బ్రహ్మదేవుడు సృష్టి గురించి ఆలోచన చేస్తుండగా ఆయన నాలుగు ముఖాల నుండి
బుగ్యజుస్సామ అధర్వణ వేదాలు పుట్టాయి. అలా సర్వశాస్త్రలూ ప్రభవించాయి.
ప్రజాసృష్టి గురించి ఆలోచన చేయగా స్వాయంభువ మనువు, ఆయన భార్య శతరూప ప్రభవించారు. [ఇక్కడ ‘ఆలోచన నుండే జనించటం’ గురించి చెప్పబడింది. ‘సంకల్పమే అన్నిటికీ ప్రారంభం’ అని ఇందుకే అంటారేమో! ‘భావం నుండే అన్నీ జన్మించాయి. భావమే తప్ప భౌతిక ప్రపంచం లేదు. అది అభాస మాత్రమే, ఉన్నదను కోవటం భ్రాంతే’ అనే తత్త్వ చింతనకి, ఆధార బీజాలు ఇక్కడ కనిపిస్తాయి.]
ఈ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే కుమార్తెలు కలిగారు. ఉత్తానపాదుడు కుమారుడే ధృవుడు.
ఆకూతిని రుచికిచ్చి, దేవహూతిని కర్దముడి కిచ్చి, ప్రసూతికి దక్షుని కిచ్చి వివాహం జరిపించారు. వీరి వల్ల మానవ ప్రపంచం ప్రవృద్దమయింది.
ఇది భాగవతం తొలి అధ్యాయాలలో చెప్పబడింది.