Followers

Thursday 8 January 2015

నామరామాయణం ( సుందరకాండము- తాత్పర్యము తో పాటుగా )



కపివరసంతతసంస్మృత రామ | తద్గతివిఘ్నధ్వంసక రామ |
సీతాప్రాణాధారక రామ | దుష్టదశాననదూషిత రామ |
శిష్టహనూమద్భూషిత రామ | సీతవేదితకాకావన రామ |
కృతచూడామణిదర్శన రామ | కపివరవచనాశ్వాసిత రామ ।

సుందరకాండము- తాత్పర్యము 

ఓ శ్రీరామా! నీవు హనుమంతునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, ఆతని మార్గమున అవరోధములను విధ్వంసము చేసిన వాడవు, లంకలో ఉన్న సీత ప్రాణమునకు ఆధారమైన వాడవు, రావణునిచే దూషించ బడినవాడవు, సుజనుడైన హనుమంతునిచే భూషితుడవు,
సీతాదేవిచే హనుమంతునితో తనను కాకాసురుని బారినుండి కాపాడిన వానిగా పేర్కొనబడ్డావు, హనుమంతుని ద్వారా చూడామణిని చూపబడ్డావు, ఉత్తముడైన హనుమంతుని సందేశముతో, మాటలతో ఊరట చెందావు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

Popular Posts