కృతయుగం లో పుష్కరుడు అనే మహా మహర్షి వుండే వాడు .అన్ని వేదాలను శాస్త్రాలను చదివి సర్వ విద్యా పరిపూర్ణుడు అయాడు .సూక్ష్మార్ధాన్ని వివ రింప గల నేర్పున్న వాడు .స్వధర్మా చరణం లో గొప్ప వాడు .అన్ని మంత్రాల సారాన్ని తెలుసుకొన్న వాడు .ఆ మంత్రాది దేవతలను ప్రసన్నం చేసుకొన్న పుణ్యాత్ముడు .ఆయన శ్రీ ఆంజనేయ మహా మంత్రం లో ఒక దాన్ని జపించాలను కొని నైమిశారణ్యం చేరాడు .సిద్దాశ్రమానికి దగ్గర ,ఒక ఆశ్రమం నిర్మించుకొని ,హనుమంతుని మంత్రం తో తపస్సు చేశాడు .పవన సుతుడు ప్రత్యక్ష మై ,దివ్యాను గ్రహాన్ని ఇచ్చాడు .మానసిక ఆనందాన్ని పొంది ,ఏ కోరికా లేకుండా అక్కడే జప తపాలతో జీవిస్తున్నాడు .
ఆ కాలమ్ లోనే ధ్వజదత్తుడు అనే వేద వేదంగాఅధ్యనుడు ,సర్వ శాస్త్ర పారంగతుడు నిష్టా గరిస్తుడు వుండే వాడు .గర్వం లేని వాడు .నిష్కామి .అయితె కటిక దరిద్రుడు .గృహస్తుల ఇళ్ళలో భిక్షాటనం చేస్తూ ,ఆ ద్రవ్యం తో పెళ్ళామ్ పిల్లల్ని పోషించు కొనే వాడు .ఇలా ఉపాదానం తో జీవిస్తూ కూడా విద్యార్ధులకు ఉచితం గా వేద శాస్త్రాలను బోధిస్తుండే వాడు .మధ్యాహ్న భోజనం తరువాత ,శిష్యుల చదువును పరీక్షించే వాడు .
ఒక రోజూ మధ్యాహ్నం శిష్యులతో పాటు తన కుమారుడిని కూడా పరీక్షించటానికి పిలిచాడు .అతడు రాలేదు .పుత్రుడిని ఎన్ని సార్లు పిలిచినా రాక పోవటం తో ఇల్లంతా గాలించాడు .చివరికి వంట గది లోకూరలనుమాత్రమే తింటున్న భార్యను ,పిల్లాడిని చూశాడు .అన్నం లేకుండా వాటిని ఎందుకు తింటున్నారని అడి గాడు .వారిద్దరూ వంట పాత్ర ను చూపించారు .అందులో ఒక్క మెతు కైనా అన్నం లేదు .గుండె చెరువైంది ధ్వజ దాత్తుడికి .దీనికి కారణం ఏమిటి అని భార్యను అడి గాడు .రోజూ వారిద్దరూ అన్నం లేకుండా నే గడుపుతున్నారని తెలుసుకొన్నాడు . .ఈ దరిద్రానికి తానె కారణం అని తెలుసుకొన్నాడు .
ఇంతటి దారిద్ర్యం లో కూడా భార్య నవ్వు మొఖం తో బయటి నుంచి వచ్చే తన్ను ఆప్యాయం గా ఆదరిస్తూ పిలుస్తున్నందుకు ఆశ్చర్య పోయాడు .తన మీద ఆమెకున్న ప్రేమను ,అనురాగాన్ని అర్ధం చేసుకొన్నాడు .తాను వారికి అన్నం కూడా పెట్ట లేని స్థితి లో వున్నందుకు విచార పడి కన్నీరు కార్చాడు .భార్య సౌశీల్యాన్నీఅభినందించాడు . తన లాంటి ధన్యుడు వేరెవరు ఉండరని ఇప్పటి దాకా గర్విన్చానని ,ఇప్పుడు తన అసమర్ధత తెలుసు కొన్నానని అన్నాడు .భార్యా ,పిల్లలను పోషించలేని వాడు పరమ పాతకుడని ఆమె తో అన్నాడు .
అతని భార్య, భర్త దుఖాన్ని చూడ లేక ”నాధా !ఈ దరిద్రం ఇవాల్టిది కాదు .ఎన్నో జన్మల నుంచి వచ్చిందే .పూర్వ జన్మ లో మనం ఎవ్వరికీ అన్నం పెట్టి వుండి ఉండం .అందుకే ఇప్పుడు ఆ బాధ మనం అనుభవిస్తున్నాం .సకల విద్యలు నేర్చి ఉచితం గా విద్యా దానం చేస్తూ ఉపాదానం తోజీవించే మీరు ధన్యులు. దుఃఖ పడే పురుషుడిని ”కాపురుషుడు ”అంటారు .మీ పాద సేవా భాగ్యమే మాకు భాగ్యం ”అని భర్తకు ధైర్యం చెప్పింది
భార్య మాటలకు తృప్తి చెందిన అతడు ఉపాదానానికి ప్రత్యక్ష దేవత అయిన ”భిక్షా పాత్రా దేవి ”ని తీసుకొని ,సంసారం గడ పటానికి మార్గం కోసం ఉత్తర దిశ వైపు వెళ్ళాడు .ఆ రాత్రి ఒక చోట విశ్ర మించాడు .మర్నాటి ఉదయం స్నాన సంధ్యాదికాలు పూర్తి చేసుకొని ,నడిచి, నైమిశారన్యానికి వెళ్ళాడు .అక్కడ కశ్యపుడు మొదలైన నిష్టా గరిష్టు లైన మునులను దర్శించాడు .ఆ తర్వాత పుష్కర మహర్షి వున్న సిద్ధాశ్రమం చేరాడు .పుష్కర మహర్షి శాంత గంభీర వదనం తో నిశ్చల ధ్యానం లో వున్నాడు .నమస్కరించి దగ్గర నిల బడ్డాడు .ముని కళ్ళు తెరిచి వాశ్చల్య ద్రుష్టి తో చూశాడు .ఆయనకు తాను తెచ్చిన సమిధలను ఫలా పుష్పాలను సమర్పించాడు .
”బ్రాహ్మణో త్తమా !ఎందుకు ఇక్కడికి వచ్చారు ?మీ కుటుంబ విషయాలేమిటో నాకు తెలియ జెప్పండి .”అని ప్రేమ పూర్వకం గా అడిగాడు పుష్కర మౌని .దానికి అంజలి ఘటించిన ధ్వజ దత్తుడు ”మునీంద్రా !నేను గార్గేయస గోత్రికుడను.కుండిన నగరం నా నివాసం .బ్రాహ్మణ శ్రేష్టుడైన ధజ శర్మ నా తండ్రి.నాకు భద్రకుడు ,భద్ర బాహుడు అనే సోదరులు .మేమందరం పండితులమే అయినా ఉపాదానం తోనే జీవిక గడు పు తున్నాం .అది చాలటం లేదు .భార్యా బిడ్డలను పోషించ లేక పోతున్నాను .నా దీనత్వం పోయే మార్గం సెలవియ్యండి .నన్ను కాపాడండి ”అని మొర పెట్టాడు .
ఇదంతా విన్న పుష్కర ముని దయా సముద్రుడై అభయం ఇచ్చాడు .హనుమంతుని భక్తిగా ప్రార్ధించాడు .ధ్వజ దత్తుడిని తనతో ఒక నదీ తీరాన్ని చేరి అతనితో కలిసి స్నానం చేశాడు .ఆ నది ఒడ్డున కోర్చోబెట్టి ”హనుమంమంత్రమైన ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని ”ఉపదేశించి దాన్ని శ్రద్ధాసక్తులతో నియమం గా జపించమని దానివల్ల అతని కోరిక సఫలం అవుతుందని ధైర్యం చెప్పి తన ఆశ్రమానికి పుష్కర మహర్షి వెళ్లి పోయాడు
ధ్వజ దత్తుడు చాలా నియమ నిష్టలతో హనుమంమంత్రాన్ని జపించాడు .ఎన్ని సార్లు జపించినా మారుతి దర్శనం కావటం లేదు .విసుగు పుట్టింది .హనుమను తిట్టు కొన్నాడు .గురువు తనను మోసం చేశాడని మరీ గురువునూ తిట్టటం ప్రారంభించాడు .మంత్రం కంటే గురు నింద ఎక్కు వై పోయింది .మనస్సు అశాంతి తో నిండి పోయింది .జపం ఫలించ నందుకు ఆవేశమూ కల్గింది .అప్పుడు ఒక రోజూ ”కాలుడు ”అనే కిరాతుడు అక్కడికి వచ్చాడు .వాడికి తన గోడు వెళ్ళ బోసుకొన్నాడు .తన దుస్తితికి కారణం ఏమిటో తెలియ జేయ మని కోరాడు అప్పుడు ఆ కాలుడు ”గురు దూష చేస్తున్నావు .నీకు ఉపదేహించిన మంత్రం పని చేయదు .గురువును కాదని అంటే ,దేవుడు కూడా కాపాడ లేదు .ఇప్పటి కైనా మించి పోయింది లేదు .గురువును చేరి నిండు మనసు తో మళ్ళీ ప్రార్ధించి ,ఆయన అనుగ్రహం పొంది ,మళ్ళీ సాధన చెయ్యి .అప్పుడే నీకు ఫలితం లభిస్తుంది ”అని చెప్పి తన దారిన తాను పోయాడు .ధ్వజ దత్తుడు గురువు అను గ్రహం ఎలా సంపాదించాడో ,హనుమ అతడిని ఎలా అనుగ్రహించాడో వచ్చే కధ లో తెలుసు కొందాం .
సశేషం