Followers

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –23 హుంకార మంత్ర మహిమ


పూర్వం దేవ,దానవులకు భీకర యుద్ధం జరిగింది . .ఇరు పక్షాలలో చాలా మంది మరణించారు .ఇంద్రాది దేవత లంతా భయ పడి దాక్కొని ,,అనేక చోట్ల తిరుగు తూ బ్రహ్మ ను  వెంట పెట్టు కోని మహా విష్ణువు దగ్గరకు చేరి తమ బాధ వెళ్ళ బోసు కొన్నారు .అందర్నీ తీసుకొని హరి కైలాసం వెళ్ళాడు .పార్వతీ పరమేశ్వర సందర్శనం చేసి ఇలా స్తుతించారు .
”నమస్తే రుద్ర మన్యవుతోతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః -యాత్ర్హ ఇషు శ్శివ తమా శివం బభువతే -శివా శరణ్యయా తవ తయానో రుద్ర మ్రుడయా -యాతే రుద్ర శివా తనూ రాఘోరా పాప కాశినీ –నమస్తే అస్తు భగవాన్ ,విశ్వేశ్వ రాయ ,మహాదేవాయ త్ర్యంబకాయ ,త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ ,కాలాగ్ని రుద్రాయ ,నీల కంతాయ (kanthaaya )మ్రుత్యుంజయాయ ,సర్వేష్వ రాయ ,సదా శివాయ శ్రీ మన్మక్హా దేవాయ నమః -తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ -తన్నో రుద్ర హ ప్రచోదయాత్”
శంకరుడు పరమానందం పొంది వచ్చిన కారణం అడిగాడు .శ్రీ పతి నారాయణుడు ”శుభంకరా !శంకరా !లోకం లో దరిద్రం తాండ విస్తోంది .కరువు ,కాటకాలతో జనం అల్లాడి పోతున్నారు .నువ్వ్వు ఇచ్చిన వారాల వల్ల రాక్షసులు విజ్రుమ్భించి అందరినీ బాధిస్తున్నారు.యజ్న యాగాదులు సాగనివ్వ టం లేదు .స్త్రీ లకు రక్షణ లేదు .మానవ భక్షణ ,దేవాలయ ధ్వంసం తో వారి ఆగడాలు శృతి మించుతున్నాయి .దేవలోకాన్ని ఆక్రమించి దేవేంద్రుని తో సహా అందర్నీ తరిమేస్తే వారంతా కాంది శీకుల్లా బతుకు తున్నారు .ఆ రాక్షస మూక నుండి మమ్మల్ని అందర్నీ నువ్వే రక్షించాలి .ఆలశ్యం చేయ వద్దు ”ఆని ప్రార్ధించాడు .
”నా వరాల వల్ల నిమి మొదలైన రాక్షసులు ఇంతకూ తెగిన్చారా ?నేను వాళ్ళను చంప లేను .నేనే హను మంతుని గా జన్మించి దానవుల పాలిటి యమునిగా మారుతా. సంహరించుట మీకు తెలుసు .మీ శత్రువులు హనుమను దూషిస్తారు .ఆ దూషణం చేత దివాన్ధులు అన బడే శిబితాశానులు తేజో విహీనం అవుతారు .ఆ సమయం లో వాన రా కారుడనైన నేను ”హుంకారం ”చేస్తాను .అదే సమయం గా భావించి ,మీ రందరూ మీ ఆయుధాలతో వారిని ఎదుర్కోండి. రాక్షసు లంతా నశిస్తారు .మీ ఆధిపత్యాలు మీకు మళ్ళీ లభిస్తాసయి .”అని చెప్పి ఊరట కల్గించి వారిని పంపించే శాడు .దేవ గణం అంతా గంధ మాదన పర్వతం చేరి ,అక్కడ కొలువై ఉన్న మారుతిని సంస్తుతించారు
”శ్రీ మన్మహోదార చరిత్రా !సౌవర్ణ దేదీప్య మాన ప్రభా పూర్ణ గాత్రా !కృపా పూర్ణ నేత్రా !జగద్వంద్య కౌండిన్య గోత్రా !జగత్ప్రాణ పుత్రా !పవిత్రాన్జనా నిత్య సంతోష పాత్రా !భక్త రక్షైక దక్షా !సురాధ్యక్షా !దుర్భావ మత్తేభ హర్యక్షా !శ్రీ మత్క్రుపా పూరా పింగాక్షా !శ్రీ దాన సౌసర్వ వ్రుక్షా !సదా సాదు పక్షా !సదా దుష్ట శిక్షా !కరాగ్రాప్త మోక్షా !ముఖ స్థాన రుక్షా !నివ్రుత్తారి రక్షా !శ్రితా భీష్ట దానైక రక్షా !కపీన్ద్రా !హరీ !రామ దూతా !సదా సాదు గేయా !అమేయ ప్రభావా !ఆంజనేయా !నమస్తే నమస్తే నమః ”అని భక్తీ ఆర్తి కలిపి స్తుతించారు .హనుమ ప్రీత మానసుడై విషయం తెలుసు కోని రాక్షస సంహారానికి అందరితో బయల్దేరాడు .
దానవులు ,దేవతలను బాధిస్తూ హనుమను దూషిస్తూ శస్త్రాస్త్రాలతో హింసిస్తున్నారు .మారుతికి కోపం విజ్రుమ్భించింది .భూమి ,ఆకాశం దద్ద రిల్లె టట్లు ”హుంకారం ;”చేశాడు .దానితో రాక్ష గణం బలం తగ్గి నిర్వీర్యులవుతున్నారు .అప్పుడు హనుమ ”మూడు శిరస్సులు ,ఆరు నేత్రాలు ,వజ్రాల వంటి కోరలు ,ద్వాత్రిమ్శాద్భుజాలు ,భయంకర మై కత్తు ల వంటి  రోమాలు వున్న అతి భయంకార ఆకారం తో కని పించాడు .రాక్షసులకు భయం కలిగి కంపించి కొందరు ,నేత్రాగ్ని జ్వాలలకు ఆహుతై మరికొందరు చని పోయారు .కొందరు నెల మీద పడి తన్నుకొని చచ్చారు .కొంతమ్మంది దేవతల శాస్త్రాస్త్రాలకు బలి అయారు .ఈ విధం గా సర్వ రాక్షస సంహారం జరిగింది .లోక కంటకులు నశించ టం తో అందరు హాయిగా ఊపిరి పీల్చు కొన్నారు .హనుమను ప్రస్తుతించారు .అందరికి ఆనందం  కల్గింది .అప్పుడు ఆంజనేయుడు ”దేవతలారా !మీరు అన్ని కాలాల్లో నా ”హుమ్కారమన్త్రాన్ని ”న్యాస పూర్వకం గా జపిస్తూ సర్వ శుభాలను బలాన్ని శక్తిని  పొందండి ”అని చెప్పి అంతర్ధానమయాడు .ఇదీ హుంకార మంత్ర మహిమ .
సశేషం

Popular Posts