ద్వాదశి జ్యోతిర్లింగాలు - విశిష్టత త్రయంబకేశ్వరుడు
దశరధుని ఆజ్ఞానుసారం వనవాసానికి వచ్చిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని నివసించసాగాడు. రావణుని చెల్లెలైన శూర్పణఖ రాముని మోహించి తత్ఫలితంగా లక్ష్మణుని చేత ముక్కు చెవులను కోయించుకున్నది. ఆమె ముక్కు కోయబడిన ప్రాంతమును నాశిక అంటారు. ఈ నాశిక దగ్గరలో బ్రహ్మగిరి అనే పర్వతం ఉన్నది. బ్రహ్మగిరిపై గౌతమమహర్షి అహల్యాసమేతంగా నివసిచేవాడు. అక్కడ స్నానపానాదులకు నదీ తీర్ధములేవీ లేవు. ఇతర మునులందరూ నీరు లభించక అనేక ఇబ్బందుల పాలయ్యేవారు. గౌతముని తపశ్శక్తి తెలిసిన వారందరూ ఒక తంత్రము పన్ని ఒక ఆవునూ, దూడనూ దర్భతో సృష్టించి గౌతముని పొలములో వదిలారు.
ఆ ఆవుదూడలు వరిపైరుని పాడుచేయడం గమనించిన గౌతముడు వాటిని అదిలించుటకై ఒక దర్భపోచను విసిరాడు. ఆ దర్భపోచ తగిలినంతనే ఆవు, దూడ రెండునూ ప్రాణాలు వదలి లాయి. ఆ గోహత్య పాతకము నుండి నివృత్తి పొందుటకు గౌతము డు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ‘ఏమి కావలెనని?’ అడిగాడు. ‘ప్రభూ... నాకు తగిలిన గోహత్యా పాతక మును బాపుకొనుటకునూ, లోక హితము కొరకునా నీ జటాజూటము నుండి గంగను భూమిపైకి వదులు’మని ప్రార్ధించాడు గౌత ముడు. శివుడు జటాజూటము నుండి వదిలిన గంగ బ్రహ్మగిరిపై బడి, అచట నుండి పాయలుగా వీడి గౌతముని పేరుని గౌతమి గాను, గోవు ప్రాణాలు వదిలిన ప్రదేశము మీదుగా ప్రవహించి ‘గో దావరి’ గాను ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రము నందు గౌతముని ప్రా ర్ధన మేరకు శివుడు ‘త్రయంబకేశ్వరుడు’ అను పేరుతో జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిశాడు. ఈ స్వామిని దర్శిం చిన వారు గోహత్యాది మహాపాతకముల నుండి విముక్తులవుతారని ప్రతీతి.