కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. కాలం కలిసి వస్తే కటిక దరిద్రుడు కూడా కోటీశ్వ రుడు అయి పోవచ్చు అని అంటారు. అనుకోనిదేదైనా జరిగితే రోజులు బాగాలేవంటారు. కాలం, రోజులూ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మారుతున్నది మనిషి బుద్ధి మాత్రమే. బుద్ధి స్రమంగా ఉంటే, మనిషి సన్మార్గంలో పయని స్తాడు. అందుకే, మంచి బుద్ధిని ప్రసాదించమని నిత్యం భగవంతుణ్ణి ప్రార్ధించాలి. సంధ్యావందన మంత్రం యొక్క సారాంశం ఇదే. సూర్య భగవానునికి అర్ఘ్యం ఇస్తూ సద్బుద్ధిని ప్రసాదించమని ప్రతి మనిషి ప్రార్ధన చేయాలి. దాని వల్ల మనిషికి సద్బుద్ధి మాత్రమే కాక, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. సద్బుద్ధి కోసం చేసే ప్రార్థన ఎప్పటికీ వౄఎధా కాదు. అయితే, ప్రార్థన చేసే సమయంలో మనం ఇతర విషయాల గురించి ఆలోచించకూడదు.
ఏ దేవుళ్ళనైతే ప్రార్థిస్తున్నామో వారి రూపా న్ని మన మనసులో ధ్యానించుకుని ప్రార్ధన చేయాలి. అలాచేయడం కొంత కష్టం అయినా, సాధన ద్వారా ధ్యానాన్ని అలవర్చుకోవచ్చు.అలాగే, సద్బుద్ధితో సన్మార్గాన పయనించి సత్కార్యాలను ఆచరించాలి. మంచి పనులు అంటే విశాలమైన నిర్వచనం చెప్పుకో వచ్చు. పరులకు మేలు చేయకపోయినా, ఇబ్బందులు కలిగించకుండా ఉండటమే మం చి. ఒకరిని బాధపెడితేనే మనం సుఖాన్ని పొందగలం అనే భావన మని షిలో సహజంగా ఉంటుంది. కానీ, ఇది తప్పు. ఇతరులను బాధ పెట్ట కుండానే మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. శాశ్వతమైన, స్థిరమైన ఆనందమే చిదానందం. చిదానందమనేది భగవంతుని ఆరాధన వల్ల వస్తుంది.
మిగిలిన ఆనందాలన్నీ తాత్కాలికమైనవే. ఒక సినిమానీ, లేదా దృశ్యాన్ని చూసినప్పుడు కలిగే ఆనందం, ఒక పాటనీ, లేదా మంచి సంగీతాన్ని విన్నప్పుడు కలిగే ఆనందం తాత్కాలికమైన ఆనందాలు. శాశ్వతమైన ఆనందం భగవన్నామస్మరణలో లభిస్తుంది. మామూలు గీతాల కన్నా, త్యాగరాజ, రామదాసు కీర్తనలు పాడుకున్నప్పుడూ, విన్నప్పుడు కలిగే ఆనందం శాశ్వతమైనది. చిదానందాన్ని పొందడమే మనిషి జీవిత లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకునేం దుకు ఎందరో భక్త శిఖామణులు ఎన్నో కష్టాలు పడ్డారు. అవమానాలు భరించారు. చివరికి తాము ఆశించిన లక్ష్యాన్ని సాధించారు.
తాము రచించిన కీర్తనలనూ, గ్రంథాలనూ భగవంతునికి అంకితం చేసి చరితా ర్ధులయ్యారు. ఎంతోమంది వాగ్గేయకారులున్నా త్యాగరాజ, రామదాసు ల పేర్లను నేటికీ మనం తలచుకోవడానికి, ఎంతో మంది మహాకవులు న్నా పోతన పద్యాలను స్ఫురణకు తెచ్చుకోవడానికి కారణమిదే. వారి సంగీతంలో, సాహి త్యంలో భక్తిని మిళితం చేయడంవల్ల అవి అజరామ రమయ్యాయి. ఆ మహనీయులు సద్బుద్ధితో, సన్మార్గంలో పయనించ డం వల్లనే వాటిని అందించగలిగారు. సద్బుద్ధి కోసం ప్రార్ధించేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.