Followers

Friday, 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కందం - మొదటిశ్లోకం (అద్వైత విశిష్టాద్వైత వ్యాఖ్యానం)



|| ఓం నమో భగవతే వాసుదేవాయ||
జన్మాద్యస్య యతోऽన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్
తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః
తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోऽమృషా
ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి


జన్మాది అద్య యత: అద్య - ఈ ప్రపంచం యొక్క.
జన్మాది - జమ్న రక్షణ సమ్హారం
యత: ఎవరి వల్ల జరుగుతున్నాయో

పరమాత్మ కడుపులో దాచుకోవడం - ప్రళయం
ప్రమాదం తొలగినపుడు బయటకు చేర్చుకోవడం - సృష్టి

పరమాత్మ కడుపులో దాచుకోవడం - ప్రళయం. ప్రమాదం తొలగినపుడు బయటకు చేర్చుకోవడం - సృష్టి. కారణం లేకపోతే కారణం లేదు తర్కం ప్రకారం. నిప్పు లేకపోతే పొగలేనట్లుగా.
అన్వయాత్ ఇతరత:
పరమాత్మ సంకల్పం లేకుండా జగత్తు ఉండదు. ప్రపంచంలో మనం చూసే ప్రతీ వస్తువులో ఆయన ఉన్నారు. ఆయనలేని వస్తువులేదు. వస్తువు లేకుంటే అందులో ఆయన కనపడడు. దీన్నే వ్యాప్తీ అంటారు. సాహచర్య నియమం వ్యాప్తి. కారణం లేకుండా కార్యం ఉండదు. పొగ నిప్పుకు కారణం. పొగ కనపడితే నిప్పు ఉంటుంది. పొగ లేకున్నా నిప్పు ఉంటుంది. నిప్పులేకపోతే పొగ కూడా ఉండదు. అందుకే లేకపోవడం కార్యాన్ని బట్టి ఉండటం కారణాన్ని బట్టి. మొదటిది అన్వయ వ్యాప్తి రెండొది వ్యతిరేక వ్యాప్తి. (నిప్పులేదు కాబట్టి పొగలేదు). కాని ఇలా భగవంతునికి చెప్పుకోవచ్చా? ప్రపంచం ఉంది కాబట్టి పరమాత్మ ఉన్నాడు... ప్రపంచంలేదుకాబట్టి పరమాత్మలేడు అనవచ్చా? ప్రపంచంలేదూంటే పరమాత్మ సంకల్పంలేదు.... కాబట్టి  అన్వయాత్ ఇతరత:

ప్రకృతి కన్నా వేరే పరమాత్మ ఉన్నాడని ఎందుకు  ఒప్పుకోవాలి?  ఎందుకంటే
 అర్థేషు అభిజ్ఞ్యా 
తాను చెసే పనిలో మోతాదు చక్కగా తెలిసినవాడు అయిఉండాలి.
ఒక పని చెయ్యలంటే అది చెయ్యడం తెలిసిన వాడు ఒకడు ఉండాలి. దారాలని యే వరసలో పేరిస్తే బట్ట అవుతుందో చేసేవాడికి ఆ గ్నానం  ఉండాలి. అడే విధంగా గ్నానం లేని ప్రకృఇతి కి, జడమైన ప్రకృతికి సృష్టి చేసే సామర్ధ్యం ఉండదు. జ్ఞ్యానం లేని వాడు సృష్టి చెయ్యలేడు. సృష్టి చెయ్యబడెది ఎంత చిన్నదైన - కుండైన బట్ట అయినా
జగత్తు ఎంత ఎప్పుడు సృష్టించాలి, ఎంతకాలం కాపాడాలో తెలిసిన వాడు ఒకడు ఉండాలి. యే ప్రాణికి యే గుణం యే వస్తువు యే కాలంలో రావాలో ఆ కాలంలో ఉండాలి. అది తెలిసిన వాడే సృష్టి చెయ్యాలి.
ప్రమాణం స్వరూపం స్వభావం స్థితి అవసరం ప్రయోజనం ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవి తెలిసినవాడే సృష్టి చెయ్యాలి 
మరి జ్ఞ్యానం అన్నంత మాత్రాన అది పరమాత్మే అవ్వాలని నియమం ఎమైనా ఉందా?

స్వరాట్ 
స్వయంప్రకాశం
 జీవుడి కి జ్ఞ్యానం ఉన్నా, జీవుడు ఒక పని చెయ్యాలంటే స్వాతంత్ర్యం  ఉండాలి, స్వయంప్రకాశం ఉండాలి. అనుకున్నప్పుడు పడుకోవడం,కోరుకున్నప్పుడు వృధ్ధాప్యం రావడం జీవునికి సాధ్యపడదు. మనం మాట్లాడాలన్నా, పరమాత్మ అగ్ని రూపంలో ఉండి మాట్లాడుతున్నాడని (వేదం -  అగ్నిమీళే పురోహితం.)
మనమంతా పరమాత్మ అధీనులం. స్వరాట్ అయిన వాడే సృష్టి చెయ్యగలడు. ఐతే స్వరాట్ కూడా పరమాత్మే కావలని నియమం ఎమిటి? 

తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే
బ్రహ్మగారికి కూడా వేదాలను సంకల్పంతో ఉపదేశించి

ముహ్యన్తి యత్సూరయఃసదా పశ్యంతి సూరయ:  - నిరంతరం పరమాత్మని చూసే సూరులు కూడా మోహం చెందుతూ ఉంటారు. 
అంటే జ్ఞ్యానులు బ్రహ్మ ప్రకృతి సృష్టి చేసే వీలు లేదు



తేజోవారిమృదాం యథా వినిమయో 
మనం ఉన్నదాన్ని సరిగ్గ గుర్తించలేము. తేజో వారి - తేజస్సును చూసి నీరనుకుంటాము. జలమును మట్టి అనుకుంటాం. నీరుని నిప్పుగా అనుకుంటాం. 
ఒకదానిలో ఒకటి కనపడుతుంది
అజ్ఞ్యానం అన్యధా గ్న్యానం విపరీత గ్న్యానం. ఇవన్నీ మనకున్నాయి కాబట్టి మమం ఎవ్వరం సృష్టి కర్తలం కాదు
ఒక దానిలో ఒకటి కనపడుతుంది ఎందుకంటే 
త్రిసర్గోऽమృషా
సృష్టి మూడిటితో జరుగుతుంది  - ప్రకృతి మహత్తు అహంకారం. సాత్వికాహంకారం నుండి మనస్సు , దేవతలు. రాజసాహంకారం నుండి ఇంద్రియాలు. తామస నుండి భూతాలు
సృష్టి అంతా త్రైగుణ్యం. అంతకుముందు  ఇవి అహంకారం. అనతకుముందు మహత్తులో లీనమయ్యి ఉన్నాయి. మహత్తునే బుద్ధి తత్వం అంటారు
మృష - అసత్యం. అమృష అంటే సత్యం. 
అద్వైత వ్యాఖ్యానంలో మృషా అని విషిశ్తాద్వైత వ్యాఖ్యానంలో అమృష. 
మరి దేన్ని నమ్మాలి?

ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి
తన దివ్యమైన తేజస్సుతోటి అన్ని మాయలు పోతాయి.
ఆ పరమాత్మ ఎవరు? సత్యం. అంటే మూడు కాలాల్లో ఉండేది. త్రికాల అబాధితం సత్యం.
పరం - ప్రపంచంలో ఉన్నవాటికంటే ఉత్కృష్టమైనది
ధీమహి - అలాంటి పరమాత్మని ధ్యానం చేస్తున్నాను. 
యే వస్తువుకైనా తటస్థ లక్షణం, స్వరూప లక్షణం ఉంటాయి.
పరబ్రహ్మ లక్షణం - సత్యం అనంతం(త్రికాల అపరిచ్చేధం - ఒక కాలంలో ఉండి ఇంకో కాలం లో లేకపోవడం, ఒక రూపంలో ఉండి ఇంకో రూపంలో ఉండకపోవడం. దేశ కాలా వస్తు అపరిచ్చిన్నత్వం అనంతం , పరమాత్మ సర్వ వస్తు అపరిచ్చిన్నం )

Popular Posts