Followers

Thursday, 26 February 2015

శ్రీ ఆంజనేయ మహాత్మ్యం –15 హరి శర్మ కధ

                                         
 పూర్వం గోదావరి నది ఒడ్డున కుశ తర్పణం అనే గ్రామం లో సత్యవాది తపో నిష్టుడు ,జితేంద్రియుడు అయిన బ్రాహ్మణోత్తముడు వుండే వాడు .గురువు మీద ,హనుమ మీద ,హనుమ భక్తుల మీద వినయ, భక్తీ ,గౌరవాలు కలిగి వుండే వాడు .హనుమంనామ సంకీర్తన తో జీవితాన్ని నిశ్చల మనసు తో గడిపే వాడు .
అతనికి తీర్ధ యాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది .సంసారం ప్రతి బంధకం అని తలచాడు .అయినా హనుమ వుండగా తనకు తాపత్రయం ఎందుకు అనుకోని శ్రీ శైలం వైపు బయలు దేరాడు .కృష్ణానది కనిపించింది .అందులో పవిత్ర స్నానం చేసి మల్లికార్జున భ్రమ రాంబా దేవులను భక్తీ తో దర్శించాడు  అక్కడి నుంచి అహోబిల క్షేత్రం వచ్చాడు .ఇక్కడే ప్రహ్లాదుని కాపాడటానికి తండ్రి అయిన హిరణ్య కశిపుని శ్రీ మహా విష్ణువు సంహరించాడు .భక్తుల కోర్కె తీర్చే వాడు గా ఈ నరసింహ స్వామికి పేరు శ్రీ దేవి ,భూదేవులతో స్వామి కొలువై ఉంటాడు .స్వామిని దర్శించి అనేక స్తోత్రాలు చేశాడు .ఆ తరువాత కనిపించిన క్షేత్రాలన్నీ దర్శించాడు . .
తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి వెంకటా చలం చేరాడు .ఎండ వేడికి మూర్చితుడయాడు .హరి శర్మను రక్షించే ఉద్దేశం తో హనుమ ,శూద్ర వేశం తో ఒక పెట్టె నెత్తి మీద మోసుకొంటూ అక్కడికి వచ్చాడు .హరిశర్మ వృత్తాంతం అంతా అడిగి  తెలుసు కొన్నాడు .దగ్గర లో వున్న పండ్లను కోసి తెచ్చి భక్షించ మన్నాడు .అవి తింటున్డగానే ,మారుతి అదృశ్యమైనాడు .అతని కోసం అంతా వెతికాడు హరిశర్మ .హనుమంతుడే తన్ను రక్షించ టానికి శూద్ర రూపం లో వచ్చాడని గ్రహించాడు .భక్తి తో స్మరించాడు .వెంటనే ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు .హరిశర్మ సాష్టాంగ నమస్కారం చేసి నిల బడ్డాడు .”యోగులకు కూడా దర్శనం ఇవ్వని స్వామివి నాకు దర్శనం ఇచ్చావు ..నా అదృష్టమే అదృష్టం .” అని ఆనందం తో అన్నాడు .
మారుతి సంతోషించి ”భక్తా !నీకు కనపడ కుండానే నిన్ను ఎప్పుడు రక్షిస్తూనే వున్నాను .నువ్వు చేసే స్మరణ వింటూనే వున్నాను .శూద్ర వేషం లో నీకు పండ్లు తెచ్చి ఇచ్చాను .నీ మనసు లో కోరిక ఏదైనా వుంటే నిర్భయం గా కోరు ‘అన్నాడు .అప్పుడు హరిశర్మ తనకే కోరికలు లేవని హనుమ పద భక్తీ కంటే వేరే ఏమీ వద్దని చెప్పాడు .అప్పుడు మారుతి ”హరి శర్మా !ఈ లోకం లో సుఖాలన్నీ అనుభ వించి ఆ తర్వాత ముక్తి పొందు తావు .”అని అభయం ఇచ్చాడు .
ఎంతో సంతోషించిన హరి శర్మ తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి మనసు నిండా స్తుతించాడు .అక్కడి లడ్డు ప్రసాదము భుజించి ,కలియుగ వైకున్థం గా వున్న ఆ క్షేత్ర వైభవాన్ని చాలా సార్లు పొగిడాడు .అక్కడి నుంచి దక్షిణ యాత్ర ప్రారంభించాడు .
కాంచీ క్షేత్రం లో ఏకాంబరేశ్వర కామాక్షీ దేవులను, వరద రాజా స్వామిని దర్శించాడు .అక్కడి నుండి ,శ్రీ రంగం చేరి రంగ నాద స్వామిని మనసార దర్శించాడు .అక్కడి  కావేరి నాటి  వైకుంతం లోని    విరజా నది గా  భావిస్తారు . అక్కడి నుండి రామేశ్వరం చేరాడు అక్కడ రామ లింగేశ్వర స్వామిని దర్శించ టానికి ముందే హనుమ కుందాం లో పవిత్ర స్నానం చేశాడు .హనుమను పూజించి రామ లింగేశ్వరుని తృప్తి గా అభిషేకం చేశాడు . రామేశ్వరం నుంచి ఇంటి ముఖం పట్టాడు .సుఖం గా ఇంటికి చేరాడు .భార్యా పిల్లలతో చాలా కాలమ్ సుఖాలు అనుభవించాడు .హనుమ అనుగ్రం చేత చివరికి పరమ పదాన్ని పొందాడు .హనుమ భక్తులకు తెలియ కుండా ,అనుగ్ర హిస్తూ తోడూ నీడ గా వెన్నంటి ఉంటాడు అని హరిశర్మ కధ వల్ల మనం గ్రహిస్తాము .
దీని తరువాత ”త్రిశూల రోముని ”కధ తెలుసు కొందాం .
సశేషం





Popular Posts