండ్రు మట్టి తో శివ లింగాన్ని చేసి మట్టి కుండలతో నర్మదా నదీ జలాలతో అభిషేకిస్తున్నారు .అది క్రమంగా కుంభా కారం గా పెరిగి పోయింది .ఈ విధం గా నర్మదా నది ఒడ్డున మూడు లింగాలు ఉన్న చోటు ”కుమ్భేశ్వర స్తానం ”అని ప్రసిద్ధి చెందింది .అదే శ్రీ హనుమంతేశ్వరం కూడా .రామ లక్ష్మణులు తమను చూడ వచ్చిన మును లందరినీ కుశల ప్రశ్న లతో క్షేమ సమాచారాలను తెలుసు కొని ,వినమ్రంగా నమస్కరించారు .వారి అనుమతి పొంది మళ్ళీ అయోధ్యా నగరానికి వెళ్లారు .శ్రీరామ లక్ష్మణులు ప్రతిష్టించిన రెండు లింగాలు ,మహర్షులు చేసిన కుమ్భేశ్వరలింగం లను మూడింటిని నర్మదా నదీ జలాలతో అభిషేకించి ,పూజించిన వారికి అనుకొన్న కార్యాలన్నీ నిర్విఘ్నం గా నేర వేర్తాయి .సర్వ సుఖాలు కలుగుతాయి .
సశేషం –

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –43 శత బాహువు కధ


త్రేతాయుగం లో ఒక సారి శత బాహువు అనే రాజ కుమారుడు వేట కోసం దట్ట మైన అడవికి వెళ్లి ,వేటాడి అలసి ఒక పవిత్ర వనానికి వచ్చాడు .అక్కడ ఒక బ్రాహ్మణుడి ఒక చేతిలో పుస్తకం ,రెండవ చేతి లో ఒక మూట ఉండటం చూశాడు .బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి నమస్కరించి ,దేనికోసం ఇలా వచ్చారని అడిగాడు .బ్రాహ్మణుడు ”రాజా !నేను కన్యా కుబ్జం నుంచి వచ్చాను .హనుమంతెశ్వరం ఎక్కడ ఉందా అని వెతుకు తున్నాను .మా మహారాజు శిఖండి గారి అనుజ్న తో ఈ మూట లో ఉన్న అస్తికలను హనుమంతేశ్వర తీర్ధం లో నిమజ్జన చేయ టానికి వచ్చాను ”అని బదులు చెప్పాడు .
రాజుకు ఆశ్చర్యం వేసి అస్తికల నిమజ్జనం చేస్తారా ,దాని ప్రాధాన్యత గురించి వివ రించ మని కోరాడు .అప్పుడా బ్రాహ్మణుడు ”మహా రాజా !కన్యా కుబ్జాన్ని పాలించే రాజుకు పుత్ర సంతానం లేదు .ఒక అమ్మాయి పుట్టింది .ఆమెకు పూర్వ జన్మ స్మృతి ఉంది .అల్లారు ముద్దు గా పెరిగింది .తగిన వరున్ని వెతికి వివాహం చేయాలని రాజు గారు ప్రయత్నం చేస్తున్నారు .తండ్రి ప్రయత్నాలను విని ఆ ప్రయత్నాన్ని మానుకో మని చెప్పింది .”కారణం ఏమిటి?” అని తండ్రి అడుగగా తన పూర్వ జన్మ కధను వివ రించింది .
”తండ్రీ !నేను పూర్వ జన్మ లో ఒక ఆడ నెమలిని .ణా భర్త అయిన మగ నెమలి ,నేను చాలా అన్యోన్యం గా ఉన్నాం .ఒక సారి ఆకాశం మేఘావృతం గా ఉన్న రోజు న మేమిద్దరం ఆనంద పరవశం తో నృత్యం చేస్తున్నాము .క్రీన్కారాలతో హోరేత్తిస్తున్నాము .ఇంతలో అకస్మాత్తు గా ఒక కిరాతకుడు ఒకే సారి మా మీద బాణాలను వేశాడు .మమ్మల్ని చంపి ,మా శరీరాలను తీసుకొని పోయి మాంసం వండు కొని తిన్నాడు. నా శరీరం లోని ఒక మాంసం ముక్క నేల మీద పడింది .దానిని ఒక గ్రద్ద దక్కించు కొని నోట కరచుకొని ఆకాశానికి ఎగిరింది .దాని కోసం ఇంకో గ్రద్ద దానితో పోటీ పడి,ఆకాశం లోనే పోట్లాడుకోన్నాయి .చివరికి అవి హను మంతేశ్వరం వచ్చే సరికి ఆ మాంసం ముద్దఆ తీర్ధం లో పడింది .ఆ తీర్ధ ప్రభావం తో నేను నీకు పుత్రిక గా జన్మించాను .
”నా భర్త అయిన మగ నెమలికి ఇంకా పక్షి రూపం వదల లేదు . బోయవాడు మమ్మల్ని భక్షించిన చోటనే ఇంకా ఆయన అస్తికలు ఉన్నాయి .నర్మదా నది దక్షిణ తీరం లో హనుమంతేశ్వరం లో ఎత్తు గా ఉన్న మహా బలిష్ట మైన విస్తారమైన ఊడలు గల వట వృక్షం ఉంది .దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి .మీరు ఒక బ్రాహ్మణుడిని అక్కడికి పంపి ,ఆతని చేత ఆ అస్తికలను సేకరింప జేసి ,హనుమంతేశ్వర తీర్ధం లోని నర్మదా నదీ పవిత్ర జలాలలో నిక్షేపింప జేయించండి. .నాభర్త ఆ తీర్ధ ప్రభావం తో రాజ కుమారుడు గా జన్మిస్తాడు .అతడే నా భర్త అవుతాడు .”అని రా కుమార్తె తండ్రికి వివ రించింది .”
”ఇదంతా విన్న శిఖండి రాజు నన్ను ఈ పనికి నియోగించాడు .అందుకే ఇక్కడికి వచ్చాను .ఇక్కడి మర్రి చెట్టు క్రింద గల నెమళ్ళ అస్తికలను సేకరించాను ..నర్మదా నదీ జలాల్లో నిమజ్జనం చేయటానికి వెళ్తున్నాను .”అని శతబాహువు రాజు కు చెప్పాడు బ్రాహ్మణుడు .
హను మంతేశ్వరం చేరి ఆ బ్రాహ్మణుడు పవిత్ర స్నానాన్ని నర్మదా నది లో చేసి ,ఆ మయూరాస్తికలను మంత్ర పూతం గా నర్మదా నది లో నిమజ్జనం చేసి ,మళ్ళీ స్నానం చేసి కన్యా కుబ్జం చేరాడు .బ్రాహ్మణుడి వల్ల హనుమంతేశ్వర క్షేత్ర మహాత్మ్యాన్ని విన్న శత బాహువు నర్మదా నదీ స్నానం చేసి ,హనుమంతుని ధ్యానించి ,ధర్మ మార్గం లో సంచ రిస్తూ ధర్మం గా రాజ్య పాలన చేస్తూ ,దేవతల మెప్పు పొందాడు .చివరకు శివ సాయుజ్యం పొందాడు . నర్మదా నది లో కలిపిన నెమళ్ళ అస్తికలు దేవ రూపాలను పొంది ,వెండి కొండను చేరి ,ఆ తర్వాతా పరమేశ్వరుని అనుగ్రహం పొంది ,కాశీ రాజుకు కుమారుడి గా జన్మించి ,,పూర్వ జన్మ స్మ్రుతి కలిగి ,శిఖండి రాజ కుమార్తె ను వివాహం చేసుకొన్నాడు .చాలా కాలం సుఖాలను అనుభవించి ,ఆ దంపతులు శివ లోకం చేరారు .
సశేషం —

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –42 శ్రీ హను మంతేశ్వరం


శ్రీ రామ చంద్రుని పట్టాషేకం తర్వాత ఆంజనేయుడు రామాజ్న తీసుకొనిగం ధ మాదన పర్వతం చేరి శ్రీ రామ మంత్ర జపం లో జీవిస్తూ ,చరి తార్ధుడు అవుతున్నాడు .రామ రావణ యుద్ధం లో తాను చాలా మంది రాక్షసులను సంహరించానని ,దాని వల్ల మహా పాతకం సంక్ర మించిందని ,దాన్ని పోగొట్టు కోవా టానికి శివున్ని సందర్శించాలని కోరిక కలిగింది . ,దాని వల్లే మనశ్శాంతి లభిస్తుందని భావించాడు .సీతా రాములకు మనస్సు లోనే నమస్కారం చేసి ,వెంటనే ఆకాశ మార్గం లో కైలాసం చేరాడు .
అక్కడ నందీశ్వరుడు అడ్డు పడి ”హనుమా !నీ ఆలోచన మంచిదే .కాని బ్రహ్మ హత్యా పాతకం తో శివ దర్శనం దుర్లభం .పాపాలను పోగొట్టు కొని శివ దర్శనం చెయ్యి .నర్మదా నది అఘ విదారిణి .అక్కడ కొన్ని రోజు లుండి స్నానం తో పవిత్రుడవు కమ్ము .శివుని గూర్చి తపస్సు చేస్తూ ఆయన అనుగ్రహం పొందు .”అని హితవు చెప్పాడు .
ఆంజనేయుడు ఆ మాటలు విని నర్మదా నది చేరి ,దాని దక్షిణ ప్రాంతం లో ఉన్నసోమ నాద దేవాలయానికి దగ్గర లో . ప్రశాంత వాతావరణం లో ఉంటూ ,స్నానం చేస్తూ శివ ధ్యానం తో తీవ్ర తపస్సు చేశాడు .ప్రాణ వాణ్ని ,పంచాక్షరిని ఏకాగ్ర చిత్తం తోజపించాడు .మనసు ను స్వాధీనం చేసుకొన్నాడు .
పార్వతీ మనోహరుడు మెచ్చి ప్రత్యక్షమయాడు .”హనుమా !నీకు పాపం అన్టు తుందా ?పాపం ఎప్పుడో పోయింది .ఎప్పుడు నువ్వు పవిత్రుడవే ”అన్నాడు .వెంటనే మారుతి లేచి నిలబడి నమస్కరించి పార వశ్యం తో స్తుతి చేసి ప్రీతీ కల్గించాడు .శివుడు హను మతో ”నీకు పాపాలు లేకున్నా ,మానవులు ఇలా ఉండాలి అని మార్గం చూపించావు .నీ తప ధ్యానాలకు చాలా సంతృప్తి చెందాను .నువ్వు సర్వ దేవాత్మకుడవు .నీ నామాన్ని స్మరిస్తూ ,జపిస్తూ,నిన్నుచూస్తూ ,అందరు సర్వదా శుభాలను పొందుతారు .హనుమ ,అంజనీ సుత ,వాయు పుత్రా ,మహా బాలా ,పింగాక్ష ,లక్ష్మణ ప్రాణ దాతా ,సీతా శోక నివర్తకా ” అని స్తుతిస్తూ అదృశ్య మై నాడు .
వాయు సూనుడు తానూ తపస్సు చేసిన చోట అన్ని కోర్కెలు తీర్చే శివ లింగాన్ని ప్రత్ష్టించాడు ..ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు .”హను మంత వనం ”నిర్మించాడు .దానిలో అన్ని రకాల చెట్లు ,అన్ని రకాల పూల తీగెలు ,బహువిధ ఫల ములనిచ్చే వివిధ రకాల పండ్ల చెట్లు ఏర్పరచాడు .జింకలు ,గోరు వంకలు ,చిలకలు ,నెమళ్ళు ,కోకిలలు మొదలైన పక్షి జాతు లన్ని వచ్చి చేరాయి .నందన వనాన్ని మించిన సౌందర్యం తో ఆ వనం శోభిస్తోంది .అక్కడ ప్రశాంతత రాజ్యం చేస్తుంది .తపస్సు కు మిక్కిలి అనుకూలం గా ఉంది .ప్రకృతి శోభ కళ్ళకు ఆనందాన్ని చేకూరుస్తోంది .ఇదే ”హను మంతేశ్వరం ”.ఇక్కడ శివుడిని దర్శిస్తే సకల పాప హారం సకల మనో భీష్ట సిద్ధి కలుగు తాయి అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షి వివ రించి చెప్పాడు .
సశేషం -

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –41 శ్రీ హనుమత్కుండం

                                           
     
        దక్షిణ మహా సముద్రం  తీరం లో రామేశ్వర మహా క్షేత్రం లో ని ‘’హనుమత్కుండం ‘’గురించి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివ రించి చెప్పాడు .
    స్కంద పురాణం లో బ్రహ్మ ఖండం లో రామేశ్వర క్షేత్రం లో24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించ బడింది .అవి చక్ర తీర్ధం ,భేతాళ వరద తీర్ధం ,పాప వినాశనం ,సీతా సరస్సు ,మంగళ తీర్ధం ,అమృత వాపిక ,బ్రహ్మ కుండము ,హనుమత్కుండం ,అగస్త్య తీర్ధం ,రామ తీర్ధం ,లక్ష్మణ తీర్ధం ,జటా తీర్ధం ,లక్ష్మీ తీర్ధం ,అగ్ని తీర్ధం ,శివ తీర్ధం ,శంఖ తీర్ధం ,యమునా తీర్ధం ,గంగా తీర్ధం ,గయా తీర్ధం ,కోటి తీర్ధం ,స్వాధ్యామ్రుత తీర్ధం ,సర్వ తీర్ధం ,ధనుష్కోటి తీర్ధం ,మానస తీర్ధం .
      రావణాసురుని చంపిన బ్రహ్మ హత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీ రాముడు శివ లింగ ప్రతిష్టాపన ను రామేశ్వరం లో చేయ సంకల్పించాడు .సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన ‘’పుల్ల ‘’గ్రామానికి దగ్గరలో ,సేతువు కు సమీపం లో ,గంధ మాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని రామ సంకల్పం .హను మంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహం తో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు .ముహూర్త విషయాన్ని కూడా తెలిపి ,ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆజ్ఞా పించాడు .
      హను మంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించి పోతుండగా ,మహర్షుల అను మతి తో సీతా దేవి ఇసుక తో లింగాన్ని చేస్తే ,సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్టించాడు శ్రీ రామ చంద్రుడు .ఆ లింగానికి అభిషేకం జరిపి ,పూజ కూడా చేసే శాడు .మారుతి శివ లింగాన్ని తెసుకొని వచ్చాడు .విషయమ తెలిసి బాధ పడి  తాను తెచ్చిన లింగాన్ని ఏమి చేయాలని రామున్ని ప్రశ్నించాడు .దానికి ఆయన  వేరొక చోట ప్రతిష్టించ మని  చెప్పాడు .హనుమ కు కోపం వచ్చి ‘’రామా ! నన్ను అవమానిస్తావా ?కైకత లింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకొన్నప్పుడు నన్నెందుకు కైలాసం పంపావు ?ఇంకో చోట ప్రతిష్ట చేయటానికోసమా నేను అంత దూరం వెళ్లి తెచ్చింది ? నాకీ జీవితం వద్దు .నా శరీరాన్ని సముద్రుడికి త్యాగం చేస్తాను ‘’అని దూక బోతుండగా రాముడు వారించాడు ‘’అన్నా హనుమన్నా !మనిషి తను  చేసిన కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు .ఆత్మ ను చూడు .దుఖం పొందటం వివేకికి తగని పని దోషాన్ని వదిలి మంచిని గ్రహించు .నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్తాపిద్దాం .ఈ రెండు లింగాలను దర్శించినా ,స్మరించినా ,పూజించినా పునర్జన్మ ఉండదు .భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివ లింగాన్ని పూజించి ,ఆ తర్వాతే ఇసుక లింగాన్ని పూజిస్తారు .అలా కాక పోతే ఈ సైకత లింగాన్ని పీకేసి సముద్రం లో విసిరెయ్యి ‘’అన్నాడు .
            అప్పుడు హనుమ తన తోకను ఇసుక లింగం చుట్టూ బిగించి పెకలించ టానికి తీవ్ర ప్రయత్నం చేశాడు ..అది ఇసుమంత కూడా కదలలేదు .మళ్ళీ ప్రయత్నం చేసి వీలు గాక నెత్తురు కక్కు కొంటు దూరం గా పడి  పోయాడు .పడిన చోట హనుమ ముక్కులు ,చెవుల ,నోటి నుండి విప రీతం గా రక్తం కారి ఒక సరస్సు గా మారింది .హనుమ స్పృహ కోల్పోయాడు .అప్పుడు రాముడు మారుతి పడి  ఉన్న ప్రదేశానికి వెళ్లి ,అతని శిరస్సు ను తన ఒడిలో పెట్టు కొని సేద తెర్చాడు .అతన్ని ఆదరంగా పిలుస్తూ లేవమని కన్నీరు మున్నీరు  కార్చాడు దయా సముద్రుడు రామ చంద్రుడు .
        కొంత సేపటికి హనుమంతునికి తెలివి వచ్చింది .అప్పుడు హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని సీతా రాములు ప్రతిష్టించారు .హనుమ పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది .అదే ‘’హనుమత్కుండం ‘’.ఇది రామేశ్వరానికి కొద్ది దూరం లో ఉంది .దీని లో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని రాముడు ప్రకటించాడు .పితృదేవత లకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే స్వర్గానికి వెళ్తారని సీతా రాములు అనుగ్రహించారు .
                                                            హనుమత్కుండ మహాత్మ్యం
     పూర్వం ధర్మ సఖుడు అనే రాజు ఉండే వాడు .ధర్మం గా రాజ్య పాలన చేసే వాడు .అతడికి వంద మంది భార్యలు .చాలాకాలానికి పట్టపు దేవి మనో రమ కు కొడుకు పుట్టాడు .మిగిలిన రాణులు కూడా అతన్ని తమ కుమారుడి గానే భావించి పెంచుతున్నారు .ఒక రోజు ఆ పిల్లాడు ఉయ్యాల లో ఊగుతుండగా తేలు కుట్టింది .ఈ విషయం రాణులకు తెలీక బాలుదేడుస్తుంటే వీళ్ళు కూడా ఏడవటం మొదలెట్టారు .రాజుకు విషయం తెలిసి వైద్యుల్ని రప్పించి మంత్ర తంత్రాలు జరిపిస్తే బాలుడు స్వస్తుడు అయ్యాడు .
             ఒక రోజు రాజు తనకు ఒక్కడే కొడుకు ఉండటం బాధ గా ఉందని మిగిలిన భార్యలకు కూడా పుత్రసంతానం కలిగితే బాగుంటుందని సభలో అన్నాడు .దీనికి తగిన ఉపాయం చెప్పమని కోరాడు .మంత్రులు బాగా ఆలోచించి దక్షిణ సముద్ర తీరం లో గంధ మాదన పర్వతం మహా పుణ్య క్షేత్రం అని ,దాని దగ్గరే శ్రీ రాముడు ప్రతిష్టించిన సైకత రామ లింగేశ్వరుడు ఉన్నాడని ,దానికి సమీపం లో ‘’హనుమత్కుండం ‘’ఉందని ,అక్కడ పుత్ర కామేష్టి జరిపితే అభీష్ట సిద్ధి కలుగు తుందని తెలియ జేశారు .వారు చెప్పిన ప్రకారమే రాజు అక్కడికి వెళ్లి యజ్ఞాన్ని పూర్తి చేసి హనుమత్కుండం లో భార్యల తో సహా  స్నానం చేస్తూ నేల రోజులున్నాడు .యాగం పూర్తీ అయిన పది నెలల్లో రాజు గారి మిగిలిన రాణు లంతా పుత్రుల్ని కన్నారు .వారంతా పెరిగి పెద్ద వారైనారు .అనురాగం తో తల్లులు ,పిల్లలు ఉన్నారు .తండ్రి తర్వాతరాజ్యాన్ని పాలించారు .రాజు భార్యలు మరణానంతరం స్వర్గం చేరారు .హను మంతుడు ఈ కుండం లో స్నానం చేసిన వారి కోరికలన్నీ తీరుస్తూ భక్త కల్పద్రుమం గా విలసిల్లుతున్నాడు .

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –40 శ్రీ హనుమత్ క్షేత్రాలు


పరాశర మహర్షిని మైత్రేయ మహర్షి హనుమంతునికి వాయుపు త్రడ ని ,అగ్ని పుత్రుడని  ,పార్వతీ తనయుడు అనే పేర్లు ఎలా వచ్చాయి ?హనుమంతుని దివ్య క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ?అని ప్రశ్నించాడు .దానికి పరాశర మహర్షి వివ రంగా సమాధానం చెప్పాడు .
                   పూర్వం రాధంతరం అనే కల్పం లో కశ్యపుడు అనే బ్రాహ్మనుడున్నాడు .అన్ని శాస్త్రాలు చదివిన వాడు .ఆయన భార్యతో కైలాసం వెళ్లి శివుని గూర్చి తపస్సు చేయటం ప్రారంభించాడు .వేసవి లో అగ్ని మధ్యలో ,శీతాకాలం లో నీటిలో ,వర్షా కాలం లో రెల్లు దుబ్బుల మద్య ఉండి వెయ్యి ఏళ్లు తపస్సు చేశాడు .అంత కఠోర తపస్సు చేస్తున్న కష్యపమహర్షికి అగ్ని దేవుడు ,వాయు దేవుడు సపర్యలు చేయటం మొదలు పెట్టి ,ఆయన తపస్సు కు భంగం కాకుండా చేస్తున్నారు .సువాసన గల పుష్పాలను ,మధుర ఫలాలను ,సమిధలను ,దర్భ లను సమకూరుస్తున్నారు .తపస్సు ఫలించి శివుడు అయిదు ముఖాలతో ,మూడు నేత్రాలతో ,నందీశ్వరుని వాహనం చేసుకొని కశ్యపునికి ప్రత్యక్షమయాడు .పరమేశ్వర వైభవం పరమ అద్భుతం గా ఉంది .త్రిశూలం ,డమరుకం ధరించి ,చెవులకు మెరిసే కుండలాలతో ,పది చేతులతో ,ప్రసన్న వదనం తో ,వామ భాగం లో గౌరీ దేవితో కశ్యపునికి పరమ శివుడు దర్శనం ఇచ్చాడు .తపం చేయ టానికి కారణం ఏమిటో తెలియ జేయమన్నాడు .మనో వాంచ ను తీర్చ టా నికే తాను వచ్చానని అభయమిచ్చాడు గౌరీ నాధుడు .
           కశ్యపుడు గోరీపతి కి సాష్టాంగ దండ ప్రణామం చేసి ,’’మహా శివా ! నువ్వు నాకు పుత్రుడిగా జన్మించాలి .అదే నా కోరిక ‘’అని తెలియ జేశాడు .పరమేశ్వరుడు సంతోషించి ‘’కశ్యపా !హను మంతుడు అనే పేరు తో నేను నీకు పుత్రుడి గా జన్మిస్తాను .’’అని అనుగ్రహించాడు .అప్పుడు కశ్యపునికి సపర్యలు చేస్తున్న అగ్ని దేవుడు ,వాయుదేవుడు కూడా శివున్ని తమకు కుమారునిగా జన్మించ మని ప్రాధేయ పడ్డారు .వారిద్దరికీ కూడా సరే నని అనుగ్రహించి అదృశ్యమయాడు అభవుడు .
                      కొంత కాలం తర్వాతకశ్యపుడు ‘’కేసరి ‘’అనే పేరు గల వానరుడు గా జన్మించాడు .16,000 బంగారు పర్వతాలకు కేసరి నాయకుడయ్యాడు .కశ్యపుని భార్య ‘’సాధ్య’’-అహల్యా గౌతమ మహర్షులకు’’అంజనా దేవి ‘’అనే పేర బాలిక గా జన్మించింది .అంజనా దేవి కేసరి కి భార్య అయింది .ఈ దంపతులకు శివుడు ‘’హనుమంతుడు ‘’గా జన్మించాడు .అగ్ని దేవుడు ,వాయు దేవుడు ఆంజనేయుడిని తమ పుత్రుని గా భావించి ప్రేమించి ,లాలించారు .శివుని అంశతో జన్మించి నందున పార్వతి దేవి మారుతి ని పుత్రునిగా భావించింది ..ఈ విధం గా హనుమ అందరికి పుత్రుడు అని పించు కొన్నాడు .
            ఇప్పుడు హనుమత్ క్షేత్రాల వివ రాలను తెలియజేశాడు –
 ‘’కుండినం నామ నగరం శ్రీ భద్రంకుశ  తర్పణం –పంపా తీరం చంద్ర కోణం ,కామ్భోజం గంధ మాదనం
 బ్రహ్మా వర్త పురం చైవ బార్హస్పత్య పురం తధా –మాహిష్మతీ పురం చైవ నైమిశారన్య  మేవచ
 సుందరీ నగరం చైవ రమ్యం శ్రీ హనుమత్పురం –ఏతాని హునుమద్భక్తా పుణ్య స్థానాని నిత్యశః
 యస్మరేత్ప్రాత రుద్దాయ భక్తిం ముక్తిం  ఛ విన్దతి ‘’
     కుండిన నగరం ,శ్రీభద్రం ,కుశ  తర్పణం ,పంపా తీరం ,చంద్ర కోణం ,కామ్భోజం ,గంధమాదనం ,బ్రహ్మావర్త పురం ,బార్హస్ప్త్యపురం ,మాహిష్మతీ పురం ,నైమిశారణ్యం ,సుందరీ నగరం ,హనుమత్పురం అనేవి హనుమత్ దివ్య క్షేత్రాలు .రోజు వీటిని స్మరిస్తే చాలు భుక్తి ,ముక్తి లభిస్తాయి .ఇవి చాలా పవిత్ర నగరాలుగా ప్రసిద్ధి చెందాయి .
        ధ్వజ దత్తుడి చరిత్ర కుండిన నగరానికి చెందింది .శ్రీ భద్ర నగరం సుముఖుని చరిత్రను ,కుశ  తర్పణం హరిశర్మ వృత్తాంతానికి ,పంపాతీరం త్రిశూల రాముని వృత్తాంతానికి నారద మహర్షి కి  సంబంధించి నవి .విజయ చరిత్రం చంద్ర కోన నగరానికి చెందింది .యవనాశ్వ కధ కాంభోజ నగరానికి వర్తిస్తుంది .గంధమాదనం జాంబవంతుడు మొదలైన వారికి చెందిన వృత్తాతం .బ్రహ్మా వర్థం కశ్యపుని కధకు సంబంధించింది .సోమదత్తుని కధ మాహిష్మతీ పురం లో జరిగింది .నైమిశారణ్యం  ధ్వజ దత్త చరిత్ర కు చెందింది .శ్రీ హనుమత్పురం శ్రీ హనుమ భక్తులకు సంబంధిన నగరం .
            ఇంకా చాలా ఉన్నా ,ఇవి అతి ముఖ్యమైన క్షేత్రాలు .ఈ క్షేత్ర దర్శనం చేస్తే సకల కోరికలను హనుమ తీరుస్తాడు .వెన్నంటి ఉంటాడు .ఎల్లప్పుడు అభయాన్జనేయం గా ఉంటాడు .హనుమ భక్తులకు సహాయం చేసే వారికి మారుతి సర్వదా రక్ష గా ఉంటాడు .అని హనుమత్ క్షేత్ర చరిత్రను పరాశర మహర్షి  మైత్రేయునికి చెప్పి ఆనందం కలిగించాడు
 సశేషం –

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –39 విషూచీ కధనం


పరాశర మహర్షిని మైత్రేయ మహర్షి హనుమ చేతిలో ఓడి పోయిన లంకిణి సోదరి విశూచి వృత్తాంతాన్ని తెలియ జేయ మని కోరాడు ..
   పరాశారుడు చెప్పటం ప్రారంభించాడు .విశూచ్చీ వృత్తాంతం వాల్మీకి రామాయణం లో లేదని ,కానీ జనం దాన్ని గురించి చెప్పు కోవటం ఉందని ,తాను విన్న విషయాలను తెలియ జేస్తాను అన్నాడు .రావణుని లంక కు కాపలా గాఉన్న లంకిణి కి విశూఛీ  చెల్లెలని ,ముష్యుల్ని చంపట మే దాని పని అని చెప్పాడు .మానవుల హితం కోరిన బ్రహ్మ దాన్ని తన లోకం లోనే బంధించి ఉంచాడని తెలియ జేశాడు .లంక లో ఆంజనేయుడి చేతి లో పరాభవం చెందిన తన అక్క లంకిణి గురించి విన్న విషూచి బ్రహ్మ లోకం లో నుంచి ,మాయోపాయం తో తప్పించుకొని బయట పడింది .సరాసరి లంకకు చేరింది .హనుమ ను దూషిస్తూ ,అక్కకు జరిగిన అవమానానికి బాధ పడుతూ  ,బలమైన  వంకర కర్రతో హనుమంతుణ్ణి కొడ్తూ ,తిడ్టు హడావిడి చేసింది కాసేపు .హనుమ ముందు కుప్పి గంతులు చెల్లాలేదు .ఆ కర్రనే తీసుకొని బాది  పారేశాడు .అది కేకలు ,బొబ్బలు పెడ్తూ ఆ దెబ్బలకు తట్టు కోలేక అరిచి అరిచి చచ్చింది . 
    విషూచి చచ్చిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్ష మై ‘’హనుమా !నువ్వు మంచి పనే చేశావు .దీన్ని చంపి లోకానికి ఉపకారం చేశావు .దానికి చంపటం ఒక లీల .తగిన శాస్తి పొందింది .నీవు చిరంజీవివి .కనుక నీకు పాపం ఏమీ అంటదు .నీ నామ స్మరణ చేసిన వారికి సకల శుభాలు జరుగుతాయి .’’అని దీవించి అదృశ్యమైనాడు .
           ‘’హనుమా,నంజనా సూను ,వాయుపుత్రో ,మహాబలః –కపీంద్రః ,పిన్గలాక్షస్చ ,లంకా ద్వీప భయంకరః
          ప్రభంజన సుతో వీరః ,సీతా శోక వినాశనః –అక్ష హంతా ,రామ సఖః ,రామ కార్య దురంధరః
         మహౌషధాగి రేర్హారి ,వానర ప్రాణ దాయకః –వారీ శాతాకరస్చైవ ,మైనాక గిరి భంజనః
        నిరంజనో ,జిత క్రోధః ,కదళీవన సంవృతః –ఊర్ధ్వ రే తా ,మహా సత్త్వః ,సర్వ మంత్ర ప్రవర్తకః
        మహా లింగ ప్రతిష్టాతా ,భాష్యక్రుజ్జగతాం వరః –శివ ధ్యాన పరో నిత్యం ,శివ పూజా పరాయణః ‘’
   అనే ఇరవైఏడు నామాలున్న స్తవాన్ని భక్తీ తో  చదివితే వ్యాధుల నుండి కాపాడ బడతారు .రాబోయే సృష్టి లో ఆంజనేయుడే సృష్టికర్త అవుతాడని బ్రహ్మ వరం ఇచ్చాడు .

   ‘’ ఆంజనేయ మతి పాట లాననం ,కాన్చానాద్రి కమనీయ విగ్రహం –పారిజాత తరు మూల వాసినం ,భావయామి పవ మాన నందనం ‘’
     సశేషం —

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –38 శరావోదయ వ్రతం –2


ఏరకం పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో పరాశర మహర్షి వివ రిస్తున్నాడు ..తెల్లని పుష్పాలతో ఆంజనేయుని పూజిస్తే అన్ని కోర్కెలు తీరుతాయి .పసుపు పచ్చ పూలు ఐశ్వర్యాన్నిస్తాయి .శత్రు వును బాధించాలంటే నల్ల పూలతో పూజ చేయాలి ..సువర్ణ పుష్పాల టో పూజిస్తే రాజ సూయ యాగ ఫలం వస్తుంది .తులసి ,తామర ,జాజి ,మొగలి ,,యెర్ర కలువ మొదలైన పది రకాల పూలు స్వామికి అత్యంత ప్రీతికరం ..హనుమ విగ్రహానికి ,యంత్రానికి ,హనుమ సాలగ్రామానికి దేనికి పూజించినా మంచి ఫలితమే కలుగు తుంది .
                       హనుమ సాల గ్రామం ఎలా ఉంటుందో మహర్షి వివ రిస్తున్నాడు .హనుమత్సాలగ్రామం శిరస్సు  కుడి వైపు గుండ్ర ని చక్రం ఉంటుంది .దానికి ఎడమ వైపు బాణం తో  దెబ్బ తిన్న ఆవు గిట్ట  వంటి లోతు భాగం ఉంటుంది .సూక్ష్మ పంజరం తో ,మాలికాకారం గా ,వాలము తో ,అనేక శిఖరాలుండి  ,సూక్ష్మ మైన కార్ముఖ రేఖ ఉంటుంది .ముఖం లో రెండు చక్రాలుండి  ,సూక్ష్మ మైన తామర పూవుతో ఉండే ఈ సాలగ్రామం మంత్ర స్వరూపం గా ఉండి  సర్వ సౌభాగ్యాలను ఇస్తుంది ..ఇది సాక్షాత్తు శ్రీ హనుమంతుని ప్రతి రూపమే .దీన్ని పురుషోత్తం అని ,సుక్షేత్రం అనీ అంటారు .
                      సాలగ్రామం లేక పోతే కలశం లేక యంత్రం ఉంచి పూజ చేయ వచ్చు .ఈ శారావోదయ వ్రతాన్ని అరటి వనం లో ఆచరిస్తే మహా ఫలితం ..లేకపోతే హనుమంతుని దేవాలయం లో చేసుకో వచ్చు ..వీటిలో ఏదో ఒక దానికి మంత్ర పూతం గా ప్రాణ ప్రతిష్ట చేసి షోడచోప చార పూజ ,అష్టోత్తర ,సహస్ర నామ పూజ చేయాలి .రెండు పూటలా భోజనం నిషిద్ధం ..నేల మీదే నిద్రించాలి .బ్రహ్మ చర్యం పాటించాలి .ఈవ్రతాన్ని చాలా అంది చేసి విపరీత మైన ఫలితాలను పొందారు .
     చైత్ర మాసం లో పుష్యమి నక్షత్రం లో మైందుడు అనే బ్రాహ్మణుడు పూజించి సంపూర్ణ మనో రధుడు అయ్యాడు .వైశాఖం లో ఆశ్లేషా నక్షత్రం లో చేసి ధ్వజదత్తుడు మహా ఐశ్వర్య వంతుడ యాడు .వైశాఖ దశమి నాడు యవనాశ్వుడు పూజించి ముక్తిని పొందాడు .జ్యేష్టం లో మఘా నక్షత్రం లో చేసి హరిశర్మ హనుమ అనుగ్రహం పొందాడు .జ్యేష్ట శుద్ధ విదియ రోజున చేసి గాలుడు అనే కిరాతకుడు చేసి కుష్టు వ్యాధి ని పోగొట్టు కొన్నాడు .జ్యేష్ట శుద్ధ దశమి నాడు సుముఖుడు పూజించి ఆంజనేయుణ్ణి ప్రత్యక్షం పొందాడు ..ఆషాఢ  మాసం రోహిణీ నక్షత్రం లో చేసి ఇంద్రుడు వృత్రాసుర సంహారం చేశాడు . శ్రావణ పౌర్ణమి నాడు అర్చించి కశ్యపుడు సర్వాభీష్టాలు పొందాడు ..భాద్రపదం లో అశ్వినీ నక్షత్రం లో సేవించి నాగ కన్య  నాగ లోకం చేరింది .ఆశ్వయుజ మృగశిరా నక్షత్రం లో ద్రౌపది అర్చించి చాలా ప్రసిద్ధి చెందింది .కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అగస్త్య మహర్షి పూజించి సముద్ర జలాలను పురిశిడి  లో నిమ్పేశాడు ..మార్గ శిర శుద్ధ త్రయోదశి నాడు సోమదత్త మహారాజు చేసి పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాడు ..పుష్యం లో ఉత్తరా నక్షత్రం లో సుషేణుడు అనే గంధర్వుడు అర్చించి గాన విద్య లో మేటి అని పించు కొన్నాడు ..మాఘం లో ఆర్ద్రా నక్షత్రం లో పూజ చేసి నీలుడు సర్వాభీష్టుడ య్యాడు .ఫాల్గుణ పునర్వసు నక్షత్రం లో అంగదుడు సేవించి యువ రాజయ్యాడు .ఆదివారం హస్తా నక్షత్రం లో అర్జునుడు పూజించి శ్రీ కృష్ణు ని  సారధి గా పొందాడు .ఆదివారం మృగశిరా నక్షత్రం లో భీముడు పూజ చేసి కౌరవసంహారం చేశాడు .పూర్వాభాద్ర నక్షత్రం వానర రాజు పుష్కరుడు పూజించి తపస్సిద్ధి పొందాడు .ప్రతి శని వారం భరతుడు సేవించి అవక్ర పరాక్రముడైనాడు .ప్రతి నేల లో వచ్చే ‘’వైద్రుతి యోగం ‘’లో దూర్వాస మహర్షి ఆంజనేయుని పూజ చేసి తపస్సిద్ధి సాధించాడు
                         సోమ వారం నుండి అమా వాస్య వరకు సుగ్రీవుడు భజించి తారను పొంది భయం లేని వాడ నాడు .సీతా దేవి మంగళ వారం పూజించి మనో వాన్చా సిద్ధి పొందింది .కనుక ఈ శారావోదయ వ్రతాన్ని భక్తీ శ్రద్ధలతో ఆచరించిన వారందరూ కృత మనో రధులై అభీష్ట సిద్ధి పొందుతారు అని పరాశరుడు మైత్రేయునికి తెలియ జేశాడు
  శారావోదయ వ్రత  కధ సంపూర్ణం
  సశేషం 

ఆంజనేయ స్వామి మహాత్మ్యం —37 శరావోదయ వ్రతం– 1

                         
             
       మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని ‘’శరావోదయ వ్రతం ‘’గురించి వివ రించ మని కోరాడు .అప్పుడు పరాశరుడు ఆ వ్రత విదానానాలను గురించి ,దానికి కావలసిన వస్తు సామగ్రి గురించి తెలియ జేశాడు .
       వ్రతం చేయ దలచిన వారు సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యాస్తమయం వరకు మట్టి మూకుడు లో ఆవు నెయ్యి వేసి ,వండిన అప్పాలను హనుమంతునికి నైవేద్యం చేస్తే అదే శరావదోయ ఉత్సవం .ఇది ఉత్తమ వ్రతం గా తెలియ జేశాడు .పూర్వ కాలం లో ఈ వ్రాతానాన్ని ,మృకండ మహర్షి  బదరికాశ్రమం లో చేశాడు .ఆ వ్రత ప్రభావం వల్ల ,ఆ మహర్షి కి చిరంజీవి ,మహా యోగి ,ఇంద్రియ నిగ్రహుడు అయిన మార్కండేయుడు పుత్రుడు గా జన్మించాడు .అతని కీర్తి మూడు లోకాల్లో వ్యాపించింది .ఈ వ్రతం కోరు కొన్న అన్ని కోరిక లను తీరుస్తుంది ..ఇతర వ్రతాలతో పొంద  లేని ఫలితాన్ని శరావోదయ వ్రతం వల్ల పొంద  వచ్చు .ఈ వ్రతం యొక్క మంత్రాలు నాస్తికునికి ,కృతఘ్నుదికి ,దామ్భికుడికి ,దుర్మార్గునికి ,ఎవరు ఉపదేశింప రాదు అనే నియమాన్ని అందరు పాటించాల్సిందే .
                   మల్లెలు ,పున్నాగ ,మొగలి ,పొగడ ,నంది వర్ధన ,,దాసాని ,కదంబ   ,,గజనిమ్మ ,,తామర ,,కలువ ,యెర్ర గన్నేరు ,,జాజి ,మల్లె,సంపెంగ ,మందార ,పారిజాత ,మోదుగ ,కనకాంబరం ,తుమ్మి ,నీలామ్బరం , ,పచ్చ గోరింటా ,మెట్టతామర సురపోన్న ,వేగిస ,అడవి మల్లె ,పూల గురివింద ,,కొండ గోగు ,పోట్ల  తెల్ల ,జిల్లేడు ,,చంద్ర కాంత ,సుర పున్నాగ ,కుసుమ ,మద్ది ,బంగారు ,చామంతి ,మొదలైన పుష్పాలన్నీ ఈ వ్రతానికి వాడ వచ్చు .అక్షింతలు ,నడుము విరగని తెల్ల బియ్యం ,తిలలు ,ఉపయోగించ వచ్చు .మారేడు ,ఉసరిక ,తామర ,గరిక ,తామర ,జమ్మి ,మామిడి ,నేరేడు ,రుద్రా జట  ,,తులసి ,మాచి పత్రీ ,మర్రి ,గౌరీ జట  ,ఉత్తరేణి పత్రాలను ఉపయోగించ వచ్చు .
           అరటి పళ్ళు ,మామిడి పండ్లు ,నిమ్మ పండ్లు ,పనస ,చింత ,వెలగా ,నేరేడు ,ఖర్జూర ,,రేగు ,దానిమ్మ ,సీతాఫలము ,దోస ,ద్రాక్ష ,చెరకు ,కొబ్బరి కాయ మొదలైన ఫలాలు  శ్రేష్ఠ మైనవి .ఉదయం ,మధ్యాహ్నం ,సాయంత్ర పూజల్లో వేరు వేరు రకాల పూలను ఉపయోగించాలి .వాడిన పుష్పాలను మళ్ళీ వాడ కూడదు .సువాసన నిచ్చే పూలనే వాడాలి .సంపెంగ ,గన్నేరు ,మల్లె ,సన్నజాజి ,దవనం ,వట్టి వేరు ,తులసి మొద లైనవి కూడా వాడ వచ్చు .
           పద్మము ,నంది వర్ధనం ,వనమాలికా ,సంధ్యా వర్తనం (నంది వర్ధనం ),మాధవి పున్నాగ ,మొగలి పూలను ఉదయ కాలం చేసే పూజ లో ఉప యోగించాలి ..మధ్యాహ్న పూజకు తెల్ల తామర ,గన్నేరు ,మోదుగ ,తులసి ,కలువ ,బిల్వ పత్రాలు ,యెర్ర కలువ ,కోవిదారం ,ఏక పత్రం ,తపసాన్కురం ,అనే పది రకాలైన పుష్పాలను వాడాలి .సాయంకాల పూజ కు యెర్ర మందార ,కలువ ,మల్లె ,జాజి ,మాధవి ,గన్నేరు ,హ్రాబెరం ,గజకర్నిక ,దమనం లను వాడాలి .రాత్రి పూజ కు గరిక ,తులసి ,బిల్వం ,గన్నేరు ,సంపెంగ ,విష్ణు క్రాంత ,అశోకం అన్ని వేళలా ఉపయోగించ వచ్చు .రాత్రి మాత్రం బిలవ దళాలకు బదులు వెలగ దళాలను ఉపయోగించ వచ్చు .అన్ని కాలాల్లో ,అన్ని వేలల్లో తులసీ దళాన్ని వాడ వచ్చు .
             దీని తర్వాతా యే పుష్పాలతో పూజిస్తే ,ఏయే కోర్కెలు నేర వేరు తాయో ఇంకో సారి తెలియ జేస్తాను .
  సశేషం       

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –36 హనుమ జాంబవంతులు ఎవరు ?


          పరాశర మహర్షి ని మైత్రేయుడు ఈ ప్రశ్న ను అడిగాడు .దానికి ఆయన ‘తార సారోపనిష త్’’ ఈ విషయాన్ని బాగా  వివరించిందని చెప్పటం ప్రారంభించాడు .
‘’అథ హైనం భరద్వాజహ ప్రపచ్చ యాజ్న్య వల్క్యం కిమ్తారకం ?కిం తార యతీతి ?సహోవాచ యాజ్న్య వల్క్యః –ఓం నమో నారాయణేతి తారకం ,చిదాత్మ మిత్యుపాసితవ్యం ,ఓమిత్యేకాక్షరం ఆత్మాత్మ రూపం ,తదేవ తారకం ,బ్రహ్మత్వం విద్ధి తదేవో పాసితవ్యం .అత్రైతే శ్లోకా భవంతి అకారాదభవ బ్రహ్మా ,జామ్బవానితి సంజ్నితః ,ఉకారాక్షర సంభూత ఉపెంద్రో హరి నాయకః –మకారాక్షర సంభూత స్శివంతు హనుమాన్ స్మృతః –బిన్డురీశ్వర సంజ్ఞాస్తూ ,శత్రుఘ్న శాక్రరాత్స్వయం –నాదో మహా ప్రభురర్జ్నేయో ,భరత శ్శంఖ నామకః –కలాయః పురుష స్సాక్షాత్ లక్షనో ధరణీధరః –కలాతీతా భగవతీ స్వయం సీతేతి సంజ్నితా తత్పరః పరమాత్మా శ్రీ రామః పురుషోత్తమః ఒమిత్యేతరక్షర మిదం సర్వం తస్యోప వ్యాఖ్యానం ‘’             దీని గురించి తెలుసు కొందాం .ఓం నమో నారాయణ అనేది తారకం .చిదాత్మను ఉపాసించాలి .ఓం అనే ఎకాక్షరమే ఆత్మా స్వరూపం .ఆకారం నుండి జన్మించిన బ్రహ్మ యే జాంబవంతుడు .ఉకారం నుండి పుట్టిన ఇంద్రుడే హరి నాయకుడైన సుగ్రీవుడు .మకారాక్షర సంభూతుడైన శివుడే హను మంతుడు .బిందువు అంటే సున్నా ఈశ్వర సంజ్ఞ  మై చక్ర రాజమునకు శత్రుఘ్నుడు .మహా నాదం ఇచ్చే శంఖానికి భరతుడు గుర్తు .సాక్షాత్తు కళా స్వరూపుడైన ఆది శేషునికి చిహ్నం లక్ష్మణుడు .కళా తీత అయిన స్వయం భువి అయిన భగవతి కి సీత గుర్తు .తత్పరుడైన పరమాత్మకు శ్రీ రాముడే పురుషోత్తముడు .ఓం అనే అక్షరం ఈ విధం గా వ్యాఖ్యానింప బడింది .
     అధ్యాత్మ రామాయణం లో బాల కాండ ప్రధమ సర్గ లో శ్రీ రాముని హృదయా ఆవిష్కరణ జరిగింది –శ్రీ రాముడు పరబ్రహ్మ రూపుడు .అవ్యయుడు .సర్వ ఉపాధి నుండి విముక్తుడు .సత్తా మాత్రుడు .అగోచరుడు .అసందుడు .నిర్మలుడు .శాంతుడు .నిర్వి కారుడు .నిరంజనుడు .సర్వ వ్యాపకుడు .ఆత్మా స్వరూపుడు .స్వప్రకాషుడు ,ఆకల్మషుడు .సీత మూల ప్రకృతి .శ్రీ రాముని సన్నిధి లో ఉండి సర్గ ,స్థితి ,లయాలను చేస్తుంది .సీతా దేవి ప్రభావం చేత అన్నీ శ్రీ రాముడే చేస్తున్నట్లు భ్రమ కలుగుతుంది .అయోధ్య లో అతి నిర్మల వంశం లో రాముడు జన్మించటం ,,విశ్వామిత్రుని యాగ సంరక్షణం ,మొదలు రావణ వధ ,రామాభిషేచనం వరకు జరిగిన కధ అంతా సీతా మహాత్మ్యమే .ఈ విషయాలన్నీ సీతా దేవి హనుమ కు స్వయం గ బోధించింది .
సశేషం 

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –35 శ్రీ రాముని గుణ సౌందర్యాలు


 మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని శ్రీ రాముని గుణ సౌందర్యాలను వరిం చమని కోరాడు .దానికి ఆయన సుందర కాండ లో  ఆ విషయాలన్నీ ఉన్నాయని చెప్పి తెలియజేశాడు .శ్రీ రాముడు కమల పత్రాక్షుడు ,సర్వజీవుల మనోహరుడు .మంచి రూపం ,దాక్షిణ్య స్వభావం ఉన్న వాడు .సర్వగుణాల రాశీ భూత మూర్తి యే రామ మూర్తి .సూర్య సమాన తేజస్సు ,భూమి వంటి ఓర్పు ,బృహస్పతి బుద్ధి ,ఇంద్రుని  కీర్తి ,కలవాడు .సర్వజన రక్షణ ,క్షత్రియ ధర్మ పాలన ,లోకధర్మ రక్షణ ఉన్నవాడు .వర్నాశ్రమాలకు ,నాలుగు వర్ణాలకు రక్షకుడు .మర్యాదానిలయుడు .తేజో వంతుడు ,సర్వపూజ్యుడు .బ్రహ్మ చర్య వ్రత పరాయణుడు ,సాదుజనవుప కారి .ఐహికాముష్మిక ధర్మాలు తెలిసిన వాడు .రాజ్య విద్యలో సుశిక్షితుడు .మంచి మాటలే వినే స్వభావం .శత్రుహృదయ వేది .శీ ల ,వినయ సంపన్నుడు .శత్రుదమనుడు .యజుర్వేదాధ్యయన పరుడు .ధనుర్వేద పారంగతుడు .వేద వేత్తలకు పూజ్యుడు .వేదాంగ రహస్య విజ్ఞాని .’
    శ్రీ రాముడు సత్య ,ధర్మాను రక్తుడు .ఆర్జించిన ధనాన్ని యాచకుల కిచ్చి కాపాడే వాడు .దేశకాల విధిగా పనులు చేసే వాడు .ప్రజలందరినీ సమానం గా చూసే వాడు .అందరికి ఐ ష్టుడే .ఇప్పుడు సీతా దేవి గురించి పరాశరుడు వివరిస్తున్నాడు –‘’ఇచ్చ్చా జ్ఞాన క్రియా శక్తిత్రయం యద్భావసాధనం –తాద్బ్రహ్మ సత్తా సామాన్యం సీతా సత్వ ముపాస్మహే ‘’అనే –ఇచ్చా ,జ్ఞాన ,క్రియా శక్తులైన మూడింటికి యే భావం సాధనం అయిందో ,ఆ సామాన్య మైన బ్రహ్మ సత్తే సీతా తత్త్వం అని చెప్పాడు దీన్ని పూర్తిగా వివరిస్తున్నాడు –
‘’దేవాహవైప్రజాపతి మబ్రువన్ ,కా సీతా రూప మితి ,సహోవాచ ప్రజా పథిహ్ –సా సీతా ఇతి మూల ప్రకృతి రూపత్వా తా సీతా ప్రకృతి స్మృతా ప్రణవ ప్రకృతి రూపత్వా ,సీతా ప్రకృతి రుచ్యతే –సీతా ఇతి త్రివర్నాత్మ సాక్షా న్మాయామాయీ భవేత్ –విశ్నుహ్ ప్రపంచ బీజం ఛ మాయా ఈకార ,ఉచ్యతే .సహకార సత్య మమృతం ,ప్రాప్తః సోమశ్చ  కీర్త్యతే –తాకార స్తార లక్ష్మా ఛ వైరాజః ప్రస్తారా స్మృతః –ఇకార రూపిణీ సోమామ్రుతా వయ వాదే వ్యలన్కార సరజ మౌక్తికాద్యాభారణ లంక్రుత వ్యక్త రూపిణీ భవతి –ప్రధమా శబ్ద బ్రహ్మ మయీ ,స్వాధ్యాయ కాలే ప్రసన్నా ఉద్భావన కారీ ,కాత్మికా ,ద్వితీయా భూతలే హలాగ్రే సముత్పన్నా ,తృతీయే ఇవావ కారిణీ అవ్యక్త స్వరూపా భవతీతి సీతా ఇత్య్దహరాంతి ,శౌ నకీయే శ్రీ రామ సాన్నిధ్య వశాజ్జగా ధా నంద కారిణీ ,ఉత్పత్తి స్థితి సంహార కారిణీ ,సర్వ దేహినాం ,సీతా భగ వ తీ జ్ఞేయా’’  అని ‘’సీతోపనిషత్తు ‘’నుండి ఆమె స్వరూపాన్ని వివ రించాడు .దీని భావం –సీత మూల ప్రకృతి .ప్రణవ స్వరూపిణి.సీత అనే పేరు లో మూడు వర్నాలున్నాయి .త్రివర్నాత్మకమైనది సీత .ఆమె ప్రత్యక్ష మాయ .ప్రపంచానికి విష్ణుడవు (స)బీజము .మాయామాయి ఈ కారం గా చెప్పబడింది .స కారం సత్యానికి ,అమృత సిద్ధి కి సోమానికి కారణం .త కారం లక్ష్మీ బీజమైన శ్రీ కారానికి సంకేతం .ఇకార రూపిణి అయిన మహా మాయ అవ్యక్త రూపిణి అయినా ,సోముని లాగా అమృత స్వరూపిణి .ముత్యాలు మొదలైన ఆభరణాలను ధరించి ఉంటుంది .మొదట శబ్ద బ్రహ్మ మయి గా ,స్వాధ్యాయన కాలం లో ,ఉపాసనా కాలం లో ఆత్మ రూపిణి గా ,ప్రసన్నమై ,రెండవ సారి భూమి లో నాగలి చివర జన్మించింది .దీనికి ఉదాహరణ ఆమెయే శ్రీ రాముని సన్నిధి లో జగదానంద కారిణి గా ,సృష్టి స్థితి సంహార కారిణి గా ఉన్నది అని ‘’శౌనకీయం ‘’అంగీక రించింది .ఆమె సీత .ఆ సీతే సర్వ జీవుల లో భగవతి అంటే మాయ గా ఉంది .
             ‘’శ్రీ రామ తారక ఉపనిషత్తు ‘’లోను ‘’శ్రీ రామొత్తరతా పి  న్యుపనిషత్తు ‘’లోను ఉన్న శ్రీ రామ రహస్యాన్ని మహర్షి మళ్ళీ విశ్లేషించి చెప్పాడు  .—‘’కామ రూపాయ రామాయ ,నమో మాయా మయాయచ –నమో వేదాది రూపాయ ,ఓంకారాయ నమో నమః ‘’
‘’అద హీనం భారద్వాజః పప్రచ్చ యాజ్న్య వల్క్యం కిం  తారకం ?కిం తారీతి ?సహోవాచ యాజ్న్య వల్క్య స్తారకం దీర్ఘానల బిందు పూర్వకం ,దీర్ఘానలం పునర్మాయ నమ్స్చంద్రాయ ,నమో భద్రాయ నమ ఇత్యోన్తద్బ్రహ్మాత్మికః సచ్చిదానందాభ్యా- ఇత్యు పాసితవ్యా ‘’
దీని భావం –శ్రీ రాముడు మాయా మయుడు ,వేదాది రూపుడు ,ఓంకార రూపుడు అని రామ పూర్వతాపిత్యుపనిశాత్తు చెప్పింది తారకం అంటే దీర్ఘ అ కారం తో (రా )అనే అగ్ని బీజం అయిన రకారం బిందువు తో  కూడి తె ‘’రాం’’ అవుతుంది .తరువాత మయాయనమః అనేది ఉంది .వీటిని కలిపితే ‘’రామాయ నమః ‘’అవుతుంది .దీన్నే తారకం అంటారు .ఈ తారకాన్ని ‘’రాం రామ చంద్రాయనమః ‘’అని ,’’రాం రామ భద్రా యనమః ‘’అని రెండు రకాలుగా చెబుతారు .ఈ మూడూ తారక మంత్రాలే .ఈ విధం గా ఓంకారం తత్వస్వరూపం ,బ్రహ్మ స్వరూపమూ అయింది .వీటిని సచ్చిదానంద రూపం గా ఉపాసించాలని ఈ ఉఅనిషత్తు చెప్పింది .
శ్రీ రాముడిని సర్వ దేవాత్మక స్వరూపం గా నలభై ఏడు మంత్రాలు చెప్పాయి అందులో ముఖ్య మైన నాలుగు మంత్రాలు-
ఓం యో వై శ్రీ రామ చంద్రః స భగవాన్ అద్వైత పరమానందాత్మా యత్పరం బ్రహం భూర్భువస్సువ స్తస్మై నమః
ఓం యో వై శ్రీ రామ చంద్రః స భగవాన్ యస్చాఖండైక రసాత్మా ,భూర్భువస్స్సువ స్తస్మైనమః
ఓం యో వై శ్రీ రామ చంద్రః స భగవాన్ యచ్చ బ్రహ్మానందామృతం భూర్భువస్సు వస్సువస్తస్మైనమ్హ్
ఓం యో వై శ్రీ రామ చంద్రః స భగవాన్ యత్తా రకం బ్రహ్మ భూర్భువస్సువస్తాస్మై నమః
సూక్ష్మం గా వీటి అర్ధం –అద్వైత పరమానందుడు ,పరబ్రహ్మం ,బూ లోక భువర్లోక సువర్లోక ములు తానే అయి , అఖండైక రాసాత్మకుడు ,బ్రహ్మానందామృత  స్వరూపుడు ,తారక బ్రహ్మము అయిన శ్రీ రామ చంద్ర భగవానునికి నమస్కారములు
‘’విశ్వా కారం ,మహా విష్ణుం ,నారాయణ మనామయం –పరి పూర్ణానంద విజనం పరం జ్యోతి స్వరూపినిం  –మనసా సంస్మరాన్ బ్రహ్మాతుష్టావ పర మీశ్వరం ‘’—విశ్వానికి ఆధార మైన వాడు ,మహా విష్ణువు ,నారాయణుడు ,అనామయుడు ,పరిపూరనా నందుడు ,పరంజ్యోతి స్వరూపుడు అయిన  శ్రీ రామ చంద్ర పర మేశ్వరునికి మనసు లో సంస్మరిస్తాను .
   సశేషం 

Popular Posts