ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అందరికి తెలిసినదే ఆ పదము ఎక్కడిది అంటే వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాఖ్యము ప్రజా ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
రామాయణంలో ఈ వాక్యం ఉన్న శ్లోకం
ధర్మ ఏవహతో హంతి
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత
ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవి. ప్రస్తుత కాలమానము ప్రకారము ధర్మము ఎక్కడుంది. ఎలావుంటుంది. అప్పుడు వాల్మికీగారు ధర్మాన్ని ఎలావుంటుంది అంటే రామో విగ్రహాన్ ధర్మః (మూర్తీభవించిన ధర్మమే రాముడు ) అని అన్నారు .