Followers

Sunday, 16 June 2013

సందేహానికి సమాధానమే శ్రీకృష్ణ గీత

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
శ్లోకంః కులక్షయే ణ్రశ్యంతి
krishaకులధర్మా స్సనాతనాః
ధర్మేనష్టే కులం కృత్స్నం
అధర్మో భిభవత్యుత 

ఒకొక్క వంశమునందు దానకి తగిన ఆచారములు ఉండును. ఇవి పరంపరగ సాగుచునే యుండును. వానిని సనాతన ధర్మములని అందురు. ఆచరించు వ్యక్తులుగల వంశములు ఈ యుద్ధము వల్ల నశించును గదా! వారితోటే వారి వంశాచారములు గూడా లోపించును. ఆ చోట దురాచారములు ప్రవేశించి వంశమంతయు చెడిపోవును గదా!
శ్లోకంః సంకరో నరకామైవ
కులఘ్నానాం కులస్యచ
పతంతి పితరో హ్యేషాం
లుప్తపిండోదక క్రియాః 

ఎవరి వల్ల వంశధర్మాలు చెడి, తద్వారా జాతులు సంకరములగునో అట్టివారు, వారి వంశము గూడా ఘోర ఘోర నరకమనుభవించును. అంతేకాదు ఆచారహీనులగు వీరు చేయు పిండ ప్రదానాదులు తర్పణాది కర్మలు నిష్ఫలములై వీరి పితరులకవి చెందక అచ్చట నుండి వారునూ
భ్రష్టులగుదురు

Popular Posts