Followers

Saturday, 16 March 2013

పుట్టిన మనిషికి కావాల్సిన అయిదు శక్తులకు పంచపాండవుల సంకేతం(Pandavulu janana Sanketham)

బుద్ధికి యుధిష్ఠిరుడు, మనస్సుకు భీముడు, ప్రాణానికి అర్జునుడు, కాళ్ళుచేతులకు నకుల సహదేవులు సంకేతాలు. 

ఒకరి తరవాత ఇంకొకరు పుట్టటంలో కూడ ఒక అర్థం ఉంది. తల్లి గర్భం నుంచి ముందు బయటకు వచ్చేది బిడ్డతల. అక్కడే బుద్ధి ఉండేది. తరవాత వచ్చేవి కనుబొమలు. వాటిమధ్యనే కేంద్రీకృతమయ్యేది మనస్సు. తరవాత చెవులు, ముక్కు, నోరు బయటకు వస్తాయి. ప్రాణాధారమైన ఊపిరికి అవే ఆలవాలాలు. అక్కడితో మనిషి పుట్టుకకు నాంది జరిగింది. అయితే, ఆ శరీరం పనిచేయటానికి కాళ్ళు చేతులు కావాలి. అవి రెండు రెండుగా ఉండటమే కాకుండా ఒకేలా ఉంటాయి. నకుల సహదేవులు కవలలుగా పుట్టటం కూడా దానికే సంకేతం

Popular Posts