Followers

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –30 మారుతి ప్రతిజ్ఞ

                                

   మారుతి ప్రతిజ్ఞ
         శ్రీ రాముని అనుమతి పొంది ఆంజనేయుడు ద్రోణ గిరి మీద తపస్సు చేసు కొంటున్నాడు .కాని  పతి రోజు తెల్ల వారు ఝాముననే అయోధ్యకు వచ్చి ,శ్రీ రాముడి శరీరాన్ని తైలం తో మర్దించి ,తలంటి స్నానం చేయించి మళ్ళీ వెళ్ళే వాడు .అయోధ్యకు ,ద్రోనాద్రి కి మధ్య సర్వ ఐశ్వర్య నిలయ మైన ఒక పట్టణం ఉంది .అందులో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు . దానిలో బాగా ధన వంతుడైన  ‘’వైశ్రవణుడు ‘’అనే ఒక వైశ్య ప్రముఖుడున్నాడు .నిజాయితీ తో వ్యాపారం చేస్తూ ,అందరి మన్నలను పొందాడు .మేధావి సద్గుణ సంపన్నుడు ,ధర్మాను రక్తుడు .ఇతన్ని నమ్ముకొన్న ఒక బ్రాహ్మణ గృహస్తుడు ఆ ఊరిలో ఉన్నాడు .అతడు ధర్మ మార్గం లో సంచరిస్తూ ,జ్ఞాన వృద్ధుడు గా ఉన్నాడు .రోజు ఆ వైశ్యుని చేరి ధర్మ బోధ చేస్తూ అయోధ్య లో ప్రత్యక్ష దైవమైన శ్రీ రాముడు ఉన్నాడని ,ఆయన్ను స్మరించి ముక్తి పొందమని హెచ్చ రించే వాడు .
              రోజు చెప్పే హిత వాక్యాలను విటు వ్యాపారి తనకు తీరికే దొరకటం లేదని ఆ ఊరు వదిలి అయోధ్యకు ఎలా వెళ్ళ గలనని సమాధానం చెబుతూ ఉండే వాడు .అప్పడు ఆ బ్రాహ్మణుడు తీరికా సమయం లేక పోతే బయటికి వెళ్ళే తప్పుడైనా రామ నామం జపించ వచ్చు కదా అని సలహా ఇచ్చాడు . అంతే కాదు వైశ్యుడు మల విసర్జన సమయం లో రామ నామం జపించ వచ్చా /అని అడిగాడు .అప్పుడు బ్రాహ్మణుడు  కొన్ని వేదాంత విషయాలను కూడా  తెలియ జేశాడు .శరీరం అనిత్య మైనదని ,శరీరం ధర్మ సాధనకే ఉపయోగించాలని ,మహాత్ముల సందర్షం తో పాపాలన్నీ పటాపంచాలవుతాయని ,శరీరం సుఖాలను అనుభవించ టానికి పనికి వచ్చి నపుడు రామ స్మరణకు పనికి రాదా /శరీరానికి అమృత తుల్య మైన ఆహారం పెడుతున్నాం కాని అది కంపు కొట్టే మలాన్ని విసర్జిస్తోంది .ఎవరైనా మన శరీరం లోదే కదా అని మలాన్ని తింటాడా ?సుఖాన్ని త్యాగం చేస్తాడా ?అని కొన్ని హితోక్తులు చెప్పాడు అతని మనసేమీ మార లేదు .అందుకని కోన సాగిస్తూ ‘’మన శరీరం లో నాభికి పైన ,కంఠానికి కింద కమలం లాంటి హృదయం అధోముఖం గా ఉంది .అది జ్వాలా మాలికల వంటి నాడులతో వేలాడుతూ ప్రకాశిస్తుంది .అక్కడే పరమేశ్వరుడు కొలువై ఉంటాడు .దానికి పై భాగం లో వికసించిన కమలంలో జేవుడు ఉంటాడు .అన్నీ దాని లోనే నిక్షిప్తమై ఉంటాయి .దాని మధ్య భాగం లో ప్రజ్వలించే వైశ్వానరుడు అనే జతరాగ్ని  ఉంటుంది .ఇదే మనం తిన్న ఆహారాన్ని విభజించి శరీరం అంతటికీ సరఫరా చేస్తుంది .ఇందులోని జ్వాల సూక్ష్మం  గా పైకి లేస్తుంది .ఆ సూక్ష్మ జ్వాలే నీల మేఘం మధ్య ఉండే విద్యుత్ లతా గా ఉంటుంది .అదే వారి ధాన్యపు ముళ్ళు లాగా సూక్ష్మమై పచ్చని కాంతి తో అణువు రూపం లో ఉంటుంది .ఆ జ్వాల మధ్యలో పరమాత్ముడున్నాడు .కనుక నువ్వు ఆరోపించిన నీచ స్థానము లో కూడా పరమాత్మ ఉన్నాడని అర్ధమయింది కదా /అని జ్ఞాన బోధ చేశాడు .ఇదంతా వేదవాక్య సముదాయమే నని ‘’పద్మ కోశ ప్రతీకాశం హ్రుడంచాప్యాదో ముఖం ‘’అన్న దాని సారాంశమే నని వివరించాడు .
         సర్వ జనులకు ఈశ్వరుడు గా ,విశ్వ భోక్త గా ఉన్న పరబ్రహ్మ అంగుష్ఠ మాత్రుడు గా హృదయం లో ప్రతిష్టిత మై ఉన్నాడు అని ,ఉచ్చనీచాలు నిమ్నోన్నతాలు శరీరానికి సంబంధించినవే నని మనస్సుకు సంబంధించి నవి కావని ,బాహ్య మైన కార్య క్రమాలను చేస్తూనే అంతర ధర్మాన్ని చేసుకొంటూ ఉండాలని అప్పుడే తన మత ,వంశ ధర్మాలను అనుసరించి నట్లు అవుతుందని ,అప్పుడే ముక్తి లభిస్తుందని తెలియ జేశాడు .శ్రీ రాముడు రావన సంహారం చేసిన అవతార పురుషుడని ,కనుక శ్రీ రామ స్మరణమే మోక్షానికి దారి అని దాన్ని వదిలి ద్రవ్యార్జనే ధ్యేయం గా బతికితే జీవితం వ్యర్ధం అని ఎరుక పరచాడు .
                 వైశ్రవనుడి కి నెమ్మది గా విషయం బోధ పడింది .దాన్ని బాగా మననం చేశాడు .మొదట్లో కొంచెం కష్టం గా ఉన్నా ,మల విసర్జన సమయం లో ‘’రామ స్మరణ ‘’ చేయటం ప్రారంభించాడు .ధన సంపాదన ధ్యాసతో అతనికి మల విసర్జన కష్టమై పోయింది .ఒక సారి హనుమ అయోధ్యకు వెడుతూ ఈ వైశ్యుని చూశాడు .వైశ్యుని బాధా , అందు లోంచి రామ నామం విని పించి అసహ్యం వేసింది .కిన్దిగా ఎగురుతూ వైశ్యుని వీపు మీద అయిదు వేళ్ళుఅచ్చు పడేట్లు బాది పారేశాడు .
                    మారుతి అయోధ్య చేరి శ్రీ రాముడి శరీరానికి నూనె మర్దన చేస్తున్నాడు .అప్పడు రాముడు విప రీత మైన బాధను ప్రకటించాడు . వారిద్దరి మధ్యా ఆసక్తి కరం గా సంభాషణ ఇలా కోన సాగింది
హనుమ –స్వామీ !ఏమిటి మీ బాధ ?
రాముడు –హనుమా నా వీపు మీద ఒక భక్తుడు అరచేత్తో బాదేశాడు .
హనుమ –మిమ్మల్ని కొట్టే భక్తుడు భక్తుడే కాదు .వాడెవడో చెప్పండి .దండించి వస్తాను
రాముడు –మన భక్తుడే నయ్యా హనుమయ్యా
హనుమ –వాడెక్కడ ఉన్నాడు ?ఏమి చేస్తున్నాడు  స్వామీ ?
రాముడు –ఇక్కడే ఉన్నాడు .నాకు తైల మర్దన చేస్తున్నాడు .
హనుమ –నేనా స్వామీ /
రాముడు –సాక్షాత్తూ నువ్వే నయ్యా
హనుమ –రామ ప్రభూ ! మిమ్మల్ని నేను కొట్టానా ?అంతటి పాపాన్ని చేశానా /అని బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు
రాముడు –హనుమా ! దుఖించకు .నువ్వ్వు నన్ను ప్రత్యక్షం గా కొట్ట లేదు .కాని నా నామం జపించే నా భక్తుడి ని కొట్టావు .ఆ దెబ్బ నాకు తగిలింది .నువ్వు వచ్చే దారిలో జరిగిన సంగతి ఒక సారి జ్ఞాపకం తెచ్చుకో .నువ్వు కొట్టిన దెబ్బఆ వైస్యుడిని ఏమీ బాధించ లేదు .నన్ను బాధించింది .ఎంత బలం గా కొట్టా వయ్యా ?నీ కోపం అంతా తీర్చుకోన్నావు .ఆ దెబ్బే అతనికి తగిలి ఉంటె దెబ్బకు మరణించే వాడు .నీకు అపవాదు వచ్చేది .అందుకోసం నేనే ఆ దెబ్బా, ఆ బాధ భరించాను .నువ్వూ నా భక్తుడి వేగా ?అతను మరణిస్తే రామ నామం అచ్చి రాదనీ లోకం లో ప్రచారం జరిగేది .అందుకే నాకీ అవస్థా యోగం కలిగింది ‘’అని నెమ్మదిగా చెప్పాడు భక్త సులభుడైన శ్రీ రాముడు .
      మారుతికి దిమ్మ తిరిగి పోయింది .క్షమించమని స్వామి పాదాల పై పది విపరీతం గా విలపించాడు .అప్పుడే హనుమ ఒక ప్రతిజ్ఞా చేశాడు ‘’శ్రీ రామా ! ప్రభూ !నీ సాక్షి గా ఒక ప్రతిజ్ఞా చేస్తున్నాను .రామ మంత్రం మొక్షానికే కాని ఐహికానికి కాదు .ఉభయ లోకాల్లో సుఖాన్ని ఇచ్చే రామ నామాన్ని జపించే వారిని సర్వదా సర్వధారక్షిస్తూ ఉంటాను . రామ నామం జపించే వారు ఎలాంటి వారు  ఏ కాలం లో ,ఏ ప్రదేశం లో జపిస్తున్నారు ,నియమాలేమిటి అని విచారించను .రామ నామం లో నువ్వు ఉన్నావు .నీ నామం ఉన్న చోట సర్వ శ్రేయాలు సదాచారాలు ఉంటాయని త్రికరణ శుద్ధి గా నమ్ముతున్నాను .’నైవ యోజ్యో రామ మంత్రః కేవలం మోక్ష దాయకః –ఐహికే సమ ప్రాప్తే మాం’ ప్రాప్తే  సమరే ద్రామ సేవకం ‘’అంటే కేవలం నీ నామాన్ని స్మరిస్తే నిన్ను స్మరించి నట్లే ‘’.అని మారుతి మరో సారి భీషణ ప్రతిజ్ఞ చేసి రాముని కి వీడ్కోలు చెప్పి  రత్న గిరికి బయల్దేరి ఆ వైశ్యుని ఇంటికి వెళ్లి అతన్ని నిండు మనసు తో అనుగ్రహించి  ,ఆనందం గా రత్న గిరి చేరి మళ్ళీ ధ్యాన మగ్నుదయాడు హనుమ . ఈ సంఘటన తో వైశ్రవనుడు అనే ఆ వైశ్యుడు కూడా ఈ లోకం లో సర్వ ధన శ్రేష్టుడు అని పించు కొన్నా పర లోకం లో ‘’రామధన శ్రేష్టుడు ‘’గా మారి తరించాడు ..ఆతని కుటుంబమూ ముక్తి పొందింది .శ్రీ రామ నామానికి రాముడు ,మారుతీ ఇద్దరు కూడా బల మైన పుష్టి నిచ్చారని మనకు తెలుస్తోంది .
    సశేషం 

Popular Posts