ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ పరామ్బికయై నమః
రాజా ! మధ్యభాగాన ఉన్నదే జగజ్జనని నివాసము . నాలుగు ద్వారాలతో నిర్మించిన మండపము . ఒక్కొక్క మండపము వేయి స్తంభాలచే నిర్మించి ఉంది . కాంతి లో కోటి సూర్యులతో సమానముగా ఉన్నది . మొదటి మo డ పము శృంగార మండపము రెండకాది , ముక్తి మండపము , మూడవది , ఘ్యాన మండపము , నాలగవది , ఏకాంత మండపము .
ఈ మండపములో అనేకమైన్ట్టి చంద్రుల తాపిడి ఉన్నది , రక రకాల ధూపముల సువాసన వ్యాపించి ఉన్నాయి . ఈ మండపాలు కోటి సూర్యుల తేజము తో ప్రకాశిస్తున్నది . దీనికి నాలుగు వైపులా , కేసరాలు మల్లికలు , కుంద పుష్పాలు , తెల్లని రంగు గల పుష్పాలు ,అసంఖ్యాకముగా ఉన్నట్టి సుగంధమయ పుష్పాలు , తీగలు లతలు కేసరాలు కలిగినట్టి వింత పూవులు, ,సువాసనలు వెదజల్లుతూ అద్భుత శోభ కలిగి ఉన్నవి
వీటి పైన పరిపరి విధాల భ్రున్గాలు కూర్చొని ఉన్నాయి . పూవుల తెనేలను గ్రోలుతూ మదోన్న్తతముగా ఉన్నాయి . తీనె రుచికి మరిగిన ట్టి ఈ కీటకములు ఈ వనానికి ,చక్కని సొంపును , కలిగిస్తుంటే ,ఈ వనము , ముగ్ధ మనోహరముగా ఉన్నది . రాజహంసలు , వింతైన పక్షులు ధ్వనులు ఏంతో హాయిగా విపిస్తున్నాయి . ఇక్కడి మెట్ల పైన రత్నాలు పొదిగి ఉన్నాయి
. పక్షుల కిలకిలలు , భ్రమరాల , గుంజితాలు ,కమ్మని సువానాలు , ధూపాలు పుష్పాల సుగంధము అన్ని కలిపి మధురాను భూతి కలిగించు ఈ మణి ద్వీపము , ఏంతో మనోహరముగా ఉన్నది . ఇది శృంగార మంటపము అని చెప్పబడింది . .
ఈ శృంగార మంటపములో దేవి కూర్చొని ఉంది . సభాసదులుగా దేవతలు ఉన్నారు దేవనాo గనలు వచ్చి కూర్చున్నారు . అపరసలు ఉన్నారు , వివిధమగు గానాలతో స్వర రాగాలతో , అమ్మను స్తుతిస్తున్నారు . రెండవ మంటపము , ముక్తి మంటపము , మధ్య భాగాలలో విరాజిల్లే కరుణామూర్తి భగవతి శివ , ప్రతి ఒక్క బ్రహ్మాన్దాలలోని భక్తులకు ముక్తిని ప్రసాదించే తల్లి ,
మూడవ మంటపములో , ఘ్యాన మంటపము , భగవతీ అక్కడ కూర్చొని , ఘ్యానోపదేశము ఇస్తున్నది . నాలగవ మంటపము , లో ఎకాన్తమంతప సoఘ్యక్ నాలగవ మంటపములో భగవతి అనంగ కుసుమ ప్రజల రక్షణ విషయాలను చర్చిస్తుంటుంది
రాజా చింతామణి గృహము , అమ్మవారి యొక్క ప్రదానమైనట్టి నివాసము . అమ్మవారు మూలప్రకృతి రూపములో తమ తమ పది శక్తి తత్వాల సోపాన రూపములో ఉన్నది , భగవతి యొక్క మంచము చాల ఎత్తుగా ఉన్నది . బ్రహ్మ విష్ణు రుద్రుడు సదాశివుడు అక్కడ ఈ సున్దరమైనత్తి మంచానికి , నాలుగు కొల్ల వలే ఉన్నారు . మంచము పైన మన ఆదారాభిమాని పరమ పితా దేవదేవుడు , భువనేశ్వరుడు విరాజమానుడై ఉన్నాడు .
సృష్టి కి ఆదిలో , స్వయముగా భగవతి తానె రెండు రూపాలను ధరించి ప్రకతియైయ్ వచ్చింది . ఆ సమయాన కుడి భాగమునుండి భావనేశ్వరుడు , ఎడమ భాగాన సలిల బ్రహ్మ స్వరూపినిభువనేశ్వరి ప్రకటి తమైయ్యింది . భగవతి యొక్క అర్దాన్గుడు ఈ భగవానుడే , మహేశ్వరుడు . కామదేవుని అహంకారాన్ని దగ్ధము చేసినట్టి ఈ మహేశ్వరుడు కోటి కామదేవుల సౌన్దర్యము కలిగి ఉన్నాడు .
ఐదు ముఖాలు మూడు మూడు నేత్రాలతో శోభాయమానముగా ఉన్నడు . చింతా మణులతో విభూశితుడుగా ఉన్నాడు . తమ భుజాలలొ జింకా , అభయ ముద్ర , వరద ముద్రను పెట్టుకొని , పరసు ను ధరించి ఉన్నాడు .
అందరి పైన ఆధిపత్యము చేసేటి మాహా దేవుని వయస్సు పదహారు సంవత్సరాలవలె కనిపిస్తున్నాడు . కోట్ల కొద్ది సూర్యులవలె ప్రకాశిస్తుంటే , కోటి చంద్రులవలె చల్లగా ఉన్నాడు , అట్టి తెజములో కోటి చంద్రుల వంటి చల్లదనము ,
ప్రకాశములో కోటి సూర్యుల వంటి కాంతి . శుద్ధ స్పటిక మణి లా ప్రకాశించే భువనేశ్వరుడు , దేదీప్య మానముగా ప్రకాశిషిస్తూ , విరాజితుడై ఉన్నాడు . . తొమ్మిది రకాలుగా ఉన్న రత్నాల వడ్డాణo పెట్టుకొని భువనేశ్వరునికి వామాన్కములో కూర్చొని ఉన్నది భువనేశ్వరి దేవి . సన్నని నడుముకు వడ్డాణము ఏంతో శోభను చేకూర్చింది .
మేలిమి బంగారు భుజకీర్తులు ,వైదూర్యాలతో పొదగ బడి ఉంది అవి చేతి దండలకు ఎనలేని శోభను కలుగ చేస్తున్నాయి . భుజ కీర్తుల ఆకారము శ్రీ చక్రము వలెనె ఉన్నది .
om sree maatre namaha ,