Followers

Sunday, 14 June 2015

మంగళ శ్లోకం - సర్వ మంగళ మాంగళ్యే ( ప్రతి పదార్థము - తాత్పర్యము)


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

ప్రతి పదార్థము: సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.   

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

Popular Posts