మైత్రేయ ఉవాచ
ప్రాజాపత్యం తు తత్తేజః పరతేజోహనం దితిః
దధార వర్షాణి శతం శఙ్కమానా సురార్దనాత్
నూరేళ్ళపాటు కశ్యపుడిచ్చిన తేజస్సుని కడుపులో భరించింది.
లోకే తేనాహతాలోకే లోకపాలా హతౌజసః
న్యవేదయన్విశ్వసృజే ధ్వాన్తవ్యతికరం దిశామ్
అలా మహాతేజస్సుని దాచడము వలన అప్పటికే దిక్కులన్నీ చీకట్లు కమ్ముతున్నాయి,ప్రకృతిలో వైపరీత్యం కలిగితే ప్రజాపతులు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి
దేవా ఊచుః
తమ ఏతద్విభో వేత్థ సంవిగ్నా యద్వయం భృశమ్
న హ్యవ్యక్తం భగవతః కాలేనాస్పృష్టవర్త్మనః
లోకమంతా చీకటి ఆవరించి ఉంది. దీనికి కారణం తెలియకున్నాము, కల ప్రభావం లేని భగవానుని మాయ అయి ఉంటుంది ఇది
దేవదేవ జగద్ధాతర్లోకనాథశిఖామణే
పరేషామపరేషాం త్వం భూతానామసి భావవిత్
సకల జగత్తునూ పరిపాలించే వాడా, లోక పాలకులకూ పలకుడా, పెద్దవారికీ చిన్నవారికీ కూడా నీవే పెద్దవాడవు, ప్రజాపతులకన్నా పెద్దవాడవు
నమో విజ్ఞానవీర్యాయ మాయయేదముపేయుషే
గృహీతగుణభేదాయ నమస్తేऽవ్యక్తయోనయే
నీ బలము విజ్ఞ్యానమే, సకల జగత్తునీ మాయతో సృష్టించినవాడా, నీ పుట్టుకకు కారణము ఎవరికీ తెలియదు.
యే త్వానన్యేన భావేన భావయన్త్యాత్మభావనమ్
ఆత్మని ప్రోతభువనం పరం సదసదాత్మకమ్
సకల ప్రాణులనూ ఆత్మలనూ అభివృద్ధి పధములో నడిపించేవాడివి నీవు, సృష్టి చేస్తూ ఇంకో విషయం ఆలోచించని వాడివి, సకల జగత్తులనీ పొదిగింపచేసుకుంటున్నావు,
తేషాం సుపక్వయోగానాం జితశ్వాసేన్ద్రియాత్మనామ్
లబ్ధయుష్మత్ప్రసాదానాం న కుతశ్చిత్పరాభవః
ఇలా చక్కగా యోగమును సాధించిన వారు, శ్వాసనూ ఇంద్రియమునూ మనసునూ గెలెవగలిగిన యోగులు, నీ అనుగ్రహం పొందినవారికి ఎక్కడి నుంచీ పరాభవం ఉండదు.
యస్య వాచా ప్రజాః సర్వా గావస్తన్త్యేవ యన్త్రితాః
హరన్తి బలిమాయత్తాస్తస్మై ముఖ్యాయ తే నమః
ముఖ్యుడవైన నీకు నమస్కారము. ముక్కుతాడు వేస్తే గోవులు ఎలా చెప్పినట్లు వింటాయో మమ్మల్ని వేదమే నియమిస్తోంది. అటువంటి పరమాత్మను కృతజ్ఞ్యతతో పూజిస్తాము.
స త్వం విధత్స్వ శం భూమంస్తమసా లుప్తకర్మణామ్
అదభ్రదయయా దృష్ట్యా ఆపన్నానర్హసీక్షితుమ్
ప్రపంచమంతా చీకటి మూసింది. అన్ని లోకాలు చీకటి వ్యాపించడం వలన ఆచరించ వలసిన కర్మలు ఆచరించేందుకు వీలు లేకుండా అయ్యింది. అద్భుతమైన దయతో మమ్మల్ని కటాక్షించు
ఏష దేవ దితేర్గర్భ ఓజః కాశ్యపమర్పితమ్
దిశస్తిమిరయన్సర్వా వర్ధతేऽగ్నిరివైధసి
దితి గర్భములో ఉన్న కశ్యపుని తేజస్సు సమిధలలో ఉన్న అగ్ని పెరిగినట్లు రోజు రోజుకూ పెరుగుతూ ఉంది, మాకు చీకటీ పెరుగుతోంది. ఆ చీకటిని తొలగించవలసింది
మైత్రేయ ఉవాచ
స ప్రహస్య మహాబాహో భగవాన్శబ్దగోచరః
ప్రత్యాచష్టాత్మభూర్దేవాన్ప్రీణన్రుచిరయా గిరా
కంటికి కనపడని, వేదానికి కనపడే, భగవానుడు , తన దగ్గరకు వచ్చిన దేవతలకు సంతోషం కలిగిస్తూ, ఇలా చెప్పాడు
బ్రహ్మోవాచ
మానసా మే సుతా యుష్మత్ పూర్వజాః సనకాదయః
చేరుర్విహాయసా లోకాల్లోకేషు విగతస్పృహాః
దితి వృత్తాంతం తెలియాలంటే మీకు పూర్వ కథ తెలియాలి. మీకంటే ముందు పుట్టిన సనకాదులు, ఆకాశములో విహరిస్తూ సర్వ లోకాలు చూచారు. లోకముల యందు లోకుల యందు ఎటువంటి ఆశా స్పృహ లేని వారు
త ఏకదా భగవతో వైకుణ్ఠస్యామలాత్మనః
యయుర్వైకుణ్ఠనిలయం సర్వలోకనమస్కృతమ్
సర్వ లోకులూ ఏ లోకానికి నమస్కరిస్తారో, ఏ లోకములో అందరూ పరమాత్మ రూపములో ఉంటారో,
వసన్తి యత్ర పురుషాః సర్వే వైకుణ్ఠమూర్తయః
యేऽనిమిత్తనిమిత్తేన ధర్మేణారాధయన్హరిమ్
పరమాత్మ దగ్గర ఉండి ఆయన రూపాన్ని సంతరించుకున ముక్తులు భగవంతున్ని ఎలాంటి నిమిత్తములనూ ఆశించకుండా ఉండే ధర్మ బద్ధముగా ఆరాధిస్తారు. వారు ఏ లోకానికి వచ్చినా స్వామినే చూస్తారు.
యత్ర చాద్యః పుమానాస్తే భగవాన్శబ్దగోచరః
సత్త్వం విష్టభ్య విరజం స్వానాం నో మృడయన్వృషః
శాస్త్రానికి మాత్రమే కనపడే ఆది పురుషుడు ఎక్కడ ఉన్నాడో, సత్వ గుణముతో సకల లోకముల దుఃఖమును తొలగిస్తూ, సకల లోకముల ధర్మాన్నీ పెంచుతూ
యత్ర నైఃశ్రేయసం నామ వనం కామదుఘైర్ద్రుమైః
సర్వర్తుశ్రీభిర్విభ్రాజత్కైవల్యమివ మూర్తిమత్
పరమాత్మని మనమందరమూ ఆరాధించవలసిన రూపం "వనం". ఇహ పర లోకాలలో బాగుండాలన్నా, ఈ రెండూ వద్దన్నా (మోక్షం కావాలన్నా) ఆయననే కొలవాలి. అక్కడ ఉన్న చెట్లు అన్నీ కల్పవృక్షాలే (కామదుఘై). వైకుంఠములో ఉన్న చెట్లన్నీ కోరికలు తీర్చేవే. వైఖుంఠములో ఉన్న వారికి ఉండే కోరిక ఒకటే - పరమాత్మకి నిరంతరమూ కైంకర్యం చేయాలి అన్నదే. అన్ని వేళలా అన్ని పూలూ అన్ని పళ్ళూ ఉన్నాయి. పరమపదమే రూపు దాల్చినదా అని ఉన్నట్లు ఉంది ఆ వైకుంఠం.
వైమానికాః సలలనాశ్చరితాని శశ్వద్
గాయన్తి యత్ర శమలక్షపణాని భర్తుః
అన్తర్జలేऽనువికసన్మధుమాధవీనాం
గన్ధేన ఖణ్డితధియోऽప్యనిలం క్షిపన్తః
విమానాలలో జంటలు జంటలుగా విహరిస్తూ ఉంటారు. వారు సకల లోకముల దుఃఖములను తొలగించే పరమాత్మ కథలను గానం చేస్తారు. పరమాత్మకు నాసికా కైంకర్యం చేయాలి అనుకున్నవారు పద్మములుగా పుట్టి నీళ్ళలో ఉండి పరమాత్మకు సుగంధాన్ని ఇస్తారు. స్వామికి సంగీత కైంకర్యము చేయాలనుకున్నవారు, తుమ్మెదలుగా పుట్టి ఆ పద్మాలలో మకరందాన్ని గ్రోలి శబ్దము చేస్తూ పరమాత్మకు కైంకర్యం చేస్తున్నారు. అక్కడ ఉన్న వారందరూ భాగవతులే. అంతే కాదు, ప్రతీ క్షేత్రములో ఉండే చెట్లూ పళ్ళూ పూలూ కూడా భగవతోత్తములే అని భావించాలి. అందుకే దివ్య క్షేత్రాలలో పూలు గనీ పళ్ళు గానీ స్వామికే అర్పించాలి. అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మం నుండి వచ్చే సుగంధమును పరమాత్మకు తీసుకు వెళ్ళే వాయువును నిందిస్తున్నారు (క్షిపన్తః). (ఎందుకంటే ఆ వాయువు పరమాత్మతో బాటుగా సుగంధాన్ని అక్కడున్న వారికి కూడా అందిస్తోంది. ఆ సుగంధముతో క్షణ కాలం వారి బుద్ధి పక్కకు వెళ్తోంది. ఇది వారి నిరంతర పరమాత్మ సేవకు అడ్డం వచ్చి వాయువుని నిందించారు)
పారావతాన్యభృతసారసచక్రవాక
దాత్యూహహంసశుకతిత్తిరిబర్హిణాం యః
కోలాహలో విరమతేऽచిరమాత్రముచ్చైర్
భృఙ్గాధిపే హరికథామివ గాయమానే
పావురాలు కోయిలలూ చక్రవాకములూ నెమళ్ళూ చిలుకలూ మొదలైన పక్షులు కోలాహలం చేస్తున్నాయి. తుమ్మెద గానం మొదలుపెట్టగానే అన్ని పక్షులూ శబ్దం చేయడం ఆపి నిశ్శబ్దమవుతాయి. ఎందుకంటే ఆ తుమ్మెదలు పరమాత్మ కథలు గానం చేస్తున్నాయి కాబట్టి.
మన్దారకున్దకురబోత్పలచమ్పకార్ణ
పున్నాగనాగబకులామ్బుజపారిజాతాః
గన్ధేऽర్చితే తులసికాభరణేన తస్యా
యస్మింస్తపః సుమనసో బహు మానయన్తి
మందార మల్లె కలువ సంపెంగలు నాగములు పద్మములు పారిజాతములూ ఇవన్నీ తమ గంధముతో పరమాత్మను సేవిస్తున్నారు. తులసీ దళముతో కలిసి ఉన్న తక్కిన పూల గంధాన్ని పరమాత్మకు ఆ పుష్పాలు అందిస్తున్నాయి. ఆ పుష్పాలన్నె వైకుంఠములో, తులసిగా జన్మించాలని తపస్సు చేస్తున్నాయి.
యత్సఙ్కులం హరిపదానతిమాత్రదృష్టైర్
వైదూర్యమారకతహేమమయైర్విమానైః
యేషాం బృహత్కటితటాః స్మితశోభిముఖ్యః
కృష్ణాత్మనాం న రజ ఆదధురుత్స్మయాద్యైః
పరమాత్మ యొక్క ఆజ్ఞ్యను పాటించి ఆయనకు కావలసిన కైంకర్య ఉపయుక్తమైనసంబారాలను సమకూర్చడానికి వీరూ విమానాలలో వెళ్తారు. అనంతకోటి బ్రహ్మాండాలకు మూడు రెట్లు ఉన్న వైకుంఠం. ఆ విమానాలు వైడూర్య మరకత్ మణులతో చేయబడినవి. అలా విమానాలలో తిరుగుతున్నా వారి శరీరము మీద చెట్ల మీద ఉన్న పూలు, ధూళి పడి, ఆ శరీరనికి అలంకారమైనట్లుగా ఉంది. అక్కడ మదం మాత్సరం ఉండదు. పరమాత్మ యందు మాత్రమే మనసు ఉంచినవారికి ఎటువంటి దుమ్ము పడదూ, ఎటువంటి రజో గుణము పడదు. వారికి అక్కడున్న వాటిలో వేటి మీదా కోరిక కలగదు
శ్రీ రూపిణీ క్వణయతీ చరణారవిన్దం
లీలామ్బుజేన హరిసద్మని ముక్తదోషా
సంలక్ష్యతే స్ఫటికకుడ్య ఉపేతహేమ్ని
సమ్మార్జతీవ యదనుగ్రహణేऽన్యయత్నః
నడుస్తున్నప్పుడు గజ్జెల చప్పుడవుతూ ఉంటే, చేతిలో విలాసముగా పద్మము పట్టుకుని, తనకుంది అని అందరూ చెప్పే చాపల్యమనే దోషము లేకుండా అమ్మవారు తిరుగాడుతున్నది. ఆ భవనం స్ఫటిక మణులతో చేయబడి ఉన్నది. అమ్మవారి ప్రతిరూపం అందులో కనపడుతున్నది. మొత్తం భవనాన్ని ఊడుస్తున్నట్లు కనపడుతున్నది. ఆమె ఊడుస్తున్నది దేనిని? వైకుంఠములోకి వెళ్ళి కూడా పరమాత్మను చేరుకోవడానికి అనన్యగతి తప్ప వేరేదాన్ని సాధనముగా చేసిన యత్నములను ఊడుస్తున్నది. పరమాత్మని చేరుకోవడానికి మన యత్నము కారణం అన్న భావాన్ని ఊడుస్తున్నది.
వాపీషు విద్రుమతటాస్వమలామృతాప్సు
ప్రేష్యాన్వితా నిజవనే తులసీభిరీశమ్
అభ్యర్చతీ స్వలకమున్నసమీక్ష్య వక్త్రమ్
ఉచ్ఛేషితం భగవతేత్యమతాఙ్గ యచ్ఛ్రీః
పరమాత్మను చూడాలంటే ఆమె ముఖము మీద అడ్డువస్తున్న ముంగురులను పైకి తీసి చూస్తోంది. పరమాత్మ ముఖము ఉన్నతమై ఉన్నది. అందుకు తల ఎత్తి చూడాలి. సరస్సులు కొలనులూ , పగడముల ఒడ్డు (లేదా మెట్లు) ఉన్న కొలనులూ, అందులో ఉన్న జలమంతా ఏ మాత్రం మురికి లేని అమృతమే. అలాంటి చోట తులసితో స్వామి వారిని ఆరాధిద్దామని మనసు పుట్టింది. అలా పూజిస్తూ, ముంగురులు పైకి అని, నిటారుగా ఉన్న పరమాత్మ వక్త్రాన్ని చూడటానికి, తన అలకలు (ముంగుర్లు) పైకి తోస్తుంటే తులసీ దళములతో పూజించవలసిన అవసరం తప్పింది. ఎందుకంటే అమ్మవారి చూపు అనే దళాలతో అర్చిస్తోంది. మనం కూడా పరమాత్మను హృదయపూర్వకముగా ఆరాధించగలగాలి అనుకుంటే వేరే పుష్పాలతో పని లేదు. మన అనన్య దృష్టి పరమాత్మ మీద ఉంటే అది ఆరాధనే. మనం పూలతో నామము చెబుతూ పరమాత్మ మీద వేస్తూ దృష్టి వేరే చోట ఉంటే అది ఆరాధన కాదు. చూపులూ పూలు, చూపులనే పూలు అక్కడే పడాలి. అమ్మవారు కూడా స్వామిని తులసీ దళముతోనే ఆరాధిస్తారు. భగవతేత్యమతా - భగవత ఇతి అమత - స్వామి ముఖము నీటిలో ప్రతిబింబిస్తోంది. ఆ ముఖాన్ని చూస్తున్న అమ్మవారు తన ముఖాన్ని కూడా పక్కకి జరిపింది. అప్పుడు స్వామి ముఖం అమ్మవారి పక్కకి వచ్చింది. పరమాత్మ ప్రేమగా తన ముఖాన్ని ముద్దుపెట్టుకున్నాడు అని భావించింది.. ఈ పుష్కరుణులు అమ్మవారికి స్వామికి ఇలాంటి భావన కలిగించి 'శేష కృత్యాన్ని" కలిగించాయి.
యన్న వ్రజన్త్యఘభిదో రచనానువాదాచ్
ఛృణ్వన్తి యేऽన్యవిషయాః కుకథా మతిఘ్నీః
యాస్తు శ్రుతా హతభగైర్నృభిరాత్తసారాస్
తాంస్తాన్క్షిపన్త్యశరణేషు తమఃసు హన్త
తాము ఎలాంటి ఆనందం పొందారో, అలాంటి ఆనందాన్నే తోటి వారు పొందాలని ఆశిస్తారు. వారు అలా పొందలేకపోతే జాలి పడతారు. ఇది పర దుఃఖ దు@ఖిత్వం. పరమాత్మ స్వరూప స్వభావాన్ని చూచే అదృష్టాన్ని కోల్పోతున్నవారిని చూచి వారు జాలి పడుతున్నారు. అఘభిత్ - పాపమును తొలగించే వాడు, పరమాత్మ. రచనానువాదాచ్ - సృష్టిని, రచనను, కథను తెలిపేటువంటి వాటిని ఎవరు వినరో. పరమాత్మ సృష్టి స్థితి లయముల విధానాన్ని వర్ణించేవాటిని వినకుండా, దానికంటే ఇతరములైన విషయాలను వింటారు. అవి (మతిఘ్నీః) బుద్ధిని పాడు చేసేవి. అలాంటివి సులభముగా మన దృష్టిని ఆకర్ష్స్తాయి. బుద్ధిని చంపేస్తాయి. పరమాత్మ ఇచ్చిన బుద్ధికి ప్రయోజనం పరమాత్మ గురించీ, పరమాత్మ భక్తుల గురించీ ఆలోచించుటే ప్రయోజనం. చెడు నుంచి మంచి వైపుకు తీసుకెళ్ళే వాటిలో ప్రధానమైనది ఆహారం. పరమాత్మ గురించి ఆలోచించకపోయినా, స్వార్ధపరాయణుల గురించి హింసాశీలూర్ గురించి ధంభము కలిగినవారి గురించి ఆలోచిస్తే, వారు వైకుంఠమునకు రాలేరు. ఇలాంటి కథలు వినేవారు చెరిగిపోయిన అదృష్టము కలిగిన వారు. అటువంటి వారు రక్షణ లేని చీకటి లోకాలలో పడిపోతారు. బుద్ధిని పాడు చేసే కథలను, లోభమూ దంభమూ హింసా ప్రోతసహించే వారి కథలను విన్న వారు నరకములో పడతారు.
యేऽభ్యర్థితామపి చ నో నృగతిం ప్రపన్నా
జ్ఞానం చ తత్త్వవిషయం సహధర్మం యత్ర
నారాధనం భగవతో వితరన్త్యముష్య
సమ్మోహితా వితతయా బత మాయయా తే
కొంతమంది ఏరి కోరి వివేకాన్ని పొందే అవకాశం ఉన్న, జ్ఞ్యానము ఉన్నా, పరమాత్మ జీవాత్మ తత్వము తెలుసుకొనే, ధర్మము తెలుసుకొనే అవకాశం ఉన్న, మానవ జన్మను పొంది కూడా, పరమాత్మ ఆరాధనం చేయరు. అన్ని లోకాలలో విస్తరించి ఉన్న పరమాత్మ మాయచేత సమ్మోహింపబడి అటువంటి వారు వైకుంఠానికి రాలేరు.
యచ్చ వ్రజన్త్యనిమిషామృషభానువృత్త్యా
దూరే యమా హ్యుపరి నః స్పృహణీయశీలాః
భర్తుర్మిథః సుయశసః కథనానురాగ
వైక్లవ్యబాష్పకలయా పులకీకృతాఙ్గాః
కొందరు వెళ్తారు. పరమాత్మను అనుసరించడము చేత (వృషభానువృత్త్యా), అష్టాంగయోగాన్ని అవలంబించి, చాలా మంది చేత కోరబడే స్వభావము కలవారు (స్పృహణీయశీలాః). మంచి కీర్తి కలవాడైన (సుయశసః ), పరమాత్మ యొక్క కథలను ప్రేమతో వినడం వలన, ముఖములో రంగు మారుతుంది, శరీరములో రంగు మారుతుంది. ముఖం ఆనందముతో విప్పారి, ఆనందముతో శరీరం వణుకుతుంది. శరీరములో ప్రతీ అవయవములో, ప్రతీ భాగములో పులకింతలు వస్తాయి.
తద్విశ్వగుర్వధికృతం భువనైకవన్ద్యం
దివ్యం విచిత్రవిబుధాగ్ర్యవిమానశోచిః
ఆపుః పరాం ముదమపూర్వముపేత్య యోగ
మాయాబలేన మునయస్తదథో వికుణ్ఠమ్
విశ్వానికి మొట్టమొదటి గుర్వైన స్వామి చేత నివసించబడేది. అన్ని లోకములతో నమస్కరించబడేది. దివ్యమైనదీ, విచిత్రమైన దేవతల విమాన కాంతితో ప్రకాశించేది. సనకాదులు తమ యోగమాయా బలముతో అటువంటి దివ్యమైన వైకుంఠనగారాన్ని చేరి సంతోషాన్ని పొందారు. (ఇది కేవలం ప్రకృతి మండలములో ఉన్న వైకుంఠము మాత్రమే. ఎందుకంటే అసలైన వైకుంఠమునకు వెళితే మరలా తిరిగి రావడం ఉండదు. వామన చరిత్రలో పరమాత్మ పాదం వైకుంఠము వరకూ వెళ్తుంది. అప్పుడు జయ విజయులు ఆ పాదాన్ని ప్రక్షాళన చేసారు. నారసింహ అవతారాం తరువాత వచ్చింది వామనావతారం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ వర్ణింపబడిన వైకుంఠము త్రిపాద్ వైకుంఠము కాదు. ఈ వైకుంఠానికే హిరణ్యకశిపుడూ వచ్చాడు, రావణుడూ వచ్చాడు. అంటే ఇది అసలైన వైకుంఠము కాదు. వామనావతారములో ఉన్న జయవిజయులు వేరు. ఇక్కడి జయ విజయులు వేరు. భగవత్రామానుజులు వైకుంఠ గద్యం అని రచించారు. దానిలో అసలైన వైకుంఠము ఎలా ఉంటుందో వ్రాశారు)
తస్మిన్నతీత్య మునయః షడసజ్జమానాః
కక్షాః సమానవయసావథ సప్తమాయామ్
దేవావచక్షత గృహీతగదౌ పరార్ధ్య
కేయూరకుణ్డలకిరీటవిటఙ్కవేషౌ
అటువంటి వైకుంఠనగరానికి సనకాదులు ఆరు ద్వారాలు దాటి వెళ్ళారు. దేని యందు మనసు లగ్నము చేయని వారు కాబట్టి ఆరు ద్వారాలు దాటగలిగారు. ఇలా ఆరు ద్వారములు దాటి ఏడవ ద్వారానికి వెళ్ళారు. ఆ ఏడవద్వారములో సమాన వయసు గల ఇద్దరు ద్వారపాలకులు, గద చేతిలో పట్టుకొని, అనేకాభరణములచే అలనకరించబడి ఉన్నవారు,
మత్తద్విరేఫవనమాలికయా నివీతౌ
విన్యస్తయాసితచతుష్టయబాహుమధ్యే
వక్త్రం భ్రువా కుటిలయా స్ఫుటనిర్గమాభ్యాం
రక్తేక్షణేన చ మనాగ్రభసం దధానౌ
మెడలో వనమాలలో ఉన్న పుష్పముల సౌగంధ్యానికి ఆశపడి తుమ్మెదలతో కూడి ఉన్న వనమాల కలవారు. నాలుగు బాహువులతోటి, నీలమేఘశ్యాములై, ఉన్నారు. ఒక్క నేత్రములు తప్ప అన్ని విషయములలో సమానమైన పోలిక గలవారు. ముడివేయబడి కొద్దిగా ఎర్రబడిన కన్నులు గలవారై ఉన్నారు
ద్వార్యేతయోర్నివివిశుర్మిషతోరపృష్ట్వా
పూర్వా యథా పురటవజ్రకపాటికా యాః
సర్వత్ర తేऽవిషమయా మునయః స్వదృష్ట్యా
యే సఞ్చరన్త్యవిహతా విగతాభిశఙ్కాః
ఇంతకు ముందు ఉన్న ద్వారములు దాటినట్లు ఈ ద్వారాన్ని కూడా ప్రవేశించే ప్రయత్నం చేసారు సనకాదులు. వీరు అంతటా సామ్య దృష్టి గలవారు, మునులు, మనసులో గానీ మాటలో గానీ భావములో గానీ వైషమ్యం లేదు. ఎటువంటి సంకా కలిగించని వారు ఈ సనకాదులు
తాన్వీక్ష్య వాతరశనాంశ్చతురః కుమారాన్
వృద్ధాన్దశార్ధవయసో విదితాత్మతత్త్వాన్
వేత్రేణ చాస్ఖలయతామతదర్హణాంస్తౌ
తేజో విహస్య భగవత్ప్రతికూలశీలౌ
గాలే వస్త్రముగా కలిగినవారు. చాలా వృద్ధులు. వృద్ధులందరికంటే వృద్ధులు. వృద్ధులైనా వీరి వయసు ఐదేండ్లు మాత్రమే. ఆత్మ తత్వము బాగా తెలిసిన వారు. అందుకే వీరు శరీరాని పట్టించుకోరు. అందుకు బట్టలు వేసుకోరు. చేతిలో బెత్తం (వేత్రేణ ) అడ్డుగా పెట్టారు ద్వారపాలకులు. అలా చేయుటకు తగని వారి యందు, పరమాత్మకు వ్యతిరేకమైన స్వభావముతో ద్వారపాలకులు అడ్డగించారు.
తాభ్యాం మిషత్స్వనిమిషేషు నిషిధ్యమానాః
స్వర్హత్తమా హ్యపి హరేః ప్రతిహారపాభ్యామ్
ఊచుః సుహృత్తమదిదృక్షితభఙ్గ ఈషత్
కామానుజేన సహసా త ఉపప్లుతాక్షాః
దేవతలందరూ చూస్తుండగా (మిషత్స్వనిమిషేషు ) పూజించదగినవారైన సనకాదులు ద్వారపాలకుల చేత ఆపబడ్డారు. అత్యంత ప్రీతి పాత్రుడైన పరమాత్మని చూడకుండా అడ్డాగించినందుకు, దర్శనానికి భంగం కలిగించినందు వలన, వచ్చిన కామానుజుడి (కోపం) వలన కొద్దిగా కోపం వచ్చి వారి నేత్రాలు కోపముతో ఎర్రబడ్డాయి.
మునయ ఊచుః
కో వామిహైత్య భగవత్పరిచర్యయోచ్చైస్
తద్ధర్మిణాం నివసతాం విషమః స్వభావః
తస్మిన్ప్రశాన్తపురుషే గతవిగ్రహే వాం
కో వాత్మవత్కుహకయోః పరిశఙ్కనీయః
వైకుంఠములో ఇటువంటి స్వభావం ఎలా వచ్చింది. వైకుంఠములో పరమాత్మకు సేవ చేస్తూ, పరమాత్మ ధర్మాన్ని స్వీకరించి ఉండే వారిలో ఈ స్వభావం ఎలా వచ్చింది. కోపమూ ద్వేషమూ లేని, విరోధము లేని వాడైన పరమాత్మ దగ్గర మీలా కపట భావము కలవారని (ఆత్మవత్కుహకయోః) అనుమానించదగినవారు (పరిశఙ్కనీయః) ఎవరు.
న హ్యన్తరం భగవతీహ సమస్తకుక్షావ్
ఆత్మానమాత్మని నభో నభసీవ ధీరాః
పశ్యన్తి యత్ర యువయోః సురలిఙ్గినోః కిం
వ్యుత్పాదితం హ్యుదరభేది భయం యతోऽస్య
లోకములన్నీ ఆయన ఉదర్ములోనే ఉన్నాయి. ప్రళయములో ఆ లోకాలన్నీ ఆయన కడుపులోకి లీనమైతే వాటిని కూడా ఆపుతారా? పరమాత్మకు అన్ని లోకాలు సమానమే. ఆత్మలో ఒక ఆత్మ ఉన్నట్లు, ఆకాశములో ఇంకో ఆకాశము ఉన్నట్లు, పరమాత్మ కుక్షిలో ఉండటం అనే సామ్యం అన్ని లోకాలకూ ఒకటే. ఈ విషయం జ్ఞ్యానులకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి స్వామి దగ్గరా, స్వామి విషయములో, స్వామి సేవకుల వేషం వేసుకున్న మీలో, పరమాత్మకు హాని కలిగిస్తారనే అనుమానం ఎందుకొచ్చింది. పరమాత్మ యందు భేధ దృష్టి ఉన్నవారికి భయం కలుగుతుంది. పరమాత్మను సేవించడానికి వెళ్ళేవారు పరమాత్మకు హాని కలిస్తారన్న బుద్ధి దేవతా వేషం వేసుకున్న మీకు ఎలా కలిగింది.
తద్వామముష్య పరమస్య వికుణ్ఠభర్తుః
కర్తుం ప్రకృష్టమిహ ధీమహి మన్దధీభ్యామ్
లోకానితో వ్రజతమన్తరభావదృష్ట్యా
పాపీయసస్త్రయ ఇమే రిపవోऽస్య యత్ర
ఇలాంటి పరమాత్మదగ్గర ఇలా ప్రవర్తించారు కాబట్టి, ఇలాంటి వారు ఉండదగిన చోటు గురించి ఆలోచిస్తాము. పరమాత్మకు అపకీర్తి తెచ్చే మీలంటి వారు ఇక్కడ ఉండకూడదు. మీరు ఎక్కడ ఉండాలో ఆలోచిస్తాము. కాబట్టి మీరు, ఈ లోకాల నుండి బయలు దేరి, ఎక్కడ ఈ ముగ్గురు శత్రువులు బాగా ఉంటారో అక్కడికి చేరండి. కామ క్రోధ లోభ.
తేషామితీరితముభావవధార్య ఘోరం
తం బ్రహ్మదణ్డమనివారణమస్త్రపూగైః
సద్యో హరేరనుచరావురు బిభ్యతస్తత్
పాదగ్రహావపతతామతికాతరేణ
ఇలా వీరు మాట్లాడిన తరువాత అర్థమయ్యింది, వీరు ఎలాంటి వారో. దేనినైనా నివారించవచ్చుగానీ, ఏ అశ్త్ర శస్త్రముతో దీన్ని తొలగించలేము. మేము చాలా తప్పు చేసమనుకుని చాలా భయపడ్డారు. దైన్యముతో వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు.
భూయాదఘోని భగవద్భిరకారి దణ్డో
యో నౌ హరేత సురహేలనమప్యశేషమ్
మా వోऽనుతాపకలయా భగవత్స్మృతిఘ్నో
మోహో భవేదిహ తు నౌ వ్రజతోరధోऽధః
తప్పు చేసిన వారి యందు మీరు విధించిన శిక్ష మాకు కావల్సిందే. మేము దేవతలనూ (పరమాత్మ భక్తులను) హేళన చేసిన దోషము పోతుంది. అటువంటి పాపాన్ని పొగొట్టే మీ శిక్ష మాకు ఆమోదమే. దాని వలన ఆ పాపం శమిస్తుంది. ఎలాగూ శపించారు, కింది లోకాలకు వెళుతున్న మా గురించి కూడా మీరు ఆలోచిస్తుంటారు కదా. మా గురించి మీరు చేసే ఆలోచన మాకు ఉపకారము చేయాలి. మేము ఏ ఏ లోకాలకు వెళ్ళినా, ఏ ఏ జాతులలో పుట్టినా, ఈ స్వామిని మాత్రం మరచిపోకుండా ఉండే వరము ఇవాండి. మనకు పరమాత్మ యందు భక్తి కలగాలంటే, పరమభాగవతులు మన గురించి ఒక్క సారి "వీడు మనవాడు" అని అనుకొంటే చాలు. పరమాత్మ భక్తుల మనసులో మనము మెలగగలిగితే అదే పుణ్యం. పరమాత్మ మీద ఎక్కువ భక్తితో ఉన్నమంటే దానికి కారణం మన మీదా భాగవతుల దృష్టి ఉన్నది అని అర్థం. అందుకే వారు కోరుతున్నారు " ఏ జాతిలో ఉన్నా భగవానుని మరచిపోకుండా అనుగ్రహించండి"
పరమాత్మ ధ్యానాన్ని మరచిపోయే మోహము మా జోలికి రాకూడదు. భాగవతులు మనల్ని స్మరించుటే మనకు అదృష్టము, మేలు.
ఏవం తదైవ భగవానరవిన్దనాభః
స్వానాం విబుధ్య సదతిక్రమమార్యహృద్యః
తస్మిన్యయౌ పరమహంసమహామునీనామ్
అన్వేషణీయచరణౌ చలయన్సహశ్రీః
ఇలా వీరు మాట్లాడుతుంటే, సజ్జనుల హృదయములో నివసించే పద్మనాభుడు, తన సేవకులు పెద్దలనతిక్రమించారని తెలుసుకొని, ఆ ప్రదేశానికి తాను వేళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళాడు. పరమ హంసలు, మహామునులు వెతుకుతున్న చరణములను కదిలిస్తూ వెళ్ళాడు. త్వరాయై నమః అని స్వామికి పేరు. అమ్మవారిని తీసుకుని వచ్చాడు.
తం త్వాగతం ప్రతిహృతౌపయికం స్వపుమ్భిస్
తేऽచక్షతాక్షవిషయం స్వసమాధిభాగ్యమ్
హంసశ్రియోర్వ్యజనయోః శివవాయులోలచ్
ఛుభ్రాతపత్రశశికేసరశీకరామ్బుమ్
పరమాత్మ నడిచి వస్తూంటే, చుట్టూ ఉన్న అనుచరులు కానుకలు ఇస్తూ, పూజలు చేస్తూ ఉన్నారు. అలా పూజలందుకుంటున్న స్వామివారిని సనకాదులు చూచారు. ఇంతకాలం ఈ పురుషున్ని తమ సమాధిలో చూచారు. ఇపుడు స్వయముగా చూచారు. ఆ పరమాత్మ వచ్చినపుడు ఆయనకు ఇబ్బంది కలగకుండా కొందరు గొడుగు పట్టారు. హంసల శొభను పొందిన చామరములూ, ఆ చామరముల ద్వారా శుభకరములైన వాయువు వీస్తున్నాయి. చంద్ర కిరణముల యొక్క చల్లదనాన్ని ఆతపత్రం ప్రకటిస్తోంది. చత్ర చామరముల శొభతో, భత్కుల యొక్క పూజతో పరమాత్మ వేంచేసాడు
కృత్స్నప్రసాదసుముఖం స్పృహణీయధామ
స్నేహావలోకకలయా హృది సంస్పృశన్తమ్
శ్యామే పృథావురసి శోభితయా శ్రియా స్వశ్
చూడామణిం సుభగయన్తమివాత్మధిష్ణ్యమ్
పరిపూర్ణమైన అనుగ్రహముతో ప్రసన్నమైన ముఖముతో, ఎలాంటి వారైన ఇటువంటి పరమాత్మను కనులారా చూడాలనిపించే స్వరూపము కలవాడు, ప్రీతి వెదజల్లుతున్న చూపుతో హృదయాన్ని తాకుతూ, నీలమేఘశ్యామ వర్ణముతో, అమ్మవారు బాగా విహరించడానికి విశాలముగా ఉన్న వక్షస్థలం. ప్రకాశిస్తూ ఉన్న అమ్మావరిచేత, అమ్మవారు వక్షస్థలములో ఉండుట వలన బాగా ప్రకాశిస్తూ ఉన్న కౌస్తుభముతో,
పీతాంశుకే పృథునితమ్బిని విస్ఫురన్త్యా
కాఞ్చ్యాలిభిర్విరుతయా వనమాలయా చ
వల్గుప్రకోష్ఠవలయం వినతాసుతాంసే
విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జమ్
పీతాంబరం ధరించిన వాడు, తుమ్మెదలు విహరించే వనమాల ధరించినవాడు, సుందరమైన, పుష్టిగా ఉన్న, కంకణం ఉన్న ముంజేతిని గరుత్మంతుని మీద వేసి, ఇంకో చేతితో పద్మాన్ని పట్టుకున్నాడు
విద్యుత్క్షిపన్మకరకుణ్డలమణ్డనార్హ
గణ్డస్థలోన్నసముఖం మణిమత్కిరీటమ్
దోర్దణ్డషణ్డవివరే హరతా పరార్ధ్య
హారేణ కన్ధరగతేన చ కౌస్తుభేన
మెరుపులను వెదజల్లుతున్న మకర కుండలముల చేత అలంకరించబడిన కర్ణములు కలిగినవాడు, ఆ కాంతి చెక్కిళ్ళ యందు వ్యాపించి, ఆ కాంతి ఇంకాస్త ముందుకు వెళ్దామని ప్రయత్నించినపుడు, పరమాత్మ ముక్కు చెక్కిళ్ళూ అధరములూ వింతగా ప్రకాశిస్తున్నాయి. స్వామి కిరీటము మణులతో ఉన్నది. రెండు భుజముల మధ్యన (దోర్దణ్డషణ్డవివరే ), ఉత్తమమైన హారముతోటీ, కౌస్తుభమణితోటీ,
అత్రోపసృష్టమితి చోత్స్మితమిన్దిరాయాః
స్వానాం ధియా విరచితం బహుసౌష్ఠవాఢ్యమ్
మహ్యం భవస్య భవతాం చ భజన్తమఙ్గం
నేముర్నిరీక్ష్య న వితృప్తదృశో ముదా కైః
కౌస్తుభమణి వనమాలను చూస్తే అమ్మవారే స్వామి వారు పెళ్ళి చేసుకుని వచ్చారా"ఇక్కడ ఇంకెవరైనా నాకు పోటీ వస్తున్నారా" అని అనుమానం వచ్చిందేమో అనిపించేట్లు, అమ్మవారి ముఖం కొంచెం అనుమానముతో లజ్జతో ఎర్రబడినట్లు ఉన్నది. నాకు (బ్రహ్మకూ), శివునికీ, మీకు ఎవరు ముఖ్యమో, అటువంటి పరమాత్మను తృత్పి పొందని నేత్రముతో నమస్కారము చేసారు
తస్యారవిన్దనయనస్య పదారవిన్ద
కిఞ్జల్కమిశ్రతులసీమకరన్దవాయుః
అన్తర్గతః స్వవివరేణ చకార తేషాం
సఙ్క్షోభమక్షరజుషామపి చిత్తతన్వోః
అరవింద నయనము కలవాడు, అరవింద పాదము కలవాడు, అరవింద (పద్మ)నాభుడు, ఆ పద్మము యొక్క పుప్పొడితో కలిసి ఉన్న తులసి యొక్క సువాసన అంతటా వ్యాపించి అందరిలోపలికీ వెళ్ళి, అక్కడ ఉన్న వారి మనసులో ఉన్న కల్మషాన్ని శుభ్రం చేసింది. మనసులో ఉన్న చిత్త క్షోభ తొలగిపోయింది, ఆ కింజల్కములతో కలిసి ఉన్న తులసితో ఉన్న చల్లని వాయువుతో. పరమాత్మను నిరంతరమూ సేవించేవారి మన్సులో కూడా ఆ వాయువు పరవశముతో మనసు ఉప్పొంగేట్లు క్షోభ కలిగించింది. ఒక క్షోభను తొలగించి, ఇంకో క్షోభను కలిగించింది. శరీరమూ మనసూ పులకించింది.
తే వా అముష్య వదనాసితపద్మకోశమ్
ఉద్వీక్ష్య సున్దరతరాధరకున్దహాసమ్
లబ్ధాశిషః పునరవేక్ష్య తదీయమఙ్ఘ్రి
ద్వన్ద్వం నఖారుణమణిశ్రయణం నిదధ్యుః
వారు మల్లెమొగ్గల నవ్వులాంటి పరమాత్మ నవ్వుని చూచారు. ఆ సౌందర్య శొభను చూస్తూ, ఆయన ఆశీర్వాదాన్ని పొంది, తలవంచి , గోళ్ళ కాంతితో ప్రకాశిస్తున్న పరమాత్మ పాదములని నమస్కరించారు. ప్రపంచములో అన్ని జీవులూ , యమ నియమాది అష్టాంగ యోగముతో దేన్ని వెతుకుతూ ఉంటారో, అన్ని ధ్యానములూ ఎవరి కోసమో, అందరి కన్నులకూ ఎవరు సుందరుడో,
పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గైర్
ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామమ్
పౌంస్నం వపుర్దర్శయానమనన్యసిద్ధైర్
ఔత్పత్తికైః సమగృణన్యుతమష్టభోగైః
పరమాత్మను మాత్రమే దర్శించడానికే అన్ని (అష్టాంగ యోగాది) మార్గాలు ఉన్నాయి. అష్ట సిద్ధులతో ఉన్న పరమాత్మను సనకాదులు స్తోత్రము చేసారు.
సనకాదులు చేసిన ఈ స్తోత్రములోనే అసలు భాగవత తత్వం ఏమిటొ తెలుస్తుంది. ఇవి పొద్దున్నే చదువుకోవలసిన శ్లోకాలు. నాలుగు వేదాల సారమంటారు వీటిని
కుమారా ఊచుః
యోऽన్తర్హితో హృది గతోऽపి దురాత్మనాం త్వం
సోऽద్యైవ నో నయనమూలమనన్త రాద్ధః
యర్హ్యేవ కర్ణవివరేణ గుహాం గతో నః
పిత్రానువర్ణితరహా భవదుద్భవేన
పరమాత్మ అందరికీ అంతర్యామిగానే ఉంటాడు. సజ్జనులకూ దుర్జనులకూ కూడా. యోగమునందు ఆసక్తి లేని వారు, పరమాత్మను భజించని వారి హృదయములో కూడా కనపడకుండా ఉంటావు. సజ్జనులకు కూడా నీవు హృదయములోనే భాసిస్తావు గానీ నేత్ర సాక్షాత్కారం ఉండదు. మంచి వారికీ కనపడవూ, చెడ్డవారికీ కనపడవు. అలాంటి నీవు ఈనాడు మా కన్నులకు కనపడుతున్నావు. నీవు అనంతుడవు. నీ జ్ఞ్యానము గానీ, ఐశ్వర్యము గానీ, గుణము గానీ, "ఇంతా" అని చెప్పడానికి వీలు కాదు. అందుకు మేము ధన్యులము.
ఈనాడు మా కనులకు కనపడిన నీ గురించే నీ నుండీ పుట్టిన మా తండ్రిగారు చెప్పారు. ఇంతకాలం కర్ణ రంధ్రములోంచి ప్రవేశించే నీవు, ఈనాడు కనుల ద్వారా వచ్చావు. ఇంతకాలం మా తండ్రిగారు చెప్పగా మా కర్ణ రంధ్రముల గుండా ప్రవేశించావు. నీవు మాకు దూరముగా లేవు, మాకు కాని వాడవు కావు, మాకు అందని వాడవు కావు. మేము కాదనుకున్నా, అవుననుకున్నా, నీవు మాత్రం మమ్మల్ని కాదనుకోవు.
తం త్వాం విదామ భగవన్పరమాత్మతత్త్వం
సత్త్వేన సమ్ప్రతి రతిం రచయన్తమేషామ్
యత్తేऽనుతాపవిదితైర్దృఢభక్తియోగైర్
ఉద్గ్రన్థయో హృది విదుర్మునయో విరాగాః
పేర్లు వేరు వేరు పెట్టినా, వేరు వేరు రూపాలలో ఉన్నా, పరమాత్మ తత్వము ఒకటే అని మాకు తెలుసు. నిన్ను మేము తెలుసుకున్నాము (తం త్వాం విదామ). ప్రపంచములో ఉన్న ప్రతీ వస్తువుకూ, ప్రతీ వ్యక్తికీ మరొక వస్తువుకు మీదా, వ్యక్తిమీదా ప్రీతి కలగడానికి కారణమేమిటి. బృహదారణ్యకోపనిషత్తులో ఇలా ఉంది "ప్రతీ వాడు నా భార్య నన్నే ప్రేమించాలి, లేదా ప్రతీ భార్యా నా భర్త నన్ను ప్రేమించాలి అని గానీ, కొడుకు, నా తండ్రి నన్ను ప్రేమించాలి అని కోరుకుంటారు, భావిస్తారు. ఇలా అనుకున్న వారందరూ ప్రేమిస్తున్నారా? ప్రేమగా ఉంటున్నారా? వివాహం చేసుకున్న కొద్ది రోజులవరకూ ఉన్న ప్రేమ తరువాత ఉండటం లేదు. మరి లోపం ఎక్కడుంది. ప్రేమగా ఉండాలని భర్త గానీ, భార్య గానీ ఉండాలనుకుంటే ఉండలేరు. భగవంతుడు కోరుకుంటే భార్య భర్తలు గానీ, తండ్రీ కొడుకులు గానీ, అత్తా కోడళ్ళు గానీ అన్యోన్యంగా ఉంటారు. అండుకే వివాహం మంత్రాలతో ఏర్పడాలి, వివాహం ముందూ, వివాహంలోనూ, వివ్హాహం తరువాతా, సంతానం కోసమూ పరమాత్మనే పూజించాలి. పరమాత్మ కోరితేనే భార్యను భర్తా, భర్తను భార్యా, తండ్రిని కొడుకూ, కొడుకునూ తండ్రీ ప్రేమిస్తాడు. ఆత్మన కామాయ. ఆయన కోరుకుంటేనే ఇంటికీ యజమానికి బంధం పెరుగుతుంది - స్థిరాస్తి గానీ, చరాస్తి గానీ, బంధుమిత్రుల బంధం గానీ. మన కోరికలూ సంకల్పాలు నెరవేరవు. పరమాత్మ సంకల్పిస్తేనే కలుగుతాయి. పరస్పరం ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించేవాడు పరమాత్మే. "
ఈ జగత్తు లోని వారందరికీ ప్రీతిని కల్పిస్తున్నావు. ప్రపంచములో ఎదుటి వస్తువు మీద ఇంకో వస్తువుకి విడగొట్టుకోరాని ప్రీతి దానంతటది కలగదు , నీవు కలిగిస్తావు. ప్రతీ వస్తువుకూ ఇంకో దాని మీద ప్రీతి కలిగించేది నీవు. అఖిల జగత్తులో ప్రేమతత్వాన్ని నింపినది నీవు. ప్రేమే నీ స్వరూపం. ఇది మేము తెలుసుకున్నాము.
ఇహ లోకములో సుఖమయ జీవితం కోరి ఆచరించే పనుల వలన కలిగిన సంపదలు ఎలా క్షీణిస్తునాయో, ఈ లోకములో స్వర్గాదులు కలగాలని చేసిన యజ్ఞ్య యాగాది కర్మల ఫలితాలు కూడా క్షీణిస్తాయి. మనము చేసిన పనుల వలన ఫలితము నాశనమే ( అది ఈ లోకములో కావొచ్చు పరలోకములో కావచ్చు) ఇంత కష్టపడి ఆచరించే కర్మలు నశించే వాటిని పొందడానికా? నశించని వాటిని పొందాలంటే ఏమి చేయాలో పశ్చాతాపముతో తెలియబడతారు (ఈ ప్రపంచములో ఉండి కష్టపడి భోగాలు సంపాదించి "అందరికంటే చాలా గొప్ప వాడిని" అనుకొంటున్న క్షణములో మొత్తం ఆస్తి తృటిలో పోతుంది. అందుకే భాగవతం కృష్ణ నిర్యానముతో, యదుకుల క్షయముతో, కురువంశ క్షయముతో మొదలయ్యింది) . దీన్నే అనుతాపం అంటారు ( పశ్చాత్తాపం అని కూడా అనొచ్చు). అలా పశ్చాత్తాపం కలిగిన నాడే భగవత్తత్వం తెలుస్తుంది. అలా తెలిసిన తత్వం వలన కలిగిన భక్తి పెరిగి, యోగముగా మారి, గ్రంధి భేధనమవుతుంది. అహంకార గ్రంధి భేధింపబడుతుంది. అహం ("నేను నేను") అనేది హృదయాన్ని బంధించి ఉంటుంది ఎప్పుడూ. ఆ హృదయ గ్రంధి భక్తి కలిగితే పోతుంది. ఆ భక్తి పశ్చాత్తాపం కలిగితే వస్తుంది. అప్పుడు ప్రపంచం యందు వైరాగ్యం కలుగుతుంది. పశ్చాత్తాపం కలగాలి, పరమాత్మ తత్వం తెలియాలి, పరమాత్మ యందు భక్తి కలగాలి, ప్రపంచం యందు వైరాగ్యం కలగాలి, అహంకార గ్రంధి తొలగాలి. ఈ ఐదూ ఐతే వారు మునులు అవుతారు. ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. ఇవన్నీ కలిగిన తరువాత యోగులూ మునులూ, హృదయములో నీవున్నావని తెలుసుకుంటారు. అలాంటి నిన్ను ఇపుడు మేము కనులకెదురుగా చూస్తున్నాము.
నాత్యన్తికం విగణయన్త్యపి తే ప్రసాదం
కిమ్వన్యదర్పితభయం భ్రువ ఉన్నయైస్తే
యేऽఙ్గ త్వదఙ్ఘ్రిశరణా భవతః కథాయాః
కీర్తన్యతీర్థయశసః కుశలా రసజ్ఞాః
పరమాత్మ భక్తులు "నీ పాదములే మాకు రక్షకులు " అని శరణు వేడతారు. కీర్తన చేసేవారిని పవిత్రం చేస్తాడన్న పేరుపొందిన వాడవైన (కీర్తన్యతీర్థయశసః ) నీ కథ యొక్క రసము తెలిసిన వారు. అట్టివారు నేర్పరులు, సమర్ధులు (కుశలా ). దేనిలో సమర్ధులు? సంసారాన్ని దాటడములో, మాయకు అతీతులవడములో, ఆచరించిన కర్మకు ఫలితము రాకుండా చేయగలిగిన సమర్ధులు. తాము చేసిన పని యొక్క ఫలితం పొందకుండా ఉన్న వారు కుశలులు. నీ దయకు చరమావది అయిన మోక్షాన్ని కూడా వారు కోరరు. (మోక్షమే పరమాత్మ అనుగ్రహానికి చివర). మోక్షాన్ని కూడా కోరని భక్తులు నీ కనుబొమ్మల కదలికతో నశించే ఇతర ఫలితాలను (స్వర్గాది లోక ఫలితములను) కోరతారా? వారు సమర్ధులు, కుశలులు, నేర్పరులు కాబట్టి దేన్ని కోరాలో వారికి తెలుసు. నిరంతరం పరమాత్మ కథా శ్రవణం చేసేవారు మోక్షం కూడా కోరరు.
కామం భవః స్వవృజినైర్నిరయేషు నః స్తాచ్
చేతోऽలివద్యది ను తే పదయో రమేత
వాచశ్చ నస్తులసివద్యది తేऽఙ్ఘ్రిశోభాః
పూర్యేత తే గుణగణైర్యది కర్ణరన్ధ్రః
మేము చేసిన పాపాలకు శాస్త్రం ప్రకారం ఏ నరకములు రావాలో ఆ నరకములోనే జన్మ ఉండనీ (నిరయేషు స్తాచ్). నరకములో ఉన్నా మా మనసు తుమ్మెదలు మకరందాన్ని కోరినట్లు నీ పాదపద్మాలనే కోరాలి. తులసి ఎలా నీ పాదాలను సేవిస్తుందో మా వాక్కు కూడా నీ పాదాలనే ఆశ్రయించాలి. నీ కథా శ్రవణముతో మా చెవులు నిండాలి. మమ్మల్ని ఎక్కడైనా పంపు గానీ మా మనసు నీ పదములయందు రమించేట్లు, వాక్కు తులసి లాగ నీ పదముల యందు ఉండాలి, చెవులు నీ కథలతో నిండాలి, మా కనులు నీ రూపాన్ని చూడాలి.
ప్రాదుశ్చకర్థ యదిదం పురుహూత రూపం
తేనేశ నిర్వృతిమవాపురలం దృశో నః
తస్మా ఇదం భగవతే నమ ఇద్విధేమ
యోऽనాత్మనాం దురుదయో భగవాన్ప్రతీతః
గొప్ప మంత్రములతో, వేదొ సూత్రములతో ఆహ్వానింపబడే వాడా (పురుహూత ), నీవు ఏ రూపాన్ని సాక్షాత్కరింపచేసావో, ఆ రూపాన్ని చూసిన మా నేత్రాలు తృప్తి పొందాయి. మానసిక నిగ్రహం లేని (అనాత్మనాం) వారికి నీ సాక్షాత్కారం ఉండదు అని ప్రసిద్ధి పొందిన నీవు, మా ముందర సాక్షాత్కరింపచేసిన నీ రూపముతో మా కనులు తృప్తి పొందాయి.