విదుర ఉవాచ
స్వాయమ్భువస్య చ మనోరంశః పరమసమ్మతః
కథ్యతాం భగవన్యత్ర మైథునేనైధిరే ప్రజాః
మనువు నుండి స్త్రీ పురుష సమాగమ సృష్టి పెరిగిందని చెప్పారు కదా.
ప్రియవ్రతోత్తానపాదౌ సుతౌ స్వాయమ్భువస్య వై
యథాధర్మం జుగుపతుః సప్తద్వీపవతీం మహీమ్
ప్రియవ్రత ఉత్తాన పాదులు జన్మించారని చెప్పరు స్వాయంభువుకు. ఆకూతి దేవహూతి రుచి అనే పుత్రికలు పుట్టారని
తస్య వై దుహితా బ్రహ్మన్దేవహూతీతి విశ్రుతా
పత్నీ ప్రజాపతేరుక్తా కర్దమస్య త్వయానఘ
ఈ దేవహూతి కర్దమ ప్రజాపతికి భార్య అయ్యింది అని చెప్పారు.
తస్యాం స వై మహాయోగీ యుక్తాయాం యోగలక్షణైః
ససర్జ కతిధా వీర్యం తన్మే శుశ్రూషవే వద
ఈ కర్దమ దేవహూతులకు ఎంతమంది సంతానం కలిగారు
రుచిర్యో భగవాన్బ్రహ్మన్దక్షో వా బ్రహ్మణః సుతః
యథా ససర్జ భూతాని లబ్ధ్వా భార్యాం చ మానవీమ్
వారి వారి భార్యల యందు సంతానాన్ని ఎలా పొంది జగత్తును ఎలా వృద్ధి చెందించారో, మానవీయ సృష్టి (మను సృష్టి) ఎలా జరిగింది.
మైత్రేయ ఉవాచ
ప్రజాః సృజేతి భగవాన్కర్దమో బ్రహ్మణోదితః
సరస్వత్యాం తపస్తేపే సహస్రాణాం సమా దశ
బర్హ్మ కర్దమ ప్రజాపతి సృష్టించి సృష్టి పెంచమని ఆజ్ఞ్యాపిస్తే కర్దమ ప్రజాపతి సరస్వతీ నదీ తీరములో తపస్సు చేస్తూ కూర్చున్నాడు. పదివేల సంవత్సరాలు తపస్సు చేసాడు
తతః సమాధియుక్తేన క్రియాయోగేన కర్దమః
సమ్ప్రపేదే హరిం భక్త్యా ప్రపన్నవరదాశుషమ్
పరమాత్మ స్వరూప సాక్షాత్కారం అతనికి కలిగింది.
తావత్ప్రసన్నో భగవాన్పుష్కరాక్షః కృతే యుగే
దర్శయామాస తం క్షత్తః శాబ్దం బ్రహ్మ దధద్వపుః
ఉపనిషత్మయమైన శరీరముతో పరమాత్మ సాక్షాత్కరించాడు.
స తం విరజమర్కాభం సితపద్మోత్పలస్రజమ్
స్నిగ్ధనీలాలకవ్రాత వక్త్రాబ్జం విరజోऽమ్బరమ్
కిరీటినం కుణ్డలినం శఙ్ఖచక్రగదాధరమ్
శ్వేతోత్పలక్రీడనకం మనఃస్పర్శస్మితేక్షణమ్
విన్యస్తచరణామ్భోజమంసదేశే గరుత్మతః
దృష్ట్వా ఖేऽవస్థితం వక్షః శ్రియం కౌస్తుభకన్ధరమ్
మకర కుండల హార కేయూరములతో మనసు హరించే చిరునవ్వు గల, గరుడిని అధిరోహించిన స్వామి, కౌస్తుభమణి కలిగి ఉన్న స్వామిని చూచి సాష్టాంగపడ్డాడు
జాతహర్షోऽపతన్మూర్ధ్నా క్షితౌ లబ్ధమనోరథః
గీర్భిస్త్వభ్యగృణాత్ప్రీతి స్వభావాత్మా కృతాఞ్జలిః
చేతులు జోడించి "ఇంత కాలానికి నా కన్నులు సార్ధకమయ్యాయి"
ఋషిరువాచ
జుష్టం బతాద్యాఖిలసత్త్వరాశేః సాంసిద్ధ్యమక్ష్ణోస్తవ దర్శనాన్నః
యద్దర్శనం జన్మభిరీడ్య సద్భిరాశాసతే యోగినో రూఢయోగాః
కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు ఏ దివ్య మంగళ విగ్రహాన్ని చూడగోరుతారో అలాంటి నిన్ను దర్శించాను.
యే మాయయా తే హతమేధసస్త్వత్ పాదారవిన్దం భవసిన్ధుపోతమ్
ఉపాసతే కామలవాయ తేషాం రాసీశ కామాన్నిరయేऽపి యే స్యుః
నీ మాయ వలన సంసారాన్ని దాటించగల పడవ వంటి నీ పాదములు ఉండి కూడా క్షుద్రమైన కోరికలు కోరతారు. నరకములో కూడా సుఖాన్ని భావిస్తారు.
తథా స చాహం పరివోఢుకామః సమానశీలాం గృహమేధధేనుమ్
ఉపేయివాన్మూలమశేషమూలం దురాశయః కామదుఘాఙ్ఘ్రిపస్య
మా తండ్రిగారు సృష్టి పెంచమని ఆజ్ఞ్యాపించారు. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నాలాంటి స్వభావము కల భార్యని కోరిన నేను నీ పాదపద్మములను చేరాను
ప్రజాపతేస్తే వచసాధీశ తన్త్యా లోకః కిలాయం కామహతోऽనుబద్ధః
అహం చ లోకానుగతో వహామి బలిం చ శుక్లానిమిషాయ తుభ్యమ్
బ్రహ్మ ఒక్క ఆజ్ఞ్యతో ఈ లోకమంతా సంసారమనే తాడుతో కట్టబడి ఉంది. నేను కూడా అటువంటి లోకములోనే ఉన్నాను. నీ ఆరాధనకు అడ్డురాని, మోక్షాన్ని ప్రసాదించే సంసారాన్ని, భక్తి జ్ఞ్యానములకు పనికొచ్చే సంసారాన్ని, పెంచే భార్యనూ, కలిగించే సంతానాన్ని ప్రసాదించు
లోకాంశ్చ లోకానుగతాన్పశూంశ్చ హిత్వా శ్రితాస్తే చరణాతపత్రమ్
పరస్పరం త్వద్గుణవాదసీధు పీయూషనిర్యాపితదేహధర్మాః
జ్ఞ్యానులైన వారు సంసారములో ఉండికూడా నీ పాదపద్మాలనే ఆశ్రయిస్తున్నారు. పరస్పర విరుద్ధమైన సంసరామూ మోక్షము, నీ దర్శనమైతే, నీ గుణాలు సంకీర్తన చేసే సంసారి సన్యాసి కన్నా గొప్పవాడు. నిరంతర నీ గుణ గానముతో మా దేహ ధర్మాన్ని మరచిపోవాలి.
న తేऽజరాక్షభ్రమిరాయురేషాం త్రయోదశారం త్రిశతం షష్టిపర్వ
షణ్నేమ్యనన్తచ్ఛది యత్త్రిణాభి కరాలస్రోతో జగదాచ్ఛిద్య ధావత్
ఎంత తిరిగినా అరగని ఆకులు గలది ఈ సంసారం. లోకములో ఉన్న చక్రాల ఇరుసు తిరిగితే అరుగుతుంది. కానీ ఈ చక్రం అరగదు. దీనికి పదమూడు ఆకులు ఉంటాయి ( పక్షము) మూడు వందల అరవై పర్వములు ఉంటాయి. ఆరు నేములు ఉంటాయి (ఋతువులు), మూడు నాభములు ఉంటాయి (వర్షము చలి ఎండ) పెద్ద నోరు ప్రవాహముగా గలది (ఎప్పటికీ ఆగనిది కాలము)
ఏకః స్వయం సన్జగతః సిసృక్షయా ద్వితీయయాత్మన్నధియోగమాయయా
సృజస్యదః పాసి పునర్గ్రసిష్యసే యథోర్ణనాభిర్భగవన్స్వశక్తిభిః
నీవు సకల జగత్తునీ ఒక్కడిగా ఉండి సృష్టించదలచి యోగ మాయ సహాయముతో ఈ జగత్తుని సృష్టించి రక్షించి సంహరిస్తున్నావు. సాలీడు పురుగులాగ.
నైతద్బతాధీశ పదం తవేప్సితం యన్మాయయా నస్తనుషే భూతసూక్ష్మమ్
అనుగ్రహాయాస్త్వపి యర్హి మాయయా లసత్తులస్యా భగవాన్విలక్షితః
నీవేది సంకల్పించుకున్నావో దాన్ని యోగమాయతో విస్తరింపచేస్తావు,అదే భూత సూక్ష్మము, (తన్మాత్రలు, పంచ్భూతములూ జ్ఞ్యాన కర్మేంద్రియాలు). నీవు సృష్టించిన సకల జగత్తు నీ అనుగ్రహం పొందడానికి మార్గముగా చేయి. నీ మెడలో ఉన్న తులసిమాల వాసన మాకు కొంచెం కలిగేట్లు చూడు.
తం త్వానుభూత్యోపరతక్రియార్థం స్వమాయయా వర్తితలోకతన్త్రమ్
నమామ్యభీక్ష్ణం నమనీయపాద సరోజమల్పీయసి కామవర్షమ్
అలాంటి నిరంతర ఆనందమయుడవైన నీవు , ఎటువంటి కర్మలూ చేయని నీవు, నీ మాయతో సకల చరాచర జగత్తునీ ప్రవర్తింపచేస్తున్నవాడివి. ఎంతో మంది చేత నమస్కరింపబడే నీ పదములకు నేను నిరంతరం నేను నమస్కరిస్తున్నాను.
ఋషిరువాచ
ఇత్యవ్యలీకం ప్రణుతోऽబ్జనాభస్తమాబభాషే వచసామృతేన
సుపర్ణపక్షోపరి రోచమానః ప్రేమస్మితోద్వీక్షణవిభ్రమద్భ్రూః
ఆ స్తోత్రం విన్న పరమాత్మ ప్రేమతో చిరునవ్వులు చిందిస్తూ ఇలా మాట్లాడాడు
శ్రీభగవానువాచ
విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజి తత్
యదర్థమాత్మనియమైస్త్వయైవాహం సమర్చితః
నీవు తపస్సు దేనికోసము చేసావో, యమ నియమాలతో దేని కోసం నన్ను ఆరాధించావో, నీ మానసిక అభిప్రాయాన్ని దాన్ని తెలిసి, దానికి కావలసిన ఏర్పాటు చేసాను
న వై జాతు మృషైవ స్యాత్ప్రజాధ్యక్ష మదర్హణమ్
భవద్విధేష్వతితరాం మయి సఙ్గృభితాత్మనామ్
నన్ను ఆరాధించుట ఎప్పుడూ వ్యర్థము కాదు. అందులో నీలాంటి వారు చేస్తే. స్వార్థమునూ స్వలాభాపేక్షను కోరి నీవు చేయలేదు. పెద్దలను ఆరాధన చేయడమే ప్రయోజనముగా గల మీవంటివారి ఆరాధన వ్యర్థం కాదు. కొందరికి మనసంతా కోరిక మీదే ఉంటుంది. కోరిక లభించిన తరువాత ఇంక తాను ఏమి పొందాలో దానిని కోరతారు కొందరు. కొందరు పరమాత్మ దర్శన స్పర్శన ఆలాపనలే ధేయముగా ఆరాధన చేస్తారు. ఇలాంటి మీరు చేసే ఆరాధన వ్యర్థము కాదు.
ప్రజాపతిసుతః సమ్రాణ్మనుర్విఖ్యాతమఙ్గలః
బ్రహ్మావర్తం యోऽధివసన్శాస్తి సప్తార్ణవాం మహీమ్
స చేహ విప్ర రాజర్షిర్మహిష్యా శతరూపయా
ఆయాస్యతి దిదృక్షుస్త్వాం పరశ్వో ధర్మకోవిదః
నీ దగ్గరకు వచ్చేముందే బ్రహ్మగారి పుత్రుడు అయినా, శుభ్కార్యములు చేసే స్వాయంభువ మనువు, బ్రహ్మావర్తమును రాజధానిగా చేసుకుని ఏడు సముద్రాల భూమండలానికి అధిపతి. ఆ మనువు తన భార్యతో, తన పుత్రికతో నిన్ను చూడటానికి ఎల్లుండి (పర్శ్వ) ఇక్కడికి వస్తున్నాడు. ధర్మము తెలిసినవాడు.
ఆత్మజామసితాపాఙ్గీం వయఃశీలగుణాన్వితామ్
మృగయన్తీం పతిం దాస్యత్యనురూపాయ తే ప్రభో
యవ్వనమూ స్వభావమూ సద్గుణమూ గల తన పుత్రికను భర్త కావాలని వెతుకుతూ ఇక్కడికి వస్తాడు. ఇంత వరకూ ఎలాంటి భార్యకోసం నీవు ఎదురుచూస్తున్నావో అలాంటి పుత్రిక నీదగ్గరకి వస్తుంది
సమాహితం తే హృదయం యత్రేమాన్పరివత్సరాన్
సా త్వాం బ్రహ్మన్నృపవధూః కామమాశు భజిష్యతి
యా త ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి
వీర్యే త్వదీయే ఋషయ ఆధాస్యన్త్యఞ్జసాత్మనః
ఆమెతో నీవు తొమ్మిది మంది పుత్రికలను పొందుతావు. నీ పుత్రికలను నవ ప్రజాపతులూ వివాహం చేసుకుంటారు.
త్వం చ సమ్యగనుష్ఠాయ నిదేశం మ ఉశత్తమః
మయి తీర్థీకృతాశేష క్రియార్థో మాం ప్రపత్స్యసే
నీవు నా ఆజ్ఞ్యను సక్రమముగా పరిపాలించి అన్ని కర్మల ఫలితాన్ని నాయందు సమర్పించి (కృష్ణార్పణం) సకల జీవ భూత దయ కలిగి, అందరినీ ప్రేమతో చూచి,
కృత్వా దయాం చ జీవేషు దత్త్వా చాభయమాత్మవాన్
మయ్యాత్మానం సహ జగద్ద్రక్ష్యస్యాత్మని చాపి మామ్
భయము పొందిన వారికి అభయాన్ని ఇచ్చి నాయందు నీ మనసు నిలిపి, నాలో జగత్తును చూస్తావు, నీలో నన్ను చూసుకుంటావు. సకల ప్రపంచమూ నామయమే అని తెలుసుకుంటావు
సహాహం స్వాంశకలయా త్వద్వీర్యేణ మహామునే
తవ క్షేత్రే దేవహూత్యాం ప్రణేష్యే తత్త్వసంహితామ్
ఇలాంటి నీకు నేనే స్వయముగా పుత్రునిగా పుడతాను. నీ క్షేత్రమైన దేవహూతి యందు నేను అవతరించి సాంఖ్యమును అంతటా వ్యాపింపచేస్తాను
మైత్రేయ ఉవాచ
ఏవం తమనుభాష్యాథ భగవాన్ప్రత్యగక్షజః
జగామ బిన్దుసరసః సరస్వత్యా పరిశ్రితాత్
ఇలా చెప్పి ఆ బిందు సరస్సు నుండి అంతర్ధానమయ్యాడు
నిరీక్షతస్తస్య యయావశేష సిద్ధేశ్వరాభిష్టుతసిద్ధమార్గః
ఆకర్ణయన్పత్రరథేన్ద్రపక్షైరుచ్చారితం స్తోమముదీర్ణసామ
పరమాత్మ వెళ్ళే దారిలో యోగులూ సిద్ధులూ ఎదురుచూస్తూ, వేద ,మంత్రాలతో అనువాకం చేస్తూ ఉంటే, తాను వెళ్తున్న దారిలో సామవేద మంత్రాలను వింటూ వెళ్ళాడు(గరుడుడు రెక్కల ధవ్నిలో సామవేద మంత్రాలు వస్తాయి)
అథ సమ్ప్రస్థితే శుక్లే కర్దమో భగవానృషిః
ఆస్తే స్మ బిన్దుసరసి తం కాలం ప్రతిపాలయన్
పరమాత్మ చెప్పిన సమయం కోసం ఎదురు చూస్తూ కర్దముడు కాలము గడిపాడు
మనుః స్యన్దనమాస్థాయ శాతకౌమ్భపరిచ్ఛదమ్
ఆరోప్య స్వాం దుహితరం సభార్యః పర్యటన్మహీమ్
తస్మిన్సుధన్వన్నహని భగవాన్యత్సమాదిశత్
ఉపాయాదాశ్రమపదం మునేః శాన్తవ్రతస్య తత్
బంగారు రధం అధిరోహించి మనువు భార్యనూ పుత్రికనూ తీసుకుని పరమాత్మ ఆదేశించిన విధముగా వచ్చాడు.
యస్మిన్భగవతో నేత్రాన్న్యపతన్నశ్రుబిన్దవః
కృపయా సమ్పరీతస్య ప్రపన్నేऽర్పితయా భృశమ్
పరమాత్మ ఆనందాశ్రువులతో ఏర్పడిన సరస్సు ఆ బిందు సరస్సు. దాని తీరములో కర్దముడు తపస్సు చేస్తున్నాడు
తద్వై బిన్దుసరో నామ సరస్వత్యా పరిప్లుతమ్
పుణ్యం శివామృతజలం మహర్షిగణసేవితమ్
పుణ్యమైనవీ పవిత్రమైనవి శుభకరమైన ఆ జలమును మహర్షులు సేవిస్తున్నాను.
పుణ్యద్రుమలతాజాలైః కూజత్పుణ్యమృగద్విజైః
సర్వర్తుఫలపుష్పాఢ్యం వనరాజిశ్రియాన్వితమ్
మత్తద్విజగణైర్ఘుష్టం మత్తభ్రమరవిభ్రమమ్
మత్తబర్హినటాటోపమాహ్వయన్మత్తకోకిలమ్
లతలూ, వృక్షములూ పక్షులూ తుమ్మెదలు పొదల్లు కోకిలలూ
కదమ్బచమ్పకాశోక కరఞ్జబకులాసనైః
కున్దమన్దారకుటజైశ్చూతపోతైరలఙ్కృతమ్
కారణ్డవైః ప్లవైర్హంసైః కురరైర్జలకుక్కుటైః
సారసైశ్చక్రవాకైశ్చ చకోరైర్వల్గు కూజితమ్
రకరకాల పక్షులతో సేవించబడుతూ
తథైవ హరిణైః క్రోడైః శ్వావిద్గవయకుఞ్జరైః
గోపుచ్ఛైర్హరిభిర్మర్కైర్నకులైర్నాభిభిర్వృతమ్
ప్రవిశ్య తత్తీర్థవరమాదిరాజః సహాత్మజః
దదర్శ మునిమాసీనం తస్మిన్హుతహుతాశనమ్
ఆది రాజైన కర్దముడు హోమము పూర్తిచేసుకుని ప్రకాశముతో ప్రశాంతముగా ఉన్న
విద్యోతమానం వపుషా తపస్యుగ్రయుజా చిరమ్
నాతిక్షామం భగవతః స్నిగ్ధాపాఙ్గావలోకనాత్
తద్వ్యాహృతామృతకలా పీయూషశ్రవణేన చ
పదివేల సంవత్సరాలు తపస్సు చేసినా పరమాత్మ కటాక్షము చేత చిక్కిపోని దేహము గలవాడు. పరమాత్మ దృష్టితోనూ పరమాత్మ వాక్కు అనే అమృతముతో చల్లబడి, ఆజానుభాహుడు పుండరీకాక్షుడు జటలు కట్టుకొని ఉన్నవాడు
ప్రాంశుం పద్మపలాశాక్షం జటిలం చీరవాససమ్
ఉపసంశ్రిత్య మలినం యథార్హణమసంస్కృతమ్
అథోటజముపాయాతం నృదేవం ప్రణతం పురః
సపర్యయా పర్యగృహ్ణాత్ప్రతినన్ద్యానురూపయా
మనువు రాగానే పూజించి సపర్యలు చేసాడు. మనో నిగ్రహముతో ప్రశాంతముగా ఉన్నవాడితో
గృహీతార్హణమాసీనం సంయతం ప్రీణయన్మునిః
స్మరన్భగవదాదేశమిత్యాహ శ్లక్ష్ణయా గిరా
సంతోషముతో ఇలా అన్నాడు
నూనం చఙ్క్రమణం దేవ సతాం సంరక్షణాయ తే
వధాయ చాసతాం యస్త్వం హరేః శక్తిర్హి పాలినీ
సజ్జనులను కాపాడటానికి నీలాంటి వారు తిరుగుతారు.
యోऽర్కేన్ద్వగ్నీన్ద్రవాయూనాం యమధర్మప్రచేతసామ్
రూపాణి స్థాన ఆధత్సే తస్మై శుక్లాయ తే నమః
సూర్యుడు చంద్రుడు ఇంద్ర అగ్ని వాయువు యమ ధర్మ వరుణుడు అనే ఈ పది మంది అంశ రాజులో ఉంటుంది. అటువంటి నీకు నమస్కారం. (రాజుకు ఋషి నమస్కారం చేయాలి. ఋషి అంశ దిక్పాలకుల అంశ కాబట్టి)
న యదా రథమాస్థాయ జైత్రం మణిగణార్పితమ్
విస్ఫూర్జచ్చణ్డకోదణ్డో రథేన త్రాసయన్నఘాన్
స్వసైన్యచరణక్షుణ్ణం వేపయన్మణ్డలం భువః
వికర్షన్బృహతీం సేనాం పర్యటస్యంశుమానివ
సూర్యభగవానుడు కిరణాలను ప్రసరింపచేస్తూ తిరిగినట్లు రధాన్ని తీసుకుని జగత్తులో పర్యటిస్తున్నావు
తదైవ సేతవః సర్వే వర్ణాశ్రమనిబన్ధనాః
భగవద్రచితా రాజన్భిద్యేరన్బత దస్యుభిః
వర్ణాశ్రమ ధర్మాలను నియమించి అవి అతిక్రమించకుండా శాసిస్తున్నావు
అధర్మశ్చ సమేధేత లోలుపైర్వ్యఙ్కుశైర్నృభిః
శయానే త్వయి లోకోऽయం దస్యుగ్రస్తో వినఙ్క్ష్యతి
మహారాజు ధర్మ పాలనకోసం జగత్తును పర్యటించకుంటే అని ధర్మాలు అతిక్రమించబడతాయి. అధర్మాన్ని ఆచరించకుండా చూడటానికి రాజు భూమండలమంతా తిరుగుతూ పరిపాలిస్తాడు. నీవు పడుకుని ఉంటే లోకమంతా దొంగల పాలవుతుంది
అథాపి పృచ్ఛే త్వాం వీర యదర్థం త్వమిహాగతః
తద్వయం నిర్వ్యలీకేన ప్రతిపద్యామహే హృదా
నీవేర్పరచిన ధర్మ మర్యాదలు ఎవరూ దాటకుండా అందరూ పరిపాలించేలా నీవు భూమండలమంతా సంచరిస్తూ ఉంటావు. నీవు ఈ ఆశ్రమానికి దేని కోసం వచ్చావు. "నేను ఈ పనికి వచ్చాను" అని నీవు చెబితే మేము అది పాటిస్తాము