Followers

Monday, 1 July 2013

పేదల వెంకన్న... శ్రీ కురుమూర్తి స్వామి


కలియుగదైవం శ్రీనివాసుడు ఎక్కడ కొలువైనాడంటే... ఏడుకొండలపై అని, అవి ఎక్క డున్నాయంటే... తిరుపతిలో అని ఎవరైనా ఇట్టే సమాధానం చెబుతారు. సర్వాంతర్యామి అయిన ఆ దేవదేవుడు లేని చోటంటూ ఈ విశ్వంలో ఉంటుందా? అయితే... శ్రీనివాసుడు కొలువైన తిరుపతిలాగే... మరో తిరుపతి కూడా ఉంది. అది ఎక్కడో కాదు మహబూబ్‌నగర్‌ జిల్లాలో... జిల్లాలోని అమ్మాపూర్‌ గ్రామమే ఆ మరో తిరుపతి... తెలంగాణ తిరుపతిగా పేరుగాంచి.. ఇటీవలే బ్రహ్మోత్సవాలు జరుపుకున్న శ్రీ కురుమూర్తి స్వామి విశిష్టతలు ఈవారం ‘ఆలయం’లో...

kurumurthyరాష్ట్రంలోనే అతి పురాతన ఆలయాల్లో ఒక టిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురు మూర్తి వేంకటేశ్వర దేవస్థానం. తిరుమల వేం కటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయాని కి పోలికలున్నాయి. అమ్మాపూర్‌ గ్రామ సమీ పంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన స్వామి వారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురు మూర్తికి ‘కురుమతి’ పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తున్నది. ఇటీవలే కురు మూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

క్షేత్ర మహత్మ్యం...శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడకు రావడా నికి రెండు రకాల పురాణ గాథలు ఉన్నాయి. ఇందులో... తిరుపతి నుంచి కురుమూర్తికి రా వడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి. తిరుపతి నుంచి ఇక్కడి కి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో... సుగంధభరిత నానాఫల పక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. ఇక్కడ ‘కురు’ అనగా చేయుట, ‘మతి’ అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామికి ‘కురుమతి’ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కురుమూర్తి’గా స్థిరపడి పోయినట్లు పూర్వీకులు చెబుతుంటారు. దాదాపు 900 సంవత్సరాల నుండి స్వామి వారు పూజలు అందుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.

ఆలయ నిర్మాణం...

kurumurthy1ఆత్మకూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూ రంలో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురు మూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపు రుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపరచగా, సోమ భూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సంప్రదాయం అమలు లోకి తెచ్చాడు. 1870లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాల లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. 1999 లో కొత్తగా మండపం ఏర్పా టు చేశారు. ఇక్కడ ప్రతియేటా బ్రహ్మోత్స వాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.

ఇక్కడా ఏడు కొండలపైనే..!

ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఆ కొండల వివరాలు...
1. శేతాద్రి (బొల్లిగట్టు), 2. ఏకాద్రి (బంటి గట్టు), 3. కో ట గట్టు, 4. ఘనాద్రి (పెద్ద గట్టు), 5. భల్లూకాద్రి (ఎలు గులగట్టు), 6. పతగాద్రి (చీపు ర్లగట్టు), 7. దైవతాద్రి (దేవరగట్టు)... అనే ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపైనే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు
.

దళితుల సేవ...కురుమూర్తి దేవ స్థానానికి దళితులకు విడదే యరాని బంధం ఉంది. స్వామి వారి పాదుకల ను వడ్డెమాన్‌లోని ఉద్దాల కార్పోగారంలో రా యలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్య మైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఉద్దాల మండలంలో దళితులే అర్చకులు. ఇది చాలా అరుదైన విషయం.

తిరుమలకు కురుమూర్తికి పోలికలు...

kurumurthy2ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి కురుమూర్తి అనేక పోలికలున్నాయి.
* తిరుపతి క్షేత్రంపై మేరు పర్వత పుత్రుడైన ఆనందగిరిపై శ్రీనివాసుడు వెలసి ఉన్నాడని పురణాలు చెబుతున్నాయి. శ్రీ కురుమూర్తి కొండలు ఆనందగిరిలో భాగమేనని అచట వెలసిన స్వామి వారే ఇచ్చట వెలిశారని స్థల పురాణంలో చెప్పబడినది.
* తిరుపతిలో విఘ్నేశ్వరుని విగ్ర హం లేదు. కురుమూర్తిలో కూడా లేదు.
* వేంకటాచలంతో స్వామి నిల్చున్న భంగిమ ల్లో ఉండగా కురుమూర్తి స్వామి అదే భంగిమ లో ఉండడం విశేషం.
* తిరుమలకు మెట్లపై వెళ్లేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నాయి. ఇక్కడా ఉన్నాయి.
రవాణా సౌకర్యం...
* ఈ కురుమూర్తి స్వామి దేవస్థానానికి చేరు కోవడానికి బస్సు, రైలు సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌ నగర్‌ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు.
* రైలు సౌకర్యం హైదరాబాద్‌, కర్నూల్‌ ద్వారా కురుమూర్తి రైల్వే స్టేషన్‌లో దిగి స్వామి దగ్గరకు రావచ్చు.

Popular Posts