Followers

Wednesday, 19 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదిహేనవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
భరతస్యాత్మజః సుమతిర్నామాభిహితో యము హ వావ కేచిత్పాఖణ్డిన ఋషభ
పదవీమనువర్తమానం చానార్యా అవేదసమామ్నాతాం దేవతాం స్వమనీషయా పాపీయస్యా కలౌ కల్పయిష్యన్తి

భరతుని కుమారుడు సుమంతుడు. ఆయన తన తాతగారైన ఋషభుని మార్గాన్ని అవలంబించాడు. ఆయన మార్గం సరిగా అర్థం కాక చాలా మంది పాఖండులు (పాప చిహ్నములు కలవారు) వేదములో చెప్పబడని కొత్త దేవత పేరు చెప్పేసారు. దానినే బుద్ధుడన్నారు. బుద్ధుడే సుమతిగా అవతరించాడన్నారు. సుమంతుని యోగ మార్గం వీరికి అర్థం కాక ఈయనను బుద్ధుడనుకున్నారు. బౌద్ధము వేద బాహ్యం.  

తస్మాద్వృద్ధసేనాయాం దేవతాజిన్నామ పుత్రోऽభవత్

ఇతనికి వృద్ధసేనతో దేవతాజిత్ అని కుమారుడు కలిగాడు. 

అథాసుర్యాం తత్తనయో దేవద్యుమ్నస్తతో ధేనుమత్యాం సుతః
పరమేష్ఠీ తస్య సువర్చలాయాం ప్రతీహ ఉపజాతః

య ఆత్మవిద్యామాఖ్యాయ స్వయం సంశుద్ధో మహాపురుషమనుసస్మార

ప్రతీహాత్సువర్చలాయాం ప్రతిహర్త్రాదయస్త్రయ ఆసన్నిజ్యాకోవిదాః సూనవః ప్రతిహర్తుః
స్తుత్యామజ భూమానావజనిషాతామ్

అతనికి దేవద్య్మ్నుడు, అలా ఐదో తరం తరువాత ప్రతీహుడనే వాడు యోగమార్గముతో పరమాత్మని ధ్యానిస్తూ ఆయనలో చేరాడు.ఇతనికి సువర్చల యందు ముగ్గురు కుమారులుకలిగారు. వీరందరూ యజ్ఞ్యములో నిపుణులు. 

భూమ్న ఋషికుల్యాయాముద్గీథస్తతః ప్రస్తావో దేవకుల్యాయాం ప్రస్తావాన్నియుత్సాయాం
హృదయజ ఆసీద్విభుర్విభో రత్యాం చ పృథుషేణస్తస్మాన్నక్త ఆకూత్యాం జజ్ఞే నక్తాద్ద్రుతిపుత్రో గయో రాజర్షిప్రవర
ఉదారశ్రవా అజాయత సాక్షాద్భగవతో విష్ణోర్జగద్రిరక్షిషయా గృహీతసత్త్వస్య కలాత్మవత్త్వాదిలక్షణేన
మహాపురుషతాం ప్రాప్తః

స వై స్వధర్మేణ ప్రజాపాలనపోషణప్రీణనోపలాలనానుశాసనలక్షణేనేజ్యాదినా చ భగవతి
మహాపురుషే పరావరే బ్రహ్మణి సర్వాత్మనార్పితపరమార్థలక్షణేన బ్రహ్మవిచ్చరణానుసేవయాపాదిత
భగవద్భక్తియోగేన చాభీక్ష్ణశః పరిభావితాతిశుద్ధమతిరుపరతానాత్మ్య ఆత్మని
స్వయముపలభ్యమానబ్రహ్మాత్మానుభవోऽపి నిరభిమాన ఏవావనిమజూగుపత్

నక్తునికి దృతి వలన గయుడు కలిగాడు. ఇతను రాజర్షులలో శ్రేష్టుడు, మంచి కీర్తి కలవాడు. సకల జగత్తునూ రక్షించాలన్న సంకల్పముతో పరమాత్మ తన అంశను ఇతనిలో నిక్షిప్తం చేసాడు. ఇతనికి ఆత్మ తత్వజ్ఞ్యానం బాగా కలిగింది. ఇతను మహా పురుషుడు. రాజుగా ప్రజాపాలన, యజ్ఞ్యయాగాలు చేసాడు, క్షత్రియునిగా యుద్ధమూ చేసాడు, పుత్రునిగా పితృ కర్మలూ చేసాడు. ప్రజలకు ప్రీతి కలిగించాడు, పాలించాడు పోషించాడు, అనుశాసించాడు, లాలించాడు.
యజ్ఞ్యాదులు (పంచ యజ్ఞ్యాలతో) చేస్తూ పరమాత్మను ఆరాధించాడు. బ్రాహ్మణుల పాద సేవ వలన కలిగిన పరమాత్మ భక్తితో మాటి మాటికీ దేహమే ఆత్మ అన్న భ్రమను తొలగించుకుని పరబ్రహ్మానుభవం బ్రహ్మానుభవం ఆత్మానుభవముతో  

తస్యేమాం గాథాం పాణ్డవేయ పురావిద ఉపగాయన్తి

ఆ గయుని యొక్క ప్రభావం చెప్పే ఈ గాధను ప్రాచీనులు ఇలా పాడుతున్నారు

గయం నృపః కః ప్రతియాతి కర్మభిర్యజ్వాభిమానీ బహువిద్ధర్మగోప్తా
సమాగతశ్రీః సదసస్పతిః సతాం సత్సేవకోऽన్యో భగవత్కలామృతే

గయున్ని ఎవరు అనుసరించగలరు. యజ్ఞ్యములంటే ప్రీతి కలవాడు, చాలా విషయాలు తెలిసినవాడూ, తెలిసిన దాన్ని ఆచరించేవాడు. పరమాత్మానుగ్రహాన్ని బాగా పొందినవాడు. సకల పతి ఆయనే. సజ్జనులని సేవిస్తాడు. ఇన్ని లక్షణాలు కలవారు పరమాత్మ తప్ప ఎవరై ఉంటాడు 

యమభ్యషిఞ్చన్పరయా ముదా సతీః సత్యాశిషో దక్షకన్యాః సరిద్భిః
యస్య ప్రజానాం దుదుహే ధరాశిషో నిరాశిషో గుణవత్సస్నుతోధాః

దక్షుని కుమార్తెలైన పదహారు మంది ఇతనికి పరమానందముతో పట్టభిషేకం చేసారు. ఈ పదహారు మందీ గయున్ని సేవించారు. గయుడు ఎలాంటి కోరికా లేని విరక్తుడు. ఏమీ ఆశించని గయుని యొక్క ప్రజలకు అడగకుండానే భూదేవి అన్నీ ఇచ్చింది. భూదేవిని గోవుతో పోలుస్తారు. ఏ గోవైనా దూడ తన పొదుగు దగ్గర నోరు పెడితేనే పాలిస్తుంది. అలాగే భూమి కూడా గయుని యొక్క గుణాలనే దూడలచే పొదుగులతో ప్రజలు కోరినవన్నీ ప్రసాదించినది 

ఛన్దాంస్యకామస్య చ యస్య కామాన్దుదూహురాజహ్రురథో బలిం నృపాః
ప్రత్యఞ్చితా యుధి ధర్మేణ విప్రా యదాశిషాం షష్ఠమంశం పరేత్య

వేదములు కూడా అతను ఏమీ కోరలేదు కాబట్టి, అతని ప్రజలకు కావలసినవన్నీ అతని కోరికలుగా భావించి ప్రసాదించాయి. ప్రజలడిగినప్పుడల్లా వర్షించాయి. వేద మాత ఆశీర్వాదం వలన అన్నీ ప్రసాదించాయి. ఈయన యుద్ధములో శత్రువులను ఆరాధించగానే యుద్ధములో శత్రురాజులు ఆయంకు కానుకలు ఇచ్చారు. ధర్మముతో విప్రులు ఆరాధించబడి ఆశీస్సులు ఇచ్చారు. వారి తపస్సునుంచి ఆరవ భాగం రాజుకు ఇచ్చారు. 

యస్యాధ్వరే భగవానధ్వరాత్మా మఘోని మాద్యత్యురుసోమపీథే
శ్రద్ధావిశుద్ధాచలభక్తియోగ సమర్పితేజ్యాఫలమాజహార

గయుడు యజ్ఞ్యం చేసి సోమ యాగములు చేసాడు. ఇతను చేసిన సోమ యాగముతో సోమ రసాన్ని ఆహుతి రూపములో పానం చేసిన ఇంద్రుడు మత్తులో మునిగిపోయాడు. నారాయణుడు స్వయముగా వచ్చి తన భాగాన్ని తీసుకున్నాడు. సాధారణముగా విష్ణువుకిచ్చిన హవిస్సును ఇంద్రాదులు తీసుకుని వెళ్ళి అర్పిస్తారు. ఇంద్రుడే మత్తులో ఉండుట వలనా, గయుడు ధర్మ పద్దతిలో పరమాత్మార్పణముగా అన్ని పనులూ చేస్తున్నాడు కాబట్టి విష్ణువే స్వయముగా వచ్చి భాగాన్ని తీసుకున్నాడు.  

యత్ప్రీణనాద్బర్హిషి దేవతిర్యఙ్ మనుష్యవీరుత్తృణమావిరిఞ్చాత్
ప్రీయేత సద్యః స హ విశ్వజీవః ప్రీతః స్వయం ప్రీతిమగాద్గయస్య

పరమాత్మ ప్రీతి చెందితే వరకూ సకల చరాచర జగత్తూ ప్రీతి చెందుతుంది.అలాంటి పరమాత్మ గయుడు చేసిన యజ్ఞ్యముతో ప్రీతి పొద్నాడు. 
గయుడు సాక్షాత్ పరమాత్మనే సంతోషపెట్టినవాడయ్యాడు

గయాద్గయన్త్యాం చిత్రరథః సుగతిరవరోధన ఇతి త్రయః పుత్రా బభూవుశ్చిత్రరథాదూర్ణాయాం
సమ్రాడజనిష్ట తత ఉత్కలాయాం మరీచిర్మరీచేర్బిన్దుమత్యాం బిన్దుమానుదపద్యత తస్మాత్సరఘాయాం
మధుర్నామాభవన్మధోః సుమనసి వీరవ్రతస్తతో భోజాయాం మన్థుప్రమన్థూ జజ్ఞాతే మన్థోః
సత్యాయాం భౌవనస్తతో దూషణాయాం త్వష్టాజనిష్ట త్వష్టుర్విరోచనాయాం విరజో విరజస్య శతజిత్ప్రవరం పుత్ర
శతం కన్యా చ విషూచ్యాం కిల జాతమ్

ఈయనకి ముగ్గురు కొడుకులు పుట్టారు. ఇలా వరుసలో విరజునితో భరత వంశము సమాప్తము. ఈయనకి నూరుగురు కొడుకులూ ఒక అమ్మాయి. 

తత్రాయం శ్లోకః
ప్రైయవ్రతం వంశమిమం విరజశ్చరమోద్భవః
అకరోదత్యలం కీర్త్యా విష్ణుః సురగణం యథా

దేవతలందరికీ ప్రీతి కలిగించే ప్రియవ్రతుని వంశములో చివరి వాడు విరజుడు. పరమాత్మ కీర్తిని భూమండలములో వ్యాపింపచేసిన వాడు విరజుడు 

Popular Posts