Followers

Friday 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –27 దరిద్ర బ్రాహ్మణుడి కద




పూర్వం ఒక కుగ్రామం లో దరిద్రుడైన ఒక బ్రాహ్మనుడున్నాడు .చదువు ఏ మాత్రం అబ్బలేదు .ఒక పూరి గుడిసె లో కాపురముంటున్నాడు .పెళ్లి కాలేదు .బిచ్చ మెత్తు కోని జీవించే వాడు .కాని సజ్జనుడు గా జీవిస్తున్నాడు .అతని ఇంట్లో శ్రీ సీతా రామాంజనేయ విగ్రహాలున్నాయి .ప్రతి రోజూ వాటిని పరిశుద్ధ జలం తో  కడిగి పూలు పెట్టి నమస్కరించే వాడు .ప్రార్ధన మంత్రాలైనా రావు .మనసుకు తోచిన మాటలతో పూజ చేసే వాడు .ఇలా జీవితం గడిచి పోతోంది .
ఒక సారి శ్రావణ మాసం లో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళ్తూ ఈ గ్రామానికి వచ్చాడు .అప్పటికే పొద్దు గూకింది చీకటి పడింది .దీనికి తోడూ వర్షం కురవటం ప్రారంభ మైంది .వాన బాధ భరించ లేక రాజు ,సైనికులు ఎక్కడ ఇల్లు కన పడితే అక్కడ తల దాచు కొన్నారు .కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజు గారి సేవకులమని ,తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుడిని బయటకు పొమ్మని ఆదేశించారు .అపుడా బాపడు ప్రార్ధన తో ”అయ్యా లారా !మా దేవుళ్ళు అయిన సీతా రామాంజనేయ స్వాములు నిద్ర పోతున్నారు .వాళ్ళను ఇప్పుడు నేను నిద్రా భంగం చేసి మేల్కొల్ప లేను .”అని అతి వినయం గా సమాధానం చెప్పాడు .సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బైటికి వెళ్ళమని గట్టి గా చెప్పారు .వినక పొతే విపరీతం గా కొట్టటం ప్రారంభించారు .ఆ దెబ్బల బాధ భరించ లేక పోతున్నాడు పాపం .
    కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లా ఆ విగ్రహాలున్న చోటికి వెళ్లి ”శ్రీ రామా ! నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తున్నారు .మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు ”అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపు పై ఉంచుకొని జల పాత్ర ను ఎడం చేతి లో పట్టు కోని ,దండాన్ని కుడి చేతిలో ధరించి ,బైటకు వచ్చి చూరు  కింద నిల బడ్డాడు .లోపల  సైనికులు హాయిగా నిద్ర పోతున్నారు .వర్షం విపరీతం గా కురుస్తోంది .ఏమీ చేయటానికి అతనికి పాలు పోవటం లేదు .నీటి పాత్ర ను నేల మీద ఉంచి ,ఎడమ చేతి తో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని ,”వాయు నందనా !నీ ప్రతాపం ఇంతేనా ?నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ విపరీతం గా వర్నించాయని అంటారు ..నిన్ను నువ్వు రక్షించు కో లేవా ?నీ స్వామి ని కాపాడు కోలేవా ?ఎందుకొచ్చిన పరాక్రమం ?”అని దుఃఖిస్తూ ఆంజనేయుడి తోకను పుచ్చు కొని గాలిలోకి ఆ విగ్రహాన్ని విసిరేశాడు .అంతే -ఆ విగ్రహం హను మంతుని గా మారి పోయింది .బ్రహ్మాండ భాన్డాలన్నీ  దద్ద రిల్లేట్లు భయంకర గర్జన చేశాడు హనుమ .ఆ గర్జనకు రాజు ,అతని సైనికులు ఊళ్ళోని మగ వాళ్ళందరూ  గుండెలు పగిలి చచ్చి పోయారు .స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు .ఎట్లాగో ఆ రాత్రి గడిచి పోయింది .వర్షం కూడా తగ్గి పోయింది .తెల్ల వారిన తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కని పించాయి .ఈ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శావాలనన్నిటికి దహన సంస్కారాలు చేశారు .అప్పటి నుండి ఆ ఊళ్ళో ని స్త్రీ లందరూ అతన్ని భర్త గా స్వీకరించారు .అనేక సుఖాలు  అనుభవించి ,సీతా రామాన్జనేయులను నిత్యం పూజిస్తూ ,కొద్ది రోజులకు రాజైనాడు .అప్పటి  నుంచి ఏ స్త్రీ అయినా గర్భం లో పురుష శిశువును ధరిస్తే హనుమ గర్జించే వాడు .గర్భ పాతం జరిగి ఆ శిశువు మర ణించే వాడు . ఆ గ్రామం పూర్తిగా  మగువల దే  అయింది .మగవాళ్ళు లేని గ్రామంగా నే ఉండి పోయింది ..మళ్ళీ మగ శిశు జననం అనేది అక్కడ జరగ లేదు .
                  సశేషం

Popular Posts