ముక్కుపుడకను ధరించడం ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య ట్రెండ్‌గా మారినా..మన సంప్రదాయంలో ఆనాది నుంచి ముక్కుపుడకకు ప్రాధాన్యత ఉంది.ముక్కుపుడక వల్ల అందంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది.ఇస్నోఫీలియా, సైనస్ వంటి నాసికా సంబంధ రుగ్మతల నుంచి రక్షణ కల్పించడమే ముక్కుపుడక లక్ష్యం. ముక్కు పుడక విషయంలో మన్యంలోనూ, కొండ ప్రాంతాల్లోనూ నివసించే ఆదివాసీ స్ర్తీలు మరింత శ్రద్ధ కనబరుస్తారు. మైదాన ప్రాంతంలో నివసించేవారు కేవలం ముక్కు పుడకతోనే సరిపెట్టుకుంటే గిరిజన స్ర్తీలు మాత్రం ముక్కుపుడక, నత్తు, అడ్డబాస వంటివి కూడా ధరిస్తారు.
కొండ గాలి తగలడం వల్ల తరచూ ముక్కుకు సంబంధించిన రొంప, పార్శ్వ నొప్పి, ముక్కు దిబ్బడ, సైనస్‌లు పూడుకుపోవడ వంటి సమస్యలు వస్తుంటాయి. వీటినుంచి రక్షణ కోసం గిరిజన మహిళలు నత్తు, అడ్డబాస వంటివి విధిగా ధరిస్తారు. సహస్రార చక్రం దిగువన అంటే నుదిటిపూ ఆజ్ఞా చక్రం ఉంటుంది. దానిని ఉత్తేజితం చేయడానికి తలకు ఇరుపక్కలా బంగారాన్ని అలంకరించుకుంటారని పెద్దలు చెబుతారు.ప్రస్తుతం ఆధునిక యువతులు కూడా చెవి రింగులు, చెంప సరాలు, మాటీలు అలంకరించుకోవడం చేస్తూ ట్రెండ్‌తో పాటు ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకుంటున్నారన్న మాట.