వినాయకుడి విశిష్టత
మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకని మాత్రమే తెలుసు కాని '' వినాయకుడు '' అనే పదానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటంటే '' నాయకుడు లేనివాడు '' అని అర్థం. అంటే తనకు తనే నాయకుడు అని.
'త్వమేవాహమ్', 'అహంబ్రహ్మోసి' అన్న భావమే అది. అందుకే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతినే పూజ చేస్తారు పూజారులు. ఏ గణానికైనా అతడే 'పతి' జగత్తు. ఎందుకంటే అంతా 'గణ' మయమే కాబట్టి ! వివిధ గణ సమాహారమే ఈ విశ్వమని మనకు ఎన్నో పురాణాలు చెబుతుంటాయి. 'గ' అనే అక్షరం నుంచే జగత్తు జనించింది.
కరచరణాద్యనయన విన్యాసం మొదలుకుని, ఎలాంటి శబ్దమైన భాష, భాషాత్మకమైన జగత్తు. అంతా 'గ' శబ్ద వాక్యం . దీన్ని సుగుణానికి సంకేతం అంటారు. 'ణ' కారం మనసుకు, మాటలకు అందని పరతత్త్వానికి గుర్తు. ఇది నిర్గుణ సంకేతమన్నమాట! సుగుణంగా, నిర్గుణంగా భాసించే ఈశుడే 'గణేశుడు'. అతడే 'గణపతి'. ఆ పదహారు రూపాలలో కొలువై ఉన్నాడని మనకు మన పెద్దలు చెబుతుంటారు.
పదహారు రూపాల గణపతులు.
1. బాలగణపతి
2. తరుణగణపతి
3. భక్తగణపతి
4. వీరగణపతి
5. శక్తి గణపతి
6. ధ్వజ గణపతి
7. పింగళ గణపతి
8. ఉచ్ఛిష్ట గణపతి
9. విఘ్న గణపతి
10. క్షిప్ర గణపతి
11. హేరంబ గణపతి
12. లక్ష్మీగణపతి
13. మహాగణపతి
14. భువనేశ గణపతి
15. నృత్త గణపతి
16. ఊర్ధ్వగణపతి.
"శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"
ఈ శ్లోకంలో వినాయక తత్త్వం దాగుందని మీకు తెలుసా?
శుక్లాంబరదరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు అనే ధావళ్యత సత్త్వగుణ ప్రతీక.
'శుక్లాంబరధరం విష్ణుం' అంటే సత్త్వగుణమైన ఆకాశాన్ని ధరించినవాడని.
శశివర్ణం అంటే చంద్రునివలె కాలస్వరూపుడని. అంటే లోక పాలకుడని. 'చతుర్భుజం' అంటే ధర్మార్ధకామమోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్దబ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నది సకల గణాధిపతి అయిన వినాయకుడే అని పై శ్లోకంలో దాగున్న తత్వ్తం.