Followers

Sunday 9 June 2013

స్త్రీలు వేదవిద్యకు అర్హులేనా?



 స్త్రీపురుషుల శరీరసృష్టియందు బేధం కలదు. శరీర నిర్మాణమున త్వచము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, అస్థి అను ఆరుకోశములు కలవు. త్వచమూ, రక్తమూ, మాంసము స్త్రీల శరీరమునందు అధికముగాను, మేధస్సు మజ్జ, అస్థి కాస్త తక్కువగాను ఉండడమువలన స్త్రీ పురుషుని కంటే తక్కువ దేహబలం కలిగియున్నది. ఇది సృష్టి నియమం. అందుచే మనోనిగ్రహము, ధారణాశక్తి, బలము పురుషులకు ఉన్నంతగా స్త్రీలకు ఉండదన్నది యదార్ధం. అలానే పురుషుల కంటే స్త్రీలల్లో ప్రేమ, శాంతస్వభావం, మృదుత్వం అధికం. ఇవి చాలు, భగవద్భక్తికిని, వేదాధ్యయనమునకు, బ్రహ్మజ్ఞానమునకు! 

 అయితే వేదమంత్రధారణలో పురుషులకున్న దృఢశక్తి స్త్రీలల్లో ఉండదు. మరియు బ్రహ్మచర్యం వలన అమితశక్తిని పురుషులు పొందగలరు. స్త్రీలల్లో నెలనెలా ఋతుక్రమం వలన కాయికశక్తి, మానసికశక్తి, బుద్ధినిశ్చయాత్మకశక్తి కొంత తగ్గుతుంది. ఈ కారణం వలన బ్రహ్మవిద్య యందు కొంత అవరోధం ఉంటుందన్నది నిజమేనైనప్పటికీ వేదవిద్యలను అభ్యసించే అర్హత స్త్రీలకు లేదనుకోవడం తప్పు. స్థిరసంకల్పముతో ఈ విద్యలను అభ్యసించవచ్చును. అలా అభ్యసించినవారిలో గార్గేయ, మైత్రేయి, విశ్వవర... మొదలగువారు ఉన్నారు.   భగవద్గీత యందు 'కీర్తి: శ్రీర్వాక్చనారీణాం స్మృతిర్మేధా ద్రుతి: క్షమా' స్త్రీల యందలి కీర్తి, ఐశ్వర్యం, వాక్చమత్కృతి, ధారణాశక్తి, బుద్ధిబలం, దైర్యం, ఓర్పు... నా అంశములే (స్వరూపములే) అన్న శ్రీకృష్ణ పరమాత్మ మాటలను పరిగణలోనికి తీసుకొని పరిశీలించిన ఇన్ని భగవదంశములున్న స్త్రీ వేదవిద్యకు అనర్హురాలని అనుకోవడం అవివేకం.

Popular Posts