శ్రావణ మాసం. . . మహిళల మాసం
శ్రావణ మాసం వచ్చేసింది. మహిళలు కార్తీక మాసానికి ఇచ్చిన ప్రాముఖ్య త కంటే శ్రావణ మాసానికి ఇస్తారు. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాము ఖ్యత ఉన్నది. శ్రావణ శుక్రవారం వచ్చిదంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తయిదువలు, ముసలి వారి వరకూ కూడా తల స్నానాలు చేసి నూతన దుస్తులు దరించి లక్ష్మిదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధిలోని తోటి ముత్తయిదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి ఆకు, వక్క, పండు, గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుం ది. శ్రావణ మాసంలో శుక్రవారాలతో పాటూ మంగళవారాలకు, ఇతర తిధులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే శ్రావణ మాసాన్ని మహిళల మాసంగా పిలుస్తారు.
మంగళగౌరి వ్రతం
శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో మంగళగౌరి వ్రతాలు నిర్వహిస్తారు. భర్తల క్షేమం కోసం, సిరి సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. అంతేకాకుండా నూతన వదూవరులు కూడా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో ఉండాలని, అన్యోన్య దాంపత్యం గడపాలని మంగళ గౌరి వ్రతం నిర్వహిస్తారు. వ్రతం అనంతరం ఇతర దంపతులకు తాం బూలాలు ఇచ్చి ఆశీర్వాదం పొందుతారు.
శ్రావణ శుక్రవారం
ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తయిదువలు తమ ఇళ్లలో పూజలు చేసు కుని బేసి సంఖ్యలో తోటి ముత్తయిదువలను ఇంటికి పిలిచి తాంబూళాలు ఇస్తారు.
వరలక్ష్మి వ్రతం
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఈ మాసం మొదలైన తరు వాత వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసా దించాలని, నిండు నూరేళ్లు సౌబాగ్యంతో వర్ధి ల్లాలని లక్ష్మిదేవిని భక్తి శ్రద్ధలతో పూజించే విదానాన్నే వరలక్ష్మి వ్రతం అంటారు. ముఖ్యం గా మహిళలు వరలక్ష్మి వ్రతం రోజు తప్పక తోటి మహిళలకు తాంబూలాలు, జాకెట్లు ఇచ్చి ఆశీర్వాధం తీసుకుంటారు. దేవాలయాలలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు.
నాగుల పంచమి
శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుద్ద పం చమి రోజును నాగుల పంచమిగా జరుపుకుం టారు. నాగుల పంచమి రోజున నాగదోశాల నివారణకు మహిళలు పాముల పుట్టల దగ్గర కు, నాగదేవత విగ్రహాల వద్దకు వెళ్లి పుట్టలలో, విగ్రహాలపై పాలు పోసి పూజలు చేస్తారు.
పుత్ర ఏకాదశి
ఈ మాసంలోని శుద్ధ ఏకాదశిని పుత్ర ఏకాదశిగా పిలిచి జరుపుకుంటారు. సంతానం లేని దంపతులు సంతానం కోసం శ్రావణ మాసంలోని ఏకాదశి రోజు పుత్ర ఏకాదశి వ్రతం జరుపుకుంటారు. మరి కొందరు మగ సంతానం కావాలని కూడా పుత్ర ఏకాదశి వ్రతం జరుపుకుంటారని పురోహితులు చెబు తున్నారు. ఈ సందర్భంగా పిల్లలు కావాలని కోరుకుంటూ దంపతులు శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రావణ పౌర్ణమి
శ్రావణ పౌర్ణమి అంటేనే అందరకూ గుర్తు కొచ్చేది రక్షా బందన్ కార్యక్రమం. సోదర సోదరీ మణులకు ఈ రోజు నిజంగా పండుగ రోజే. మగవారికి వారి చెల్లెళ్లు గానీ, అక్కలు గానీ ఈ రోజు చేతికి రాఖీ కట్టి దీవించమని కోరతారు. రాఖీలు కట్టిన సోదరీమణులు సోద రులకు స్వీట్ కూడా తినిపిస్తారు. అందుకు ప్రతిగా సోదరులు అంతో ఇంతో డబ్బు ఇచ్చి సోదరీమణులను ఆశీర్వదిస్తారు. ఇదే రోజు కొందరు జంద్వాల పౌర్ణమిని జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమికి మరో ప్రత్యేకత కూడా ఉం ది. ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి జన్మదినం కూడా. అందుకే శ్రావణ పౌర్ణమి రోజు వెంకన్న గుడులకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా అన్నీ శ్రావణ శనివారాలలో సైతం దంపతులు పిల్లా పాపలతో సహా వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రావణ అష్టమి (కృష్ణాష్టమి)
శ్రావణ మాసంలోని బహుళ అష్టమి రోజు కు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజు కృష్ణు డి జన్మదినం. అందుకే ఈ రోజు కృష్ణునికి ప్రత్యేక పూజలు జరిపి ఉట్టి కొట్టే కార్యక్రమం లో పాల్గొంటారు. చాలా మంది ఉపవా సాలు కూడా ఉంటారు. కృష్ణాష్టమి రోజు ఉపవాసా లు ఉండి, రాత్రంతా జాగరణ చేస్తే కోటి ఏకా దశి వ్రతాలు చేసినంత పుణ్యమని పురోహితు లు చెబుతున్నారు.