Followers

Tuesday 17 December 2013

మణి ద్వీప వర్ణన (10 వ భాగము )






ఓం శ్రీ గురుభ్యో నమ:
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ పరామ్బికయై నమః

ఇంద్ర నీల మణి ప్రాకారము దాటాక ,చాలా విశాలముగా ఉన్నట్టి ముక్తా ప్రాకారము వస్తుంది , ఈ ప్రాకారపు ఎత్తు పది యోజనములు .ఈ ప్రాకాపు భూమి సహితము ముక్తా మణి చే నిర్మితమైయ్యి ఉంది . ఇందులో కూడా మధ్య భాగాన , ఎనమిది దళముల కమలము ఉన్నది . ముక్తా ప్రభ్రుతి మణుల ఇట్టి కమలము కేసరాలచే ఎంతో శోభాయమానముగా ఉన్నది .

చల్లని దట్టమైన కాంతి ప్రభలతో సుందర శోభను కలిగి ఉన్నది . ఎనమిది రేకులపైన భువనేశ్వరీ దేవిలాగానేకనపడే దేవతలు ఎనమిది,రేకులపై విరాజ మానులై ఉన్నారు . వీరు అమ్మ వారి సచివలు .

అమ్మవారి మనోభావాలను యిట్టె తెలుసుకొనే సామర్థ్యము వీరికి ఉన్ది .
ఆకార ప్రాకారాలతో అమ్మవారినే పోలి ఉన్నారు . సమస్త కార్యాలను అవలీలగా నిర్వర్తించే సామర్థ్యము వీరికి ఉన్నది . అత్యంత సుందరీ మణులు , మరియు ప్రవీణులు . వీరు తమ ఘ్యానము ద్వారా సమస్త లోకాల యందు నివసించే ప్రాణుల సమాచారముతెలుసుకొని , అమ్మవారికి ఇస్తుంటారు . ఇది వీరి ప్రధాన కార్యము .

వీరి పేర్లు ఇలా ఉనాయి , అనంగ కుసుమ ,అనంగ కుసుమాతురా , అనంగ మదన,అనంగ మదనాతురా , భువన పాలా , గగన వేగా , శశిరేఖా , మరియు గగన రేఖా . వీరు ఎర్రని కాంతి తో ప్రాకాశిస్తుంటారు .వీరి హస్తములలో ,పాశం అంకుశం ,వరద ముద్ర అభయ ముద్రను చూపుతారు .ప్రతి క్షణం జగత్తుకు సంబంధిత వార్తలు భువనేశావారీ దేవికి ఇవ్వటమే వీరి ప్రధాన మయిన కార్యము .

om sree maatre namaha

Popular Posts