ఓం శ్రీ గురుభ్యో నమ:
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ పరామ్బికయై నమః
ముక్తామణి ప్రాకారము దాటాక , మహామరకత మణి ప్రాకారము వస్తున్నది . ఇది పది యోజనాలు పొడవును కలిగి ఉంది . ఇక్కడి మధ్య భూమి సహితము మహా మరకత మనణి చే నిర్మింప బడి ఉన్నది . ఇక్కడ సౌ భాగ్యాల సామగ్రి మరియు సమస్త భోగ సామగ్రులు అన్ని కలిగి ఉన్నాయి . ఈ ప్రాకారమున ఆరు కోణాలు కలిగినట్టి, భువనేశ్వరీ దేవి యంత్రము ఉన్నది .
ఇట్టి కొణాలపైన నివసించే దేవతలా పేర్లు వినండి , పూర్వ కోణం లో చతుర్ముఖ బ్రహ్మ , భగవతి గాయిత్రి దేవి వెంట , విరాజిమానుడు . కమండలము ,అక్ష సూత్రము . అభయ ముద్ర , దండము , శ్రేష్థ మగు ఆయుధాలు ధరించి ఉన్నాడు . గాయిత్రి దేవి సహితము అవే
ఆయుధాలు ధరించి ఉన్నది . వేదాలు మరియు,శాస్త్రాలు వీరితో పాటుగా నివసిస్తున్నాయి .
వీరి తో పాటుగా వ్యాహృతులు ఇక్కడే ఉన్నాయి .
నైరుతి కోణంలో శంఖ చక్రం , గదా కమలం ధరింఛి న ట్టి సావిత్రి దేవి నివాసము ఇక్కడే . విష్ణువు అదే వేషముల్ ఇక్కడే నివసిస్తారు . మత్స్య కూరం , విష్ణువు రూపాలు ఇక్కడ నివసిస్తుంటాయి .
గొడ్డలి అక్ష మాల , వరద , అభయం ముద్రలతో, రుద్రు డు వాయవ్యములో ఉంటాడు . భగవతీ సరస్వతి కూడా ఇక్కడే నివసిస్తుంటుంది . దక్షిణా మూర్తి గా , అన్ని రూపాలతో , పార్వతీ దేవీ తమ సమస్త రూపాల తో ఇక్కడ నివసిస్తున్నది . 64 ఆగమ శాస్త్రాలు , ఇక్కడే ఉన్నాయి .
కుబేరుడు తమ రెండు హస్తములలో రత్న కలశాలు పట్టుకొని , అగ్ని కొనం లో నివాసమున్తాడు . దేవీ సంపదలను కాపాడుకుంటూ ఆగ్నేయములో ఉంటాడు .
ఓం శ్రీ మాత్రే నమః …