నారద మహర్షి హనుమంతునికి తాను వచ్చిన కార్యాన్ని ఇలా చెప్ప సాగాడు ”పూర్వం ”అసి”అనే రాక్షసుడు తపస్సు చే శివ్వున్ని మెప్పించాడు .వాడికి ”త్రిశూల రాముడు ”అనే కొడుకున్నాడు .అనేక ఏనుగుల బలం వున్నవాడు క్రూరుడు .వీడు శివుని కోసం గోదా వరి తీరం లో ఘోర తపస్సు ను అనేక సంవత్స రాలు చేశాడు .తన బలాన్ని చూసుకొని ,గర్వం తో ఇతరులను కించ పరచే వాడు .తపస్సు చేసుకొనే మునులను బాధించే వాడు .దేవతలను ఇబ్బంది పెట్టె వాడు .దేవతా స్త్రీలను బలాత్కారం చేసే వాడు .దేవరుషులను కూడా చులకన గా చూసే వాడు .దిక్పాలుర నందర్నీ అధికారాలకు దూరం చేశాడు .పాపం వాళ్లకు భార్య ల దగ్గరకు వెళ్ళే సాహసం కూడా లేదు .నన్ను కూడా ఆ దుష్టుడు బాధ పెట్టాడు .భయం అంటే ఏమిటో తెలీని నాకు వాడి వల్ల భయం ఎక్కు వైంది .మనశ్శాంతి గా తపస్సు చేసుకో లేక పోతున్నాను .ఇంక ఉపేక్షించి ఊరుకోవటం తగదని నువ్వు తప్ప వాడిని అదుపు లో పెట్టె వారెవ్వరూ లేరని ,నీ శరణు వేడ టానికి వచ్చాను .”అన్నాడు
హనుమ పరాక్ర మాన్ని ఒక సారి గుర్తు చేస్తూ ”హనుమా !పూర్వం బదరికాశ్రమం లో ”నర నారాయణ ఆకృతి ”దాల్చి ,ధ్యానం లో నువ్వు వున్నావు .అప్పుడు రాక్ష బాధ పొందుతున్న బ్రహ్మాది దేవతలు నర నారాయనుడవైన నిన్ను శరణు జొచ్చారు . రాక్షసుల నుండి తమల్ని కాపాడమని మరీ మరీ వేడుకొన్నారు నిన్ను .అప్పుడు నువ్వు గౌరీ శంకరులకు హను మంతుడు అనే పేరు తో జన్మిస్తానని ,బల వీర శ్రీ మంతుదవై సర్వ రాక్షస సంహారం చేస్తానని అభయం ఇచ్చావు .నీ మాటలు విని సంతోషించి నీకు కృతజ్ఞత తెలియ జేసి దేవతలు మళ్ళీ తమ స్థానాలకు వెళ్లి పోయారు .నువ్విప్పుడు మమ్మల్ని అనుగ్రహించాలి .త్రిశూల రాముడిని వధించి లోక కల్యాణం చేయాలి ”అని నారదుడు విన్న విన్చుకొన్నాడు .హనుమ వదిన్క్”లోక కంటకుడైనా వాడిని తప్పక వధిస్తాను ”అని అభయం ఇవ్వగా నారదుడు దేవేంద్ర లోకానికి వెళ్లి పోయాడు .
ఇంద్ర లోకం లో సుధర్మ సభలో దేవేంద్రుడు కొలువు తీరి వున్నాడు .త్రిశూలున్ని వాదించే వారెవ్వరూ అనే విషయం మీద అక్కడ చర్చ జరుగు తోంది ఇంతలో దేవర్షి నారదుడు సభ లో ప్రవేశించాడు .దేవేంద్రుడు సకలోప చారాలతో స్వాగతం పలికి ఉచితాసనం పై కూర్చో బెట్టాడు .దేవ గురువు బృహస్పతి ని చూసి ఇంద్రుడు దైన్యం గా ఉండ టానికి కారణమేమిటో నని అడిగాడు .అప్పుడు గీష్పతి ”దేవర్షీ !నీకు తెలియని దేముంది ?త్రిశూల రాముడనే రాక్షసి శివుని వర బల గర్వం తో మమ్మలనందర్నీ పీడిస్తున్నాడు .దిక్పాలకలకే దిక్కు లేకుండా చేశాడు .యజ్న హవిర్భాగాలను ఇంద్రుడికి దక్క నీయటం లేదు .శ్రౌత స్మార్త కర్మ లన్నీ భ్రష్ట మైనాయి . .నీ రాక మాకందరికీ ఊరట కల్గించింది .ఇంద్రుని కష్టాలు పోయే ఉపాయం చెప్పా లని మేమందరం నిన్ను ప్రార్దిస్తున్నాం ”అన్నాడు .
నారదుడు ఇంద్రుని వైపు చూసి ,మనసు లో శ్రీమన్నారాయ నుణ్ణి ధ్యానించి”దేవ గురు బృహస్పతి వర్యా !పూర్వం మీరు శ్రీమహా విష్ణువు ను శరణు కోరిన సంగ తి మర్చి పోయినట్లుంది .ఆయన భూలోకం లో ఆంజనేయుని గా జన్మించి ,రాక్షస సంహారం చేస్తానని అభయం ఇచ్చిన సంగతి గుర్తు లేదా ? ఆంజనేయుడు పంపా తీరం లో వున్నాడు .రాక్షస సంహారం చేసి మీ అందరికి మేలు చేస్తాడు హనుమ ను స్మరిస్తూ వుండండి నేను కూడా హనుమ ను దర్శించి త్రిశూల రోముడిని సంహరించమని వేడుకొని వస్తున్నాను .”అని అభయమిచ్చి దేవర్షి వైకున్థం చేరాడు .
హనుమ కొంత కాలమ్ పంపా తీరం లోనే వుంది ఆ సరస్సులో నిత్యం జల క్రీడా లాడుతూ పిల్ల వాడి లాగా వినోదిస్తున్నాడు .ఒక రోజూ అకస్మాత్తు గా సామ గానం విన పడింది .తన పరి వారం తో అక్కడికి చేరాడు .వానరులన్దర్నీ మాట్లాడ వద్దని హెచ్చ రించా గా వారంతా చెట్లు ఎక్కి కూర్చున్నారు .హనుమ కూడా ఒక వ్రుక్షమేక్కి కూర్చున్నాడు .దూరం గా పొదల చాటు నుండి త్రిశూల రాముడు రావటం గమ నించాడు హనుమ .వాడిని చూసి ఋషులు భయ కంపితు లవుతున్నారు .రక్షించే వారి కోసం దిక్కులు చూస్తున్నారు .రాక్షసుడు అక్కడికి చేరి ,కశ్యపాది మహర్షులతో ”కాంది శీకలై పారి పోయిన మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది ?నేనే లోక నాయకుడిని .మీ యజ్న భాగం నాకే చెందాలి .”అని పళ్ళు పాట పటా కొరికి హవిస్సును సంగ్రహించటానికి ముందుకు వచ్చాడు .
అన్నీ చూస్తున్న హనుమ ఒక్క సారిగా చెట్టు మీద నుంచి రాక్షసుడి నెత్తి మీదకు దూకాడు .వాడు నేలపై పడి పోయాడు .మారుతిని గమనించి ఆకాశం లోకి ఎగిరాడు . తోకతో వాడి గొంతు బిగించి తిప్పి తిప్పి కొట్టాడు హనుమ .వాడి చూపు మందగించింది .ముక్కు నుండి రక్త ధారలు స్రవించాయి వాడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు .హనుమ సాహసానికి ఆశ్చర్యం తో మునులు చూస్తున్నారు .మారుతి ని కింద పడేయ టానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు .రాక్షసుడు హనుమ తోక పట్టు కోని గిర గిరా తిప్పాడు మునులు భయ పడ్డారు .హనుమ కు ఆశీర్వచనాలు పలికారు .వాడు హనుమ వాలాన్ని పళ్ళ తో కొరికాడు .రాక్షసుణ్ణి తన్నుతూ పిడికిలి తో గుద్డుతూ వాడి ప్రాణాలకు ఎసరు పెట్టాడు ఆంజ నేయుడు .తన్ను చంప టానికి సాక్షాత్తు నారాయణుడే కపి రూపం లో వచ్చాడని తెలుసు కొన్నాడు .పరిగెత్తి కొండల మధ్య వున్న ”స్పటిక శిల ”చాటున దాక్కున్నాడు .వాడి వెంట బడి అక్కడికి చేరి ”గుండ క్రియా రాగం ”పాడాడు స్వామి హనుమ .ఆ రాగం తో స్పటిక శిల కరిగి నీరై పోయింది ..అక్కడున్న త్రిశూల రోముడిని వెంటనే చంపి దేవ మునులకు ఆనందం కల్గించాడు .ఈ కధ ఇంతటి తో సమాప్తం .
సశేషం