Followers

Monday 17 June 2013

కోటిఫలితాల మా పల్లె కోటిపల్లి

కాకినాడ పట్టణం దాకా రైల్లో వచ్చిన తర్వాత అక్కడి 

నుంచి నలభై కిలోమీటర్ల రోడ్డు మార్గాన ప్రయాణం 

చేయాలి కోటిపల్లి చేరాలంటే. ఇక్కడి ఆలయంలో దేవేంద్ర 

నిర్మితమైన యోగలింగం-కోటేశ్వరస్వామి వారు 

పూజలందుకుంటున్నారు. దీన్ని ’సిద్ధిక్షేత్ర’ మని పెద్దలు 

చెప్తారు. ’కోటిఫలి’ కాలాంతరంలో కోటిపల్లి అయింది.
koti2ఇక్కడి విశాలమైన పుష్కరిణి ’సోమగుండం’లో స్నానం కష్టాలని హరిస్తుందని అంటారు. ఇక్కడి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి. ఆలయ ప్రాంగణంలోనే ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది. తారాచంద్రుల ప్రణయకేళీ విలాసాలకి ఆగ్రహించి బౄఎహస్పతి చంద్రుని శపించాడు. చంద్రుడు ప్రార్థించగానే శాపవిముక్తి కూడా తెలిపాడు. కోటితీర్థంలో నిత్యం స్నానం చేసి శివపూజ చేస్తే విముక్తి కలుగుతుందని. చంద్రుడు అలాగే చేసి దక్షిణ దిశగా సోమేశ్వరుని ప్రతిష్ఠించి ఆరాధించాడు. పోగొట్టుకున్న ఛాయలను సిద్ధింపచేసిన కారణాన ఈయన ఛాయా సోమేశ్వరుడైనాడు. స్వామివారి వామభాగంలో పార్వతీ అమ్మవారు నెలకొని ఉన్నారు. ఆయలంలోని నంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 

సోమేశ్వర లింగంలో కోటిలింగములు తొలువబడి ఉన్నాయంటారు. శివరాత్రికిక్కడ వేయి దీపాలు వెలిగించి దీపోత్సవం చేసే ఆచారం ఉంది. ఈ ఆలయం ప్రాంగణంలోనే శ్రీదేవీ, భూదేవీ, సహిత జనార్థన స్వామిని కశ్యప మహర్షి ప్రతిష్ఠించారు. ఇక్కడ చేసే జప,తప,దాన, యజ్ఞ యాగాదులు కోటిరెట్లు అధిక ఫలం ఇస్తాయిట. అందుచేత ఇది కోటిఫలి క్షేత్రం అయింది. దర్శించి, ఫలం పొందాలి మరి కాలయాపన చేయక.

Popular Posts