Followers

Friday, 5 July 2013

గీతామృతంతో మానసిక తృప్తి


నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.’’

శ్రీ మద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
krishn6శ్లోకంః శ్వశురాన్‌ సుహృదశె్చైవ
సేనయో రుభయోరపి
తాన్‌ సమీక్ష్య స కౌంతేయః
సర్వాన్‌ బంధూన్‌ అవస్థితాన్‌

ఇంకను ఇక్కడ ద్రుపదాది మామలు, హితమును కోరే ఎందరో పెద్దలు ఉన్నారు. మొత్తానికి అందరూ ఎటుచూచినా బుధువులే. అందరనూ ఒకసారి కలియచూసాడు అర్జునుడు. హృదయము ద్రవించింది. వారి ప్రాణములకు ముప్పు వాటిల్లునన్న బాధతో కుమిలిపోతూ కౌంతేయుడు ఇట్లు పలికెను
శ్లోకంః కృపయా పరయా విష్టో విషీదన్‌ ఇద మబ్రవీత్‌
దృష్టే్వమం స్వజనం కృష్ణ! యుయుత్సుం సముపస్థితమ్‌
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే 

కోరిన వారికానందమునిచ్చు శ్రీకష్ణా! ఇది ఏమి ఉత్సాహమైనది? యుద్దయునకు సన్నద్దులై ఇచ్చట చేరిన ఈ బంధుజనమును చూడగనే, నా అవయవములన్నీ శిథిలమై పట్టుసడలిపోవుచు న్నది. నోరంతా తడి ఆరిపోవుతున్నది. శరీరం ఒణికిపోతున్నది. ఒడలంతా గగుర్పాటుతో పలకరించుచున్నది?

Popular Posts