గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి? (Relation ship between GuruSishaya)
సంప్రదాయ పద్ధతిలో బోధన ప్రారంభించే ముందు గురుశిష్యులు క్రింది మంత్రాన్ని కలిసి పఠించాలని మన ఉపనిషత్తులు చెప్తు న్నాయి.
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై
మన అధ్యయనం వీర్యవత్తరంగా ఉండుగాక. ఎటువంటి పరస్పర విద్వేషం లేకుండా మనం అధ్యయనం ప్రారంభించెదము గాక''. విద్యార్జనలో ప్రతిభావంతులైన విద్యార్థుల పట్ల కొంత మంది అధ్యాపకులకు అసూయ ఉంటుంది. తమ విద్యార్థుల విద్యార్జన యందు ప్రగతిని సహించలేని అధ్యాపకులు కూడ ఉంటారు. ఇక విద్యార్థుల సంగతికి వస్తే ''నేను నా విద్యార్జనలో చాలా ప్రగతిని సాధించాను. నా గురువు అలా చేయలేదని గట్టిగా చెప్పగలను''. అని భావించే వాళ్లు ఉన్నారు. తన శిష్యుడు అధ్య యనంలో ప్రగతిని సాధించకూడదనే అధ్యాపకుని భావన, తన అధ్యాపకునికి ఏమీ తెలియదు తనకే తెలుసు అని శిష్యుని భావన, రెండూ తప్పే. అటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే గురుశిష్య సంబంధాలకిక అర్థమే ఉండదు. అందువల్లనే పైన చెప్పిన మంత్రాన్ని అధ్యయన ప్రారంభంలో పఠించటం. తన శిష్యుని ప్రగతిని గురువు నిరంతరం ఆకాంక్షించాలి. విద్యార్జనలో తన ప్రగతి గురువుగారి వల్లనే సాధ్య మయ్యిందని శిష్యుడు భావిం చాలి. అప్పుడు గురు శిష్యుల మధ్య సత్సంబంధాలు నెల కొంటాయి.