Followers

Thursday, 20 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవయ్యవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
అతః పరం ప్లక్షాదీనాం ప్రమాణలక్షణసంస్థానతో వర్షవిభాగ ఉపవర్ణ్యతే

జమ్బూద్వీపోऽయం యావత్ప్రమాణవిస్తారస్తావతా క్షారోదధినా పరివేష్టితో యథా
మేరుర్జమ్బ్వాఖ్యేన
లవణోదధిరపి తతో ద్విగుణవిశాలేన ప్లక్షాఖ్యేన పరిక్షిప్తో యథా పరిఖా బాహ్యోపవనేన ప్లక్షో జమ్బూ
ప్రమాణో ద్వీపాఖ్యాకరో హిరణ్మయ ఉత్థితో యత్రాగ్నిరుపాస్తే సప్తజిహ్వస్తస్యాధిపతిః ప్రియవ్రతాత్మజ
ఇధ్మజిహ్వః స్వం ద్వీపం సప్తవర్షాణి విభజ్య సప్తవర్షనామభ్య ఆత్మజేభ్య ఆకలయ్య స్వయమాత్మ
యోగేనోపరరామ

జంబూ ద్వీపం ఎంత పొడవూ వెడల్పూ వైశాల్యమూ ఉన్నదో అంత కొలతా ఉన్న ఉప్పు సముద్రం జంబూ ద్వీపం చుట్టూ ఉంది. మేరు పర్వతం జంబూ ద్వీపముతో ఆవరించబడి ఉనట్లుగా ఉప్పు సముద్రం కూడా దాని కంటే రెండు రెట్లు వైశాల్యం ఉన్న ప్లక్ష ద్వీపముతో ఆవరించబడి ఉన్నది . అంబూ ద్వీపమూ దాని చుట్టూ లవణ సముద్రం, దాని చుట్టూ ప్లక్షం. ద్వీపమూ - సముద్రమూ - ద్వీపము. ద్వీపానికి సముద్రము హద్దు, సముద్రానికి ద్వీపం హద్దు. ప్లక్ష ద్వీపములో ఏడు నాలికలు గల అగ్ని ఆరాధించబడతాడు. ప్రియవ్రతుని కుమారుడైన ఇద్మ జిహ్వుడు ఆరాధిస్తాడు. ప్లక్ష ద్వీపాన్ని ఏడూ వర్షాలుగా విభజించి, ఏడు కుమారుల పేర్లు వాటికి పెట్టి, వారికి అవి పెంచి; పరమాత్మను ఆరాధించడానికి వెళ్ళిపోయాడు

శివం యవసం సుభద్రం శాన్తం క్షేమమమృతమభయమితి వర్షాణి తేషు గిరయో నద్యశ్చ
సప్తైవాభిజ్ఞాతాః
శివం యవసం సుభద్రం శాన్తం క్షేమమమృతమభయమితి - ఈ ఏడూ వర్షాలు 
మణికూటో వజ్రకూట ఇన్ద్రసేనో జ్యోతిష్మాన్సుపర్ణో హిరణ్యష్ఠీవో మేఘమాల ఇతి సేతుశైలాః - ఇవి పర్వతాలూ 
అరుణా
నృమ్ణాఙ్గిరసీ సావిత్రీ సుప్తభాతా ఋతమ్భరా సత్యమ్భరా ఇతి మహానద్యః - ఇవి మహానదులు యాసాం జలోపస్పర్శనవిధూతరజస్
తమసో హంసపతఙ్గోర్ధ్వాయనసత్యాఙ్గసంజ్ఞాశ్చత్వారో వర్ణాః సహస్రాయుషో విబుధోపమసన్దర్శన
ప్రజననాః స్వర్గద్వారం త్రయ్యా విద్యయా భగవన్తం త్రయీమయం సూర్యమాత్మానం యజన్తే

ఈ నదుల జలమును స్పృశిస్తే అన్ని పాపాలూ తొలగిపోతాయి. ఈ ద్వీపములో నాలుగు జాతులున్నాయి. హంస, పతంగ ఊర్ధ్వాయన సత్యాంగ అనే వర్ణాలున్నాయి. పరమాత్మ వేద మంత్రాలతో సూర్య భగవానుని ఆరాధిస్తారు 

ప్రత్నస్య విష్ణో రూపం యత్సత్యస్యర్తస్య బ్రహ్మణః
అమృతస్య చ మృత్యోశ్చ సూర్యమాత్మానమీమహీతి

ఇది సూర్య భగవానుని మంత్రం.
సనాతనుడైన పరమాత్మ, సత్యుడు మంగళ కరుడు. పరమాత్మ మోక్షానికీ సంసారమునకూ ఆత్మ పుట్టాలన్నా పుట్టిన వారు బతకాలన్నా బతికిన వారు మరణించాలన్నా సూర్యుడే మూలం. అటువంటి సూర్యున్ని ఆరాధిస్తున్నాము. ప్లక్ష్యాది ద్వీపాలలో పుట్టినప్పటినుంచే ఇంద్రియ బలం మొదలైనవి ఉంటాయి.

ప్లక్షాదిషు పఞ్చసు పురుషాణామాయురిన్ద్రియమోజః సహో బలం బుద్ధిర్విక్రమ ఇతి చ
సర్వేషామౌత్పత్తికీ సిద్ధిరవిశేషేణ వర్తతే

ఈ ద్వీపాలలో శక్తి తరుగుటలేదు. చెరుకు రసము గల సముద్రం.ఇక్కడ శాల్మలీ వృక్షం, దాని చుట్టూ సురా సముద్రం ఉంటుంది 

ప్లక్షః స్వసమానేనేక్షురసోదేనావృతో యథా తథా ద్వీపోऽపి శాల్మలో ద్విగుణవిశాలః సమానేన
సురోదేనావృతః పరివృఙ్క్తే

యత్ర హ వై శాల్మలీ ప్లక్షాయామా యస్యాం వావ కిల నిలయమాహుర్భగవతశ్ఛన్దఃస్తుతః పతత్త్రి
రాజస్య సా ద్వీపహూతయే ఉపలక్ష్యతే

ఈ శాల్మలీ ద్వీపం ప్లక్ష ద్వీపం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. గరుడున్ని ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు. ప్రియవ్రతుని కుమారుడైన యజ్ఞ్యబాహువు అధిపతి. ఇతను కూడా ఈ వర్షాన్ని ఏడు భాగాలు చేసి ఏడు వర్షాలను ఏడుగురు కొడుకులకు ఇచ్చాడు.

తద్ద్వీపాధిపతిః ప్రియవ్రతాత్మజో యజ్ఞబాహుః స్వసుతేభ్యః సప్తభ్యస్తన్నామాని సప్తవర్షాణి
వ్యభజత్సురోచనం సౌమనస్యం రమణకం దేవవర్షం పారిభద్రమాప్యాయనమవిజ్ఞాతమితి

తేషు వర్షాద్రయో నద్యశ్చ సప్తైవాభిజ్ఞాతాః స్వరసః శతశృఙ్గో వామదేవః కున్దో ముకున్దః పుష్ప
వర్షః సహస్రశ్రుతిరితి అనుమతిః సినీవాలీ సరస్వతీ కుహూ రజనీ నన్దా రాకేతి

ఏడు పర్వతాలూ ఏడు నదులూ ఉన్నాయి 

తద్వర్షపురుషాః శ్రుతధరవీర్యధరవసున్ధరేషన్ధరసంజ్ఞా భగవన్తం వేదమయం
సోమమాత్మానం వేదేన యజన్తే

ఇక్కడ ఉండే వర్ణాల పేర్లు: శ్రుతధరవీర్యధరవసున్ధరేషన్ధర. ఇక్కడ చంద్రున్ని ఆరాధిస్తారు వేద మంత్రాలతో.. 

స్వగోభిః పితృదేవేభ్యో విభజన్కృష్ణశుక్లయోః
ప్రజానాం సర్వాసాం రాజా న్ధః సోమో న ఆస్త్వితి

తన కిరణములతో దేవతలకూ పితృదేవతలకూ ఆహారమిస్తాడు. శుక్లపక్షములో దేవతలకూ కృష్ణ పక్షములో పితృదేవతలకూ (అంధః అంటే ఆహారం)ఆహారం ఇస్తాడు కాబట్టి రాజు 

ఏవం సురోదాద్బహిస్తద్ద్విగుణః సమానేనావృతో ఘృతోదేన యథాపూర్వః కుశద్వీపో
యస్మిన్కుశ
స్తమ్బో దేవకృతస్తద్ద్వీపాఖ్యాకరో జ్వలన ఇవాపరః స్వశష్పరోచిషా దిశో విరాజయతి

దానికి రెట్టింపుగా ఘృత సముద్రం, అందులో కుశ ద్వీపం, అందులో ఒక కుశ (దర్భ) వృక్షముంది. మరొక అగ్ని హోత్రునిలా తన కాంతితో అన్ని దిక్కులనీ ప్రకాశింపచేస్తుంది. ప్రియవ్రతుని కుమారుడైన హిరణ్యరేతుడు తన ఏడుగురు కొడుకులకీ ఏడు భాగాలూ ఇచ్చి  తపస్సుకి వెళ్ళిపోయాడు 

తద్ద్వీపపతిః ప్రైయవ్రతో రాజన్హిరణ్యరేతా నామ స్వం ద్వీపం సప్తభ్యః స్వపుత్రేభ్యో యథా
భాగం విభజ్య స్వయం తప ఆతిష్ఠత వసువసుదానదృఢరుచినాభిగుప్తస్తుత్యవ్రతవివిక్తవామదేవ
నామభ్యః

తేషాం వర్షేషు సీమాగిరయో నద్యశ్చాభిజ్ఞాతాః సప్త సప్తైవ చక్రశ్చతుఃశృఙ్గః కపిలశ్చిత్రకూటో
దేవానీక ఊర్ధ్వరోమా ద్రవిణ ఇతి రసకుల్యా మధుకుల్యా మిత్రవిన్దా శ్రుతవిన్దా దేవగర్భా ఘృతచ్యుతా
మన్త్రమాలేతి

 చక్రశ్చతుఃశృఙ్గః కపిలశ్చిత్రకూటో దేవానీక ఊర్ధ్వరోమా ద్రవిణ - వర్షములూ
రసకుల్యా మధుకుల్యా మిత్రవిన్దా శ్రుతవిన్దా దేవగర్భా ఘృతచ్యుతా మన్త్రమాలేతి - నదులు 

యాసాం పయోభిః కుశద్వీపౌకసః కుశలకోవిదాభియుక్తకులకసంజ్ఞా భగవన్తం జాతవేద
సరూపిణం కర్మకౌశలేన యజన్తే

కుశద్వీపౌకసః కుశలకోవిదాభియుక్త - ఇవి వర్ణాలు 

పరస్య బ్రహ్మణః సాక్షాజ్జాతవేదోऽసి హవ్యవాట్
దేవానాం పురుషాఙ్గానాం యజ్ఞేన పురుషం యజేతి

ఈ ద్వీపములో అగ్నిహోత్రుడు ప్రధాన దైవం. ఈయన జాత వేదుడు - వేదం దేనితో పుట్టినదో. నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వస్వరూపాన్ని తెలిపేవాడవు, హవ్యాన్ని వహించేవాడవు.దేవతలను కాదు. దేవతల పేరుతో ఉన్న పరమాత్మ యొక్క అవయవాలను యజ్ఞ్యమనే పేరుతో ఆరాధిస్తున్నాము. పరమాత్మ అవయవాలుగా ఉన్న ఇతర దేవతలను ఆరాధిస్తున్నాము. అవయవాలకు చేసిన ఆరాధన అవయవే పొందుతాడు. వీటిని అగ్ని హోత్రుడే మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన పేరు జాత వేద

తథా ఘృతోదాద్బహిః క్రౌఞ్చద్వీపో ద్విగుణః స్వమానేన క్షీరోదేన పరిత ఉపక్లృప్తో వృతో యథా
కుశద్వీపో ఘృతోదేన యస్మిన్క్రౌఞ్చో నామ పర్వతరాజో ద్వీపనామనిర్వర్తక ఆస్తే

క్రౌంచ ద్వీపం తన కన్నా పూర్వం ఉన్న ద్వీపముల కన్నా రెండింతలు ఉండి పాల సముద్రముతో వ్యాపించి ఉంటుంది. కుశ ద్వీపం ఘృత సముద్రముతో ఉన్నట్లు ఈ ద్వీపం క్షీర సముద్రముతో ఉంటుంది. ఇక్కడుండే పర్వతం పేరు క్రౌంచ పర్వతం. 

యోऽసౌ గుహప్రహరణోన్మథితనితమ్బకుఞ్జోऽపి క్షీరోదేనాసిచ్యమానో భగవతా
వరుణేనాభిగుప్తో
విభయో బభూవ

ఈ క్రౌంచ పర్వతమును కుమారస్వామి తన శూలముతో కొట్టగా ఆ పైభాగం గాయపడింది. అలా గాయపడిన దాన్ని పరమాత్మ క్షీరసముద్రములో ఉన్న పాలతో బాగు చేయగా ఇప్పుడు మరలా ప్రకాశిస్తోంది. వరుణుడు కాపడగా ఇపుడు భయము లేనిదై ఉన్నది

తస్మిన్నపి ప్రైయవ్రతో ఘృతపృష్ఠో నామాధిపతిః స్వే ద్వీపే వర్షాణి సప్త విభజ్య తేషు పుత్రనామసు
సప్త రిక్థాదాన్వర్షపాన్నివేశ్య స్వయం భగవాన్భగవతః పరమకల్యాణయశస ఆత్మభూతస్య
హరేశ్చరణారవిన్దముపజగామ

దీన్ని పరిపాలించేవాడు ప్రియవ్రతుని కుమారుడు ఘృతపృష్ఠ. ఇతను కూడా ఏడుగా విభజించి ఏడుగురికి ఏడు వర్షాలిచ్చి రాజ్యాన్ని వారికి వదిలి పరమాత్మను ఆరాధిస్తున్నాడు. వారి కొడుకుల పేర్లతోటే వర్షాల పేర్లు ఉన్నాయి. 

ఆమో మధురుహో మేఘపృష్ఠః సుధామా భ్రాజిష్ఠో లోహితార్ణో వనస్పతిరితి
ఘృతపృష్ఠసుతాస్తేషాం
వర్షగిరయః సప్త సప్తైవ నద్యశ్చాభిఖ్యాతాః శుక్లో వర్ధమానో భోజన ఉపబర్హిణో నన్దో నన్దనః
సర్వతోభద్ర ఇతి అభయా అమృతౌఘా ఆర్యకా తీర్థవతీ రూపవతీ పవిత్రవతీ శుక్లేతి

దీనికీ ఏడు నదులూ పర్వతాలూ ఉన్నాయి.  ఇక్కడ పురుష వృషభ ద్రవిణా దేవ అని నాలుగు వర్ణాలు. ఇక్కడ వరుణ దేవతని ఆరాధిస్తారు 

యాసామమ్భః పవిత్రమమలముపయుఞ్జానాః పురుషఋషభద్రవిణదేవకసంజ్ఞా వర్షపురుషా
ఆపోమయం దేవమపాం పూర్ణేనాఞ్జలినా యజన్తే

ఆపః పురుషవీర్యాః స్థ పునన్తీర్భూర్భువఃసువః
తా నః పునీతామీవఘ్నీః స్పృశతామాత్మనా భువ ఇతి

జలమంటే పరమాత్మ వీర్యము (శక్తి). ఈ జలమే మూడు లోకాలనూ పునీతం చేస్తుంది. ఈ జలం పాపమును (అమీవ) హరిస్తుంది (అమీవఘ్ని). నదీ స్నానం వలన గ్రహబాధలు పోతాయి. 

ఏవం పురస్తాత్క్షీరోదాత్పరిత ఉపవేశితః శాకద్వీపో ద్వాత్రింశల్లక్షయోజనాయామః సమానేన చ
దధిమణ్డోదేన పరీతో యస్మిన్శాకో నామ మహీరుహః స్వక్షేత్రవ్యపదేశకో యస్య హ మహాసురభి
గన్ధస్తం ద్వీపమనువాసయతి

దాని చుట్టూ ఉండే ద్వీపం శాఖ ద్వీపం. ఇక్కడ పెరుగు సముద్రం, శాక వృక్షం ఉంటుంది. ఆ సువాసన వ్యాపించి ఉంటుంది . 

తస్యాపి ప్రైయవ్రత ఏవాధిపతిర్నామ్నా మేధాతిథిః సోऽపి విభజ్య సప్త వర్షాణి పుత్రనామాని తేషు
స్వాత్మజాన్పురోజవమనోజవపవమానధూమ్రానీకచిత్రరేఫబహురూపవిశ్వధార
సంజ్ఞాన్నిధాప్యాధిపతీన్స్వయం భగవత్యనన్త ఆవేశితమతిస్తపోవనం ప్రవివేశ

మేధాతిథిః అనే ప్రియవ్రతుని పుత్రుడు ఏడు వర్షాలుగా విభజించి ఏడుగుర్ కొడుకులకు ఇచ్చారు.

ఏతేషాం వర్షమర్యాదాగిరయో నద్యశ్చ సప్త సప్తైవ ఈశాన ఉరుశృఙ్గో బలభద్రః శతకేసరః
సహస్రస్రోతో దేవపాలో మహానస ఇతి అనఘాయుర్దా ఉభయస్పృష్టిరపరాజితా పఞ్చపదీ సహస్రస్రుతిర్నిజధృతిరితి



తద్వర్షపురుషా ఋతవ్రతసత్యవ్రతదానవ్రతానువ్రతనామానో భగవన్తం వాయ్వాత్మకం
ప్రాణాయామవిధూతరజస్తమసః పరమసమాధినా యజన్తే

పరమాత్మ వాయు రూపములో ఉంటాడు. శరీరములో మనసులో ఉండే దోషాలను పోగొట్టేది ప్రాణాయామము.

అన్తఃప్రవిశ్య భూతాని యో బిభర్త్యాత్మకేతుభిః
అన్తర్యామీశ్వరః సాక్షాత్పాతు నో యద్వశే స్ఫుటమ్

వాయువు ప్రతీ ప్రాణిలోపల ప్రవేశించి కాపాడుతుంది. పరమాత్మ ప్రతీవాని లోపల ప్రవేశించి వ్యాపిస్తాడు. తన చిహ్నములతో (పది వాయువుల పేర్లతో) అందరిలో ప్రవేశించి నిలుపుతున్నాడు

ఏవమేవ దధిమణ్డోదాత్పరతః పుష్కరద్వీపస్తతో ద్విగుణాయామః సమన్తత ఉపకల్పితః
సమానేన స్వాదూదకేన సముద్రేణ బహిరావృతో యస్మిన్బృహత్పుష్కరం జ్వలనశిఖామలకనక
పత్రాయుతాయుతం భగవతః కమలాసనస్యాధ్యాసనం పరికల్పితమ్

పుష్కర ద్వీపములో తీయని నీరు ఉంది.  ఇక్కడున్న పద్మం (పుష్కరమంటే పద్మం) బ్రహ్మకు ఆసనం. ఈ ద్వీపం మధ్యన . ఇక్కడ మానసోత్తరం సరిహద్దు పర్వతం. పది వేల యోజనాల ఎత్తూ వైశాల్యం ఉన్నది. ఇక్కడ నాలుగు దిక్కులలో నలుగురు లోకపలాకుల భవనాలున్నాయి. 

తద్ద్వీపమధ్యే మానసోత్తరనామైక ఏవార్వాచీనపరాచీనవర్షయోర్మర్యాదాచలోऽయుత
యోజనోచ్ఛ్రాయాయామో యత్ర తు చతసృషు దిక్షు చత్వారి పురాణి లోకపాలానామిన్ద్రాదీనాం
యదుపరిష్టాత్సూర్య
రథస్య మేరుం పరిభ్రమతః సంవత్సరాత్మకం చక్రం దేవానామహోరాత్రాభ్యాం పరిభ్రమతి

ఈ (సూర్య) రథానికి ఒకే చక్రం, సారధికి కాళ్ళు లేవు, గుఱ్ఱాలకు (కిరణాలకు) ఆకారం లేదు. ఇవేవీ లేకున్నా ఆయనకు సత్వం (సంకల్పం మనసూ ధైర్యం ఉంది) ఉంది. అది ఉంటే సాధనాలు అవసరం లేదు. 

తద్ద్వీపస్యాప్యధిపతిః ప్రైయవ్రతో వీతిహోత్రో నామైతస్యాత్మజౌ రమణకధాతకినామానౌ వర్ష
పతీ నియుజ్య స స్వయం పూర్వజవద్భగవత్కర్మశీల ఏవాస్తే

తద్వర్షపురుషా భగవన్తం బ్రహ్మరూపిణం సకర్మకేణ కర్మణారాధయన్తీదం చోదాహరన్తి

యత్తత్కర్మమయం లిఙ్గం బ్రహ్మలిఙ్గం జనోऽర్చయేత్
ఏకాన్తమద్వయం శాన్తం తస్మై భగవతే నమ ఇతి

పగలూ రాత్రి రూపములో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది.  తమ పుత్రులకు ఆ భాగాన్ని ఇచ్చేసి ఈ ఇద్దరు కొడుకులూ భగవానుని ఆరాధించడానికి వెళ్ళాడు. ఈ ద్వీపాధిపతి బ్రహ్మ.  రజస్సు తమస్సు లాంటి గుణాలు లేని ఏకాంతుడు పరమాత్మ. అదే గుర్తుగా కలిగిన పరమాత్మను మానవులు పూజించాలి. ఇలాంటి పరమాత్మకు నమస్కారం 

తతః పరస్తాల్లోకాలోకనామాచలో లోకాలోకయోరన్తరాలే పరిత ఉపక్షిప్తః

లోకాలోకమనే పర్వతం. ఇక్కడితో సూర్య సంచారం ఆగిపోతుంది. 

యావన్మానసోత్తరమేర్వోరన్తరం తావతీ భూమిః కాఞ్చన్యన్యాదర్శతలోపమా యస్యాం ప్రహితః
పదార్థో న కథఞ్చిత్పునః ప్రత్యుపలభ్యతే తస్మాత్సర్వసత్త్వపరిహృతాసీత్

ఆలోకమంటే వెలుతురు. లోకములలో ఉండే వెలుతురు. ఆ వెలుతురుకు అది హద్దు. దాని అవతల వెలుతురు లేదు.  మేరు మానస పర్వతాల మధ్యలో ఉన్న భూమి. లోకాలోకములలో ఏ పదార్థాన్ని పడవేసినా ఇంక అది ఎవరికీ దొరకదు. ఆ భూమి అంతా బంగారు భూమి.  కానీ వస్తువు పడేస్తే మళ్ళీ దొరకదు. పడ్డట్టు అనుభూతి మాత్రం ఉంటుంది. అందు వలన ఈ ప్రాంతములో ఎలాంటి ప్రాణీ ఉండదు. అందుకు అన్ని ప్రాణులచే ఇది వదిలివేయబడినది. 

లోకాలోక ఇతి సమాఖ్యా యదనేనాచలేన లోకాలోకస్యాన్తర్వర్తినావస్థాప్యతే

స లోకత్రయాన్తే పరిత ఈశ్వరేణ విహితో యస్మాత్సూర్యాదీనాం ధ్రువాపవర్గాణాం జ్యోతిర్గణానాం
గభస్తయోऽర్వాచీనాంస్త్రీన్లోకానావితన్వానా న కదాచిత్పరాచీనా భవితుముత్సహన్తే తావదున్నహనాయామః

ఈ పర్వతముతో లోకాలోకముల యొక్క (వెలుత్రూ చీకటి మధ్య ఉన్న భాగనికి) భాగానికి ఆ పేరు వచ్చింది. ఇది పరమాత్మచేత జాగ్ర్త్తగా పరిపాలిచబడుతున్నాయి. ఇక్కడే సూర్యుడిమొదలు ధ్రువుని వరకూ. జ్యోతి కిరణములూ, దాని తరువాత ఉన్న మూడు లోకాలనూ ప్రకాశింపచేస్తున్నవై, అవి ఎప్పుడూ ముందరభాగానికే వెళతాయి గానీ, ఆ కిరణములు వెనక భాగానికి ప్రసరించవు. ఆ ప్రాంతం ఎంత వైశాల్యమూ ఔన్నత్యమో అంతా వ్యాపిస్తాయి. గానీ సాధారణముగా ఏ కిరణమైనా అన్ని దిక్కులకూ వస్తాయి. సూర్యుని వెలుగు అడ్డముగా వెళుతుంది.  కానీ ఇది మాత్రం ముందుకే వస్తుంది వెలుతురు.  అద్దము ముందర ఉన్న భాగాన్ని చూపుతుంది గానీ వెనక భాగాన్ని చూపదు. దీప కిరణములు కిందభాగానికి రావు. ఆదర్శము (అద్దము) వెనకభాగానికి రాదు, సూర్యుని కిరణములు అన్ని దిక్కులకీ వెళతాయి 

ఏతావాన్లోకవిన్యాసో మానలక్షణసంస్థాభిర్విచిన్తితః కవిభిః స తు పఞ్చాశత్కోటిగణితస్య భూ
గోలస్య తురీయభాగోऽయం లోకాలోకాచలః

ఇది లోఖముల యొక్క సంగతి. దాని కొలతలూ స్వరూప స్వభావములను జ్ఞ్యానులు వివరించారు. భూగోళ వైశాల్యం యాభై కోట్ల యోజనాలు.  ఇందులో నాలగవ భాగం లోకాలోకాచలం. 

తదుపరిష్టాచ్చతసృష్వాశాస్వాత్మయోనినాఖిలజగద్గురుణాధినివేశితా యే ద్విరదపతయ
ఋషభః
పుష్కరచూడో వామనోऽపరాజిత ఇతి సకలలోకస్థితిహేతవః

దీని పైన నాలుగు దిక్కులలో ఆత్మ యోని (బ్రహ్మ) చేత ఒక్కో దిక్కునకూ ఒక్కో గజరాజు నియమించబడి ఉంది.  ఋషభ పుష్కర చూడా వామన అపరాజిత. ఈ నాలుగు ఆయా ప్రాంతములు సక్రమముగా ఉండడానికి భారమును ఈ ఏనుగులు మోస్తాయి. 

తేషాం స్వవిభూతీనాం లోకపాలానాం చ వివిధవీర్యోపబృంహణాయ భగవాన్పరమమహాపురుషో
మహావిభూతిపతిరన్తర్యామ్యాత్మనో విశుద్ధసత్త్వం ధర్మజ్ఞానవైరాగ్యైశ్వర్యాద్యష్టమహాసిద్ధ్య్
ఉపలక్షణం విష్వక్సేనాదిభిః స్వపార్షదప్రవరైః పరివారితో నిజవరాయుధోపశోభితైర్నిజభుజదణ్డైః
సన్ధారయమాణస్తస్మిన్గిరివరే సమన్తాత్సకలలోకస్వస్తయ ఆస్తే

కానీ ఇవేవి మనకు కనపడవు. కానీ మనం ఉండడానికి ఇవే కారణం. పని చేసే వారు ఇలాగే పైకి చెప్పుకోకుండా ఉండాలి. వారి వారి విభూతులూ లోకపలకులూ పరమాత్మే తన ప్రభావం చూపించడానికి. తన విభూతులతో ఆయా పేర్లతో ప్రపంచం బాగా సాగడానికి ఈ పని చేస్తుంటాడు. తన పేరు మాత్రం బయట రాదు. ఆ దిగ్గజాలకు అంతర్యామిగా పరమాత్మే ఉన్నాడు. ఈయన అంతర్యామి, ఆత్మ యొక్క గుణత్రయ రహితమైన విశుద్ధమైన సత్వం.ధర్మ జ్ఞ్యాన వైరాగ్యం ఐశ్వర్యం అనే నాలుగు కాళ్ళు గల పీఠములు ఉంటాయి. తన పరివారముతో కలిసి ఉండి తన భుజ దండములతో (అష్టాయుధములతో) లోకాలోక పర్వతము మీద ఏ ప్రాణీ ఉండదు.కానీ అక్కడ ఉండేది ఈ స్వామే. అక్కడినుంచి తన విభూతులతో తన పరివారాన్ని పంపుతాడులోకాలోక పర్వతము మీద ఏ ప్రాణీ ఉండదు.కానీ అక్కడ ఉండేది ఈ స్వామే.

ఆకల్పమేవం వేషం గత ఏష భగవానాత్మయోగమాయయా విరచితవివిధలోకయాత్రా
గోపీయాయేత్యర్థః

కల్పాంతం వరకూ తన ఆత్మమాయతో సకల లోకాల స్థితి రక్షణ ప్రవృత్తినీ కాపాడుతూ ఉంటాడు 

యోऽన్తర్విస్తార ఏతేన హ్యలోకపరిమాణం చ వ్యాఖ్యాతం యద్బహిర్లోకాలోకాచలాత్తతః
పరస్తాద్యోగేశ్వరగతిం విశుద్ధాముదాహరన్తి

ప్రపంచము లోపల ఎంత భాగమో వెలుపల ఎంత భాగమో తెలిస్తుంది ఈ లోకాలోకాచలము గురించి తెలుసుకోవడం వలన. ఇది దాటి మన బుద్ధి వెళ్ళలేదు. అది దాటి ఏముందో మనకు తెలియదు 

అణ్డమధ్యగతః సూర్యో ద్యావాభూమ్యోర్యదన్తరమ్
సూర్యాణ్డగోలయోర్మధ్యే కోట్యః స్యుః పఞ్చవింశతిః

సూర్యభగవానుడు బ్రహ్మాండం యొక్క మధ్య భాగములో ఉన్నాడు. పైన ఆకాశం కింద భూమి, మధ్య సూర్యభగవానుడు ఉండి, పైలోకాలకూ కింద లోకాలకూ వెలుగును ఇస్తాడు. సూర్యునికీ అండగోళానికి మధ్య ఉన్న విస్తీర్ణం ఇరవై ఐదు కోట్ల యోజనాలు. సూర్యుడు బ్రహ్మాండములో పుట్టాడు. బ్రహ్మాండములోనుండి బ్రహ్మ బయటకు వచ్చాక పుట్టాడు 

మృతేऽణ్డ ఏష ఏతస్మిన్యదభూత్తతో మార్తణ్డ ఇతి వ్యపదేశః హిరణ్యగర్భ ఇతి యద్ధిరణ్యాణ్డ
సముద్భవః

మరణించిన అండములోంచి పుట్టాడు కాబట్టి ఆయన మార్తాండుడు. గుడ్డు మధ్య భాగం బంగారు రంగులో ఉంటుంది. అందులోంచి వచ్చాడు కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు.

సూర్యేణ హి విభజ్యన్తే దిశః ఖం ద్యౌర్మహీ భిదా
స్వర్గాపవర్గౌ నరకా రసౌకాంసి చ సర్వశః

సకల దిగ్ విభాగం చేసేవాడు సూర్యుడే. దిక్కులూ ఆకాశం స్వర్గం అపవర్గం నరకం భూమి మొదలైన విభాగాలన్నీ సూర్యుని వలనే జరిగాయి. దేవతలు సూర్యునికి పైన ఉన్నారు, మనం కింద ఉన్నాము. అందుకే అవి ఊర్ధ్వ లోకాలు, కిందవి అధోలోకాలు

దేవతిర్యఙ్మనుష్యాణాం సరీసృపసవీరుధామ్
సర్వజీవనికాయానాం సూర్య ఆత్మా దృగీశ్వరః

దేవతలతో మొదలుకొని సకల ప్రాణులకూ సూర్యుడే ఆత్మ కన్నూ శాసకుడు. సూర్య ఆత్మ జగతః స్తస్తుశశ్చ. సూర్యకిరణాలు మన శరీరం మీద పడే లోపల చేయాలి. తడిసీ తడియని శరీరం మీఎద ఆయన కిరణాలు పడితే ఆరోగ్యానికి మంచి. శరీరానికి ఏ భాగానికి ఎంత నీరు రావాలో అంత నీరు ఇస్తాడు

Popular Posts