Followers

Friday, 15 March 2013

రామకోటి రాయడానికి నియమాలు

రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక సత్కార్యం. ఈ కార్యానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

* రామకోటి రాయాలన్న మీ సంకల్పాన్ని ముందు దేవుడి దగ్గర మానసికంగా సంకల్పం చేసుకోండి.

* శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్నా పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.

* మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళి తో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడంప్రారంభించండి.

* రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకుండా స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.

* అనుకోకుండా మంధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకంమూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.

* రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం.

* రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.

* ప్రతి లక్ష నామాలకు ప్రత్యెక పూజ,నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి.

* రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ,నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.

* పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనారాముని గుడిలో ,ఆధ్యాత్మిక సంష్తకు అప్పగించాలి. అదీ వీలుకాకుంటే నదిలో వదలాలి.

Popular Posts