Followers

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –40 శ్రీ హనుమత్ క్షేత్రాలు


పరాశర మహర్షిని మైత్రేయ మహర్షి హనుమంతునికి వాయుపు త్రడ ని ,అగ్ని పుత్రుడని  ,పార్వతీ తనయుడు అనే పేర్లు ఎలా వచ్చాయి ?హనుమంతుని దివ్య క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ?అని ప్రశ్నించాడు .దానికి పరాశర మహర్షి వివ రంగా సమాధానం చెప్పాడు .
                   పూర్వం రాధంతరం అనే కల్పం లో కశ్యపుడు అనే బ్రాహ్మనుడున్నాడు .అన్ని శాస్త్రాలు చదివిన వాడు .ఆయన భార్యతో కైలాసం వెళ్లి శివుని గూర్చి తపస్సు చేయటం ప్రారంభించాడు .వేసవి లో అగ్ని మధ్యలో ,శీతాకాలం లో నీటిలో ,వర్షా కాలం లో రెల్లు దుబ్బుల మద్య ఉండి వెయ్యి ఏళ్లు తపస్సు చేశాడు .అంత కఠోర తపస్సు చేస్తున్న కష్యపమహర్షికి అగ్ని దేవుడు ,వాయు దేవుడు సపర్యలు చేయటం మొదలు పెట్టి ,ఆయన తపస్సు కు భంగం కాకుండా చేస్తున్నారు .సువాసన గల పుష్పాలను ,మధుర ఫలాలను ,సమిధలను ,దర్భ లను సమకూరుస్తున్నారు .తపస్సు ఫలించి శివుడు అయిదు ముఖాలతో ,మూడు నేత్రాలతో ,నందీశ్వరుని వాహనం చేసుకొని కశ్యపునికి ప్రత్యక్షమయాడు .పరమేశ్వర వైభవం పరమ అద్భుతం గా ఉంది .త్రిశూలం ,డమరుకం ధరించి ,చెవులకు మెరిసే కుండలాలతో ,పది చేతులతో ,ప్రసన్న వదనం తో ,వామ భాగం లో గౌరీ దేవితో కశ్యపునికి పరమ శివుడు దర్శనం ఇచ్చాడు .తపం చేయ టానికి కారణం ఏమిటో తెలియ జేయమన్నాడు .మనో వాంచ ను తీర్చ టా నికే తాను వచ్చానని అభయమిచ్చాడు గౌరీ నాధుడు .
           కశ్యపుడు గోరీపతి కి సాష్టాంగ దండ ప్రణామం చేసి ,’’మహా శివా ! నువ్వు నాకు పుత్రుడిగా జన్మించాలి .అదే నా కోరిక ‘’అని తెలియ జేశాడు .పరమేశ్వరుడు సంతోషించి ‘’కశ్యపా !హను మంతుడు అనే పేరు తో నేను నీకు పుత్రుడి గా జన్మిస్తాను .’’అని అనుగ్రహించాడు .అప్పుడు కశ్యపునికి సపర్యలు చేస్తున్న అగ్ని దేవుడు ,వాయుదేవుడు కూడా శివున్ని తమకు కుమారునిగా జన్మించ మని ప్రాధేయ పడ్డారు .వారిద్దరికీ కూడా సరే నని అనుగ్రహించి అదృశ్యమయాడు అభవుడు .
                      కొంత కాలం తర్వాతకశ్యపుడు ‘’కేసరి ‘’అనే పేరు గల వానరుడు గా జన్మించాడు .16,000 బంగారు పర్వతాలకు కేసరి నాయకుడయ్యాడు .కశ్యపుని భార్య ‘’సాధ్య’’-అహల్యా గౌతమ మహర్షులకు’’అంజనా దేవి ‘’అనే పేర బాలిక గా జన్మించింది .అంజనా దేవి కేసరి కి భార్య అయింది .ఈ దంపతులకు శివుడు ‘’హనుమంతుడు ‘’గా జన్మించాడు .అగ్ని దేవుడు ,వాయు దేవుడు ఆంజనేయుడిని తమ పుత్రుని గా భావించి ప్రేమించి ,లాలించారు .శివుని అంశతో జన్మించి నందున పార్వతి దేవి మారుతి ని పుత్రునిగా భావించింది ..ఈ విధం గా హనుమ అందరికి పుత్రుడు అని పించు కొన్నాడు .
            ఇప్పుడు హనుమత్ క్షేత్రాల వివ రాలను తెలియజేశాడు –
 ‘’కుండినం నామ నగరం శ్రీ భద్రంకుశ  తర్పణం –పంపా తీరం చంద్ర కోణం ,కామ్భోజం గంధ మాదనం
 బ్రహ్మా వర్త పురం చైవ బార్హస్పత్య పురం తధా –మాహిష్మతీ పురం చైవ నైమిశారన్య  మేవచ
 సుందరీ నగరం చైవ రమ్యం శ్రీ హనుమత్పురం –ఏతాని హునుమద్భక్తా పుణ్య స్థానాని నిత్యశః
 యస్మరేత్ప్రాత రుద్దాయ భక్తిం ముక్తిం  ఛ విన్దతి ‘’
     కుండిన నగరం ,శ్రీభద్రం ,కుశ  తర్పణం ,పంపా తీరం ,చంద్ర కోణం ,కామ్భోజం ,గంధమాదనం ,బ్రహ్మావర్త పురం ,బార్హస్ప్త్యపురం ,మాహిష్మతీ పురం ,నైమిశారణ్యం ,సుందరీ నగరం ,హనుమత్పురం అనేవి హనుమత్ దివ్య క్షేత్రాలు .రోజు వీటిని స్మరిస్తే చాలు భుక్తి ,ముక్తి లభిస్తాయి .ఇవి చాలా పవిత్ర నగరాలుగా ప్రసిద్ధి చెందాయి .
        ధ్వజ దత్తుడి చరిత్ర కుండిన నగరానికి చెందింది .శ్రీ భద్ర నగరం సుముఖుని చరిత్రను ,కుశ  తర్పణం హరిశర్మ వృత్తాంతానికి ,పంపాతీరం త్రిశూల రాముని వృత్తాంతానికి నారద మహర్షి కి  సంబంధించి నవి .విజయ చరిత్రం చంద్ర కోన నగరానికి చెందింది .యవనాశ్వ కధ కాంభోజ నగరానికి వర్తిస్తుంది .గంధమాదనం జాంబవంతుడు మొదలైన వారికి చెందిన వృత్తాతం .బ్రహ్మా వర్థం కశ్యపుని కధకు సంబంధించింది .సోమదత్తుని కధ మాహిష్మతీ పురం లో జరిగింది .నైమిశారణ్యం  ధ్వజ దత్త చరిత్ర కు చెందింది .శ్రీ హనుమత్పురం శ్రీ హనుమ భక్తులకు సంబంధిన నగరం .
            ఇంకా చాలా ఉన్నా ,ఇవి అతి ముఖ్యమైన క్షేత్రాలు .ఈ క్షేత్ర దర్శనం చేస్తే సకల కోరికలను హనుమ తీరుస్తాడు .వెన్నంటి ఉంటాడు .ఎల్లప్పుడు అభయాన్జనేయం గా ఉంటాడు .హనుమ భక్తులకు సహాయం చేసే వారికి మారుతి సర్వదా రక్ష గా ఉంటాడు .అని హనుమత్ క్షేత్ర చరిత్రను పరాశర మహర్షి  మైత్రేయునికి చెప్పి ఆనందం కలిగించాడు
 సశేషం –

Popular Posts