కశ్యప ఉవాచ
కృతశోకానుతాపేన సద్యః ప్రత్యవమర్శనాత్
భగవత్యురుమానాచ్చ భవే మయ్యపి చాదరాత్
చేసిన తప్పు తెలుసుకున్నావు, తప్పు చేసిన వెంటనే నీవు పరిశీలించుకున్నావు, పరమాత్మ యందు నీకు గౌరవమూ భక్తీ ఉన్నాయి, నా మీదా, శివుని మీదా, ఆదరం చూపావు కాబట్టి,
పుత్రస్యైవ చ పుత్రాణాం భవితైకః సతాం మతః
గాస్యన్తి యద్యశః శుద్ధం భగవద్యశసా సమమ్
నీ కొడుకులకు కలిగే సంతానములో సజ్జనులందరిచేతా అంగీకరింపబడే కుమారుడు పుడతాడు. పరమాత్మ యొక్క కీర్తితో సమానముగా అన్ని లోకాలలో నీ పౌత్రుని కీర్తిని గానం చేస్తారు
యోగైర్హేమేవ దుర్వర్ణం భావయిష్యన్తి సాధవః
నిర్వైరాదిభిరాత్మానం యచ్ఛీలమనువర్తితుమ్
బంగారము యొక్క చెడు రంగు పోవాలంటే ఒక లోహములో వేసి తీస్తారు. అలాగే నీ పౌత్రుని పేరు తలచుకుంటే లోకమంతా శుద్ధి పొందుతుంది. సజ్జనులందరూ ఇతనిని ఆదరితారు. మంచివాడు అంటే ఎలా ఉండాలి, ఎవరిని ఉత్తముడు అని అనాలి అంటే నీ పౌత్రుని శీలాన్ని కొలబద్దగా తీసుకుంటారు.
యత్ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకమ్
స స్వదృగ్భగవాన్యస్య తోష్యతేऽనన్యయా దృశా
మంచి వారంతా నీ మనవడిని ఆదర్శముగా తీసుకుంటారు, అనుకరిస్తారు. సకల చరాచర ప్రపంచం ఎవరి అనుగ్రహ్ముతో ప్రశాంతముగా ఆనందముగా ఉంటుందో, ఆయన నీ మనవడిని చూచి ప్రసన్నుడవుతాడు. భగవంతుని మీద తప్ప ఇంకొకరి మీద దృష్టి ఉండదు. అలాంటి భగవానుడి చేత నీ మనవడు "నా వాడు" అని అనిపించుకుంటాడు.
స వై మహాభాగవతో మహాత్మా మహానుభావో మహతాం మహిష్ఠః
ప్రవృద్ధభక్త్యా హ్యనుభావితాశయే నివేశ్య వైకుణ్ఠమిమం విహాస్యతి
పరమభాగవతుడు, గొప్ప మనసు కలవాడు (మహాత్మ), పరమాత్మను మాత్రమే నిరంతరమూ తలుస్తాడు ( మహానుభావ), గొప్పవారందిరిలో గొప్పవాడు (మహతాం మహిష్ఠః). ఇతను పరమాత్మ యందు భక్తి పెరగడం వలన నిరంతరం మనసులో పరమాత్మను మాత్రమే ధ్యానం చేస్తూ ఉంటాడు. అలా ఆ మహానుభావుడు ఈ లోకాన్ని విడిచి పెట్టి వైకుంఠాన్ని జేరతాడు.
అలమ్పటః శీలధరో గుణాకరో హృష్టః పరర్ద్ధ్యా వ్యథితో దుఃఖితేషు
అభూతశత్రుర్జగతః శోకహర్తా నైదాఘికం తాపమివోడురాజః
దేని యందూ ఆశలేని వాడు, ఎప్పుడు సత్శీలములో ఉండేవాడు, సద్గుణంబుల్లెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజ తనయు నందు నిలిచె అన్నట్లు, బోవదలపవు, పరమాత్మ యందు గుణాలు ఎలా తొలగిపోవో ఈయన యందు కూడా అలాగే కళ్యాణ గుణలు ఉంటాయి, నిరంతరమూ ఇతరుల సంతోషాన్ని చూచి సంతోషించేవాడు, ఎదుటివారి బాధను చూచి దుఃఖిస్తాడు. శత్రువులెవరూ లేని వారు. సకల జగత్తు యొక్క శోకాన్ని తొలగించేవాడు. వేసవి కాలములో తాపము చంద్రుని దర్శనముతో ఎలా పోతుందో అలాగ.
అన్తర్బహిశ్చామలమబ్జనేత్రం స్వపూరుషేచ్ఛానుగృహీతరూపమ్
పౌత్రస్తవ శ్రీలలనాలలామం ద్రష్టా స్ఫురత్కుణ్డలమణ్డితాననమ్
నీకు నాకూ పిల్లలకూ లేని అదృష్టం నీ మనవడికి కలుగుతున్నది. ఇతను వెలుపలా లోపలా పవిత్రుడు, తన సంకల్పముతో కోరిన రూపము ధరించే, లక్ష్మీ దేవికి (అమ్మవారికి) ఆనందము కలిగించే పరమాత్మ, మకర కుండలములూ హారములూ కేయూరములతో అలంకరించబడి ఉన్న పరమాత్మను నీ పౌత్రుడు ప్రత్యక్షముగా సాక్షాత్కరింపచేసుకుంటాడు. అంతటి ఉత్తముడైన పౌత్రుడు నీకు కలుగుతాడు.