Followers

Wednesday, 17 June 2015

అంగారక దోషం

వివాహసమయంలో వదుఉవారుల జాతకాలను పరిశీలించి సరి చూసి వివాహనిర్ణయం చేయడం భారతీయ అనేక కుటుంబాలలో ఆచారంగా ఉంది. ముఖ్యంగా అంగారక దోష పరిగణన అవశ్యం. వధువుకు అంగారకుని స్థితి భర్త
స్థితికి కారకత్వంగా జ్యోతిష్కులు భావిస్తారు. మొదటగా చూడ వలసినది అంగారకుని స్థానం.
౧. అంగారకుడు.
అంగారకుడు వధూవరుల జాతకంలో రెండు, నాలుగు, ఏడు, ఎనిమిది, పన్నెండు స్థానాలలో ఉంటే దోషంగా భావిస్తారు.
కొందరు రెండవ స్థానం మినహాయిస్తారు. 
౨. అంగారక దోషలలో మినహాయింపులు ఉంటాయి. అవి వరసగా
కుజుడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు అది మిధున లేక కన్య రాసి అయినప్పుడు. ఇవి బుధుని స్థానాలుగా గుర్తించాలి.
అంగారకుడు నాలుగవ ఉన్నప్పుడు అది మేష రాసిగా ఉంటే. అంటే అంగారకుని స్వస్తనాలలో ఇది ఒకటి.
అంగారకుడు ఏడవ స్థానంలో ఉంది అది కర్కాటక రాసిగా కానీ మకర రాసిగా కానీ ఉంటే. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, మకర రాశికి శని అధిపతి.
అంగారకుడు ఎనిమిదవ స్థానంలో ఉండి అది మీనరాశిగా ఉంటే. మీన రాశి గురువు అధిపతి.
అంగారకుడు పన్నెండులో ఉండి అది వృషభ రాశి కాని, మీనరాశిగా కానీ ఉంటే. వృషభ, మీమరాశులకు అధిపతి.
అంగారకుడు కర్కాటక సింహలగ్నాలలో యోగకుజుడు ఔతాడు. కర్కాటకలగ్నానికి పదవస్థానం మేషం కనుక మేషానికి అంగారకుడు అధిపతి కనుక దోషం ఉండదు.సింహలగ్నానికి మేషం తొమ్మిదవ స్థానం మేషం కనుక మేషానికి అధిపతి అంగారకుడు కనుక ఈ రెండు లగ్నాలకు అంగారకదోషం ఉండదు.
కుంభలగ్న జాతకులకు అంగారకుడు నాలుగు మరియు ఎనిమిది స్థానాలలో ఉన్నప్పుడు. అంటే కుంభలగ్న జాతకులకు నాలుగు వృషభం, ఎనిమిది కన్య కనుక ఆ రెరండు స్థానాలలో అంగారక దోషం ఉండదు.
అంగారకుడు గురువు మరియు చంద్రులతో ఉన్నప్పుడు దోషం ఉండదు.
అంగారకుడు రవి, బుధ, శని, రాహువులతో కలసి ఉన్నప్పుడు దోషం లేదు.

Popular Posts