Followers

Saturday, 8 August 2015

విశ్వరూపసందర్శనయోగః 1 (అథ ఏకాదశోధ్యాయః, భగవద్గీత)

-శ్రీ భగవద్గీత
 అర్జున ఉవాచ :- 

మదనుగ్రహాయ పరమం
గుహ్యమధ్యాత్మ సంజ్ఞితమ్‌,
యత్త్వయోక్తం వచస్తేన
మోహోయం విగతో మమ.


అర్జునుడు చెప్పెను - శ్రీకృష్ణమూర్తీ! నన్నును గ్రహించుట కొఱకై సర్వోత్తమమై రహస్యమైన (అధ్యాత్మమను పేరుగలదైనట్టి) ఏ వాక్యమును (బోధను) మీరు చెప్పితిరో, దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది.

******************************************************************************************* 1

భవాప్యయౌ హి భూతానాం
శ్రుతౌ విస్తరశో మయా,
త్వత్తః కమలపత్రాక్ష
మాహాత్మ్యమపి చావ్యయమ్‌‌.


ఏలయనగా కమల నేత్రుడవగు, ఓ కృష్ణా! మీ వలన ప్రాణులయొక్క ఉత్పత్తి వినాశముల గూర్చి మీ యొక్క మాహాత్మ్యమును (మహిమను) గూర్చి సవిస్తరముగ వింటిని.

******************************************************************************************* 2

ఏవమేతద్యథాత్థ త్వ
మాత్మానం పరమేశ్వర
ద్రష్టుమిచ్ఛామి తే రూప
మైశ్వరం పురుషోత్తమ‌.


ఓ పరమేశ్వరా! మిమ్ముగూర్చి మీరు చెప్పినదంతయు సరియేనని నేను విశ్వసించుచున్నాను. ఓ పురుషోత్తమా! మీయొక్క ఈశ్వరసంబంధమైన విశ్వరూపమును నేనిపుడు చూడదలంచుచున్నాను.

*******************************************************************************************  3

మన్యసే యదితచ్ఛక్యం
మయా ద్రష్టుమితి ప్రభో,
యోగేశ్వర తతో మే త్వం
దర్శయాత్మాన మవ్యయమ్‌.


ప్రభూ! ఆ మీ స్వరూపమును జూచుటకు నాకు సాధ్యమగునని మీరు తలంతురేని, ఓ యోగేశ్వరా! నాశరహితమైన ఆ మీ విశ్వరూపమును ఇక నాకు చూపుడు.

*******************************************************************************************  4

శ్రీ భగవానువాచ :- 

పశ్య మే పార్థ రూపాణి
శతశోథ సహస్రశః,
నానావిధాని దివ్యాని
నానావర్ణాకృతీని చ‌.


శ్రీ భగవానుడు చెప్పెను - ఓ అర్జునా! అనేక విధములుగ నున్నవియు, అలౌకికములైనవియును, వివిధవర్ణములు ఆకారములు గలవియు, అసంఖ్యాకములుగ వర్తించునవియునగు నాయొక్క రూపములను గావించుము.

*******************************************************************************************  5

పశ్యాదిత్యాన్‌ వసూన్‌ రుద్రా
నశ్వినౌ మరుతస్తథా,
బహూన్యదృష్టపూర్వాణి
పశ్యాశ్చర్యాణి భారత.


ఓ అర్జునా! సూర్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ దేవతలను, మరుత్తులను చూడుము. అట్లే ఇదివఱకెన్నడును నీవు చూడని పెక్కు ఆశ్చర్యములను గాంచుము.

*******************************************************************************************  6

ఇహైకస్థం జగత్కృత్స్నం
పశ్యాద్య సచరాచరమ్‌,
మమ దేహే గుడాకేశ
యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి.


ఓ అర్జునా! ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకను దేనిదేనిని జూడదలంచుచున్నావో దానిని ఈ నా శరీరమందు (అవయవమువలె) ఒక్కచోటనున్న దానినిగా ఇపుడు చూడుము.

*******************************************************************************************  7

న తు మాం శక్యసే ద్రష్టు
మనేనైవ స్వచక్షుషా,
దివ్యం దదామి తే చక్షుః
పశ్య మే యోగమైశ్వరమ్‌.


ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును గాంచజాలవు. కావున దివ్యదృష్టిని (జ్ఞాననేత్రమును) నీకు ప్రసాదించుచున్నాను. దానిచే ఈశ్వర సంబంధమైన నాయోగమహిమను జుడుము.

*******************************************************************************************  8

సంజయ ఉవాచ :- 

ఏవయుక్త్వా తతో రాజన్‌
మహాయోగేశ్వరో హరిః,
దర్శయామాస పార్థాయ
పరమం రూపమైశ్వరమ్‌.


సంజయుడు చెప్పెను - ఓ ధృతరాష్ట్ర మహారాజా! మహాయోగేశ్వరుడగు శ్రీకృష్ణపరమాత్మ ఈ ప్రకారముగ వచించి తదుపరి సర్వోత్తమమైన ఈశ్వర సంబంధమగు (విశ్వ) రూపమును అర్జునునకు జూపెను.

*******************************************************************************************  9


Popular Posts