Followers

Sunday 9 June 2013

వాస్తు సలహాలు పాటించండిలా...


భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే, జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అందులో కొన్ని సలహాలను పరిశీలిస్తే...


  • chakramsపక్కమీద నుండి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించటం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. మంచి లాభాలు పొందుతారు.
  • ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేర స్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివలన ధనాదాయం లభిస్తుంది.
  • తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవటం మంచిది.
  • ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించటం చేయకూడదు. దీనివలన ఈశాన్య మూల మూతపడటం శుభదాయకం కాదు.
  • గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభమై నైఋతి వైపుకు చెత్తను ప్రోగుచేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు.
  • ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు.. తూర్పు అబిముఖంగా నించుని వంట చేయాలి.
  • ఇంటిని ఊడ్చే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్‌ పైకి మాత్రమే పెట్టి ఉంచటం శుభకరం.
    ఇంటి నిర్మాణానికి అనుకూలం కాని స్థలాలు...
  • ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన, గృహనిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే...
  • స్థలంలోని నాలుగు భుజములు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది.
  • chaskramచేట ఆకారంలో గల స్థలం కూడా మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్య్రానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం జరుగుతుంది.
  • స్థలం లోని పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారో గ్యం కలిగిస్తుంది.
  • విసనకర్ర ఆకార స్థలం... ఎటువంటి ఆస్తి మంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
  • లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
  • డమరకపు ఆకారంలో ఉండే స్థలం మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యలు నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.
  • కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించటం జరుగుతుంది.
  • మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను, విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
  • అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయి.
    గృహావరణలో మెట్లు...
    మెట్లను నిర్మించటంలో కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్రాలు తెలుపుతున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లను ఏవిధంగా నిర్మిస్తే శుభదాయకాలనే అంశాలను పరిశీలిస్తే...
  • మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒక వరుస మెట్లను... తూర్పు నుండి పడమరకు లేదా, ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించాలి.
  • Turpu-Padamaraరెండు వరుసలుగా నిర్మించేటపుడు.. మొదటి వరుస మెట్లను.. తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకైనా తిరిగినా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.
  • రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగానూ, రెండవ వరుస.. ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరం ఎక్కేవిధంగా నిర్మించుకోవచ్చు.
  • ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తర - ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు.
  • ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకూడదు.
  • మెట్లను ఎల్‌ ఆకారంలో ఉండే విధంగా నిర్మించాలనుకునే వారు ముందు తూర్పు నుండి పడమరకు గానీ, లేదా ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎటువైపుకైనా నిర్మించుకోవచ్చు.

Popular Posts