సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
అర్జునుడు చెప్పెను - ఓ శ్రీకృష్ణా! మీయను గ్రహము వలన నా యజ్ఞానము నశించినది. జ్ఞానము (ఆత్మస్మృతి) కలిగినది. సంశయములు తొలగినవి. ఇక మీ యాజ్ఞను నెఱవేర్చెదను. ******************************************************************************************* 73 సంజయ ఉవాచ :- ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః, సంవాదమిమమశ్రౌష మద్భుతం రోమహర్షణమ్.
సంజయుడు చెప్పెను - ఓ దృతరాష్ట్ర మహారాజా! ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణునియొక్కయు, మహాత్ముడగు అర్జునునియొక్కయు ఆశ్చర్యకరమైనట్టియు, పులకాంకురమును గలుగజేయునదియునగు ఈ సంభాషణము వింటిని. ******************************************************************************************* 74 వ్యాసప్రసాదాచ్ఛ్రుతవా నేతద్గుహ్యతమం పరమ్, యోగం యోగేశ్వరాత్కృష్ణా త్సాక్షాత్కథయతస్స్వయమ్.
శ్రీ వేదవ్యాసమహర్షి యొక్క అనుగ్రహము వలన, నేను అతిరహస్యమైనదియు, మిగుల శ్రేష్ఠమైనదియు నగు ఈ యోగశాస్త్రమును స్వయముగనే అర్జునునకు చెప్పుచున్న యోగీశ్వరుడగు శ్రీకృష్ణుని వలన ప్రత్యక్షముగా (నేరులో) వింటిని. ******************************************************************************************* 75 రాజమ్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్, కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః.
ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆశ్చర్యకరమైనదియు, పావనమైనదియు, (లేక పుణ్యదాయకమైనదియు) నగు కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణమును, తలంచి మాటిమాటికి ఆనందమును బొందుచున్నాను. ******************************************************************************************* 76 తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః, విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః.
ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణమూర్తి యొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును తలంచి తలంచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది. మఱియు (దానిని తలంచుకొని) మాటిమాటికిని సంతోషమును బొందుచున్నాను. ******************************************************************************************* 77 యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః, తత్ర శ్రీర్విజయో భూతి ర్ధ్రువా నీతిర్మతిర్మమ.
సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః, ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్.
(ఓ అర్జునా!) రహస్యము లన్నిటిలోను పరమ రహస్యమైనదియు, శ్రేష్ఠ మైనదియునగు నా వాక్యమును మఱల వినుము. (ఏలయనిన) నీవు నాకు మిక్కిలి ఇష్టుడవు. ఇక్కారణమున నీయొక్క హితమునుగోరి మఱల చెప్పుచున్నాను. ******************************************************************************************* 64 మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే.
నాయందు మనస్సునుంచుము. నాయెడల భక్తి గలిగియుండుము. నన్నారాధింపుము. నాకు నమస్కరింపుము. అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు. నీవు నాకిష్టుడవై యున్నావు. కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. ******************************************************************************************* 65 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః.
సమస్త ధరములను విడిచిపెట్టి నన్నొక్కనిమాత్రము శరణుబొందుము. నేను సమస్త పాపముల నుండియు నిన్ను విముక్తినిగ జేసెదను. ******************************************************************************************* 66 ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన, న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోభ్యసూయతి.
నీకు బోధింపబడిన ఈ గీతాశాస్త్రము తపస్సు లేనివానికిగాని, భక్తుడుకానివానికిగాని, వినుట కిష్టము లేనివానికిగాని లేక గురుసేవ చేయనివానికిగాని, నన్ను దూషించువానికిగాని (లేక నాయెడల అసూయజెందువానికిగాని) ఎన్నడును చెప్పదగినదికాదు. ******************************************************************************************* 67 య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి, భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః.
ఎవడు అతిరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు చెప్పునో అట్టివాడు నాయం దుత్తమ భక్తి గలవాడై, సంశయరహితుడై (లేక నిస్సందేహముగ) నన్నే పొందగలడు. ******************************************************************************************* 68 న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః, భవితా న చ మే తస్మా దన్యః ప్రియతరో భువి.
మనుజులలో అట్టివానికంటె నాకు మిక్కిలి ప్రియము నొనర్చు వాడెవడును లేడు. మఱియు అతనికంటె నాకు మిక్కిలి ఇష్టుడైనవాడు ఈ భూలోకమున మఱియొకడు కలుగబోడు. ******************************************************************************************* 69 అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః, జ్ఞానయజ్ఞేన తేనాహ మిష్టస్స్యామితి మే మతిః.
ఎవడు ధర్మయుక్తమైన (లేక ధర్మస్వరూపమేయగు) మన యిరువురి ఈ సంభాషణమును అధ్యయనముచేయునో అట్టివానిచే జ్ఞానయజ్ఞముచేత నేనారాధింప బడినవాడనగుదునని నా నిశ్చయము. ******************************************************************************************* 70 శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః, సోపి ముక్తశ్శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్.
ఏ మనుజుడు శ్రద్ధతోగూడినవాడును, అసూయలేనివాడునునై ఈ గీతాశాస్త్రమును వినునో, అట్టివాడును పాపవిముక్తుడై పుణ్యకార్యములను చేసినవారి యొక్క పుణ్యలోకములను పొందును. ******************************************************************************************* 71 కచ్చి దేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా, కచ్చి దజ్ఞానసమ్మోహః ప్రనష్ట స్తే ధనంజయ.
ఓ అర్జునా! నాయీబోధను నీవు ఏకాగ్ర మనస్సుతో వింటివా? అజ్ఞానజనితమగు నీయొక్క భ్రమ (దానిచే) సంపూర్ణముగా నశించినదా? ******************************************************************************************* 72
భక్తి చేత మనుజుడు నేనెంతటివాడనో, ఎట్టివాడనో, యథార్థముగ తెలిసికొనుచున్నాడు. ఈ ప్రకారముగ నన్ను గూర్చి వాస్తవముగా నెఱింగి అనంతరము నాయందు ప్రవేశించచచున్నాడు. ******************************************************************************************* 55 సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః, మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్.
సమస్తకర్మములను ఎల్లప్పుడును చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు (శరణుబొందువాడు) నా యనుగ్రహము వలన నాశరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు . ******************************************************************************************* 56 చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః, బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్త స్సతతం భవ.
నాయందు చిత్తమును జేర్చినవాడవైతివేని నా అనుగ్రహము వలన సమస్త సాంసారిక దుఃఖములను దాటగలవు. అట్లుగాక అహంకారమువలన నా యీ వాక్యములను వినకుందువేని చెడిపోదువు. ******************************************************************************************* 58 యద్యహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే, మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతి స్త్వాం నియోక్ష్యతి.
ఒక వేళ అహంకారము నవలంబించి 'నేను యుద్ధము చేయను' అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదియే యగును. (ఏలయనిన) నీ (క్షత్రియ) స్వభావమే నిన్ను (యుద్ధమున) నియోగింపగలదు. ******************************************************************************************* 59 స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్స్వేన కర్మణా, కర్తుం నేచ్ఛసి యన్మోహా త్కరిష్యస్యవశోపి తత్.
ఓ అర్జునా! స్వభావము (పూర్వజన్మ సంస్కారము) చే గలిగిన (ప్రకృతి సిద్ధమైన) నీయొక్క కర్మముచే లెస్సగ బంధింపబడినవాడవై దేనిని చేయుటకు అవివేకమున నిచ్చగింపకున్నావో దానిని పరాధీనుడవై (కర్మధీనుడవై) తప్పక చేసియే తీరుదువు. ******************************************************************************************* 60 ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా.
ఓ అర్జునా! జగన్నియామకుడగు పరమేశ్వరుడు (అంతర్యామి) మాయచేత సమస్త ప్రాణులను యంత్రము నారోహించినవారినివలె (కీలుబొమ్మలను వలె) త్రిప్పుచు సమస్త ప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు. ******************************************************************************************* 61 తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్.
ఓ అర్జునా! సర్వవిధముల ఆ (హృదయస్థుడగు) ఈశ్వరునే శరణుబొందుము. అతని యనుగ్రహముచే సర్వోత్తమమగు శాంతిని శాశ్వతమగు మోక్షపదవిని నీవు పొందగలవు. ******************************************************************************************* 62 ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా, విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు.
ఈ విధముగా రహస్యము లన్నిటి కంటెను పరమరహస్యమైనట్టి జ్ఞానమును (గీతాశాస్త్రమును) నేను నీకు జెపితిని. దీనినంతను బాగుగ విచారణ చేసి తదుపరి నీకెట్లిష్టమో అట్లాచరింపుము. ******************************************************************************************* 63
ఓ సుఖము ప్రారంభమునందు విషమువలెను, పర్యవసానమందు అమృతమును బోలినదిగను నుండునో, తన బుద్ధియొక్క నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్త్వికమని చెప్పబడినది . ******************************************************************************************* 37 విషయేంద్రియసంయోగా ద్యత్తదగ్రేమృతోపమమ్, పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్.
ఏ సుఖము విషయేంద్రియ సంబంధము వలన మొదట అమృతమునుబోలియు, పర్వవసానమందు (అనుభవానంతరరమున) విషము వలెను నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని చెప్పబడననది . ******************************************************************************************* 38 యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః, నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్.
నిద్ర, సోమరితనము, ప్రమత్తత - అనువాని వలన బుట్టినదై ఏ సుఖము ఆరంభమందును, అంతమందును (అనుభవించినమీదట) తనకు మోహమును (అజ్ఞానమును, భ్రమను) గలుగజేయుచున్నదో అది తామససుఖమని చెప్పబడినది. ******************************************************************************************* 39 న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః, సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్స్యాత్త్రిభిర్గుణైః.
ప్రకృతి (మాయ) నుండి పుట్టినవగు ఈ మూడు గుణములతో గూడియుండని వస్తు వీ భూలోకమున గాని, స్వర్గమందుగాని, దేవతలయందు గాని ఎచ్చటను లేదు. ******************************************************************************************* 40 బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప, కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః.
శత్రువులను తపింపజేయు ఓ అర్జునా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు (వారి వారి జన్మాంతర సంస్కారము ననుసరించి) స్వభావము (ప్రకృతి) వలన పుట్టిన గునములనుబట్టి కర్మలు వేరువేరుగా విభజింపబడననవి. ******************************************************************************************* 41 శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవ మేవ చ, జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్.
తన తన స్వాభావిక కర్మమునం దాసక్తి (శ్రద్ధ) గల మనుజుడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని బొందుచున్నాడు. స్వకీయకర్మయం దాసక్తిగలవాడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని యెట్లు పడయగల్గునో దానిని చెప్పెదను వినుము. ******************************************************************************************* 45
ఫలాపేక్షగలవానిచేతగాని, మరియు అహంకారముతో గూడిన వానిచేగాని అధిక ప్రయాసకరమగు కర్మ మేది చేయబడుచున్నదో అది రాజసకర్మయని చెప్పబడినది. ******************************************************************************************* 24 అనుబంధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషమ్ మోహాదారభ్యతేకర్మ యత్తత్తామస ముచ్యతే
మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అనువీనిచేత న్యాయమైనట్టిగాని (శాస్త్రీయమైనట్టి) గాని, అన్యాయమైనట్టి (అశాస్త్రీయమైనట్టి) గాని ఏ కర్మమును ప్రారంభించుచున్నాడో, దాని కీయైదున్ను కారణములైయున్నవి . ******************************************************************************************* 15 తత్రైవం సతి కర్తార మాత్మానం కేవలం తు యః, పశ్యత్యకృతబుద్ధిత్వా న్న స పశ్యతి దుర్మతిః.
కర్మవిషయమందిట్లుండగా (పైనదెల్పిన అయిదున్ను కారణములై యుండగా) ఎవడు సంస్కరింపబడని బుద్ధిగలవాడగుటచే, నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో, అట్టి అవివేకి కర్మము యొక్క గాని, ఆత్మ యొక్కగాని, వాస్తవ స్వరూపమును ఎఱుగకున్నాడు. ******************************************************************************************* 16 యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే, హత్వాపి స ఇమాన్ లోకాన్న హంతి న నిబధ్యతే.
ఎవనికి ' నేను' కర్తను అను తలంపులేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో అతడీ ప్రాణులన్నిటిని చంపినను వాస్తవముగ ఏమియు చంపుటలేదు. మఱియు నతడు కర్మలచే, పాపముచే బంధింపబడుటయులేదు. ******************************************************************************************* 17 జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా, కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః.
కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియువాడు అని మూడు విధములుగ నున్నది. అట్లే కర్మ కాధారమున్ను ఉపకరణము (సాధనము), క్రియ, చేయువాడు - అని మూడు విధములుగ నున్నది. ******************************************************************************************* 18
అర్జునుడు అడిగెను:- గొప్ప భుజములు గలవారును, ఇంద్రియముల యొక్క నియామకులును, కేశియను రాక్షసుని సంహరించినవారు నాగు ఓ కృష్ణా! సన్న్యాసము యొక్కయు, త్యాగము యొక్కయు యథార్థమును తెలిసికొనగోరుచున్నాను. కావున ఆ రెండిటిని వేఱు వేఱుగా నాకు చెప్పుడు . ******************************************************************************************* 1 శ్రీ భగవానువాచ:- కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదు:, సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా:.
శ్రీ భగవంతుడు చెప్పెను - (ఓ అర్జునా!) కామ్యకర్మలను వదలుటచే సన్న్యాసమని కొందరు పండితులు చెప్పుదురు. మరికొందరు పండితులు సమస్త కర్మలయొక్క ఫలమును త్యజించుటచే త్యాగమని వచించుదురు. ******************************************************************************************* 2 త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ:, యజ్ఞదానతప:కర్మ న త్యాజ్యమితి చాపరే.
కొందరు బుద్ధిమంతులు (సాంఖ్యులు) దోషమువలె కర్మము విడిచిపెట్టదగినదని చెప్పుదురు. మరి కొందరు యజ్ఞము, దానము, తపస్సు - మున్నగు కర్మములు విడువదగనివనియు చెప్పుదురు. ******************************************************************************************* 3 నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ, త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధ: సంప్రకీర్తిత:.
భరతకులోత్తముడవును, పురుష శ్రేష్ఠుడవునగు ఓ అర్జునా! అట్టి కర్మత్యాగ విషయమున నాయొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము. త్యాగము మూడు విధములుగా చెప్పబడి యున్నది కదా! ******************************************************************************************* 4 యజ్ఞ దాన తప: కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఙోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్
ఓ అర్జునా! 'కలదు' అనెడి అర్థమందును 'మంచిది' అనెడి అర్థమందును 'సత్' అను ఈ పరబ్రహ్మ నామము ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మము నందును ఆ 'సత్' అను పదము వాడబడుచున్నది. ******************************************************************************************* 26 యజ్ఙే తపసి దానే చ స్థితి: సదితి చోచ్యతే, కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే.
యజ్ఞమునందును, తపస్సునందును, దానమునందును గల నిష్ఠ (ఉనికి) కూడ 'సత్' అని చెప్పబడుచున్నది. మరియు బ్రహ్మోద్దేశమైన (భగవత్ప్రీత్యర్థమైన) కర్మలుకూడ 'సత్' అనియే పిలువబడుచున్నవి. ******************************************************************************************* 27 అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్, అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్యనో ఇహ.
ఓ అర్జునా! అశ్రద్ధతో చేయబడిన హోమము గాని, దానముగాని, తపస్సుగాని, ఇతర కర్మలుగాని 'అసత్తని' చెప్పబడును. అవి ఇహలోకఫలమును (సుఖమును) గాని, పరలోకఫలమును (సుఖమును) గాని కలుగజేయవు. ******************************************************************************************* 28 ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, శ్రద్ధాత్రయవిభాగయోగోనామ, సప్తదశోధ్యాయః
ఇతరులచే తాము సత్కరింపబడవలెనని, గౌరవింపబడవలెనని, పూజింపబడవలెనని డంబముతో మాత్రమే చేయబడుతపస్సు అస్థిరమై, అనిశ్చితమైనట్టి ఫలముగలదై (లేక చపలమైనట్టి రూపముగలదై) ఈ ప్రపంచమున రాజస తపస్సు అని చెప్పబడినది. ******************************************************************************************* 18