మైత్రేయ ఉవాచ
అథ దేవగణాః సర్వే రుద్రానీకైః పరాజితాః
శూలపట్టిశనిస్త్రింశ గదాపరిఘముద్గరైః
ఇలా యజ్ఞ్యం చూడటానికీ పాల్గొనడానికి వచ్చిన దేవగణాన్ని కూడా రుద్ర పార్శ్వదులు తరిమికొట్టారు. వారి అవయవాలు, ఆయుధాలు చిన్నాభిన్నమై
సఞ్ఛిన్నభిన్నసర్వాఙ్గాః సర్త్విక్సభ్యా భయాకులాః
స్వయమ్భువే నమస్కృత్య కార్త్స్న్యేనైతన్న్యవేదయన్
ఋత్విక్కులతో సహా అందరూ భయపడి అందరూ బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు.
ఉపలభ్య పురైవైతద్భగవానబ్జసమ్భవః
నారాయణశ్చ విశ్వాత్మా న కస్యాధ్వరమీయతుః
మరి బ్రహ్మగారు రాలేదా దక్షయజ్ఞ్యానికి? జరగబోయేది తెలుసుకాబట్టి బ్రహ్మ విష్ణువులు వెళ్ళలేదు. విష్ణువు వెళితే ఆ యజ్ఞ్యం కాపాడబడుతుంది. త్రిమూర్తులలో, మూడు ఆకారాలలో ఒక ఆకారాన్ని అవమానిస్తే మిగతా వారు సంతోషించరు. ఆ యజ్ఞ్యం కొనసాగదని తెలిసిన బ్రహ్మ విష్ణువులు అక్కడకి వెళ్ళలేదు. (ఒక్క లింగ పురాణమూ మహాశివపురాణములో తప్ప మిగతా పురాణాలలో బ్రహ్మ విష్ణువులు కూడా దక్ష యజ్ఞ్యానికి వచ్చి పారిపోయినట్లు లేదు)
తదాకర్ణ్య విభుః ప్రాహ తేజీయసి కృతాగసి
క్షేమాయ తత్ర సా భూయాన్న ప్రాయేణ బుభూషతామ్
వారు చెప్పిన మాటలు విన్న బ్రహ్మ "మహాతేజోవంతుడైన శంకరుని విషయములో అపచారము చేసినవారికి క్షేమం ఎలా కలుగుతుంది." బతకాలనుకున్నవారూ, ఉండాలనుకున్నవారూ పెద్దలకు అపచారం చేయకూడదు. శివుడు పరమభాగవతోత్తముడు. (ఆయనే మనకు శ్రీవారి తీర్థమైన గంగను ఇచ్చాడు).
అథాపి యూయం కృతకిల్బిషా భవం యే బర్హిషో భాగభాజం పరాదుః
ప్రసాదయధ్వం పరిశుద్ధచేతసా క్షిప్రప్రసాదం ప్రగృహీతాఙ్ఘ్రిపద్మమ్
అందులో మీరూ పాలుపంచుకున్నారు. మీరు కూడా తప్పు చేసినవారే. యజ్ఞ్యములో శంకరునికి భాగం ఇవ్వకపోతే మీరందరూ ఎలా తీసుకున్నారు. ఇప్పుడు వేరే మార్గము లేదు. ఎవరిని కోపింపచేసారో వారి పాదములను ఆశ్రయించండి. ప్రసన్నము చేసుకోండి. ఆయన వెంటనే ప్రసన్నుడవుతాడు. ఉత్తమస్య క్షణం కోపం. అందరూ వెళ్ళి పాదములు పట్టుకోండి
ఆశాసానా జీవితమధ్వరస్య లోకః సపాలః కుపితే న యస్మిన్
తమాశు దేవం ప్రియయా విహీనం క్షమాపయధ్వం హృది విద్ధం దురుక్తైః
ఇప్పటికైనా దక్షుడు బ్రతకాలనుకున్నా, యజ్ఞ్యం పూర్తికావాలనుకున్నా, లోకపాలకులూ లోకములూ క్షేమముగా ఉండాలనుకున్నా, ఆయనను శరణు వేడండి. అలా చేస్తే మనకు అన్నీ వస్తాయి గానీ ఆయన భార్య ఆయనకు వస్తుందా? ఆయన ఎంత క్షోభలో ఉంటాడు? ఆయనను క్షమాపణ వేడండి. ఏ తప్పు చేయని శంకరున్ని లేనిపోని మాటలన్నారు.
నాహం న యజ్ఞో న చ యూయమన్యే యే దేహభాజో మునయశ్చ తత్త్వమ్
విదుః ప్రమాణం బలవీర్యయోర్వా యస్యాత్మతన్త్రస్య క ఉపాయం విధిత్సేత్
ఆయన శక్తి తేజస్సు బలం ఎంత? అది నాకు గానీ, మీకు గానీ, ప్రాణులకు గానీ, మునులకు గానీ, యజ్ఞ్యములకు గానీ శంకరుని బలమూ పరాక్రమమూ తెలియదు. ఎందుకంటే ఆయన పరమాత్మకు అతి ప్రీతిపాత్రమైన వాడు. అపాయం కల్పించిన ఆయనే ఉపాయం కల్పించాలి.
స ఇత్థమాదిశ్య సురానజస్తు తైః సమన్వితః పితృభిః సప్రజేశైః
యయౌ స్వధిష్ణ్యాన్నిలయం పురద్విషః కైలాసమద్రిప్రవరం ప్రియం ప్రభోః
దేవతల అభ్యర్థన మేరకు దేవతలందరితో కలిసి బ్రహ్మగారు బయలు దేరారు. శంకరునికి ఇష్టమైన పర్వతశ్రేష్టమైన కైలాసానికి చేరారు.
జన్మౌషధితపోమన్త్ర యోగసిద్ధైర్నరేతరైః
జుష్టం కిన్నరగన్ధర్వైరప్సరోభిర్వృతం సదా
నానామణిమయైః శృఙ్గైర్నానాధాతువిచిత్రితైః
నానాద్రుమలతాగుల్మైర్నానామృగగణావృతైః
నానామలప్రస్రవణైర్నానాకన్దరసానుభిః
రమణం విహరన్తీనాం రమణైః సిద్ధయోషితామ్
మయూరకేకాభిరుతం మదాన్ధాలివిమూర్చ్ఛితమ్
ప్లావితై రక్తకణ్ఠానాం కూజితైశ్చ పతత్త్రిణామ్
ఆహ్వయన్తమివోద్ధస్తైర్ద్విజాన్కామదుఘైర్ద్రుమైః
వ్రజన్తమివ మాతఙ్గైర్గృణన్తమివ నిర్ఝరైః
మన్దారైః పారిజాతైశ్చ సరలైశ్చోపశోభితమ్
తమాలైః శాలతాలైశ్చ కోవిదారాసనార్జునైః
చూతైః కదమ్బైర్నీపైశ్చ నాగపున్నాగచమ్పకైః
పాటలాశోకబకులైః కున్దైః కురబకైరపి
స్వర్ణార్ణశతపత్రైశ్చ వరరేణుకజాతిభిః
కుబ్జకైర్మల్లికాభిశ్చ మాధవీభిశ్చ మణ్డితమ్
పనసోదుమ్బరాశ్వత్థ ప్లక్షన్యగ్రోధహిఙ్గుభిః
భూర్జైరోషధిభిః పూగై రాజపూగైశ్చ జమ్బుభిః
ఖర్జూరామ్రాతకామ్రాద్యైః ప్రియాలమధుకేఙ్గుదైః
ద్రుమజాతిభిరన్యైశ్చ రాజితం వేణుకీచకైః
కుముదోత్పలకహ్లార శతపత్రవనర్ద్ధిభిః
నలినీషు కలం కూజత్ ఖగవృన్దోపశోభితమ్
మృగైః శాఖామృగైః క్రోడైర్మృగేన్ద్రైరృక్షశల్యకైః
గవయైః శరభైర్వ్యాఘ్రై రురుభిర్మహిషాదిభిః
కర్ణాన్త్రైకపదాశ్వాస్యైర్నిర్జుష్టం వృకనాభిభిః
కదలీఖణ్డసంరుద్ధ నలినీపులినశ్రియమ్
పర్యస్తం నన్దయా సత్యాః స్నానపుణ్యతరోదయా
విలోక్య భూతేశగిరిం విబుధా విస్మయం యయుః
ఇంతగొప్ప కైలాస పర్వతాన్ని చూచి దేవతలందరూ ఆశ్చర్యం పొందారు. పక్కనే అలకాపురిని కూడా చూసారు
దదృశుస్తత్ర తే రమ్యామలకాం నామ వై పురీమ్
వనం సౌగన్ధికం చాపి యత్ర తన్నామ పఙ్కజమ్
నన్దా చాలకనన్దా చ సరితౌ బాహ్యతః పురః
తీర్థపాదపదామ్భోజ రజసాతీవ పావనే
నందా అలకనందా అని రెండు నదులు ఆ అలకాపురిలో ఉన్నాయి. నిరంతరం పరమాత్మ పాద పరాగముతో పవిత్రమైన నదులు ఈ రెండు
యయోః సురస్త్రియః క్షత్తరవరుహ్య స్వధిష్ణ్యతః
క్రీడన్తి పుంసః సిఞ్చన్త్యో విగాహ్య రతికర్శితాః
దేవతా స్త్రీలు దేవతలూ వచ్చి అక్కడ స్నాన సంధ్యాదులు చేస్తారు. కొందరు జంటలు ఆ నీటితో ఆడతారు
యయోస్తత్స్నానవిభ్రష్ట నవకుఙ్కుమపిఞ్జరమ్
వితృషోऽపి పిబన్త్యమ్భః పాయయన్తో గజా గజీః
అలాంటి దేవతా స్త్రీలు జంటలూ స్నానం చేసినపుడు వారి ఒంటికున్న సుగంధ ద్రవ్యాలు అంటి సుగంధం వ్యాపింపచేసే నీటిలో ఏనుగులు దాహం లేకున్నా తాగుతూ ఉంటాయి. ఆడ ఏనుగులతో ఆ నీరు త్రాగిస్తూ ఉంటాయి. ద్వి-పాత్తులే కాదు, చతుష్పాత్తులు కూడా అక్కడ ఆ నీరు తాగుతారు.
తారహేమమహారత్న విమానశతసఙ్కులామ్
జుష్టాం పుణ్యజనస్త్రీభిర్యథా ఖం సతడిద్ఘనమ్
ఎంతో మంది స్త్రీలు విమానాలతో బయలు దేరి సంచరిస్తూ ఉంటే, మెరుపుతో ఉన్న మబ్బులు సంచరిస్తున్నట్లు కనపడుతున్నాయి.
హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగన్ధికం చ తత్
ద్రుమైః కామదుఘైర్హృద్యం చిత్రమాల్యఫలచ్ఛదైః
రక్తకణ్ఠఖగానీక స్వరమణ్డితషట్పదమ్
కలహంసకులప్రేష్ఠం ఖరదణ్డజలాశయమ్
హంసలూ వాటి నాదాలు
వనకుఞ్జరసఙ్ఘృష్ట హరిచన్దనవాయునా
అధి పుణ్యజనస్త్రీణాం ముహురున్మథయన్మనః
చుట్టుపక్కల ఉన్న వారి మనసు కలతపెడుతూ
వైదూర్యకృతసోపానా వాప్య ఉత్పలమాలినీః
ప్రాప్తం కిమ్పురుషైర్దృష్ట్వా త ఆరాద్దదృశుర్వటమ్
వైడూర్యమణూల మెట్లు కలిగిన దిగుడు బావులు (వాపి)
స యోజనశతోత్సేధః పాదోనవిటపాయతః
పర్యక్కృతాచలచ్ఛాయో నిర్నీడస్తాపవర్జితః
తస్మిన్మహాయోగమయే ముముక్షుశరణే సురాః
దదృశుః శివమాసీనం త్యక్తామర్షమివాన్తకమ్
సనన్దనాద్యైర్మహాసిద్ధైః శాన్తైః సంశాన్తవిగ్రహమ్
ఉపాస్యమానం సఖ్యా చ భర్త్రా గుహ్యకరక్షసామ్
అక్కడ సనకాదులచే సేవించబడుతున్న శంకరుడు అక్కడ ఉన్నాడు. మిత్రుడైన కుబేరునితో సేవించబడుతూ ఉన్నాడు.
విద్యాతపోయోగపథమాస్థితం తమధీశ్వరమ్
చరన్తం విశ్వసుహృదం వాత్సల్యాల్లోకమఙ్గలమ్
విద్యకూ యోగమునకూ తపమునకు అధీశ్వరుడై, వాత్సల్యముతో, సకల లోకమునకు మంగళం కలిగించేవాడు. మిత్రుడు
లిఙ్గం చ తాపసాభీష్టం భస్మదణ్డజటాజినమ్
అఙ్గేన సన్ధ్యాభ్రరుచా చన్ద్రలేఖాం చ బిభ్రతమ్
తపస్వులు ధరించే గుర్తులతో ఉన్నాడు. భస్మమూ దండమూ జటలూ జింక చర్మముతో ఉన్నాడు. సంధ్యాకాల కాంతితో ఉన్న చంద్ర లేఖతో ఉన్నాడు
ఉపవిష్టం దర్భమయ్యాం బృస్యాం బ్రహ్మ సనాతనమ్
నారదాయ ప్రవోచన్తం పృచ్ఛతే శృణ్వతాం సతామ్
దర్భాసనం మీద ఉన్న ఈ బ్రహ్మ నారదాదులు వింటూ ఉండగా పరబ్రహ్మ తత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. నారదుడు అడుగగా తక్కిన వారందరూ వింటున్నారు.
కృత్వోరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని
బాహుం ప్రకోష్ఠేऽక్షమాలామాసీనం తర్కముద్రయా
కుడి తొడమీద ఎడమ పాదాన్ని పెట్టుకుని ఉన్నాడు. ధ్యాన ముద్రలో కూర్చున్నాడు.
తం బ్రహ్మనిర్వాణసమాధిమాశ్రితం వ్యుపాశ్రితం గిరిశం యోగకక్షామ్
సలోకపాలా మునయో మనూనామాద్యం మనుం ప్రాఞ్జలయః ప్రణేముః
ఈయన పూర్తిగా యోగమార్గములో ఉండి పరబ్రహ్మానందం పొందే సమాధిలో ఉన్నవాడు, మునులూ లోకపాలులూ మొదటి మనువుకు నమస్కరించారు
స తూపలభ్యాగతమాత్మయోనిం సురాసురేశైరభివన్దితాఙ్ఘ్రిః
ఉత్థాయ చక్రే శిరసాభివన్దనమర్హత్తమః కస్య యథైవ విష్ణుః
అందరూ నమస్కారం చేస్తూ ఉంటే ఆయన చూచాడు. దేవ దానవులకు నమస్కారం చేయబడే వాడైనా, బ్రహ్మను చూచి నమస్కారం చేసి అభివాదం చేసాడు
తథాపరే సిద్ధగణా మహర్షిభిర్యే వై సమన్తాదను నీలలోహితమ్
నమస్కృతః ప్రాహ శశాఙ్కశేఖరం కృతప్రణామం ప్రహసన్నివాత్మభూః
అక్కడ ఒక మఱ్ఱి చెట్టు, వందల యోగజనాల ఎత్తు, బంగారు మెట్లు, మంటపం. మూడువంతులు కొమ్మలు చుట్టూ, కొండంతకీ నీడపట్టేసింది ఆ చెట్టు, అక్కడ గూళ్ళు లేవు. మోక్షము నందు కోరిక గలవారు శరణని ఆశ్రయించిన మంటపం. సనకాదులూ అందరూ ఆయన్ను సేవిస్తూ ఉన్నారు. దర్భాసనం వేసుకుని శివుడు కూర్చున్నాడు. కుడి తొడ మీద ఎడమ పాదాన్ని మీద పెట్టుకుని కూర్చున్నాడు. చేతికి జపమాల. ఎదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. అందరూ అభివాదం చేసారు. ఆయన లేచి అందరికీ నమస్కార్మ్ చేసారు.
ఆయనే కాకుండా, అయన్ను ఆశ్రయించి ఉన్నవారంతా బ్రహ్మగారికి నమస్కారం చేఆరు. ఆ శంకరునితో కొంచెం చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మ ఇలా అన్నారు
బ్రహ్మగారు నారాయణుడూ వచ్చారని లేచిన శివునితో బ్రహ్మగారిలా అన్నారు
బ్రహ్మోవాచ
ఆనే త్వామీశం విశ్వస్య జగతో యోనిబీజయోః
శక్తేః శివస్య చ పరం యత్తద్బ్రహ్మా నిరన్తరమ్
త్వమేవ భగవన్నేతచ్ఛివశక్త్యోః స్వరూపయోః
విశ్వం సృజసి పాస్యత్సి క్రీడన్నూర్ణపటో యథా
త్వమేవ ధర్మార్థదుఘాభిపత్తయే దక్షేణ సూత్రేణ ససర్జిథాధ్వరమ్
త్వయైవ లోకేऽవసితాశ్చ సేతవో యాన్బ్రాహ్మణాః శ్రద్దధతే ధృతవ్రతాః
త్వం కర్మణాం మఙ్గల మఙ్గలానాం కర్తుః స్వలోకం తనుషే స్వః పరం వా
అమఙ్గలానాం చ తమిస్రముల్బణం విపర్యయః కేన తదేవ కస్యచిత్
న వై సతాం త్వచ్చరణార్పితాత్మనాం భూతేషు సర్వేష్వభిపశ్యతాం తవ
భూతాని చాత్మన్యపృథగ్దిదృక్షతాం ప్రాయేణ రోషోऽభిభవేద్యథా పశుమ్
పృథగ్ధియః కర్మదృశో దురాశయాః పరోదయేనార్పితహృద్రుజోऽనిశమ్
పరాన్దురుక్తైర్వితుదన్త్యరున్తుదాస్తాన్మావధీద్దైవవధాన్భవద్విధః
యస్మిన్యదా పుష్కరనాభమాయయా దురన్తయా స్పృష్టధియః పృథగ్దృశః
కుర్వన్తి తత్ర హ్యనుకమ్పయా కృపాం న సాధవో దైవబలాత్కృతే క్రమమ్
భవాంస్తు పుంసః పరమస్య మాయయా దురన్తయాస్పృష్టమతిః సమస్తదృక్
తయా హతాత్మస్వనుకర్మచేతఃస్వనుగ్రహం కర్తుమిహార్హసి ప్రభో
కుర్వధ్వరస్యోద్ధరణం హతస్య భోః త్వయాసమాప్తస్య మనో ప్రజాపతేః
న యత్ర భాగం తవ భాగినో దదుః కుయాజినో యేన మఖో నినీయతే
జీవతాద్యజమానోऽయం ప్రపద్యేతాక్షిణీ భగః
భృగోః శ్మశ్రూణి రోహన్తు పూష్ణో దన్తాశ్చ పూర్వవత్
దేవానాం భగ్నగాత్రాణామృత్విజాం చాయుధాశ్మభిః
భవతానుగృహీతానామాశు మన్యోऽస్త్వనాతురమ్
ఏష తే రుద్ర భాగోऽస్తు యదుచ్ఛిష్టోऽధ్వరస్య వై
యజ్ఞస్తే రుద్ర భాగేన కల్పతామద్య యజ్ఞహన్
నీవే లోకములో జీవుడూ ప్రకృతి అనేవాటిని కలిపి ఉంచి రక్షించేవాడివి. శక్తికీ శివునికీ కూడా పైనుండే తత్వము నీవే. సాక్షాత్ నారాయణుడు నీలోన ఉండి లోకములన్నింటినీ సంహరింపచేస్తున్నాడు. నీవు ధర్మాన్ని అర్థాన్ని రెంటినీ లోకానికి ప్రసాదిస్తావు. దక్షుడిలోపల నీవుండీ ఆయన చేసే యాగములోపల నీవుండి ఆయన చేసిన శాస్త్రములోపల నీవుండి యజ్ఞ్యమును చేయించినవాడివి నీవే. ఆ చేసిన మంచి పనులకు ఫలమును నిర్ణయించినవాడివి నీవే కదా. వారికి మగళములు కలిగించినా అమంగళములు కలిగించినా నీవే. అటువంటి నీ పాదములు సేవించిన వారికి ఇటువంటి బాధలు రావడం న్యాయమా? నిజమే, నీకంటే వేరుగా తాను ఉన్నాడనుకుని నీవు అల్లుడివీ తాను మామగారని తగని మాటలు అన్నాడు. భగవంతుడంటే తెలియనివారు, భగవంతుడు అందరిలో ఉంటాడని తెలియని వారు. భగవంతుడు నాకంటే వేరుగా ఎక్కడో ఉంటారనుకునేవారు, పెద్దల్ను దూషిస్తారు. అది దైవబలం. దైవం వారినలా ప్రేరణ చేసి చెడుమాటలు పలికిస్తుంది. నీవు సాక్షాత్ పరమమైన జ్ఞ్యాన మూర్తివికదా నీ లోపల ఇటువంటి కోపం వచ్చి వారిని చంపవచ్చునా.
ఒక్కసారి ఆ యజ్ఞ్యాన్ని నీవు ఉద్దరించాలి. ఎక్కడైతే శంకరునికి భాగం లేకుండా చేస్తారో అది యజ్ఞ్యమూ కాదు, వారు యజ్ఞ్యము చేసినవారూ కాదు. దక్షుని శిరస్సు తీసేసావు, దానితో హోమం చేసేసావు, ఆ శిరసు మళ్ళీ రావాలి, భగుని కళ్ళు పోయాయి, అవి మళ్ళీ రావాలి.
బృగువుకు గడ్డం లాగేసారు, అది మళ్ళీ రావాలి. పూషకు దంతాలు రావాలి. దేవతలకు ఒళ్ళు విరిగిపోయాయి. వారికి శరీరాలు బాగుపడాలి.
ఇక నుంచీ ప్రతీ హోమములోనూ నీ పేరుతో కూడా ఆహుతి వేస్తారు. అది వేయని యజ్ఞ్యం ఉండదు. ప్రతీ హోమములో రుద్రపరమైన మంత్రాలు ఉంటాయి. అవి రుద్రభాగం. అవి నీకు కల్పించకపోతే యజ్ఞ్యమునకు పూర్తిలేదు.