జ్యోతిష్యశాస్త్రములో మొత్తం ఇరువై ఏడు నక్షత్రములున్నవి. ఒక్కొక్క నక్షత్రమును నాలుగు పాదములు గా విభజించిరి.మొత్తం 108 పాదములు . 12 రాశులకు పంచగా ఒక్కొక్క రాశికి 9 పాదములు వచ్చును.
అవి ; ఈ క్రింది విధంగా విభజించ బడినవి.
1. అశ్విని -4, భరణి - 4 కృత్తిక – 1 = మేష రాశి
2. కృత్తిక – ౩, రోహిణి – 4 మృగశిర – 2 = వృషభ రాశి
3. మృగశిర -2 ఆరుద్ర – 4 పునర్వసు- ౩ = మిదునరాశి
4. పునర్వసు- 1 పుష్యమి – 4 ఆశ్లేష - 4 = కర్కాటక రాశి
5. మఖ-4 పుబ్బ-4 ఉత్తర-1 = సింహరాశి
6. ఉత్తర-౩ హస్త-4 చిత్త-2 = కన్యారాశి
7. చిత్త-2 స్వాతి-4 విశాఖ-౩ = తులారాశి
8. విశాఖ-1 అనురాధ-4 జ్యేష్ఠ-4 = వృశ్చికరాశి
9. మూల-4 పూర్వాషాడ-4 ఉత్తరాషాడ-1 = ధనూరాశి
10. ఉత్తరాషాడ-౩ శ్రవణం,-4 ధనిష్ఠ-2 = మకరరాశి
11. ధనిష్ట-2 శతభిషం-4 పూర్వాబాద్ర-౩ = కుంభరాశి
12. పూర్వాభాద్ర-1 ఉత్తరాభాద్ర-4 రేవతి-4 = మీనరాశి