Followers

Thursday 26 February 2015

శ్రీ ఆంజనేయ మహాత్మ్యం –14 కశ్యపుని కధ


 పూర్వం బ్రహ్మా వర్తం అనే గ్రామం లో దరిద్రం తో బాధ పడే కశ్యపుడు అనే బ్రాహ్మణుడు వున్నాడు .అన్నీ తెలిసి ,అన్నీ చదివి నా దరిద్రం బాధిస్తోంది .హనుమ భక్తుడు కూడా .రోజూ ఆంజనేయ స్వామి పూజ చేయకుండా పని చేసే వాడు కాదు .అతని భక్తికిప్రీతి   చెంది హనుమ ,ధన వంతుల హృదయాలలో చేరి ఇతనికి ధన ధాన్యాలను ఇప్పించేట్లు చేస్తుండే వాడు .కొంత కాలానికి ధన వంతుణ్ణి చేసే శాడు .
ఇతని ఇంట్లో వున్న ధనాన్ని దొంగిలించ టానికి ఒక సారి ఒక  దొంగ ప్రయత్నించాడు .భక్త  వాత్సల్యుడైన హనుమ   అన్ని విధాలా దొంగ నుండి కాపాడాడు . దండాన్ని ధరించి ,రోకలిని చేత బట్టి ,ఖడ్గం ధరించి ,కవచం పూని ,బాణం ధరించి ,పార పట్టి ,బ్రాహ్మణరూపం   లో వుండి ,సేవకుడి గా పని  చేసి కాశ్యపుని ధనాన్ని కాపాడాడు .
దొంగ ను పట్టు కోవాలనే ఆలోచన ఆన్జనేయునికి కలిగింది .మరి నలుగురి సాయం తో దొంగలు వచ్చి ఇంటికి కన్నం తవ్వుతున్నారు .అప్పుడు అసలు దొంగ కన్నం ద్వారా ఇంట్లోకి చేరాడు .మిగిలిన వాళ్ళు బయట కాపలా వున్నారు.ఆంజనేయుడు కశ్యపుని వేషం ధరించి దొంగను కన్నం లోంచి లాగి బాది పారేశాడు .వాడు ఎంతో బాధ అనుభవిస్తున్నా కిక్కురు మన లేదు .ధనం మీద ఆశ చేత అన్నీ భరించాడు .చివరికి తల మీద కొట్టాడు .ఇక బాధ భరించ లేక దొంగ ఏడిచే శాడు . ధ్వని విని తోడు దొంగలు పారి పోయారు .ఇంట్లోని వారంతా దగ్గరికి వచ్చి దొంగ చచ్చి పోతాడేమో అని భయ పడి ఇంక కొట్ట వద్దని కశ్యపుని రూపం లో వున్న హనుమను ప్రార్ధించారు .దయతో వాడిని వదిలేశాడు .ఇంకోసారి వచ్చి కశ్యపుడి అంతు చూస్తానని వాడు బెదిరించి పారి  పోయాడు .మారుతి అదృశ్యమైనాడు .
పొద్దున్నే కశ్యపుడు నిద్ర లేచి చూస్తె ,గోడకు కన్నం కనిపించింది .దొంగలు పడి ధనాన్ని ఎత్తుకు పోయారని బాధ పడ్డాడు ,ఎడిచెశాడు .సేవకులు వచ్చి అసలు విషయం చెప్పి ,దొంగను పట్టుకొన్నది కశ్యపుడే అన్న విషయం గుర్తు చేశారు .దొంగను విడిచేసింది అతనే అని చెప్పారు ..ఇదంతా హనుమల్లీల అని గ్రహించాడు కశ్యప విప్రుడు .దొంగకు కనిపించి ,హనుమ తనకు కని పించ లేదని బాధ పడ్డాడు .దొంగ అదృష్టాన్ని కొనియాడాడు .తన్ను ఇంకా హనుమ పరీక్షిస్తున్నాడని వగచాడు .తన దూర ద్రుష్టాన్ని  నిన్దిన్చుకొంటు స్వామిని తలచాడు
యోగీశ్వరానా మపి యత్న దుర్లభం -యద్దర్శననం కిమ్చ సురాసురానాం
పాపీయసా దృష్టి పధం గతోయః -తం వానరేంద్రం శరణం భజామి
సర్వ వేదాంత వేద్యాయ పూర్ణయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ భవిష్యద్ బ్రహ్మనే నమః  ”
అని మనస్ఫూర్తిగా స్తోత్రం చేశాడు .హనుమ పరమ ప్రీతి చెండాడు .కశ్యపుడు భార్యా పిల్లలతో అన్ని భోగాలు అనుభవించి నిత్య హనుమ సేవలో తరిస్తూ చివరికి ఇంద్రాదులకు కూడా లభించని మోక్షాన్ని పొందాడు . కధ చదివినా ,విన్నా ,అన్ని కోరికలు తీరి, సంసారం నుండి విముక్తులై, ముక్తిని చేరు తారని పరాశర మహర్షి మైత్రేయునికి తెలియ జేశాడు .
తర్వాతి కధ హరి శర్మది .
సశేషం


Popular Posts