శ్రీశుక ఉవాచ
అథ సిన్ధుసౌవీరపతే రహూగణస్య వ్రజత ఇక్షుమత్యాస్తటే తత్కులపతినా శిబికావాహ
పురుషాన్వేషణసమయే దైవేనోపసాదితః స ద్విజవర ఉపలబ్ధ ఏష పీవా యువా సంహననాఙ్గో గో
ఖరవద్ధురం వోఢుమలమితి పూర్వవిష్టిగృహీతైః సహ గృహీతః ప్రసభమతదర్హ ఉవాహ శిబికాం స
మహానుభావః
రహూగణుడనే మహారాజు కపిలుని వద్ద యోగమును పొందుదామని ఇక్షుమతీ నది దగ్గర వరకూ పల్లకీలోకి రాగా, పల్లకీ మోసేవారిలో ఒకరి అస్వస్థత ఏర్పడి ఇంకో మోసేవాడి కోసం చూస్తున్నప్పుడు అతన్ అదృష్టం బాగుండి ఇతను లభించాడు.
యదా హి ద్విజవరస్యేషుమాత్రావలోకానుగతేర్న సమాహితా పురుషగతిస్తదా విషమగతాం
స్వశిబికాం
రహూగణ ఉపధార్య పురుషానధివహత ఆహ హే వోఢారః సాధ్వతిక్రమత కిమితి విషమముహ్యతే యానమితి
బాగా దృడముగా ఉన్నాడు యువకుడు సంధి బంధములు దృఢముగా ఉన్నవాడు ఒక ఎద్దులాగ ఖరములాగ బరువు బాగా మోయగలవాడు అయిన ఇతన్ని దండం పట్టుకుని తిరుగుతూ ఉన్నవారు చూసారు. అలాంటి పనికి యోగ్యుడు కాకపోయినా దేహాత్మాభిమానం లేనివాడీన భరతుడు పల్లకీ మోసాడు
అథ త ఈశ్వరవచః సోపాలమ్భముపాకర్ణ్యోపాయతురీయాచ్ఛఙ్కితమనసస్తం విజ్ఞాపయాం
బభూవుః
న వయం నరదేవ ప్రమత్తా భవన్నియమానుపథాః సాధ్వేవ వహామః అయమధునైవ నియుక్తో
ऽపి న ద్రుతం వ్రజతి నానేన సహ వోఢుము హ వయం పారయామ ఇతి
అలవాటు లేకపోవడం వలన దూరముగా చూడటం వలన కాలు తడబడుతోంది. ఆ మేనా వంకరగా నడుస్తోంది. అది తెలుసుకుని రహూగణుడు వారిని శ్రద్ధగా మోయమని చెప్పారు. వారు ఈ ఇబ్బందంతా కొత్తవాడి వలన వచ్చిందీ అని చెప్పారు.
సాంసర్గికో దోష ఏవ నూనమేకస్యాపి సర్వేషాం సాంసర్గికాణాం భవితుమర్హతీతి నిశ్చిత్య నిశమ్య
కృపణవచో రాజా రహూగణ ఉపాసితవృద్ధోऽపి నిసర్గేణ బలాత్కృత ఈషదుత్థితమన్యురవిస్పష్టబ్రహ్మ
తేజసం జాతవేదసమివ రజసావృతమతిరాహ
అది విని రహూగణుడు పెద్దలను సేవించేవాడైనా ప్రకృతి ప్రేరణతో రజస్సూ తమస్సూ ఆవరించినవాడై కోపం వచ్చి.
అహో కష్టం భ్రాతర్వ్యక్తమురుపరిశ్రాన్తో దీర్ఘమధ్వానమేక ఏవ ఊహివాన్సుచిరం నాతిపీవా న
సంహననాఙ్గో జరసా చోపద్రుతో భవాన్సఖే నో ఏవాపర ఏతే సఙ్ఘట్టిన ఇతి బహువిప్రలబ్ధోऽప్యవిద్యయా
రచితద్రవ్యగుణకర్మాశయస్వచరమకలేవరేऽవస్తుని సంస్థానవిశేషేऽహం మమేత్యనధ్యారోపిత
మిథ్యాప్రత్యయో బ్రహ్మభూతస్తూష్ణీం శిబికాం పూర్వవదువాహ
బ్రహ్మతేజస్సు కలిగ్ ఉన్నా స్పష్టముగా అది కనపడని భరతునితో "సోదరా చాలా దూరం నుంచీ పల్లకీ ఒక్కడివే మోస్తున్నావు, ఒక్కడివే ఉన్నావు, నీకు తోడు కూడా లేరు, వృద్ధుడవూ,
అథ పునః స్వశిబికాయాం విషమగతాయాం ప్రకుపిత ఉవాచ రహూగణః కిమిదమరే త్వం
జీవన్మృతో
మాం కదర్థీకృత్య భర్తృశాసనమతిచరసి ప్రమత్తస్య చ తే కరోమి చికిత్సాం దణ్డపాణిరివ జనతాయా యథా
ప్రకృతిం స్వాం భజిష్యస ఇతి
ఇలా చాలా మాటలు అవిద్యతో అంటూ ఉంటే విని ఊరుకున్నాడు భరతుడు. ద్రవ్యమూ గుణములూ కర్మలూ అంతరంగం మనసూ ఇవన్నీ స్థూల శరీరములో ఉంటాయి. ఈ శరీరము నిజమైన వస్తువు కాదు. ఇదే నిజమైన వస్తువని అహంకారం మమకారముతో మాట్లాడుతున్నాడు. శరీరము వేరు ఆత్మ వేరు అన్న భావం స్పష్టముగా కనిపిస్తున్నా, ఆరోపించబడని శరీరాత్మ భావమును కూడా ఆరోపించినట్లుగా తీసుకుని మిధ్యలో ఉన్నాడని గమనించి బ్రహ్మజ్ఞ్యాని మారు మాట్లాడకుండా పల్లకీ మోస్తున్నాడు.
ఇంత చెప్పినా పల్లకీ మళ్ళీ వంకర గానే పోతోంది. ఈ సారి నిజముగా కోపం వచ్చి "బ్రతికి ఉండి కూడా మరణించినట్లే భావిస్తున్నవా? నన్ను నా మాటలనూ ధిక్కరించావు. యజమాని ఆజ్ఞ్యను ఉల్లంఘించావు. మత్తులో ఉన్న నిన్ను యముడిలాగ శిక్షిస్తే గాని నువ్వు దారికి రావు.
ఏవం బహ్వబద్ధమపి భాషమాణం నరదేవాభిమానం రజసా తమసానువిద్ధేన మదేన
తిరస్కృతాశేషభగవత్ప్రియనికేతం పణ్డితమానినం స భగవాన్బ్రాహ్మణో బ్రహ్మభూతసర్వభూత
సుహృదాత్మా యోగేశ్వరచర్యాయాం నాతివ్యుత్పన్నమతిం స్మయమాన ఇవ విగతస్మయ ఇదమాహ
ఇలా అన్నీ లేని మాటలే మాట్లాడాడు (శాస్త్ర న్యాయ హేతు బద్ధమూ లేని మాటలు) నేనే రాజునూ అనుకుంటూ మాట్లాడాడు. రాజు అనే సరికి వచ్చిన రజో తమో గుణాలూ మదముతో భాగవతోత్తములను ఎలా ఆదరించాలో తెలియని వాడూ, పండితుడని అనుకుంటున్న వాడు. అయిన అతనితో అన్ని ప్రాణులకూ మిత్రునిగా ఉండే మనసు గలవాడు కాబట్టి "ఇతనికి యోగమార్గమేమంత ఎక్కువ రాదు. వీడిని దారిలో పెడదామని" చిరునవ్వు నవ్వి గర్వం లేకుండా ఇలా అన్నాడు
బ్రాహ్మణ ఉవాచ
త్వయోదితం వ్యక్తమవిప్రలబ్ధం భర్తుః స మే స్యాద్యది వీర భారః
గన్తుర్యది స్యాదధిగమ్యమధ్వా పీవేతి రాశౌ న విదాం ప్రవాదః
స్థౌల్యం కార్శ్యం వ్యాధయ ఆధయశ్చ క్షుత్తృడ్భయం కలిరిచ్ఛా జరా చ
నిద్రా రతిర్మన్యురహం మదః శుచో దేహేన జాతస్య హి మే న సన్తి
నీవు చాలా అన్నావు. అది అంతా సత్యమునకు దూరముగా ఉన్నదే అయినా లోకములో అందరూ అలాగే అంటారు. కానీ బరువు మోసేవాడికి ఉంటుంది. బాగా బలిసావు అన్నావు అని ఒక మాంసం ముద్దను అన్నావు. నీవే మాంసపు ముద్దనన్నావో అదే నడిచిందా. లావు బక్కా శరీర వ్యాధి మనోవ్యాధి ముసలితనం ప్రీతి కోపం అహంకారం దుఃఖమూ దేహానికి ఉంటాయి. నేను దేహముతోనే వచ్చాను. కానీ అవేవీ నాకు లేవు. నేను మోయనప్పుడు బరువు నాకేంటి?
జీవన్మృతత్వం నియమేన రాజనాద్యన్తవద్యద్వికృతస్య దృష్టమ్
స్వస్వామ్యభావో ధ్రువ ఈడ్య యత్ర తర్హ్యుచ్యతేऽసౌ విధికృత్యయోగః
జీవన్ మృతుడనన్నావు. జీవత్వం మృతత్వం వికారం చెందే శరీరానికి ఉన్నాయి. జీవత్వానికీ మృతత్వానికీ మొదలు చివరా కలవు. అవి శరీరానికి మాత్రమే ఉంటాయి గానీ ఆత్మకు కాదు. నేను రాజునీ అన్నావు. ఎప్పుడూ నీవే రాజుగా ఉంటావా? కొన్నాళ్ళకు నీవు సేవకుడివైతే అప్పుడు కూడా నీవు రాజువని అంటావా? ఇవి మాటి మాటికీ మారుతూ ఉంటాయి. సర్వ దేశ సర్వ కాలావస్థలలో ఎవరైతే ఉంటాడో ఆయన స్వామి. పరమాత్మ స్వామి, మనం అయానకు స్వం. అందరి చేత స్తోత్రం చేయబడే పరమాత్మ యందు మాత్రమే "స్వామి" అన్నది నిత్యముగా ఉంటుంది.
విశేషబుద్ధేర్వివరం మనాక్చ పశ్యామ యన్న వ్యవహారతోऽన్యత్
క ఈశ్వరస్తత్ర కిమీశితవ్యం తథాపి రాజన్కరవామ కిం తే
ఆ పరమాత్మ విషయములోనే విధి అన్నది ఉంటుంది (ఇలా చేయి చేయవద్దూ అని చెప్పడం). ఇక్కడ ఎవరు రాజు? ఎవరు భృత్యువు? రాజు అయిన వాడు ఏం చేస్తాడు, కాని వాడేమి చేస్తాడు. కానీ వ్యవహారం అలా ఉంది. నీవు రాజువీ కాదు నేను భృత్యున్నీ కాదు
ఉన్మత్తమత్తజడవత్స్వసంస్థాం గతస్య మే వీర చికిత్సితేన
అర్థః కియాన్భవతా శిక్షితేన స్తబ్ధప్రమత్తస్య చ పిష్టపేషః
నన్ను శిక్షిస్తాను అన్నావు. శరీరానికి విఘాతం కలుగుతుంది అనుకునే వారికి అది భయం. నాకా దేహాత్మాభిమానమే లేదు. శరీర బాధను నేను బాధగానే చూడను. నీవు శిక్షిస్తే నీకేం ప్రయోజనం నాకేమి ప్రయోజనం. పిండి విసిరినట్లు ఉంటుంది. ఎందుకంటే నాకు సాంసారిక విషయాలయందు ఆసక్తే లేదు
శ్రీశుక ఉవాచ
ఏతావదనువాదపరిభాషయా ప్రత్యుదీర్య మునివర ఉపశమశీల ఉపరతానాత్మ్యనిమిత్త ఉపభోగేన
కర్మారబ్ధం వ్యపనయన్రాజయానమపి తథోవాహ
అని అనువాద పరిబాషలో చెప్పాడు.చెప్పి మౌనం వహించాడు. ఆ పల్లకీని మోసుకుంటూ వేళ్ళాడు. ఈ వాక్యాలు విన్న రహూగణుడు
స చాపి పాణ్డవేయ సిన్ధుసౌవీరపతిస్తత్త్వజిజ్ఞాసాయాం
సమ్యక్
శ్రద్ధయాధికృతాధికారస్తద్ధృదయగ్రన్థిమోచనం ద్విజవచ ఆశ్రుత్య బహుయోగగ్రన్థసమ్మతం
త్వరయావరుహ్య శిరసా పాదమూలముపసృతః క్షమాపయన్విగతనృపదేవస్మయ ఉవాచ
హృదయానికున్న గ్రంధిని పోగెట్టే బ్రాహ్మణుని "బహు యోగ గ్రధములూ జ్ఞ్యానులకూ " సమ్మతమైన వాక్యము విని ఆ మేనా నుండి అమాంతం కిందకు దూకి పాదముల మీద పడి క్షమాపణలు కోరాడు. నేను రాజునీ అన్న గర్వం పోయింది.
కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం బిభర్షి సూత్రం కతమోऽవధూతః
కస్యాసి కుత్రత్య ఇహాపి కస్మాత్క్షేమాయ నశ్చేదసి నోత శుక్లః
నీవెవరవు నిన్ను చూస్తే బ్రాహ్మణుడిలా యజ్ఞ్యోపవీతము (సూత్రం) ధరించి ఉన్నావు. నీవు అవధూతవే. పదహారు అవధూత మార్గాలలో నీవే మార్గం అవలంబిస్తున్నావు. ఎవరి వాడవు ఎక్కడుంటావు ఇక్కడికెందుకొచ్చావు. మాలాంటి వారికి తత్వ జ్ఞ్యానం కలిగించడానికి వచ్చిన్ కపిలుడి కాదు కదా?
నాహం విశఙ్కే సురరాజవజ్రాన్న త్ర్యక్షశూలాన్న యమస్య దణ్డాత్
నాగ్న్యర్కసోమానిలవిత్తపాస్త్రాచ్ఛఙ్కే భృశం బ్రహ్మకులావమానాత్
శంకరుని త్రిశూలముతో గానీ యముని పాశముతొ గానీ ఇంద్రుని వజ్రాయుధముతో గానీ, అష్ట దిక్పాలకుల ఆయుధాలనుంచీ కూడా ఎటువంటి అపాయం లేదు. బ్రాహ్మణున్ని అవమానించాలంటే నేను వణికిపోతాను. నీ యజ్ఞ్యోపవీతం చూడలేదు నేను.
తద్బ్రూహ్యసఙ్గో జడవన్నిగూఢ విజ్ఞానవీర్యో విచరస్యపారః
వచాంసి యోగగ్రథితాని సాధో న నః క్షమన్తే మనసాపి భేత్తుమ్
సంసారం యందు సంగతి లేకుణ్డా జడుడిలా నిగూఢముగా ఉన్నావు. నీ జ్ఞ్యానమెంతో మేము తెలుసుకోలేము. మీరు మాట్లాడినవన్నీ యోగ సూత్రాలు. మాలాంటి అల్ప జ్ఞ్యానులు అలాంటి వాక్యాలను భేధించగలరా.
అహం చ యోగేశ్వరమాత్మతత్త్వ విదాం మునీనాం పరమం గురుం వై
ప్రష్టుం ప్రవృత్తః కిమిహారణం తత్సాక్షాద్ధరిం జ్ఞానకలావతీర్ణమ్
తత్వజ్ఞ్యానం కలవాడు మునులలో ఉత్తముడైన కపిలుడిని అడగడానికి బయలు దేరాను. ఈ ప్రపంచములో రక్షణ ఏది అన్నది నా ప్రశ్న.
సాక్షాత్ పరమాత్మే కపిలుడిగా అవతరించాడు.
స వై భవా లోకనిరీక్షణార్థమవ్యక్తలిఙ్గో విచరత్యపి స్విత్
యోగేశ్వరాణాం గతిమన్ధబుద్ధిః కథం విచక్షీత గృహానుబన్ధః
మీర్ సాక్షాత్ కపిలుడే. మీ స్వరూపాన్ని కప్పిపుచ్చుకుని తిరుగుతున్నారా. గ్ర్హస్థాశ్రమములో సంసారములో ఉన్న నేను యోగీశ్వరుల మార్గాన్ని ఎలా తెలుసుకోగలను
దృష్టః శ్రమః కర్మత ఆత్మనో వై భర్తుర్గన్తుర్భవతశ్చానుమన్యే
యథాసతోదానయనాద్యభావాత్సమూల ఇష్టో వ్యవహారమార్గః
పనితో అలసట వస్తుంది అది శరీరానికీ కలుగుతుంది. ఆయాసం వస్తుంది. నీవు కూడా పని చేస్తున్నావు కాబట్టి ఆ పని చేసేవాడికేది వస్తుందో అదే రావాలి కదా?నేనూ అదే అడిగాను.
కుండ ఉంటే నీరు తెస్తాము. నీరు తేవట్లేదంటే కుండ లేదు అని గుర్తు. నడిస్తే అలసట వస్తుంది. అలసట ఉంటే పని కనపడుతుంది. మరి అలాంటప్పుడు లేదని ఎలా అనుకోవాలి. నీవు పని చేయకపోతే అలసట రాదు. పని చేస్తూ అలసటల్ లేదని ఎలా చెప్పుకోవాలి.
స్థాల్యగ్నితాపాత్పయసోऽభితాపస్తత్తాపతస్తణ్డులగర్భరన్ధిః
దేహేన్ద్రియాస్వాశయసన్నికర్షాత్తత్సంసృతిః పురుషస్యానురోధాత్
అన్నం వండడానికి గిన్నెలో బియ్యమూ నీరు పోస్తున్నాము. పాత్ర వేడి కావడముతో నీరు వేడి అవుతోంది, అలాగే బియ్యం ఉడుకుతోంది. ఎలా ఐతే గిన్నెలో ఉన్న నీరు వేడి అవుతోందో దేహములో ఉన్న ఆత్మకు కూడా దేహం అలసట చెందితే అలసట రాదా?.
శాస్తాభిగోప్తా నృపతిః ప్రజానాం యః కిఙ్కరో వై న పినష్టి పిష్టమ్
స్వధర్మమారాధనమచ్యుతస్య యదీహమానో విజహాత్యఘౌఘమ్
దేహానికి కలిగేవన్నీ ఆతంకూ కలగాలి కదా? ఆ రీతిలోనే నన్ను రాజనీ మిమ్ము సేవకులనీ అంటారు. అది ఉన్న విషయమే కదా? మన ధర్మాన్ని మనం ఆచరించడమే కదా భగవదారాధన. మరి అది లేదని ఎలా అంటున్నావు. పాపాన్ని పోగొట్టుకోవాలంటే ధర్మాచరణ చేయాలి. ధర్మాచరణే అచ్యుతారాధన కద.
తన్మే భవాన్నరదేవాభిమాన మదేన తుచ్ఛీకృతసత్తమస్య
కృషీష్ట మైత్రీదృశమార్తబన్ధో యథా తరే సదవధ్యానమంహః
ఇప్పటిదాకా నేనే రాజుని అన్న అభిమానం ఉండేది దానితో మిమ్ములని నిరాదరణకు గురిచేసాను. ఆర్త బంధువులైన మీరు నా మీద కరుణా కటాక్షాన్ని పడెయ్యండి. ఉన్నదీ జరుగుతున్నది అన్నట్లు అనిపించే సంసారం వలన కలుగుతున్నది. సంసారం అనే పాపాన్ని తొలగించే మీ కటాక్షం మా మీద ఉంచండి.
న విక్రియా విశ్వసుహృత్సఖస్య సామ్యేన వీతాభిమతేస్తవాపి
మహద్విమానాత్స్వకృతాద్ధి మాదృఙ్నఙ్క్ష్యత్యదూరాదపి శూలపాణిః
అజ్ఞ్యానులు మాట్లాడిన వారి మాటలకు జ్ఞ్యానులు కోపించరు. మీరే ఆగ్రహిస్తే మాలాంటి వారి గతి ఏమి కావాలి. మీరు ప్రపంచం మొత్తానికీ మిత్రులు, ప్రపంచములో మిత్రులకే మిత్రులు. ఎందుకంటే సర్వం విష్ణు మయం జగత్తు కాబట్టి. ఈ ప్రపంచమే ఒక దేవాలయం, పరమాత్మ అంతటా ఉన్నాడు. సామ్య భావనతో అభిమానన్ని వదిలిపెట్టిన మీకు ఎటువంటి అవమనానం జరగదు. స్వయం కృతముగా పెద్దలను అవమానించిన నాలాంటి వారు త్వరలోనే నశిస్తారు. శంకరుని అండ తీసుకున్న వారైనా సరే మహాత్ములను అవమానిస్తే వారు నశిస్తారు.