Followers

Thursday, 8 January 2015

నామరామాయణం (ఉత్తరకాండము- తాత్పర్యము తో పాటుగా )



ఆగతమునిగణసంస్తుత రామ | విశ్రుతదశకంఠోద్భవ రామ |
సితాలింగననిర్వృత రామ | నీతిసురక్షితజనపద రామ |
విపినత్యాజితజనకజ రామ | కారితలవణాసురవధ రామ |
స్వర్గతశంబుకసంస్తుత రామ | స్వతనయకుశలవనందిత రామ |
అశ్వమేధక్రతుదిక్షిత రామ | కాలానివేదితసురపద రామ |
ఆయోధ్యకజనముక్తిద రామ | విధిముఖవిభుదానందక రామ |
తేజోమయనిజరూపక రామ | సంస్మృతిబంధవిమోచక రామ |
ధర్మస్థాపనతత్పర రామ | భక్తిపరాయణముక్తిద రామ |
సర్వచరాచరపాలక రామ | సర్వభవామయవారక రామ |
వైకుంఠాలయసంస్థిత రామ | నిత్యనందపదస్తిత రామ |
ఉత్తరకాండము: తాత్పర్యము
ఓ రామా! నీవు చూడవచ్చిన మునులచే స్తుతించబడిన వాడవు, వారి నోట రావణుని కథ విన్న వాడవు. సీతాలింగనముతో ఆనందము పొందిన వాడవు, నీతితో జనులను రక్షినచిన వాడవు. ధర్మము పాటించుటకై సీతను అడవులకు పంపించిన వాడవు. లవణాసురుని వధను కూర్చిన వాడవు, స్వర్గగతుడైన శంబూకునిచే నుతించ బడిన వాడవు, సుతులైన లవ కుశులతో ఆనందము పొందిన వాడవు, అశ్వమేధ దీక్ష తీసుకున్న వాడవు. అవతార సమాప్తియైనదని దేవతలచే వర్తమానము పొందిన వాడవు, అయోధ్య ప్రజలకు ముక్తి ప్రసాదించిన వాడవు. బ్రహ్మాది దేవతలకు ఆనందము కలిగించిన వాడవు. తేజోమయ రూపము కలిగిన వాడవు. జనన మరణ బంధముల నుండి విముక్తి కలిగించే వాడవు. ధర్మ స్థాపనే ధ్యేయముగా కలవాడవు. భక్తి పరాయణులకు మోక్షము కలిగించే వాడవు, సర్వ జీవులకు పాలకుడవు, సర్వ రోగములను పోగొట్టే వాడవు, వైకుంఠంలో నివసించే వాడవు, శాశ్వతమైన ఆనందము కలిగే పదములో ఉన్నవాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.
మంగళం-
భయహర మంగళ దశరథ రామ | జయ జయ మంగళ సీతా రామ |
మంగళకర జయ మంగళ రామ | సంగతశుభవిభవోదయ రామ |
ఆనందామృతవర్షక రామ | ఆశ్రితవత్సల జయ జయ రామ |

రఘుపతి రాఘవ రాజా రామ | పతితపావన సీతా రామ |

నామరామాయణం ( యుద్ధకాండము- తాత్పర్యము తో పాటుగా )











రావణనిధనప్రస్థిత రామ | వానరసైన్యసమావృత రామ |
శోషితశరదీశార్థిత రామ | విభీషణాభయదాయక రామ |
పర్వతసేతునిబంధక రామ | కుంభకర్ణశిరశ్ఛేదక రామ |
రాక్షససంఘవిమర్ధక రామ | అహిమహిరావణచారణ రామ |
సంహృతదశముఖరావణ రామ | విధిభవముఖసురసంస్తుత రామ |
ఖఃస్థితదశరథవీక్షిత రామ | సీతాదర్శనమోదిత రామ |
అభిషిక్తవిభీషణవందిత రామ | పుష్పకయానారోహణ రామ |
భరద్వాజాభినిషేవణ రామ | భరతప్రాణప్రియకర రామ |
సాకేతపురీభూషణ రామ | సకలస్వీయసమానస రామ |
రత్నలసత్పీఠస్థిత రామ | పట్టాభిషేకాలంకృత రామ |
పార్థివకులసమ్మానిత రామ | విభీషణార్పితరంగక రామ |
కీశకులానుగ్రహకర రామ | సకలజీవసంరక్షక రామ |
సమస్తలోకోద్ధారక రామ ।

యుద్ధకాండము-  తాత్పర్యము

ఓ శ్రీరామా! నీవు వానర సైన్యముతో కూడి రావణుని సంహరించ బయలుదేరితివి. నీ క్రోధముతో ఎండిపోయిన సముద్రుని కాపాడినావు, విభీషణునికి అభయమిచ్చినావు, రాళ్ళతో వానరుల సహాయముతో సేతువును నిర్మించినావు. కుంభకర్ణుని సంహరించినావు. వేలాది రాక్షసులను అంతము చేసావు. అహిరావణ, మైరావణులచే పాతాళమునకు కొనిపోబడినావు, పదితలల రావణుని సంహరించినావు. బ్రహ్మ, శివులచే నుతించబడిన వాడవు, ఆకాశమునుండి తండ్రియైన దశరథునిచే చూడబడిన వాడవు, సీత సంయోగముతో ఆనందించిన వాడవు, నీ చేత లంకాభిషిక్తుడైన విభీషణునిచే పొగడబడిన వాడవు, పుష్పకమును అధిరోహించిన వాడవు. భరద్వాజుడు మొదలగు వారిచే పూజించబడిన వాడవు, భరతునికి ప్రాణము వంటి వాడవు, అయోధ్యకు ఆభరణము వంటి వాడవు, అందరిచే గౌరవించబడిన వాడవు, రత్నములచే అలంకరించబడిన పీఠాన్ని అధిరోహించిన వాడవు, పట్టాభిషిక్తుడవై శోభిల్లినావు, సామంతరాజులచే గౌరవించ బడినవాడవు, విభీషణునిచే పూజించబడిన వాడవు (ఎరుపు వర్ణపు లేపనముతో), వానర సమూహాన్ని అనుగ్రహించిన వాడవు, అన్ని జీవులను కాపాడే వాడవు, అందరిని రక్షించే వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

నామరామాయణం ( సుందరకాండము- తాత్పర్యము తో పాటుగా )



కపివరసంతతసంస్మృత రామ | తద్గతివిఘ్నధ్వంసక రామ |
సీతాప్రాణాధారక రామ | దుష్టదశాననదూషిత రామ |
శిష్టహనూమద్భూషిత రామ | సీతవేదితకాకావన రామ |
కృతచూడామణిదర్శన రామ | కపివరవచనాశ్వాసిత రామ ।

సుందరకాండము- తాత్పర్యము 

ఓ శ్రీరామా! నీవు హనుమంతునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, ఆతని మార్గమున అవరోధములను విధ్వంసము చేసిన వాడవు, లంకలో ఉన్న సీత ప్రాణమునకు ఆధారమైన వాడవు, రావణునిచే దూషించ బడినవాడవు, సుజనుడైన హనుమంతునిచే భూషితుడవు,
సీతాదేవిచే హనుమంతునితో తనను కాకాసురుని బారినుండి కాపాడిన వానిగా పేర్కొనబడ్డావు, హనుమంతుని ద్వారా చూడామణిని చూపబడ్డావు, ఉత్తముడైన హనుమంతుని సందేశముతో, మాటలతో ఊరట చెందావు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

నామరామాయణం ( కిష్కింధాకాండము - తాత్పర్యము తో పాటుగా )


హనుమత్సేవితనిజపద రామ | నతసుగ్రీవాభీష్టద రామ |
గర్వితవాలిసంహారక రామ | వానరదూతప్రేషక రామ |
హితకరలక్ష్మణసంయుత రామ |


కిష్కింధాకాండము -  తాత్పర్యము

ఓ శ్రీరామ! నీవు - హనుమంతునిచే పాదసేవ పొందిన వాడవు, సుగ్రీవుని కోరిక తీర్చిన వాడవు, గర్వి అయిన వాలిన సంహరించిన వాడవు, వానరులను దూతగా పంపిన వాడవు, హితుడైన లక్ష్మణునితో కూడి యున్నవాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

నామరామాయణం (అరణ్యకాండము - తాత్పర్యము తో పాటుగా )


దండకావనజనపావన రామ | దుష్టవిరాధవినాశన రామ |
శరభంగసుతీక్ష్ణార్చిత రామ | అగస్త్యానుగ్రహవర్ధిత రామ |
గృధ్రాధిపసంసేవిత రామ | పంచవటీతటసుస్థిత రామ |
శూర్పణఖార్తివిధాయక రామ | ఖరదూషణముఖసూదక రామ |
సీతాప్రియహరిణానుగ రామ | మారీచార్తికృతాశుగ రామ |
వినష్టసీతాన్వేషక రామ | గృధ్రాధిపగతిదాయక రామ |
శబరీదత్తఫలాశన రామ | కబంధబాహుచ్ఛేదన రామ |


అరణ్యకాండము -  తాత్పర్యము
ఓ శ్రీరామా! నీవు దండకారణ్యంలోని జనులను పావనము చేసిన వాడవు, దుష్టుడైన విరాధుని చంపిన వాడవు, శరభంగుడు, సుతీక్ష్ణులచే పూజించ బడినవాడవు, అగస్త్యుని అనుగ్రహముతో వర్ధిల్లిన వాడవు, జటాయువుచే సేవించ బడినవాడవు, పంచవటీ తీరమున నివసించిన వాడవు, శూర్ఫణకకు దుఃఖము కలిగించిన వాడవు, ఖరఆ దూషణులను సంహరించిన వాడవు, సీత కోరిన మాయలేడిని అనుసరించిన వాడవు, మారీచుని సంహరించిన వాడవు, సీతను వెదకుతూ వెళ్ళిన వాడవు, జటాయువుకు మోక్షము కలిగించిన వాడవు, శబరి ఇచ్చిన ఫలములు తిన్న వాడవు, కబంధుని బాహువులు నరికిన వాడవు.


సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

నామరామాయణం (అయోధ్యాకాండము - తాత్పర్యము తో పాటుగా )



అగణితగుణగణభూషిత రామ | అవనీతనయాకామిత రామ |
రాకాచంద్రసమానన రామ | పితృవాక్యాశ్రితకానన రామ |
ప్రియగుహవినివేదితపద రామ | ప్రక్షాళితనిజమృదుపద రామ |
భరద్వాజముఖానందక రామ | చిత్రకూటాద్రినికేతన రామ |
దశరథసంతతచింతిత రామ | కైకేయీతనయార్పిత రామ |
విరచితనిజపితృకర్మక రామ | భరతార్పితనిజపాదుక రామ ।

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ
అయోధ్య కాండ:    తాత్పర్యము

ఓ శ్రీరామా! నీవు ఎన్నలేని సుగుణముల సమూహముతో శోభిల్లే వాడవు, భూమి పుత్రిక అయిన సీతచే ప్రేమించ బడిన వాడవు, చంద్రునివంటి ముఖము కలవాడవు, . పితృవాక్య పరిపాలనకి అడవులకు వెళ్లినా వాడవు, గుహునిచే ఆహ్వానించ బడి, పాదముల కడిగి పూజించబడిన వాడవు, భరద్వాజ మునికి ఆనందము కలిగించిన వాడవు, చిత్రకూటముపై నివసించిన వాడవు, దశరథునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, భరతునిచే రాజ్యము సమర్పించబడిన వాడవు, దశరథునికి పితృ కర్మలు చేసిన వాడవు, భరతునికి పాదుకలు ఇచ్చిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

నామరామాయణం (బాలకాండము - తాత్పర్యము తో పాటుగా )


బాలకాండము-
శుద్ధబ్రహ్మపరాత్పర రామ | కాలాత్మకపరమేశ్వర రామ |
శేషతల్పసుఖనిద్రిత రామ | బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |
చండకిరణకులమండన రామ | శ్రీమద్దశరథనందన రామ |
కౌసల్యాసుఖవర్ధన రామ | విశ్వామిత్రప్రియధన రామ |
ఘోరతాటకాఘాతుక రామ | మారీచాదినిపాతక రామ |
కౌశికమఖసంరక్షక రామ | శ్రీమదహల్యోద్ధారక రామ |
గౌతమమునిసంపూజిత రామ | సురమునివరగణసంస్తుత రామ |
నావికధావికమృదుపద రామ | మిథిలాపురజనమోహక రామ |
విదేహమానసరంజక రామ | త్ర్యంబకకార్ముకభంజక రామ |
సీతార్పితవరమాలిక రామ | కృతవైవాహికకౌతుక రామ |
భార్గవదర్పవినాశక రామ | శ్రీమదయోధ్యాపాలక రామ |
రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

బాల కాండ: తాత్పర్యము:
శ్రీరామా! - నీవు దైవ తత్త్వమైన పరబ్రహ్మవు , కాలానికి ఆత్మ యైన పరమేశ్వరుడవు, శేషతల్పముపై నిద్రించే వాడవు, బ్రహ్మ మొదలగు దేవతలచే ప్రార్ధించ బడిన వాడవు, సూర్య వంశ యశస్సును ఇనుమడింప చేసిన వాడవు, దశరథుని ప్రియ పుత్రుడవు, కౌసల్య సుఖాన్ని పెంపొందించిన వాడవు, విశ్వామిత్రునికి ఇష్టుడవు, తాటకిని సంహరించిన వాడవు మారీచుని పారద్రోలిన వాడవు, విశ్వామిత్రుని యాగాన్ని కాపాడి ఆయన గౌరవాన్ని నిలబెట్టిన వాడవు, అహల్యను ఉద్ధరించి తిరిగి రూపాన్ని ఇచ్చిన వాడవు, గౌతమ మునిచే పూజించ బడిన వాడవు, దేవతలచే, మునులచే వరములు పొందిన వాడవు నావికుని చే మృదువైన పాదములు కడుగ బడిన వాడవు, మిథిలాపుర జనులను సమ్మోహ పరచి, జనకుని మనసుని రంజిల్ల చేసిన వాడవు, శివుని విల్లు విరచి, సీతచే వరమాలను పొంది వివాహమాడిన వాడవు, పరశురాముని గర్వము నాశనము చేసినవాడవు, అయోధ్యను పాలించిన వాడవు. 


సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది.


ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అందరికి తెలిసినదే ఆ పదము ఎక్కడిది అంటే వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాఖ్యము ప్రజా ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
రామాయణంలో ఈ వాక్యం ఉన్న శ్లోకం
ధర్మ ఏవహతో హంతి
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత
ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవి.  ప్రస్తుత కాలమానము ప్రకారము ధర్మము ఎక్కడుంది.  ఎలావుంటుంది.  అప్పుడు వాల్మికీగారు ధర్మాన్ని ఎలావుంటుంది అంటే రామో విగ్రహాన్ ధర్మః   (మూర్తీభవించిన ధర్మమే రాముడు ) అని అన్నారు .

Wednesday, 7 January 2015

ఆది వైద్యులు -నాగార్జునుడు



నాగార్జునుడు మందుల తయారిలో అగ్రగణ్యునిగా పేరుగాంచాడు. ఏ వస్తువైనా సరే, బంగారంగా మార్చగలిగే ‘పరసవేది’ విద్యలో కూడ నాగార్జునుడు సిద్ధహస్తుడని చెబుతుంటారు. ఈయన ఆధ్వర్యంలో రసశాస్రం (కెమిస్ట్రీ) బాగా అభివృద్ధి చెందింది. ఇక, ఆ రోజుల్లో వైద్యశాలలను (ఆసుపత్రులు) గురించి పాహియాన్, హుయాన్ సాంగ్ వంటి విదేశీ యాత్రీకులు గ్రంథంస్తం చేసిన విషయాల ద్వారా అనేక విషయాలను తెలుసుకునేందుకు వీలవుతోంది. తెలుసుకోగలం. చంద్రగుప్తమౌర్యుని కాలంలో పాతలీపుత్రాన్ని దర్శించిన చైనా యాత్రీకుడు పాహియాన్ అప్పటి భారతంలోని ఉచిత వైద్యశాలల గురించిన వివరాలను తన యాత్రా గ్రంథంలో లిఖించాడు. తమ ఇళ్ళనే వైద్యశాలలుగా మార్చిన వైద్యులు పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా వైద్యసేవలను అందించేవారట. ఇక, హుయాన్ సాంగ్ అయితే భారతదేశంలో ఉచిత వైద్యశాలలకు కోడవేలేదనటమే కాక, వాటిని పవిత్ర దేవాలయాలని పేర్కొన్నాడు. ఇలా మనది ఘనమయిన చరిత్ర

“ప్రకృతిలో పరమాత్మను దర్శించే మన సంస్కృతిలో, వైద్యవిధానాలు కూడ ప్రకృతికి అనుగుణంగానే అభివృద్ధి చెందాయి. ఎక్కడా కృతిమ తత్త్వానికి చోటేలేదు. అప్పటి సమాజం అన్ని విధాలుగా ముందంజ వేసిందంటే, అందుకు కారణం, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న విషయాన్ని మనసా వాచా కర్మణా నమ్మి, ఆచరించటమే!”

ఆది వైద్యులు -జీవకుడు


జీవకుడు మెదడు, నరాలకు సంబంధించిన వైద్యనిపుణుడు. బౌద్ధ గ్రంథాలలో ఈయన వైద్య విధానాన్ని గురించిన ప్రశంసలను చూడగలం. బింబిసారుని కాలానికి చెందిన జీవకుడు ఒక కుప్పతోట్టిలో కనిపించాడని, రాజుకు ఈ విషయం తెలిసి, ఆ పసికందును ఆస్థానానికి రప్పించి జీవకుడు అనే పేరు పెట్టాడని చారిత్రిక కథనం. పెరిగి పెద్దయిన జీవకుడు తక్షశిలలో వైద్యవిద్యను అభ్యసించాడు. ఏడేళ్ళ పాటు సాగిన ఆ విద్య ముగిసిన అనంతరం, అతనిని గురువు పిలిచి, తక్షశిలకు వలయాకారంలో ఎనిమిది మైళ్ళ పర్యంతంలో వైద్యానికి పనికిరాని మొలకను  తీసుకురమ్మానాడు. జీవకుడు గురువు చెప్పిన ప్రకారం, ఒక యోజన పర్యంతము తిరిగి, అటువంటి మొక్క కోసం వెదకి, వైద్యానికి పనికిరాని మొక్కను కనిపెట్టడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు అతని అర్హత పట్ల సంతృప్తి చెందిన గురువు, అతనిని ఆయుర్వేద వైద్యం చేయడానికి అనుమతిని ఇచ్చాడు.

అనంతరం జీవకుడు నరాలకు సంబంధించిన వైద్యాన్ని చేసేందుకు సాకేతపురానికి చేరుకున్నాడు. వైద్యవృత్తి ద్వారా జీవకుడు బాగా ధనవంతుడయ్యాడు. అనంతరం ఒకానొక సమయంలో జీవకుడు బుద్ధునికి కూడా వైద్యాన్ని అందించాడు. ఒకప్పుడు బుద్ధుని కాలికి రాయితగలగా  గాయమైంది. అప్పుడు జీవకుడు కొన్ని మూలికలను గాయముపై పూసి, కట్టు కట్టాడట. ఆ కట్టు ఓ కాలపరిమితి తర్వాత విప్పి వేయాలి. కానీ, ఆ సమయంలో జీవకుడు వేరేపనిపై పొరుగూరుకెళ్ళాడు. అప్పుడు జీవకుడు బుద్ధునితో మానసిక తరంగాల ద్వారా సంప్రదించి, అక్కడనుంచే బుద్ధుని కాలికి కట్టివున్న కట్టును ఎలా విప్పదీయాలో చెప్పి, అలాగే చేయించాడని ప్రతీతి. అప్పట్నుంచి బుద్ధుడు, జీవకుని తన ప్రధాన శిష్యులలో ఒకరినిగా నియమించాడు. జీవకుడు కూడ బుద్ధునికి ఆరోగ్యపరమైన సలహాలను ఇస్తూ ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.

ఆది వైద్యులు - కశ్యపుడు


కశ్యపుడు పిల్లలకు సంబంధించిన విద్యావిధానంలో, ప్రసూతి వైద్య విధానామలో నిష్ణాతుడు. ఈయనచే విరచిత్రమైన గ్రంథం ‘కశ్యప సంహిత’ ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటుంది. ప్రసూతి వైద్యంలో కశ్యపుని కృషి గణనీయమైనది. ఆయుర్వేదానికి సంబందించిన ఎనిమిది విభాగాలలో కశ్యపుని కృషి అనితరసాధ్యం.

కాయ చికిత్స
శల్య చికిత్స
శాలక్య తంత్ర
అగాధ తంత్రం
భూత విద్య 
కౌమార భృత్య
రసాయన తంత్రం
వాజీకరణ తంత్రం అంటూ ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విభాగాలలో కశ్యపప్రభావం ఉంది.
అదే విధంగా కశ్యపుని వైద్య విధానంలో ఏడు విధాలుగా మందులను తయారు చేసేవారట.

చూర్ణం
శీతకషాయం
స్వరస
అభిసవ
ఫంట
కలక
క్వత
కశ్యపుడు పిల్లల పెరుగుదలకు సంబధించిన ఎన్నో సూచనలను తన గ్రంథంలో అందించాడు.

ఆది వైద్యులు - వాగ్భటుడు



పూర్వకాలంలో వృద్ధత్రయీ అని పేర్కొనబడినవారిలో వాగ్భటుడు ఒకరు. మిగతా ఇద్దరు ఆత్రేయుడు, సుశ్రుతుడు. ఈయనచే విరచించబడిన ప్రఖ్యాత వైద్యగ్రంథాలు అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం. సింహగుప్తుని కుమారుడైన వాగ్భటుడు సింధునదీ పరివాహక ప్రాంతములో జన్మించాడు. అవలోకితుడు అనే బౌద్ధగురువు దగ్గర వాగ్భటుడు వైద్యవిద్యను అభ్యసించాడు. అయితే వాగ్భటుడు పుట్టుకతో హిందువే అయినప్పటికీ, జీవన ప్రస్థానంలో హిందూ ధర్మాన్నే అనుసరిస్తున్నప్పటికీ, తనయొక్క గ్రంథాలకు ముడు మాటగా చెబుతున్నప్పుడు బుద్ధుని స్మరించుకుంటాడు.

ఈయన అష్టాంగ సంగ్రహం భారతదేశ పర్యంతం చదువబడింది. ఈయన తన కాలంలో లభ్యమైన వైద్యగ్రంథాలన్నింటిని పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా చేసాడు. చరకుడు, సుశ్రుతుడు చెప్పినవాటిని చక్కగా పరిష్కరించాడు. ఈయన ఋతువులను అనుసరించి చేయాల్సిన దినచర్యల గురించి, ఋతుచర్యల గురించి వివరించాడు. వీటిని పాటించడంవల్ల ఆయుర్ వృద్ధి జరుగుతుందని ప్రయోగాత్మకంగా తెలిపేవాడయాన.

ఈయన రాసిన అష్టాంగ సంగ్రహంలో 6 అధ్యాయాలు, 150 విభాగాలున్నాయి. మొదటి అధ్యాయంలో శరీర నిర్మాణము, గర్భము ధరించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవ సమయములో పాటించవలసిన పద్ధతులు, మూడవ అధ్యాయంలో మధుమేహం, చర్మ వ్యాధుల నివారణలను గురించి, నాలుగవ అధ్యాయములో ఆయా వ్యాధులకు తగిన చికిత్సా పద్ధతులు, ఐదవ అధ్యాయంలో చిన్నపిల్లలకు వచ్చే రోగాలు, మూర్ఛలు, పిచ్చి గురించి, వాటి నివారణ పద్ధతులను గురించి వివరించబడింది.

ఆది వైద్యులు - చరకుడు


సుశ్రుతుడు శస్త్రచికిత్స  నిపుణుడైతే చరకుడు  ఆయుర్వేద వైద్యుడు. ఏ రోగికి ఏ మూలిక తగినదన్న విషయాన్ని నిర్ణయించడంలో నిష్ణాతుడు. ఆయన శాస్త్ర చికిత్సావిధానాల్లో అనేక అద్భుతాలు చేశాడు.

ఈయన గర్బస్థశిశువు పెరుగుదల గురించి, మానవ శరీర నిర్మాణము గురించి స్పష్టమైన వివరాలు అందించాడు. వాత, పిత్త, కఫములను అనుసరించి చరకుడు శరీరంలోని ఆరోగ్యస్థితిని అంచనా వేసేవాడు. అదేవిధంగా రోగాలను నిర్థారించడమే కాదు, వాటికి తగిన చికిత్సా పద్ధతులను సూచించడంలో కూడా ఘటికుడు చరకుడు. ఈయన వృద్ధాప్యాన్ని వెన్నక్కి మళ్లించే మూలికలను కూడా అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

ఆయనచే విరచితమైన ‘చరక సంహితి’లో పలు విధాలైన మూలికల వివరాలను, చికిత్సా విధానాలను చూడొచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో చరకుడు వైద్యం చేసేందుకు లోహథాతువులను, జంతు సంబంధ పదార్థాలను కూడా ఉపయోగించేవాడట. మందులు ఉపయోగించే పద్ధతిని అనుసరించి చరకుడు ఆయా మందులను 50 రకాలుగా విభజించాడు. మందులను పొడిరూపంలో, జిగురుగా, ద్రవరూపంలో తాయారు చేసిన చరకుడు ఆ మందులను ఉపయోగించాల్సిన విధానాన్ని గురించి చాల వివరంగా పేర్కొన్నాడు.

ఆది వైద్యులు - సుశ్రుతుడు


శస్త్రచికిత్స అనేతప్పటికీ మనకు ముందుగా గుర్తుకొచ్చేది సుశ్రుతుడే. సుశ్రుతుడు ఓ గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడు. గొప్ప గురువు, సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడనిపేర్కొనబడుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, సుశ్రుతుడు హిపోక్రెట్స్కు ఓ వంద సంవత్సరాలు ముందుగా, సెల్సియన్ మరియాగాలన్ ల కంటే రెండు సంవత్సరాల ముందుగా ఈ భూమిపై ఆపరేషన్లు చేశాడనేది యదార్థం. సుశ్రుతుడు ఓ గొప్ప వైద్యపరంపర నుంచి వైద్యాన్ని నేర్చుకుంటే, దివోదాసుడు నుంచి సుశ్రుతుడు వైద్యవిద్యను నేర్చుకున్నాడు. సుశ్రుతుని కీర్తి దేశదేశాలకు పాకింది. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ముందుగా అరబిక్ భాషలోకి అనువదించబడి, అరబిక్ భాష నుండి పర్షియన్ భాషలోకి, ఆ తదనంతరం మిగతా భాషలకు విస్తరించాయి. సుశ్రుతసంహిత రెండు భాగాలను కలిగి ఉంది. మొదటి భాగం పూర్వసంహితగా, రెండవభాగం ఉత్తర సంహితగా విభజింపబడ్డాయి. 184 అధ్యాయాలుగా విభజింపబడిన ఈ గ్రంథంలో 1,120 రుగ్మతలను గురించి ప్రస్తావించబడటమే కాక, వాటికి సంబంధించిన చికిత్సాపద్ధతులు కూడ వివరించబడ్డాయి.

అయితే, ఆయన ఇన్ని విధాలైన వైద్యవిధానాలను సూచించినప్పటికీ, ఆయన మధుమేహ, ఊబకాయాలను తగ్గించే వైద్యునిగానే చాలా మంది గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన కాశీలో నివసించినందువల్ల ప్రస్తుతం బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంలో సుశ్రుతుని విగ్రహం ప్రతిష్టించబడింది.

ఆది వైద్యులు - ధన్వంతరీ



‘ వైద్యో నారాయణో హరిః ’ అని అన్నారు. వైద్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని, అనుభవజ్ఞుడైన వైద్యుని ‘ అపర ధన్వంతరి ’ అని మన వాళ్ళు పోగడుతుంటారు.

శ్రీమద్భాగవతం ధన్వంతరిని “దృఢమైన శరీరంతో, పొడవైన చేతులతో, నలుపురంగు శరీరంతో, ఎర్రని కళ్ళతో, పసుపువర్ణదుస్తులను ధరించి, వివిధ రకాల ఆభరణాలను అలంకరించుకొని దర్శనమిస్తూంటారు” అని వర్ణించింది. ఇలా పలు పురాణాలు ఆయన అవతారగాథను వివరించాయి. భాగవతపురాణం ప్రకారము, క్షీరసాగరమధనం ద్వార ధన్వంతరి ఆవిర్భావం జరిగింది.

రాక్షసులు  పెట్టే  బాధలను భరించలేకపోయిన దేవతలు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకోగా, ఆయన శ్రీహరిని ప్రార్థించమన్నాడు. అందరూ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా క్షీరసాగరమథనము చేస్తే ఫలితము ఉంటుందని చెబుతాడు. అలా వారు విష్ణుదేవుని సలహాననుసరించి గడ్డి, తీగలు, ఓషధులను పాలసముద్రములో వేసి, మందరపర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా, కవ్వం కిందుగా కూర్మావతార విష్ణువు ఆధారంగా ఉండగా, ముందుగా హాలాహలం పుట్టగా, దానిని పరమశివుడు కంఠములో ధరించాడు. అనంతరం కామధేనువు, ఉచ్చైశ్శ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి కన్య ఉద్భవించారు.

ఆ తర్వాత పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో నడుముకు పట్టుపుట్టం, కంఠాన పూదండలు, ఎర్రటి కన్నులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్నకుండలాలు, కాళ్ళకు రత్న మంజీరాలలో ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతిలో అమృతకలశం ధగధగలాదుతోంది.

ఈ విధంగా భాగవత పురాణం ధన్వంతరి ఆవిర్భావాన్ని వర్ణించింది.

ఇక, విష్ణుధర్మోత్తరపురణం, ఒక చేతిలో అమృతకలశం, మరొక చేత వనమూలికలు పట్టుకొని ధన్వంతరి దర్శనమిచ్చినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు ఆయన వనములికలకు బదులుగా జలగలను పట్టుకుని ఉంటాడని పేర్కొన్నాయి. రామాయణంలో కమండలం, దండం నుంచి ధన్వంతరి ఉద్భావించాడని చెప్పబడింది. ఆయన నాలుగు చేతులతో దర్శనమిస్తూ, పై రెండు రెండు చేతులలో,శంఖు, చక్రాలను ధరించి, క్రింది రెండు చేతులలో జలగన్ఉ అమృతకలశాన్ని పట్టుకుని ఉంటాడని కొన్ని పురాణాల కథనం.

దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో వివరించబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి చాలా కాలంపాటూ సంతానభాగ్యం లేక పోవడంతో విష్ణుమూర్తిని వేడుకుంటూ ఘోరమైన తపస్సును చేసాడు. అప్పుడు స్వామి దీర్ఘతమునికి ధన్వంతరి కొడుకుగా పుట్టేవరాన్ని అనుగ్రహించాడు. అలా దీర్ఘతముని ఇంట మానవరూపములో జన్మించిన ధన్వంతరి దేవ లోకంలోని వైద్యవిధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

బ్రహ్మవైవర్తపురాణం, ధన్వంతరి భూలోకానికి వచ్చిన తదనంతరం జరిగిన సంఘటనలను వివరిస్తోంది. ఒకానోకసారి ధన్వంతరి, తన శిష్యులతో కలసి కైలాసపర్వత దర్శనానికి బయలుదేరాడు. దారిలో వారిని అడ్డగించిన దక్ష అనే పాము, తన పడగలను విప్పి బెదిరించింది. ధన్వంతరి శిష్యులలో ఒకడు దూకుడుగా ముందుకు వెళ్ళి దక్ష పామును పట్టుకుని ఓ మంత్రమును పఠించడంతో, ఆ మంత్రప్రభావానికి దక్ష పాము మూర్ఛ పోయింది. ఈ విషయాన్ని గురించి విన్న పాములరాజు వాసుకి, ద్రోణ, పుండరీక అనే క్రూర పాముల నాయకత్వంలో కొన్ని వేల పాములను ధన్వంతరి శిష్యులపైకి పంపాడు. ఆ పాముల సైన్యం తమ విషంతో ధన్వంతరి శిష్యులంతా మూర్చపోయేట్లు చేసాయి. అయితే ధన్వంతరి ఆయుర్వేద మూలికలతో తన సిష్యులనంతా మూర్ఛ నుండి తెరుకునేట్లు చేసాడు. ఈ సంఘటన వాసుకిని మరింత ఆవేశానికి లోను చేయగా, ధన్వంతరితో పాటు అతని శిష్యులను నాశనం చేసేందుకు మానసాదేవి అనే పాములరాణిని పంపాడు. మానసాదేవి తన విషాన్ని ఎగజిమ్ముతుండగా, ధనవంతరావిషానికి విరుగుడు చేసాడు. తదనంతరం మానసాదేవికి, ధన్వంతరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధజ్వాలలకు సకల లోకాలు కంపించిపోసాగాయి. సరిగ్గా అప్పుడు వారి మధ్య శివుడు ప్రత్యక్షం కాగా, తన తప్పును గ్రహించిన వాసుకి పరుగుపరుగున వచ్చి శివుని పాదాలపై వాలిపోయాడు.

ఇలా ధన్వంతరి గురించి అనెక్ పురాణకథలను వింటూంటాం. శస్త్ర చికిత్సలో (ఆపరేషన్స్) ఉద్దండుడైన దివోదాసు ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు.

శ్రీధన్వంతరి మూలమంత్రం

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ

ధన్వాతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ

సర్వరోగ నివారనాయ త్రైలోక్య పతయే త్రైలోక్యవిధయే

శ్రీమహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూప

శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా

ఆర్యుల దండయాత్ర సిద్దంతం అబద్దము అని తెలియచేసే అదారములు



ఇదేదో హిందుత్వవాదమో మరొకటో అని అపార్థం చేసుకోకండి. సరే విషయానికి వద్దాము. నిజానిజాలు ఎంత? తెలియలిసిన అవసరం ఉంది
1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.


ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని "ఆర్యపుత్రా" అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.


2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.

అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని "రాయల్ ఏషియాటిక్ సొసైటీ" రహస్య సమావేశ తీర్మానం
"ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్‌వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు."
(వనరు:Proof of Vedic Culture's global Existence - by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్‌ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం


"నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత "గొప్పగా" మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది."

(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)


విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన "విలియం జోన్స్",మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ "ఆర్య" శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.

1946లో అంబేద్కర్ రచించిన "Who were the sudras?" అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో " పాశ్చాత్యులు సృష్టించిన "ఆర్యజాతి" సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది"
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో "ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు".


4.సైంటిఫిక్ ఋజువులు:

1920లో బయటపడిన "సింధు నాగరికత"తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్‌వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే "ఆర్య" శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది 'గుర్రాలపై దండెత్తి" ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.

1980లో ఉపగ్రహాల ద్వారా 'సరస్వతీ' నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్‌వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.
ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.

ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు

ఆర్య సిద్ధాంతం ఒక అబద్దలా పుట్ట ....


భారతీయ భూమి కను తిరస్కరిస్తూ 150 సంవత్సరాల క్రితం అప్పటి బ్రిటిష్‌ పరిపాలకులు 'ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం' ఈ దేశం లో ప్రవేశపెట్టారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమనేది కేవలం ఒక వాదనే తప్ప వాస్తవం ఎంతమాత్రం కాదు. తదనంతరకాలంలో లభించిన ఆధారాలను, ప్రమాణాలను బట్టి ఈ దురాక్రమణ సిద్ధాంతం తిరస్కరింపబడుతోంది. అయినా ఈనాటికీ కూడా మన పాఠ్యపుస్తకాలలో, అదే సిద్ధాంతం, తరం తర్వాత తరంగా, బోధింపబడుతూ కొనసాగుతూ వస్తూవుంది.



పురాణాలులో   ఒక  శ్లోకం తెసుకొని   దానికి  ద్వంద  అర్ధం  తీస్తూ   ఆర్య సిద్ధాంతం  అనేది  నిజము  అనే  ఓ  మేదావులరా  భారతీయ ప్రాచీన వేదశాస్త్ర గ్రంథాలలోగాని, ఇతి హాస పురాణాలలో గాని, ఈ దండయాత్ర లను గురించి ఎక్కడా ఒక్క వాక్యం కూడా చెప్పలేదు. దక్షిణ భారత దేశపు ద్రావిడ సాహిత్యం కూడా ఎక్కడా ఈ ఆర్యుల దండయాత్ర గురించిన సూచనలు కూడా లేనే లేవు.

ఋగ్వేద మంత్రాలలో దస్యులను తిరస్కరిస్తూ, నిందిస్తూ ఉన్న వాక్యాలు కన్పించడం నిజమే. కొందరు వ్యాఖ్యాతను దస్యులనగా తొలుత భారతభూమిలో నివ సించెడివారని, వారు వైదిక భిన్నమైన భాషను మాట్లాడుతుండేవారని, వారినే యుద్ధప్రియులైన ఆర్యులు తమ యుద్ధరథాలతో తరిమివేశారనీ వ్యాఖ్యానించడం జరిగింది. నేనధ్యయనం చేసినంతమేరకు ఋగ్వేదంలోని మంత్రాలలో ఆర్యులు ఎక్క డ్నుంచో క్రొత్తగా వచ్చినవారు కాదనీ, వారు ముఖ్యంగా ఇండోయూరోపియన్లుగా భారత్‌లో ప్రవేశించ లేదని స్పష్టంగా తెలుస్తోంది.  ఆర్యులు తెగకాదు ఆర్య  అంటే  గౌరవం  సూచక  పదం  ఉత్తర భారతీయులు  .  అని  కాదు . మండోదరి అనేక  సందర్బాలులో  రావణుడి ని  ఆర్య  పుత్ర అని  సంబోదించింది  రామాయణం  చదివిన వారికీ  తెలుస్తుంది 

సరే  ఈ వాదనలు   ఇవన్నీ భారతదేశంలో తమ వలస సామ్రాజ్యాలను సుస్థిరం చేసు కునేటందుకు, తమదైన మతాన్ని ఈ దేశంలో వ్యాపిం పచేసేందుకు మాత్రమే బ్రిటీష్‌ వారు మొదలుపెట్టారు. 150 సంవత్సరాలకు ముందు భారతీయులెవ్వరికీ వైదికసాహిత్యం, అది రచించబడిన సంస్కృతభాషలు, తమవి కాదని, అవి ఎక్కడ్నుంచో వచ్చాయన్న ఆలోచన ఊహామాత్రంగా కూడా తెలియదు.

ఆర్య దురాక్రమణ సిద్ధాంతాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వారు చారిత్రక విద్వాం సులుగాని, పురా తత్త్వ శాస్త్రవేత్తలు గాని కానే కారు. ఈ సిద్ధాంత ప్రారంభకుడైన మాక్స్‌ముల్లర్‌ను బ్రిటీష్‌ వారికి చెందిన ఈస్టిండియా కంపెనీ తమ వలసవాద సిద్ధాంత ప్రచారకుడుగా ఒకానొక ఉద్యోగిగా స్వీకరించింది. 

గత 30 ఏండ్ల కాలంలో ఋగ్వేద కాలపు సరస్వతీ నదీ. అది ప్రవహించిన త్రోవలు కనుగొన బడ్డాయి. పంజాబులో మొహంజోదారో హరప్పా త్రవ్వకాలు గుజరాత్‌లో లోథాల్‌, ధోలావీరా త్రవ్వకాలు, హర్యానా ప్రాంతంలో కునాల్‌ త్రవ్వకాలలో ప్రాచీన వైదిక కాలం లోని యజ్ఞవేదికలు, యాపస్థంభాలు బయటపడ్డాయి. అలాగే ఆ త్రవ్వకాలలో బయటపడిన భాష వైదిక సం స్కృత కుటుంబానికి చెందినది

నాకు తెలిసిన భగవత్ గీత


గీతం మనిషికి మూలం
ధర్మం తెలిపే మహత్తర గ్రంధం 
ఆత్మే నిత్యం దాని వెనకే మన పయనం
మరణం అంటే మరో జన్మంటూ తెలిపే శాస్త్రం
నీలో పరమాత్మనే గ్రహించాలంటూ తెలిపే సారం 
బ్రతుకంటే నీవెంటే సాగే సాగరం
ఎదురీదే లక్ష్యం ఉంటే జీవితమే కాదా దాసోహం
ఆ యోగ్యం సాధించాలంటే సాధనే ప్రత్యేకం 
కలతలే నీకున్న ఓర్పుకు జరిగే పరిక్షలు
ప్రయత్నమే విడువకు నువ్వు ముందుకు సాగు

Popular Posts