Followers

Thursday, 8 January 2015

నామరామాయణం (అయోధ్యాకాండము - తాత్పర్యము తో పాటుగా )



అగణితగుణగణభూషిత రామ | అవనీతనయాకామిత రామ |
రాకాచంద్రసమానన రామ | పితృవాక్యాశ్రితకానన రామ |
ప్రియగుహవినివేదితపద రామ | ప్రక్షాళితనిజమృదుపద రామ |
భరద్వాజముఖానందక రామ | చిత్రకూటాద్రినికేతన రామ |
దశరథసంతతచింతిత రామ | కైకేయీతనయార్పిత రామ |
విరచితనిజపితృకర్మక రామ | భరతార్పితనిజపాదుక రామ ।

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ
అయోధ్య కాండ:    తాత్పర్యము

ఓ శ్రీరామా! నీవు ఎన్నలేని సుగుణముల సమూహముతో శోభిల్లే వాడవు, భూమి పుత్రిక అయిన సీతచే ప్రేమించ బడిన వాడవు, చంద్రునివంటి ముఖము కలవాడవు, . పితృవాక్య పరిపాలనకి అడవులకు వెళ్లినా వాడవు, గుహునిచే ఆహ్వానించ బడి, పాదముల కడిగి పూజించబడిన వాడవు, భరద్వాజ మునికి ఆనందము కలిగించిన వాడవు, చిత్రకూటముపై నివసించిన వాడవు, దశరథునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, భరతునిచే రాజ్యము సమర్పించబడిన వాడవు, దశరథునికి పితృ కర్మలు చేసిన వాడవు, భరతునికి పాదుకలు ఇచ్చిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

Popular Posts