యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే
పద విచ్చేదన: యద్ + యద్ + ఆచరతి + శ్రేష్ఠః + తద్ + తద్ + ఏవ + ఇతరః + జనః + స + యత్ + ప్రమాణః +కురుతే + లోకః + తద్ + అనువర్తతే
ప్రతి పదార్ధము:
యద్ = ఏది; యద్ = ఏది; యద్యద = ఏవేవి; ఆచరతి = ఆచరించునో; శ్రేష్ఠః = శ్రేష్టుడు, ఉత్తముడు, ఉన్నతుడు; తత్తదేవ = తద్ + తద్ + ఏవ; తద్ = దానిని; తద్ = దానిని; తత్త = ఆయా వాటిని; ఏవ = కేవలం, మాత్రము; ఇతరః = ఇతరులైన; జనః = జనులు; స = కలసి; యత్ = ఏదైతే; ప్రమాణం = ప్రమాణము, కొలబద్ద; కురుతే = తీసుకోనునో; లోకః = లోకము; తద్ = ఆవిధంగా; అనువర్తతే = అనుసరించును.
తాత్పర్యం: ఉత్తములు ఏయే వాటిని ఆచరింతురో ఆయావాటిని మాత్రమే ఇతర జనులు ప్రమాణముగా తీసుకుందురు. లోకము కూడా ఆ విధముగా అనుసరించును.