Followers

Thursday 26 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం –12 సోమ దత్తు ని కధ


—       
 హనుమ ఎనిమిదవ అవతారం లోని సోమ దత్తు ని కధను పరాశర మహర్షి మైత్రేయుని కి వివరిస్తున్నారు .పూర్వం సోమ దత్తుడు అనే చంద్ర వంశ రాజు వున్నాడు .సత్య వాది .అహంకారం లేని వాడు .మౌని .ఆతి దేయుడు .పరాక్రమ వంతుడు .శత్రు వులను జయించిన వాడు .భూమి నంతటినీ ఏక చత్రాది పత్యం గా పాలించాడు .అతని చేత జయింప బడిన రాజులు అందరు ఏకమై ,ఒక్క సారి గా అతని రాజ్యం పై దాడి చేశారు .భీకర యుద్ధం జరిగింది .సోమ దత్తుడు యుద్ధం లో విపరీత ముగా నష్ట పోయాడు .పర్రజయాన్ని తట్టు కో లేక ,భార్యా ,పిల్ల లతో రహశ్యం గా అడవులకు పారి పోయాడు .
కొంత కాలానికి గార్గ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరి ,నివశిస్తున్నాడు .అతనికి గుడ్డి తనం ,మూగ తనం ,చెవుడు  ,కుంటి తనం ఏర్పడ్డాయి .తనకు వచ్చిన దుర్దశ కు విప రీతం గా చింతి స్తున్నాడు .  .భార్య మాత్రం అతనికి ధైర్యం నూరి పోసింది .అంతా కర్మ ఫలం .కాలమే బాధల్ని మాన్పు తుంది అని ఊర డించింది .ఆపదలలొ ధైర్యం ,సంపదలలో క్షమా ,సభల్లో చక్కని ప్రసంగం ,యుద్ధం లో పరాక్రమం ,స్త్రీ విషయం లో   మంచి నడ వడి సంపదలో ఓర్పు ,బ్రాహ్మణుల యెడ భక్తీ మనం కలిగి వుండాలని బోధించింది .కొబ్బరి కాయ లోని నీళ్ళు లాగా జరగాల్సింది జరిగి పోతూ వుంటుంది అని ధైర్యం చెప్పింది .దగ్గర లో గర్గ మహర్షి ఆశ్రమం వుందని ,ఆయనను శరణు వెడితే ప్రయోజనం ఉంటుందని హితవు చెప్పింది .ఇద్దరు ముని ఆశ్రమానికి వెళ్లి గర్గుని పాదాల పై పడి శరణు కోరారు .
వారు వచ్చిన సందర్భాన్ని గర్గ ముని గ్రహించారు ,.రాజా !నువ్వు నీ పరాక్రమాన్నే నమ్మి దైవాన్ని మరచి నందున నీకు ఆపద కల్గింది .భగవంమంత్రాన్ని జపిస్తూ ,మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే బాధ తప్పేది .అని తెలిపాడు
సోమ దత్త మహా రాజు గర్గుని పాదాలను స్పృశించి మహాను భావా !మీరు చెప్పింది అక్షర సత్యం .ఇప్పుడు నా దుస్తితి తొలగి పోవ టానికి ఉపాయం అనుగ్ర హించండి .సద్యో ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఉపదేశించండి .నిష్ఠ గా జపించి ,మనో భీష్ట సిద్ధి ని పొందు తాను .అని వేడు కొన్నాడు .
గర్గ ముని కి అనుగ్రహం కలిగి రాజా !జరిగి పోయిన దానికి విచారించ వద్దు .అత్యంత వేగం గా ఫల సిద్ధి నిచ్చే హనుమంమంత్రాన్ని ఉపదేశిస్తాను .దాన్ని జపిస్తూ ,హనుమద్ వ్రతం చేయి .నీ కోరికలన్నీనెర  వేరు తాయి .శత్రు జయం కలుగు తుంది .హనుమద్ వ్రతాన్ని వైశాఖ బహుళ దశమి లేక అమా వాస్య ,నాడు కాని ,మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో శుక్ల పక్షం లో మొదటి శని వారం కాని ,, నెలల్లోనే వచ్చే మృగశిరా నక్షత్రం లో కాని ,శ్రావణ పూర్ణిమ నాడు కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని ,మార్గ శిర శద్ధ త్రయోదశి రోజున కాని చేయాలి .పగలైనా సాయంత్రమైనా వ్రతం చేయ వచ్చు .బంగారం వెండి ,రాగి రేకు పై చెక్కించిన యంత్రం ,లేక భూర్జర పత్రం మీద రాసిన యంత్రాన్ని ,బియ్యం పిండి తో వేసిన యంత్రం మీద కాని ,విగ్రహం లో కాని ,నీరున్న కలశం లో కాని ,పట్టు వస్త్రం మీద వేసిన యంత్రం లో కాని ఆవాహనం చేయాలి .శ్రద్ధ గా పూజించాలి .పద మూడు ముళ్ళు గల తోరాన్ని పూజించి, ధరించాలి .పద మూడు నేతి అప్పాలను దానం చేయాలి .పూర్వం శ్రీ రాముడు ,విబీషణుడు వ్రతాన్ని చేసి ఫలితం పొందారు .నువ్వు చేసి రాజ్యాన్ని సుఖాలను పొందు అని చెప్పాడు .
సోమ దాత్తుడికి పంచ ముఖాన్జనేయ మహా విద్యను ,ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గ ముని దంపతులతో హనుమద్ వ్రతం దగ్గ రుండి జరి పించాడు . మంత్ర ప్రభావం చేత అతనికి మళ్ళీ బల పరాక్రమాలు  సిద్ధించాయి .వ్యాదులన్నీ మాయ మైనాయి .మంచి రూపం వచ్చింది .ఆంజనేయ అనుగ్రహం తో శత్రువు లందర్నీ జయించి రాజ్యాన్ని దక్కించుకొన్నాడు .ధర్మ మార్గం లో నడుస్తూ ,ప్రజల్ని బిడ్డల లాగా కాపాడుతూ గర్గ మహర్షిని పురోహితుని గా చేసుకొని సత్ర యాగం చేశాడు .దీనితోసప్త   ద్వీపాలను జయించాడు .ఎనిమిది మంది కుమారులు కలిగారు .ఆనందం గా జీవితాన్ని గడిపి ,పెద్ద కుమారుడికి రాజ్యం అప్ప గించి ,దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకొంటూ చివరికి బ్రహ్మ లోకం చేరారు .
అందుకే హనుమంతుని మించిన దైవం లేదు .హనుమద్ వ్రతాన్ని మించిన వ్రతమూ లేదు .హను మంతుని పూజిస్తే ,త్రి మూర్తులు సంతోషిస్తారు .సర్వ దేవతలు సంతృప్తి చెందు తారు .చంద్రుడు లేని రాత్రి ,ధనం లేని రాజు ,హనుమన్నామం లేని ప్రబంధం వ్యర్ధం .
మైత్రేయ ,నీల ,విజయ ,ధ్వజ దత్త ,గాల -మైన్గాంగా దశ్చ ,భారతం ,సుషేషణం
హరీత ,కశ్యప ,సుపుష్కర ,సోమ దత్తాన్ పుణ్యం స్మరామి హనుమత్పద పద్మ భక్తాన్
తరు వాతిది గాలుని కధ
సశేషం


Popular Posts