శ్రీ రామ చంద్రుని పట్టాషేకం తర్వాత ఆంజనేయుడు రామాజ్న తీసుకొనిగం ధ మాదన పర్వతం చేరి శ్రీ రామ మంత్ర జపం లో జీవిస్తూ ,చరి తార్ధుడు అవుతున్నాడు .రామ రావణ యుద్ధం లో తాను చాలా మంది రాక్షసులను సంహరించానని ,దాని వల్ల మహా పాతకం సంక్ర మించిందని ,దాన్ని పోగొట్టు కోవా టానికి శివున్ని సందర్శించాలని కోరిక కలిగింది . ,దాని వల్లే మనశ్శాంతి లభిస్తుందని భావించాడు .సీతా రాములకు మనస్సు లోనే నమస్కారం చేసి ,వెంటనే ఆకాశ మార్గం లో కైలాసం చేరాడు .
అక్కడ నందీశ్వరుడు అడ్డు పడి ”హనుమా !నీ ఆలోచన మంచిదే .కాని బ్రహ్మ హత్యా పాతకం తో శివ దర్శనం దుర్లభం .పాపాలను పోగొట్టు కొని శివ దర్శనం చెయ్యి .నర్మదా నది అఘ విదారిణి .అక్కడ కొన్ని రోజు లుండి స్నానం తో పవిత్రుడవు కమ్ము .శివుని గూర్చి తపస్సు చేస్తూ ఆయన అనుగ్రహం పొందు .”అని హితవు చెప్పాడు .
ఆంజనేయుడు ఆ మాటలు విని నర్మదా నది చేరి ,దాని దక్షిణ ప్రాంతం లో ఉన్నసోమ నాద దేవాలయానికి దగ్గర లో . ప్రశాంత వాతావరణం లో ఉంటూ ,స్నానం చేస్తూ శివ ధ్యానం తో తీవ్ర తపస్సు చేశాడు .ప్రాణ వాణ్ని ,పంచాక్షరిని ఏకాగ్ర చిత్తం తోజపించాడు .మనసు ను స్వాధీనం చేసుకొన్నాడు .
పార్వతీ మనోహరుడు మెచ్చి ప్రత్యక్షమయాడు .”హనుమా !నీకు పాపం అన్టు తుందా ?పాపం ఎప్పుడో పోయింది .ఎప్పుడు నువ్వు పవిత్రుడవే ”అన్నాడు .వెంటనే మారుతి లేచి నిలబడి నమస్కరించి పార వశ్యం తో స్తుతి చేసి ప్రీతీ కల్గించాడు .శివుడు హను మతో ”నీకు పాపాలు లేకున్నా ,మానవులు ఇలా ఉండాలి అని మార్గం చూపించావు .నీ తప ధ్యానాలకు చాలా సంతృప్తి చెందాను .నువ్వు సర్వ దేవాత్మకుడవు .నీ నామాన్ని స్మరిస్తూ ,జపిస్తూ,నిన్నుచూస్తూ ,అందరు సర్వదా శుభాలను పొందుతారు .హనుమ ,అంజనీ సుత ,వాయు పుత్రా ,మహా బాలా ,పింగాక్ష ,లక్ష్మణ ప్రాణ దాతా ,సీతా శోక నివర్తకా ” అని స్తుతిస్తూ అదృశ్య మై నాడు .
వాయు సూనుడు తానూ తపస్సు చేసిన చోట అన్ని కోర్కెలు తీర్చే శివ లింగాన్ని ప్రత్ష్టించాడు ..ఒక పుష్కరిణి ఏర్పాటు చేశాడు .”హను మంత వనం ”నిర్మించాడు .దానిలో అన్ని రకాల చెట్లు ,అన్ని రకాల పూల తీగెలు ,బహువిధ ఫల ములనిచ్చే వివిధ రకాల పండ్ల చెట్లు ఏర్పరచాడు .జింకలు ,గోరు వంకలు ,చిలకలు ,నెమళ్ళు ,కోకిలలు మొదలైన పక్షి జాతు లన్ని వచ్చి చేరాయి .నందన వనాన్ని మించిన సౌందర్యం తో ఆ వనం శోభిస్తోంది .అక్కడ ప్రశాంతత రాజ్యం చేస్తుంది .తపస్సు కు మిక్కిలి అనుకూలం గా ఉంది .ప్రకృతి శోభ కళ్ళకు ఆనందాన్ని చేకూరుస్తోంది .ఇదే ”హను మంతేశ్వరం ”.ఇక్కడ శివుడిని దర్శిస్తే సకల పాప హారం సకల మనో భీష్ట సిద్ధి కలుగు తాయి అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షి వివ రించి చెప్పాడు .
సశేషం -