Followers

Saturday, 8 August 2015

గుణత్రయవిభాగయోగః 2 ( అథ చతుర్దశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

రజస్తమశ్చాభిభూయ
సత్త్వం భవతి భారత,
రజస్సత్త్వం తమశ్చైవ
తమస్సత్త్వం రజస్తథా.


ఓ అర్జునా! సత్త్వగుణము (బలముకలిగియుండునపుడు) రజోగుణ తమోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును. అట్లే రజోగుణము సత్త్వగుణము తమోగుణములను, తమోగుణము సత్త్వగుణము రజోగుణములను అణగద్రొక్కి ప్రవర్తించును.

******************************************************************************************* 10

సర్వద్వారేషు దేహేస్మి
ప్రకాశ ఉపజాయతే,
జ్ఞానం యదా తదా విద్యా
ద్వివృద్ధం సత్త్వమిత్యుత.


ఎపుడీ శరీరమునందు శ్రోత్రాది ఇంద్రియ ద్వారములన్నిటి యందును ప్రకాశరూపమగు (బుద్ధివృత్తిరూపమగు) జ్ఞానము కలుగుచున్నదో, అప్పుడు సత్త్వగుణము బాగుగ వృద్ధినొందుచున్నదని తెలిసికొనవలెను.

******************************************************************************************* 11

లోభః ప్రవృత్తిరారంభః
కర్మణామశమః స్పృహా,
రజ స్యేతాని జాయంతే
వివృద్ధే భరతర్షభ.


భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! రజోగుణమభివృద్ధి నొందినపుడు మనుజునియందు లోభత్వము, కార్యములందు ప్రవృత్తి (కామ్య, నిషిద్ధ) కర్మములను ప్రారంభించుట, మనశ్శాంతి లేకుండుట (లేక ఇంద్రియ నిగ్రహము లేకుండుట) ఆశ, అనునవి పుట్టుచుండును.

******************************************************************************************* 12

అప్రకాశో ప్రవృత్తిశ్చ
ప్రమాదో మోహ ఏవ చ,
తమ స్యేతాని జాయంతే
వివృద్ధే కురునందన.


కురువంశీయుడవగు ఓ అర్జునా! తమోగుణము అభివృద్ధినొందిన దగుచుండగా మనుజునియందు అవివేకము (బుద్ధిమాంద్యము), సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము (మూఢత్వము, లేక విపరీతజ్ఞానము) అనునవి కలుగుచున్నవి.

******************************************************************************************* 13

యదా సత్త్వే ప్రవృద్ధే తు
ప్రలయం యాతి దేహభృత్‌,
తదోత్తమవిదాం లోకా
అమలాన్‌ ప్రతిపద్యతే‌.


ఎప్పుడైతే జీవుడు సత్త్వగుణమభివృద్ధిని బొందిన దగుచుండగా మరణించినచో, అప్పుడతడు ఉత్తమజ్ఞానము గలవారి యొక్క పరిశుద్దములైన లోకములనే పొందును.

******************************************************************************************* 14

రజసి ప్రలయం గత్వా
కర్మసంగిషు జాయతే,
తథా ప్రలీన స్తమసి
మూఢయోనిషు జాయతే.


రజోగుణము అభివృద్ధి నొందియుండగా మరణించు వాడు కర్మాసక్తులగు వారియందు జనించుచున్నాడు. అట్లే తమోగుణమభివృద్ధి నొందియుండగా మరణించువాడు పామరుల గర్భములందు లేక పశుపక్ష్యాది హీనజాతులందు పుట్టుచున్నాడు .

******************************************************************************************* 15

కర్మణస్సుకృతస్యాహు
స్సాత్త్వికం నిర్మలం ఫలమ్‌,
రజసస్తు ఫలం దుఃఖ
మజ్ఞానం తమసః ఫలమ్‌‌.


సాత్త్వికమైన కర్మమునకు (లేక పుణ్యకార్యములకు) సత్త్వగుణసంబందమైన నిర్మలసుఖము ఫలమనియు, రజోగుణసంబందమైన కర్మమునకు దుఃఖము ఫలమనియు, తమోగుణసంబందమైన కర్మకు అజ్ఞానము ఫలమనియు (పెద్దలు) చెప్పెదురు.

******************************************************************************************* 16

సత్త్వాత్సంజాయతే జ్ఞానం
రజసో లోభ ఏవ చ,
ప్రమాదమోహో తమసో
భవతోజ్ఞానమేవ చ.


సత్త్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన అజాగ్రత (మఱపు), భ్రమ, అజ్ఞానము కలుగుచున్నవి.

******************************************************************************************* 17

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా
మధ్యే తిష్ఠంతి రాజసాః,
జఘన్యగుణవృత్తిస్థా
అధో గచ్ఛంతి తామసాః.


సత్త్వగుణము కలవారు (మరణానంతరము) ఊర్ధ్వలోకముల కేగుచున్నారు. రజోగుణము గలవారు మధ్యమమగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. నీచగుణప్రవృత్తి గల తమోగుణయుతులు (పాతాళాది) అధోలోకములకు (లేక, అల్పములగు పశ్వాదిజన్మలకు) జనుచున్నారు.

******************************************************************************************* 18


Popular Posts