Followers

Sunday, 14 June 2015

స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చా ?



స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చా ? 
అనే సందేహం చాలా మందికి ఉంటుంది స్త్రీలు రుద్రాక్షలు ధరించకూడదని ఎక్కడా చెప్పలేదు. స్త్రీలకు ఋతుస్రావం ఆగేవరకూ ధరించడం మంచిది కాదు అంటారు కాని శివునికి ఏ విధమైన అంటు ముట్టు ఉండదు అసలు శివుడే శ్మశానవాసి సృష్టిలలో స్మశానం కంటే మరొక ప్రదేశం ఉండదు. ప్రపంచంలోనే హైందవ దేవాలయాలు ఏదేశంలోనైనా గర్భాలయంలో ప్రవేశం ఉన్నా ? లేకపోయినా శివాలయంలోనికి వెళ్ళవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగా నైనా నేరుగా చేతితో తాకవచ్చు.(ఎవ్వరైనా, ఏపరిస్థితిలో ఉన్నా) ఉదాహరణకి శ్రీశైలంలో శివలింగాన్ని ఎవరైనా స్వయంగా తాకవచ్చు అలాగే కాశిలో శివలింగాన్ని సైతం ఎవరైనా స్వయంగా తాకవచ్చు. ఇది అందరికి తెలిసిన సత్యమే శివునికే అంటులేనప్పుడు ఆయన స్వరూపములైన రుద్రాక్షలకు దోషమేముంటుంది. అయితే వీటన్నింటికి మించి మన మనస్సుకు మించినది ఏదీ లేదు. రుద్రాక్షలు ధరించి ఉన్నప్పుడు చెడు పనులకు మనస్సు అంగీకరించదు.

ఉదాహణకు మాంసాహారాన్ని తినేటప్పుడు వాటిని తీసి పక్కనపెట్టి తరువాత ధరిస్తే మంచిది ఎందుకంటే ఇందాక మనం చెప్పుకొన్నట్లు మన మనస్సు ఈ విషయంలో అంగీకరించదు కారణం రుద్రాక్షలంటే పవిత్రమైనవి, శివునకు ఇష్టమైనవి, శక్తి వంతమైనవి అని మన మనస్సుకు తెలుసుకాబట్టి ఆవిధంగా తిరిగి మళ్ళీ ధరించడం మంచిది అప్పుడు ఏవిధమైన దోషములు ఉండవు స్త్రీలు కూడ ఆ మూడు రోజులు పక్కన పెట్టి తదుపరి ధరించడం మంచిది ధరించేముందు కొంచం నీళ్ళు చల్లి సుద్ధిపరిస్తే ఇంకా మంచిది. సన్యసించిన వారు యోగినులు రుద్రాక్షలు ధరించడం మనం చూస్తూ ఉంటాము మన పురాణగ్రంధాలలో పిల్లలకు ఆరు సంవత్సరములు వచ్చే వరకూ అయినా రుద్రాక్షలు ధరింపజేయడం వలన వారి భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ధన, కనక, వాస్తువాహనములతో మంచి కీర్తి కలిగి ఉంటారని చెప్పారు.

చదువుకొనే ఆడపిల్లలు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వారి విద్యలో బాగా రాణిస్తారు. రుద్రాక్షలు దైవ స్వరూపాలు, క్షుద్రాలు గాదు దైవానికి సంబంధించిన విషయంలో దోషాలు ఉండవు. దేవుని గుడిలోకి వెళ్ళేటప్పుడు పాదరక్షలు బయట విడిచి వెళతాము అలాగే ఏదైనా వెళ్ళకూడని పనికి రుద్రాక్షలు ధరించి (చనిపోయిన చోటికి) వెళ్ళిన లేక ఋతుస్రావం సమయంలో రుద్రాక్ష ధరించి ఉన్నా ఆ తరువాత నీళ్ళతో కడిగి తర్వాత పాలతో శుద్ధిచేసి, మళ్ళీ నీళ్ళతో కడిగి ధారణ చేయాలి మనం తెలియక చేసిన  దానికి దోషం లేదు అంటే ఒక ఆసుపత్రికి వెళ్ళామంటే అక్కడ చనిపోయిన వారు ఉండవచ్చు బయటకి వెళితే ఎదురురావచ్చు ఇవి దోషాలు కాదు. మనం తెలిసి వెళ్ళినప్పుడు రుద్రాక్షలు ఇంట విడిచి వెళ్ళాలి యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసినట్లు.

Popular Posts