అయోధ్యకు రావణ న్సంహారం తర్వాత చేరి పట్టాభిషిక్తుడైన శ్రీ రాముడు అందరిని ఉచిత రీతి సత్కరించాడు .ఒక సారి హనుమ ను పిలిచి ”హనుమా !నీకు నేను సీతా దేవి మాత్రమే కాదు మా వంశం అంతా రుణ పడి వుంది .నీఈకు కావలసిన వరం ఇస్తాను.కోరుకో ”.అన్నాడు .దానికి హనుమ రాముడికి నమస్కరించి ”ప్రభు !నీ కృప నా మీద వుంటే చాలు అదే నాకు వర్కమ్ ”అన్నాడు .సీతా పతి ఈ మాటలు విని సంతృప్తి చెంది ,”నా ప్రార్ధన మన్నించి నేనిచ్చే వరాన్ని నువ్వు స్వీకరింపక తప్పదు .నిన్ను ఆచంద్రార్కం గా పూజించా టానికి భక్తుల కోసం ”హనుమత్పురం ”అనే గ్రామాన్ని నీకిస్తున్నాను .అందులో యజ్ఞం చేసిన సోమయాజులు శాస్త్ర పండితులు ,నిత్య కరములు వంశాచార ధర్మ పరాయణులు అందరు తమ విధులను నిర్వర్తిస్తూ నీ మంత్రాన్ని జపిస్తూ నిన్నే శరణు కోరుతూ ,నీ మీదే లక్ష్యం వుంచి సేవించే వారందరూ అక్కడ వుంటారు .”అన్నాడు .దానికి హనుమ ”నీ సేవలో నీ సమీపం లో వున్న ఆనందం నాకు ఎక్కడా లభించదు .నీ శిలా విగ్రహం వద్దే నేను వుంటాను అనుమతి నివ్వు ”అన్నాడు
హనుమత్పురం బంగారు ప్రాకారాలతో ,స్వర్ణ గృహాలతో ,ప్రకాశిస్తుంది .గోపురాలు మని మానిక్యాలతో నిర్మించ బడి వుంది .లెక్కకు మించిన వీధులు ,వెద శాస్త్ర పరాయనులతో నిండి వుంది .అన్ని రకాల ఫల వృక్షాలు వున్నాయి .వివిధ పుష్పాల తోటలనేకం వున్నాయి .ఈ పురం మీరు పర్వతానికి దక్షిణ భాగం లో పడి యోజనాల దూరం లో వుంది .బ్రాహ్మణ దేవులు అనుభవించటానికి హనుమ అన్ని సమ కూర్చి బ్రాహ్మణులు అనుభవించటానికి ఇచ్చ్చేశాడు . .14000 హనుమద్ ఆలయాలను కట్టించారు భక్తుల కోసం .నాలుగు చేతులు ,పడి చేతులు వున్న వాడిగా ,వీర రూపుడిగా ,భయంకరావతారంగా ,పంచ ముఖాలున్న వాడిగా సువర్చలా సాహితునిగా ,శాంత మూర్తి గా ,ఇలా అనేక రూపాలతో దర్శన మిచ్చాడు .కాలమ్ సుఖం గా జరిగి పోతోంది
కాల యవనుడు అనే వాడి కొడుకు దుర్ముఖుడు మదం తో విజ్రుమ్భించి హనుమత్పురాన్ని దోచుకోవటానికి సైన్యం తో వచ్చాడు .బ్రాహమనులను బెదిరించి ఆ గ్రామాన్ని తనకు అప్పగించ మని బెదిరించాడు .వారు ఆ పురాన్ని తమకు హనుమంతుడు ఇచ్చాడని అతను అనుజ్న ఇస్తేనే అక్కడి నుంచి కదులు తామని అంత దాకా హనుమత్పురాన్ని వదలమని గట్టిగా చెప్పారు .దీనికి కోపం పొందిన దుర్ముఖుడు ”హనుమంతు డెవ్వడు ?నేనే లోక ప్రభువును .అందరు నన్నే పూజించాలి మిమ్మల్ని చంపాను గ్రామ వదిలి వెళ్లి పొండి ”అన్నాడు .ఆ మాటలు విన్న విప్రులు ”సరే రేపు తప్పక ఖాళీ చేసి వెళ్తాం ”అన్నారు .చేసేది లేక భక్తీ శ్రద్ధలతో హనుమను కొందరు ప్రార్ధించారు .కొందరు మాలా జపం చేశారు .నిరాహారం గా హనుమంతుని ధ్యానించారు .ఆ రాత్రి అందులో ఒక బ్రాహ్మనోత్తముడికి హనుమ కలలో క్కన్పిన్చి రెండు శ్లోకాలు విని పించాడు
”మాన్ధాతా చ మహీ పథిహ్ కృత యుగాలన్కార భూతో గతః –సేతురఎన మహౌదదౌ విరచితః క్వాసా దశాశ్యాన్తకః
అన్యే చాపి యుధిష్టిర ప్రభ్రుతయః తే కీర్తి శేషం గతాః –నికే నాపి సమం గతా వసుమతి నూనం త్వయాయాస్యతి
ఆత్మ దత్తాప హార యః శ్మశ్రో ర్నీచ తరో హిసః -అన్యిస్తూ చర్దితం భుంక్తే న స్వాత్మ చర్దితం క్వచిత్ ”
ఈ రెండు శ్లోకాలు వాడికి చెబితే వాడు మీ జోలికి రాడు అని అభయం చెప్పాడు కలలో .
దీని భావం ఏమిటంటే క్రుతయుగానికే అలంకారుడైన మాంధాత గతించాడు .మహాసేతువు నిర్మించి పడి తలల రావణున్ని చంపినా రాముదిప్పుడున్నాడా /యుధిష్ఠిరుడు మొదలైన వారు కూడా కీర్తి శేషులైనారు వారితో ఎవ్వరి తోనూ ఈ భూమి వెళ్ళ లేదని తెలుసుకో .ఈ భూమి ఏ ఒక్కరి సొత్తు కాదు .తాను ఇచ్చ్చిన దానిని అపహర్న్చే వాడు నీచుడు .ఇతరులు కక్కిన దాన్ని ఎవరైనా అనుభవిస్తారు .కాని తానె కక్కిన దాన్ని ఎవడు అనుభవిస్తాడు ?/
ఆ ప్రకారమే వీరంతా కలిసి దుర్ముఖుడికి చెప్పారు .వాడికి కోపం రెచ్చి తక్షణం ఖాళీ చేయమని మల్లీబెదిరించాడు .వాళ్ళు మర్నాడు చేస్తాం అన్నారు .
దుఖం తోచేష్ట లుడిగి కూర్చున్నారు .అప్పుడు హనుమ అదృశ్యం గా వుంది ”నేను భక్తులను రక్షించే వాడినని మీకు తెలుసు .నాకు మీరే ఆత్మీయులు ”అని వినిపించాడు .మళ్ళీ హనుమ ధ్యానం చేశారు .హనుమ దయాలుడై దుర్ముఖుడు వున్న వైపు కు కదిలాడు .ఆ మహా వానరున్ని చూసిన అతని సైన్యం దుర్ముఖుడికి నీతి బోధించారు .బ్రాహ్మణులు హనుమద్ భక్తులని వాళ్ల జోలికి వెళ్తే మాది పోక తప్పదని హితవు చెప్పారు .హనుమ మా పరాక్రమాన్ని వివరంగా వర్ణించి చెప్పారు .వాళ్ల మాట విన్న వాడు సైన్యాన్ని దూరం గా పొమ్మన్నాడు .ఆ రాత్రి హనుమంతుడు ఒక పర్వతాన్ని పెకలించి తెచ్చి ఇదివరకు సైనికులున్న చోట ఉంచాడు .సైన్యం అక్కడి నుంచి వెళ్లి నట్లు హనుమ కు తెలియదు .దుర్ముఖుని సైన్యం దాన్ని చూసి అక్కడ వుంది వుంటే దాని కింద పడి పచ్కాది పచ్చడి అయ్యే వాళ్ళం అనుకొన్నారు .దుర్ముఖుడు కూడా హనుమ పరాక్రమం తెలిసి బ్రాహ్మను లందర్నీ రప్పించి వారికేమీ భయం వద్దని హనుమంతుడు వారిని చల్లగా కాపాడుటాడని తనకు హనుమత్పురం మీద ఆశ లేదని యహా ప్రకారం ఆ పురం లో యధేచ్చ గా ఉండమని కోరాడు .తన దుష్ట వర్తనానికి క్షమాపణ చెప్పుకొన్నాడు . .అంటే కాదు అనేక ధన కనక వస్తు వాహనాలను వారికి దానం గా అండ జేశాడు .వారందరూ అతన్ని క్షమించారు .ఆనందం గా జీవించటం మొదలు పెట్టారు .దుర్ముఖుడు తన ప్రదేశానికి బ్రాహ్మణుల అనుజ్న తీసుకొని బయలు దేరి వెళ్ళాడు .హనుమత్పురం లో విప్రులందరూ స్వర్గం లో వున్న సుఖాలన్నీ అనుభవిస్తూ అనుక్షణం హనుమ ధ్యానం తో జీవితం గడుపుతున్నారు .